Channel Avatar

Property for you @UCsdkILfUwmZE3WuFo5JMskQ@youtube.com

3.6K subscribers - no pronouns :c

Property for you is dealing all real estate properties in A


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Property for you
Posted 1 year ago

Vizag new projects and developments

2 - 0

Property for you
Posted 1 year ago

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ అక్టోబర్‌ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. మధురవాడ ఐటీ సెజ్‌లోని మహతి సొల్యూషన్స్‌ ప్రాంగణంలో ఇన్ఫోసిస్‌ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలుపెట్టి.. క్రమంగా 3 వేల మంది ఉద్యోగులకు విస్తరించనున్నారు.

మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్‌ టెక్నాలజీస్‌ సెంటర్‌ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 2.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మధురవాడ ఐటీ పార్క్‌లో చేపట్టిన నిర్మాణ పనులు 80 శాతం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది చివరిలోగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు డల్లాస్‌ టెక్నాలజీస్‌ వడివడిగా అడుగులు వేస్తోంది.

2 - 0

Property for you
Posted 2 years ago

అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరిస్తోంది.

దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా, అసెంచర్, హెచ్‌సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను నిర్మించే రహేజా వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్‌ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 3,000 సీటింగ్‌ సామర్థ్యంతో విశాఖలో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతలో 1,000 మందితో ప్రారంభించనుంది. ఇందుకోసం మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న బిల్డింగ్‌లను ఇన్ఫోసిస్‌కు చూపించామని, ఒకటి రెండు నెలల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. లేటెస్ట్భారత్‌@75వీడియోలుసినిమాక్రీడలుబిజినెస్ఫ్యామిలీఫోటోలుట్రెండింగ్

ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు..
7 Aug, 2022 02:54 IST




సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి వివరిస్తోంది.

దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్రా, అసెంచర్, హెచ్‌సీఎల్, అదానీలతో పాటు ఐటీ పార్కులను నిర్మించే రహేజా వంటి సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్‌ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 3,000 సీటింగ్‌ సామర్థ్యంతో విశాఖలో ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, తొలి విడతలో 1,000 మందితో ప్రారంభించనుంది. ఇందుకోసం మధురవాడ సమీపంలో అందుబాటులో ఉన్న బిల్డింగ్‌లను ఇన్ఫోసిస్‌కు చూపించామని, ఒకటి రెండు నెలల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.


Advertising
ఇదే సమయంలో విజయవాడలో ఇప్పటికే ఉన్న హెచ్‌సీఎల్‌.. తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించే యోచనలో ఉంది. విశాఖలో మరో భారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలను హెచ్‌సీఎల్‌ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడితో 130 ఎకరాల విస్తీర్ణంలో డేటా సెంటర్‌తో పాటు ఐటీ పార్కు, కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి సంబంధించిన పనులను త్వరలో ప్రారంభించనుంది. యాంకర్‌ కంపెనీలు విశాఖకు వస్తుండటంతో ఐటీ పార్కుల నిర్మాణ రంగ సంస్థల చూపు ఇప్పుడు ఆ నగరంపై పడింది. ఐటీ పార్కుల నిర్మాణ సంస్థ రహేజా గ్రూపు విశాఖలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఇన్‌ ఆర్బిట్‌మాల్‌ షాపింగ్‌ మాల్‌తో పాటు ఐటీ పార్కు నిర్మాణం చేపట్టనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టుకు సంబంధించిన 17 ఎకరాల భూమిని రహేజా గ్రూపు కొనుగోలు చేసింది. చిన్న కంపెనీల ఏర్పాటుకు మార్గం సుగమం
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్‌ మహీంద్రా, అసెంచర్స్‌ వంటి ఐటీ యాంకర్‌ కంపెనీలు రాష్ట్రానికి వస్తుండటంతో వాటికి అనుబంధంగా అనేక చిన్న కంపెనీలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఏర్పాటు చేయనున్న హై ఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే మర్ని ఐటీ కంపెనీలు విశాఖకు క్యూ కడతాయి. ఐటీ కంపెనీలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాలు ఇస్తోంది. త్వరలో స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం

3 - 0

Property for you
Posted 2 years ago

Inorbit mall in Vizag

2 - 0

Property for you
Posted 2 years ago

IT companies in Vizag

3 - 0

Property for you
Posted 2 years ago

Vizag: ‘ఇన్ఫోసిస్‌’ గుడ్‌న్యూస్‌.. ఆగస్టు నుంచే సేవలు!

2 - 0

Property for you
Posted 2 years ago

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటీ నుంచి సీఎం జగన్.. విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా వర్జీనియా బీచ్ తరహాలో వైజాగ్ అభివృద్ది కోసం ‘‘బీచ్ ఐటీ’’ అనే కాన్సెప్ట్‌ను జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసింఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటీ నుంచి సీఎం జగన్.. విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి సారించారు. మూడు రాజధానుల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని భావించారు. అయితే అది వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక, తాజాగా వర్జీనియా బీచ్ తరహాలో వైజాగ్ అభివృద్ది కోసం ‘‘బీచ్ ఐటీ’’ అనే కాన్సెప్ట్‌ను జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. సముద్ర తీర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ఐటీ రంగానికి ఊతం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

బీచ్ ఐటీ కాన్సెప్ట్‌లో భాగంగా ప్రత్యేకంగా sea view ఉండేలా ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీల కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని వర్జీనియాలో ఇదే విధమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. వర్జీనియా బీచ్‌లో అట్లాంటిక్ మహాసముద్రం తీరం వెంబడి ఐటీ కంపెనీలు స్థాపించబడ్డాయి.
అయితే పరిశ్రమకు అనువైన పర్యావరణ వ్యవస్థ లేకపోవడంతో ఇప్పటివరకు అనేక దిగ్గజ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఏపీలోకి అడుగుపెట్టకపోవడంతో.. బీచ్ ఐటీ అనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చినట్టుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాలమైన తీర రేఖ ఉంది. మే 22 నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో సీఎం జగన్ ‘బీచ్ ఐటీ’ కాన్సెప్ట్‌ను హైలైట్ చేయనున్నారని సమాచారం.

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. సముద్ర వీక్షణతో కార్యాలయ స్థలాలను రూపొందించడానికి చర్చలు జరుగుతున్నాయి. 2022 డిసెంబర్‌ నాటికి విశాఖ బీచ్ వెంబడి ఉన్న ఒక స్టార్ హోటల్ కూల్చివేసే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలకు అనువుగా ఉండేలా ఈ స్థలంలో ఎత్తైన భవనాన్ని నిర్మించనున్నారు. అలాగే సిరిపురం వద్ద హెచ్‌ఎస్‌బీసీ పక్కన ఉన్న ఖాళీ స్థలం కూడా sea viewతో కూడిన ఐటీ టవర్‌ను నిర్మించేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

షిప్పింగ్, ఫిషింగ్ హార్బర్‌లు, మెరైన్ ఆక్వాకల్చర్, సీఫుడ్ ట్రేడ్ మరియు లాజిస్టిక్స్.. అన్నీ కూడా తీర ప్రాంత ఆధారిత పరిశ్రమలు కావడంతో వైజాగ్‌ను సముద్ర వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక, దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సులో 18 అంశాలపై చర్చిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. అందులో బీచ్ ఐటీ కాన్సెప్ట్ కూడా ఒకటి. ‘ఈ విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని తాము ఆశిస్తున్నాము మంత్రి చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రభుత్వ ప్రత్యేకతలు, ప్రాధాన్యతలను వివరించడానికి సీఎం జగన్‌ ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.

‘‘“బీచ్ ఐటి ప్రతిపాదన వైజాగ్‌కు కొత్త కాన్సెప్ట్. ప్రణాళికాబద్ధంగా, సరిగ్గా అమలు చేస్తే వైజాగ్ దేశంలో ఇటువంటి పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న తొలి రెండు-అంచెల నగరం అవుతుంది. ఐటీ రంగ నిపుణులు అధునాతన పర్యావరణ వ్యవస్థలో పని చేయడానికి ఇష్టపడతారు’’ అని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (బ్రాండింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ) ఛైర్మన్ ఆర్‌ఎల్ నారాయణ అన్నారు.

2 - 0

Property for you
Posted 2 years ago

Beach IT in VIZAG

3 - 0