అందరికీ నమస్కారం,.. మా ఈ ఛానల్ ముఖ్యఉద్దేశ్యం,.. ఏమనగా మనపూర్వీకులు ఆచారాల్లోనూ, వ్యవహారాల్లోనూ, రోజు వారి జీవన విధానాల్లోనూ ఎన్నో మార్గదర్శకాలని నిర్దేశించారు. కాలానుగుణంగానూ, ప్రకృతిపరం గానూ, మానవ శరీర నిర్మాణపరంగానూ చేయాల్సిన విధులు చెప్పారు.
అలా మనల్ని భయపెట్టే విధంగా చెప్పనీ, భక్తితో కూర్చి చెప్పనీ, ఆరోగ్యంతో ముడిపెట్టి అలా చెప్పనీ, ఆచారంగా చెప్పనీ, ప్రతి విషయమూ మన మనుగడ కోసమే. మంచి కోసమే.
అలాంటి ఎన్నో విషయాలు కాలగర్భంలో కలిసి పోయే పరిస్థితి ప్రస్తుతం కాన వస్తోంది. మన పూర్వీకుల నుంచీ, మన తాతముత్తాతల నుంచీ వస్తున్న అనేక ఆనంద, ఆరోగ్య, ధర్మ, న్యాయ విషయాలు మరుగున పడిపోయే పరిస్థితి నేటి వేగవంతమైన జీవితంలో కానవస్తోంది.
గతంలో పెద్దలు చెపితే వినేవారు. మారుమాట్లాడకుండా చేసేవారు. ఆ రోజులు మారాయి. ఎందుకు? అని నేటి తరం ప్రశ్నిస్తున్నారు. విడమర్చి చెప్పమంటున్నారు. అందుకే అలాంటి అమృత విషయాలని మనము ఈ తాళపత్ర గ్రంధ రహస్యాలు ఛానల్ ద్వారా కొంచెమైనా తెలుసుకొనేప్రయత్నం చేద్దాం అని ఆశిస్తున్నాము.