అందరికీ నమస్కారం🙏🙏🙏
నా పేరు రవిరాజ్. నేను మన తెలుగు వారికి మంచి వీడియోలు అందించాలని చానెల్ ప్రారంభించాను. నేను చూసిన ప్రతీ విషయాన్ని మీకు చూపిస్తాను. మంచి విషయంతో కూడిన వీడియోలు అందించడానికి అలాగే కొత్త కొత్త విషయాలు తెలియ పరచడానికి నా వంతగా శ్రమిస్తానని మాట ఇస్తున్నాను. పురాతన దేవాలయాలు, పల్లెటూరు జీవన విధానం, పాఠశాలలు బలోపేతం తదితర విషయాలు మీకు అందిస్తాను. పేదవారందరికీ విద్య ఉచితంగా మాత్రమే కాదు నాణ్యత కలిగి ఉండాలని, అది ప్రభుత్వ పాఠశాలలలో లభిస్తుందని భరోష కల్పించడంలో భాగంగా ఈ చానెల్ ప్రారంభించాను. అలాగే నా వ్యక్తిగత విషయాలు, ప్రతీ రోజూ కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్న నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేయాలని , సలహాలు సూచనలు ఇవ్వాలని ఈ చానెల్ పెట్టడం జరిగింది.