in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు చంద్రబాబుగారు. ఇప్పటివరకు ఏపీలో అధ్యయన కేంద్రాలను మాత్రమే కలిగి ఉన్న అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఇకపై ఏలూరులో ప్రధాన కార్యాలయం ఏర్పడనుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
764 - 17
తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే కార్యకర్తలు అంటే చంద్రబాబు గారికి సొంత కుటుంబంతో సమానం అని మరోసారి రుజువయ్యింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
#ChandrababuNaidu
#AndhraPradesh
3.1K - 88
వైసీపీ గూండాల చేతిలో హతమైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసంలో పరామర్శించారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుస్తానని మంత్రి ప్రకటించారు.
#NaraLokesh
#AndhraPradesh
681 - 32
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నాను. ప్రజా సంక్షేమం కోసం ప్రకాశం పంతులు గారు అహర్నిశలు కృషి చేశారు. అన్యాయాన్ని ఎదిరించడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఆయన నైజం. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోను, స్వరాష్ట్ర సాధనలోను ప్రకాశం పంతులు గారు కీలకపాత్ర పోషించారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తి దాయకం. ప్రకాశం పంతులు గారి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం.
- Nara Lokesh
719 - 8
2022 మార్చిలో ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం సేవించి 20 మంది చనిపోయారు. ఆ ఘటనకు బాధ్యులెవరు? ఆ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషన్లో నమోదైన 4 వేర్వేరు కేసుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసేందుకు కూటమి ప్రభుత్వం స్పెషల్ టస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసింది.
#LiquorScamByJagan
#ScamsterJagan
#YCPScams
#PsychoFekuJagan
#AndhraPradesh
1.3K - 75
ఏపీలోని గర్భిణీ స్త్రీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 'ఎన్టీఆర్ బేబీ కిట్' పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తోంది. రూ.1410ల విలువచేసే ఈ బేబీ కిట్ లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెడ్ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది. ఈ కిట్‌లను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
1.4K - 48
ఏపీ హజ్ యాత్రికులకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసారు. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్ క్యాంపులు కూడా నిర్వహించారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
585 - 20
The Telugu Desam Party (TDP) is a regional political party in the Indian state of Andhra Pradesh. It was founded in 1982 by Nandamuri Taraka Rama Rao (NTR), a popular actor-turned-politician, with the goal of promoting the welfare of Telugu-speaking people.