Channel Avatar

Mohana Home Tips @UCsCzOAZGhEJzDWGUd2Pf8Og@youtube.com

711 subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Mohana Home Tips
Posted 1 year ago

తెలుగింటి మహావృక్షం #తాడిచెట్టు

ఊరందరికన్నా పెద్దది తాడిచెట్టు! గుడి ముందు ధ్వజస్తంభంలా, కోట బురుజ మీదెక్కి కావలి కాసే సైనికుడిలా, ప్రగతికి నిలువెత్తు నిదర్శనంలా ఎగిరే జాతీయ జెండాలా సగర్వంగా తలెత్తి నిలబడి ఉంటుంది తాడిచెట్టు! తెలుగునేల మీద పుట్టినందుకే దాని గర్వం అంతా! అవును! తాడిచెట్టు తెలుగువారి మహా వృక్షం. తాటిచెట్టుతో సంబంధం లేకు౦డా తెలుగువారి జీవితం లేదు. తాడిచెట్టు ఉత్పత్తుల్ని అనునిత్యం అనేక రకాలుగా వాడుకుంటున్నాం మనం. మన జీవితాలతో పెనవేసుకుపోయిన తెలుగు చెట్టు అది! ఊరందరికంటే పెద్దది తాడిచెట్టు అనే తెలుగు సామెత తాడిచెట్టు ప్రాముఖ్యతని చెప్తుంది.

శిలాజాలను (ఫాజిల్స్) పరిశీలించే వృక్ష చరిత్ర నిపుణులు 5,60,000 సంవత్సరాల క్రితం మధ్యధరా సముద్రతీర ప్రాంతాల్లో మొదటగా తాడిచెట్లు అవతరించాయని చెప్తారు. అయితే ఆఫ్రికన్ తాడిచెట్లు Borassus aethiopum అనే వృక్ష నామం కలిగినవి. తాటికి సంబంధించిన వివిధ భాగాల పేర్లలో మాత్రం అక్కడా తెలుగు పదాలతో సామీప్యత కనిపిస్తుంది. ఉదాహరణకి, తాటి ఆకు తొడిమ భాగాన్ని తెలుగులో తాటిమట్ట అంటారు. కొన్ని ప్రోటో ఆఫ్రికన్ భాషలైన సెమెటిక్, కుషైటిక్, ఈజిప్షియన్, భాషల్లో mVyṭ, mawaT లా౦టి పదాలు మట్ట అనే అర్థ౦లోనే కనిపించటం విశేషం.

తాడి అనే పదానికి “తార్” అనే పూర్వద్రావిడ పదం మూలం. తాల్ అనికూడా పిలుస్తారు. ఈ ‘తార్’ శబ్దమే స౦స్కృత ’తరు’కు మూలం అనే వాదన ఉంది. తమిళ, మళయాళ భాషల్లో కొబ్బరిచెట్టుని, కొన్ని చోట్ల అరటి చెట్టుని కూడా తాల శబ్దంతో వ్యవహరిస్తారు. తలప్పు, తలాటి, తలాటు పదాలకు తమిళ భాషలొ తలపొడవుగా కలిగిన చెట్టని అర్థ౦. వందడుగుల ఎత్తు దాకా ఈ తాడిచెట్లు పెరుగుతాయి.

ఖర్జూరం, కొబ్బరి, ఈత, పామాయిల్ ఇచ్చే ఆఫ్రికన్ తాడిచెట్టు, వక్కచెట్టు, ఇవన్నీ Arecaceae కుటు౦బానికి చె౦దిన వృక్షాలే! ఈ మొక్కలన్ని౦టి ను౦చీ కల్లు తీస్తారు. ఈ కుటుంబ నామాన్ని బట్టే కల్లుని arrack అనీ, Toddy అనీ పిలుస్తారు. ‘తాలక’ అంటే తాటికల్లు. తెలుగు తాటిచెట్టు వృక్షనామం Borassus flabellifer. దీన్ని doub palm అనీ, పామీరా అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు లోంచి కల్లు తీస్తారు కాబట్టి, వైన్‘పామ్ అనికూడా అంటారు. రకరకాల తాడి చెట్లు ఆస్ట్రేలియా, అమెరికా, ఇరాన్, పాకిస్తాన్, చైనాల్లో కూడా పెరుగుతాయి. అయితే, ఇక్కడ పెరిగే తాడిచెట్లూ అమెరికన్ తాడిచెట్లూ ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు మొక్కలు. ఒక్క ఫ్లోరిడా రాష్ట్రంలోనే 23 రకాల జాతుల తాడిచెట్లు పెరుగుతాయని చెప్తారు.

ఎన్ని తాళ్ళు (తాటిచెట్లు) ఉంటే అంత ఆస్తిమ౦తుడని మన పూర్వీకులు భావి౦చేవాళ్ళు! ఆస్తులు ఏవీ లేని బికారిని తాడూ, బొ౦గరం లేని వాడ౦టారు. బొ౦గరం అంటే భూమి కావచ్చు. స్థలాలు, పొలాల హద్దులు తెలియటం కోస౦ గట్ల వె౦బడి తాటిచెట్లు నాటేవారు. “తాటికట్టువ” అంటే అలా తాటి చెట్లు నాటిన సరిహద్దు అని అర్థ౦!

అరచేతి ఆకారంలో ఆకులు కలిగిన చెట్టు కాబట్టి, తాటి చెట్టుని ఆ౦గ్లంలో పామ్ ట్రీ అంటారు. ఇ౦గ్లీషులో ఒకప్పుడు “పామ్ ఆయిల్” అనే పదాన్ని “చేతి చమురు భాగవతం” అనే అర్థ౦లో వాడేవారు. ఆఫ్రికన్ తరహా ఈ తాడిచెట్టు ను౦చి పామాయిలు తీస్తారు. వాణిజ్య స్థాయిలో దీని ఉత్పత్తి మొదలు పెట్టాక, ఆ నూనెని “పామ్ ఆలివ్ ఆయిల్” అంటూన్నారు. జన వ్యవహారంలో అది పామోలివ్ ఆయిల్ గానూ పామాయిల్ గానూ మారిపోయి౦ది.

కష్టి౦చి స౦పాది౦చినదాన్ని “తాడిడి పంట“ అంటారు. తాడిడి ఫల౦బు గొను... అని దశకుమార చరిత్రంలో కవి ప్రయోగ౦ ఉంది. ఒకరిని మి౦చిన వారొకరనడానికి “తాడు దన్నువారల దలదన్నువారలు” అని ప్రయోగ౦ కనిపిస్తుంది. కూల్చాలో, ఉంచాలో తేల్చటానికి తాడోపేడో తేల్చేయటం అంటాం. తాటిచెట్టుని నరికేస్తే దాని దూలాలు ఇంటి నిర్మాణానికి, మిగిలిన పేళ్ళు పొయ్యిలోకీ ఉపయోగపడతాయి.

తాటాకు చక్కెర, తాటిచెట్టాట, తాటాకుల చిలకలు...అనే ఆటలు హంసవింశతి లాంటి కావ్యాలలో తెలుగు పిల్లలు ఆడుకొనే ఆటలుగా కనిపిస్తాయి. అవి ఎలా ఆడేవారో తెలీదు.
చిన్ని తాడిమొక్కల ఆకులతో విసనకర్రలు చేస్తారు. తాటిమట్టల్ని నలగ్గొట్టి నార తీస్తారు. “తొక్కి నార తీస్తాను” అనే తిట్టు దీన్ని బట్టే పుట్టి౦ది. ఈ నారని పేనితే, తాడు తయారవుతుంది. తాడికి స౦బ౦ధి౦చినది కాబట్టి తాడు అన్నారు. తాడు అంటే మ౦గళ సూత్ర౦ కూడా! భర్త మరణి౦చినప్పుడు ఈ తాడునే తెంపేస్తారు. “నీ తాడు తెగ” అనే తెలుగు తిట్టు హృదయ విదారకమైంది. ఆ పని పూర్తయ్యేసరికి నా తాడు తెగింది అనే మాటకు నానాకష్టాలు పడ్డానని అలిసిపోయానని అర్ధం.

క్వారీల్లో రాళ్ళను పగలగొట్టడానికి మ౦దుగు౦డు పెట్టి సన్నని పొడవైన తాడుకి మందు పట్టించి వెలిగిస్తే, అది కాల్తూ వెళ్ళి మందుగుండును పేలుస్తుంది. ఇలా దూరంగా వుండి వెలిగించటాన్ని తాటిబాణం వదలటం అంటారు.

తాడికి సంబంధించిన ఐదు భాగాలూ మనకు ఉపయోగపడతాయి. తాటి ఆకులు, తాటి కాండం, తాటి వ్రేళ్ళు(తేగలు), తాటి కాయ (ముంజెలు), తాటిపండు, తాటిపూలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడ్తున్నాయి. గ్రామీణ సంస్కృతిలో మార్పులు వచ్చాక ప్రస్తుత కాలంలో తాడిచెట్ల ఉనికి ప్రమాదంలో పడుతోంది. తాడిచెట్లని వాణిజ్య పరంగా ఉపయోగించుకునే ఆలోచనలు చేస్తే, గ్రామీణులకు మేలు జరుగుతుంది.. గ్రామీణ హస్తకళలలో భాగంగా తాడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే విదేశీ మారక ద్రవ్యం ఆదాయం పెరుగుతుంది!

తాటి ముంజెలు:
తాటి ముంజెల్ని హార్ట్ ఆఫ్ పామ్ అంటారు.హృదయాకారంలో ఉండటం ఈ పేరుకు కారణం. రకరకాల పళ్ళు, కూరగాయల్ని, ముంజెల్నీ ముక్కలుగా తరిగి, మిరియాలపొడి చల్లుకుని సలాద్ లాగా తింటే అమితమైన చలవనిస్తాయి. వేసవి దాహార్తిని తీర్చటానికి బాగా ఉపయోగ పడతాయి. షుగర్ రోగులతో సహా అందరూ తినదగిన ఆహారం. మూత్ర పి౦డాలలో రాళ్ళను కరిగి౦చే శక్తి వీటికు౦ది. వేడి శరీరతత్వానికి మేలు చేస్తాయి. ముంజెలు కడులో ఆమ్లాన్ని తగ్గిస్తాయి. కడుపులో మంట, అజీర్తి, గ్యాసు తగ్గుతాయి. ముంజెల్ని మిక్సీ పట్టి జ్యూస్ తీసుకుని తాగవచ్చు. ఎ, సి, బి విటమిన్లు, కాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్ జింకు, పొటాషియం వీటిలో ఎక్కువగా ఉంటాయి. విషదోషాలను హరించే శక్తి వీటికుంది. వాంతి, వికారాలను తగ్గిస్తాయి. కడుపులో నులిపురుగులను హరిస్తాయి. మలబద్ధతని తగ్గించి, విరేచనాన్ని అయ్యేలాచేస్తాయి. వేడి పాలలోగాని, లేదా కొబ్బరిని తురిమి పిండగా వచ్చిన పాలలో గాని పంచదార, ముంజెల ముక్కలు, జీడిపప్పు, ఏలకులు పచ్చకర్పూరం వగైరా వేసి తయారు చేసిన పాయసాన్ని ఫ్రిజ్జులో పెట్టి చల్లగా చేసి తాగితే బాగా చలవ నిస్తుంది. లేత ముంజెలే చలవనిస్తాయి. ముదిరినవి కష్టంగా అరుగుతాయి. ముంజెలమీద గోధుమరంగులో ఉండే పెచ్చుని కూడా కలిపి తింటే శరీరానికి కొన్ని రక్షో గుణాలు దక్కుతాయి. మూత్రెఅం పచ్చగా మంటగా అవుతున్న వాళ్ళకు వేసవిలో ముంజెలు గానీ, ముంజెల జ్యూస్ గానీ ఇస్తే చలవ కలిగుఇ మూత్రం ఫ్రీగా అవుతుంది.
ముంజెల గుజ్జుని పిల్లల వంటికి పట్టిస్తే, చల్లగా, పేలకుండా ఉంటుంది. ఈ గుజ్జుని, మంచిగంథం చెక్కఅరగదీసి తీసిన గంథంతోకలిపి ముఖానికి (ఫేస్ ప్యాక్) పట్టిస్తే ముఖం కాంతివంతంగా, జిడ్డుకారకుందా మృదువుగా ఉంటుంది. కళ్ళకు చలవనిస్తుంది.

తాటిబెల్లం:
తాటిపండ్ల నుండి బెల్లం తీస్తారు. ఇది కొంచెం నల్లగా ఉంటుంది. తీపితోపాటు కొద్ది వగరు రుచి కూడా ఉంటుంది. వాత రోగాలకు మంచిది. బలకరం. పంచదార, పటికబెల్లం పద్ధతిలో తాటికలకండ కూడా తయారు చేస్తారు. తాటిబెల్లం కన్నా శ్రేష్టంగా పనిచేస్తుంది. కఫాన్ని, దగ్గుని, గొంతు బొంగురుని తగ్గిస్తుంది. గాయకులకు మేలు చేస్తుంది. వీర్యకణాలను పుట్టిస్తుంది. ఇందులో ఉన్న ఖనిజాలను పూర్తిగా పొందటం కోసం తాటిబెల్లం, రాగిపిండి కలిపి సున్ని ఉండలు గాని, నువ్వులు తాటిబెల్లం కలిపి చిమ్మిలిగానీ చేసుకుంటే బలకరంగా ఉంటాయి. మామూలు బెల్లం కన్నా తాటిబెల్లం ఎక్కువ మేలుని, తక్కువ అపకారాన్నీ చేస్తుంది. అతిగా తీసుకుంటే తాటిపండు కూడా వాతమే చేస్తుంది. ఎసిడిటీని, అజీర్తినీ, ఎలెర్జీలను పెంచుతుంది. అందువలన పరిమితంగానే తినాలి. తాటి బెల్లాన్ని నీళ్ళలో కరిగించి పులవబెట్టి సారాయి తయారు చేస్తారు.

తాటి చన్నులు:
మగ తాటిచెట్టు నుండి వ్రేలాడే పొడవైన పూవుల్ని తాటి చన్నులు, తాటి వెన్నులు, తాటి చిదుగులు అంటారు, పొయ్యిలో పెట్టుకోవటానికి పనికొస్తాయి. వీటిని ద౦చిన పొడిని ఒకచె౦చా మోతాదులో తీసుకొని చిక్కని కషాయ౦ కాచుకొని రోజూ తాగుతూ ఉంటే, తెల్లబట్ట వ్యాధి ఇతర గర్భాశయ వ్యాధుల మీద బాగా పనిచేస్తుంది.

తాటి తేగలు:
తెలుగులో గేబు, గేబులు, గేంగులు అంటే తేగలు. వీటిని తంపట వేసి కాల్చి తి౦టే రుచిగా ఉంటాయి. మ౦చి పీచు పదార్థ౦ కాబట్టి విరేచన౦ అయ్యేలా చేస్తుంది. కానీ, అతిగా తి౦టే పైత్యాన్ని పెంచటమే కాకుండా, ఆకల్ని చ౦పి వాతపు నొప్పుల్ని కలిగిస్తాయి.

తాటి దూలాలు, తాటాకులు
తాటి చెట్టు కాండాన్ని దొన్నెలా తొలిచి చెరువులు, కాలవలు, సరస్సులు, నదుల మీద పడవలాగా ఉపయోగిస్తారు. చేపల వేటకు ఇది బాగా ఉపయోగ పడుతుంది. తాటి దూలాలు టేకుతో సమాన౦గా గట్టిగా ఉంటాయి. త్వరగా చెడకు౦డా ఉంటాయి. పెంకుటిళ్ళకు ఎక్కువగా వాడతారు. తాటాకు పందిళ్లను చలువ పందిళ్ళంటారు. తాటాకుల పందిరి వేశారంటే ఆ ఇ౦ట్లో శుభకార్య౦ ఉన్నట్టు! కానీ, షామియానాలు వచ్చాక చావుకీ పెళ్ళికీ తేడా తెలియకు౦డా పోతో౦ది. తాటాకుల ఇ౦ట్లో నివాస౦ శుభ ప్రద౦. ఆకుల ఇంట్లో కూర్చుంటే ఒకవిధమైన పరిమళ గంథం శరీర తాపాన్ని పోగొట్టి మనసుకు హాయినిస్తుంది. వేసవి వరకూ నైనా ఇలా౦టి ఏర్పాట్లు చేసుకోవటం ఒక మ౦చి ఆలోచన.

తాటాకు బుట్టలు, తాటాకు చాపలు, తాటి నారతో అనేక వస్తువులను తయారు చేస్తారు. తాటాకులను పేడ మొదలైనవి పట్టించి ఆరబెట్టి గంటంతో పొడుస్తూ అక్షరాలను వ్రాసేవారు. తాళపత్ర గ్రంథాలు అనేకం మనకు తంజావూరు సరస్వతీ గ్రంథాలయం, మద్రాసు కన్నెమరా గ్రంథాలయం ఇంకా ఇతర గ్రంథాలయాల్లో భద్రంగా ఉన్నాయి. వాటిని భద్రపరచటం ఒక కళ. ఒక సైన్సు కూడా! ఇప్పుడంటే పేపరు వాడకంలోకి వచ్చింది గానీ, ఒకప్పుడు తాటాకులే గ్రంథ ప్రచురణకు సాధనాలయ్యేవి. కమ్మ అంటే తాటాకు. రిజిష్టర్డ్ డాక్యుమెంటుని కూడా కమ్మ అనే పిలుస్తారు. కమ్మకట్టు అనే మాటకు నోటి మాటగా కాకుండా వ్రాత మూలకంగా వ్యవసాయం చేయటానికి ఒడబడటం అని అర్ధం. వ్రాత అనేది తాటాకుల మీదే జరిగేది ఆరోజుల్లో! కమ్మ అంటే పత్రిక కూడా! తాటాకులతో ఆభరణాలు చేసుకుని అలంకరించుకునేవారు. చెవి దిద్దులకు తాటంకాలనే పేరు ఇలానే వచ్చింది. తాళిబొట్టుకి ఆ పేరు కూడా ఇలానే తాళపత్రాల కారణంగానే వచ్చిందని పెద్దలు చెప్తారు.

తాడి రోడ్లు
కొత్తగా రోడ్డు వేస్తున్నప్పుడు మట్టి కట్ట వేసి పైన కంకరతో రోడ్డు పోస్తారు అందువలన మట్టి జారిపోయి రోడ్డు కుంగి పోతుంటుంది. ఈ సమస్యను నివారించటానికి కేరళలో కొబ్బరి పీచుతో సంచులు తయారు చేసి, మట్టితో నింపి, అందులో వట్టి వేర్లు, ప్రత్యేక రకం గడ్డి విత్తనాలు కలిపి, ఆ సంచుల్ని రోడ్డు అంచుల్లో పేర్చి మధ్యలో మట్టి పోస్తారు ఈ సంచుల్ని రోజూ తడుపుతుంటే విత్తనాలు మొలకెత్తి నేలలోకి బలంగా నాటుకుంటాయి. రోడ్డుకి అటూ ఇటూ దట్టంగా ఈ మొక్కలు పెరుగుతాయి. రోడ్డు అడుగున మట్టి జరిగిపోకుండా ఇవి కాపాడతాయి. తాటిమట్టల నారతో ఇలానే మనం కూడా సంచుల ప్రక్రియను అవలంభించవచ్చు. మన ఉత్పత్తుల్ని మనం సద్వినియోగపరచు కోవటం అవసరం కదా! తాడిరోడ్లు తెలుగు గ్రామాల వికాసానికి తోడ్పడతాయి.

తాడికి స౦బ౦ధి౦చిన వాణిజ్య ఉత్పత్తులు పెరిగితే, తాటిచెట్టు ప్రాశస్త్య౦ అర్థ౦ అవుతుంది. అలా౦టి ము౦దు చూపు మనకు అలవడాలి. రైతా౦గాన్ని ప్రోత్సహి౦చి, ఉత్పత్తులకు మ౦చి గిరాకీ దక్కేలాగా చూడగలగాలి. అప్పుడు, తలదన్నే వాడి తలదన్నే వాడు కాగలుగుతాడు “తాడిగలవాడు”!

0 - 0

Mohana Home Tips
Posted 1 year ago

🌹ఈరోజు శ్రీ బాబు జాగ్జీవన్ రాo గారి జయంతి🌹

బాబు జగ్జీవన్ రాం గారు (ఏప్రిల్ 5, 1908 - జులై 6, 1986) పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త.
బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడు. అతను బాబూజీగా ప్రసిద్ధుడు.
భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు.
1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన #ఆల్_ఇండియా_డిప్రెస్డ్_క్లాసెస్_లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.

(1991లో భారత తపాలా బిళ్ళమీద బాబూ జగ్జీవన్ రాం గారి బొమ్మ పెట్టడం జరిగింది)

0 - 0

Mohana Home Tips
Posted 1 year ago

0 - 0

Mohana Home Tips
Posted 1 year ago

0 - 0