Channel Avatar

MEENA TIRUMALA UPDATES @UCt4vtGv1CpYsbSw78IsyQ0w@youtube.com

20K subscribers - no pronouns :c

Hello friends it's me meena. I sarted this channel in march


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

MEENA TIRUMALA UPDATES
Posted 22 hours ago

🌹తిరుమల సమాచారం🌹

77 - 4

MEENA TIRUMALA UPDATES
Posted 1 day ago

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

మాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం

తిరుమల, 2024 నవంబరు 13: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో బుధవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేకువ ఝామున 4.30 నుండి 5.30 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. అక్కడక్కడా చిరు జల్లులుల కురవడంతో ఘటాటోపం లోపల స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మ‌వార్ల‌ను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ప్రాశ‌స్త్యం..

పురాణాల ప్ర‌కారం శ్రీ వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ పెరుమాళ్ కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయర్‌స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

36 - 0

MEENA TIRUMALA UPDATES
Posted 1 day ago

🌹తిరుమల సమాచారం🌹

88 - 2

MEENA TIRUMALA UPDATES
Posted 2 days ago

🌹తిరుమల సమాచారం🌹

89 - 4

MEENA TIRUMALA UPDATES
Posted 3 days ago

🌹తిరుమల సమాచారం🌹

112 - 4

MEENA TIRUMALA UPDATES
Posted 4 days ago

🌹తిరుమల సమాచారం🌹

90 - 4

MEENA TIRUMALA UPDATES
Posted 5 days ago

🙏శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్ప‌యాగం🙏

37 - 2

MEENA TIRUMALA UPDATES
Posted 5 days ago

వైభవంగా శ్రీ భూ సమేత మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం

తిరుపతి, 2024 నవంబరు 09: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపనం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ, భూ, పురుష, నీల, నారాయణ సూక్తాలను మంత్రోచ్ఛారణలతో, ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, పసుపు, చందనం లతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు.

తిరుమల జీయర్ స్వామీజీల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గోవిందరాజ దీక్షితులు పవిత్రోత్సవాలు నిర్వహించారు. అనంతరం నక్షత్ర హారతి, కుంభ హారతి, ప్రత్యేక హారతి సమర్పించి ఆచారం ముగిసింది.

అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

46 - 8

MEENA TIRUMALA UPDATES
Posted 5 days ago

తిరుమలలో వైభవంగా పుష్పాలు ఊరేగింపు

తిరుమల, 2024 నవంబరు 09: తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు శనివారం తిరుమలలో ఘనంగా జరిగింది.

తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఉద్యాన‌వ‌న సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్పయాగానికి శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

16 - 0

MEENA TIRUMALA UPDATES
Posted 5 days ago

🌹తిరుమల సమాచారం🌹

78 - 6