Channel Avatar

BJP Telangana @UCpn6aAcyGzzXrV9UO6G0M6g@youtube.com

106K subscribers - no pronouns :c

Official Account of BJP Telangana


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

BJP Telangana
Posted 1 day ago

చలో పరేడ్ గ్రౌండ్ !

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనండి.. నిజాం - రజాకార్ల రాక్షస పాలన నుండి తెలంగాణకు విమోచనం కలిగించడానికి సర్వం త్యాగం చేసిన తెలంగాణ స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ, వారి వీరగాధలను నెమరువేసుకుంటూ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం.

🗓️ సెప్టెంబర్ 17, 2024
📍 పరేడ్ గ్రౌండ్, హైదరాబాద్
⏱️ ఉదయం 8 గంటల నుండి

జై తెలంగాణ!
భారత్ మాతా కీ జై!!

#HyderabadLiberationDay

1.2K - 13

BJP Telangana
Posted 1 day ago

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సేవా పక్వాడ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ గారు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ గారు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి జయశ్రీ గారు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ అమర్నాథ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

794 - 0

BJP Telangana
Posted 1 day ago

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న కవాతు మరియు సాంస్కృతిక కార్యక్రమాల రిహార్సల్ను, ఏర్పాట్లను పరిశీలించిన బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, డా కె.లక్ష్మణ్ గారు

599 - 1

BJP Telangana
Posted 2 days ago

ఈరోజు తెల్లాపూర్ లో జరిగిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గారు, మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఎన్.రాంచందర్ రావు గారు, జిల్లా అధ్యక్షురాలు, పదాధికారుల, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

#BJPSadasyata2024

1.1K - 6

BJP Telangana
Posted 2 days ago

తెలంగాణ రాష్ట్రంలో కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాల్లో సమస్యలు తిష్ట వేశాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో గురుకులాల్లో కలుషిత ఆహారం, వసతుల లేమి, మంచినీటి సమస్యతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యాలయాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు, ఇతర రాష్ట్ర స్థాయి నాయకులతో కలిసి హైదరాబాద్ లోని లక్డీకాపూల్ లో డీఈఓ గారికి వినతిపత్రం సమర్పించారు.

427 - 3

BJP Telangana
Posted 2 days ago

పార్లమెంటులో నిద్రపోయే పప్పు,
విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం స్వదేశంపైనే విషం కక్కుతాడు.
తల్లి పాలు తాగి రొమ్ము తన్నే రకం ఈ రాహులుడు!

#RaakshasRahul

2.6K - 66

BJP Telangana
Posted 2 days ago

తెలంగాణ ప్రాంతం, కర్ణాటక-మహారాష్ట్ర లోని కొన్ని జిల్లాలను కలుపుకొని ఏర్పడిన హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం దేశంగా ప్రకటించి, ఇక్కడ నివసిస్తున్న 90 % హిందువులను ముస్లింలుగా మత మార్పిడి చేసి, భారత దేశం నడిబొడ్డున ఒక ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపిద్దాం అని పన్నాగం పన్నిన నిజాం - రజాకార్ల రాక్షస మూకలపై.. 1948 సెప్టెంబర్ 13 న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు సంధించిన అస్త్రం "ఆపరేషన్ పోలో".

భారత సైనిక దళం సాగించిన ఆపరేషన్ పోలో, సెప్టెంబర్ 13 న మొదలుకొని సెప్టెంబర్ 17 వరకు సాగింది. ఈ ప్రక్రియలో తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల తో కలిసి భారత సైన్యం తెలంగాణ ప్రజలను కాపాడుతూ, హైదరాబాద్ ను అడుగడుగునా తమ ఆధీనంలోకి తీసుకుంటూ వచ్చింది. ఈరోజు భారత సైన్యం, రజాకార్ల ముష్కర మూకలను ఓడించి, 13 సెప్టెంబర్ సాయంత్రానికి తొలి విజయం కైవసం చేసుకున్నారు.

#HyderabadLiberationDay #OperationPolo

892 - 10

BJP Telangana
Posted 2 days ago

ఈరోజు సంగారెడ్డి జిల్లాలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న BHEL ఉద్యోగులు.

ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గారు, మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ రాంచందర్ రావు గారు, జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి గారు, పదాధికారుల, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

#BJPSadasyata2024

137 - 0

BJP Telangana
Posted 2 days ago

ఈ నాటకాన్ని నడుపుతున్న ఉత్తమ దర్శకుడు ఎవరో..?

237 - 1

BJP Telangana
Posted 2 days ago

డైవర్షన్ డ్రామాల్లో కారు, కాంగ్రెస్‌ పార్టీలు
ప్రజా సమస్యలు వస్తే చాలు.. గొడవలు మొదలెడతరు
సమస్యలు పక్కకుపోవాలి.. వీళ్ల కొట్లాటలు తెరమీదకు రావాలి
రేవంత్ నాటకం.. గులాబీల బూటకం

#PrashnistunnaTelangana

178 - 4