హాయ్ అండీ.. నమస్తే.. నా పేరు దాసరి సత్తిబాబు (DSB). ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ ముఖద్వారంగా ఖ్యాతిగాంచిన రావులపాలెం మా స్వగ్రామం. అఖండ గోదావరి నది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి గౌతమి, వశిష్ట నదీ పాయలుగా వేరై సముద్రంలో కలిసే క్రమంలో ఈ రెండు నదుల మధ్య ఉన్న భూభాగమే కోనసీమ.. ఈ రెండు నదులు మరి కొన్ని పాయలుగా చీలి కోనసీమ శివార్లలో సముద్రంలో కలుస్తాయి. పంట కాలువలు, కొబ్బరి తోటలు, పచ్చని పంటల అందాలకు, పుణ్యక్షేత్రాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన కోనసీమను ఈ ఛానెల్ ద్వారా మీకు చూపించాలనేది నా ప్రయత్నం. అలాగే బయట పర్యాటక ప్రాంతాలను కూడా..
Hi.. Namaste.. My name is Dasari Sathibabu (DSB). Our hometown is Ravulapalem which is famous as the Gate Way of Konaseema in Andhra Pradesh. Konaseema is the land between these two rivers, where Gautami and Vasista rivers diverge from the Dowleswaram barrage and join the sea. Through this channel, my effort is to show you Konaseema, a land of crop canals, coconut groves, beauty of green crops, shrines and cultural traditions. Also outside the tourist areas..