వసంతలక్ష్మి అయ్యగారి వాయిస్ / మిమిక్రీ కళాకారిణి నేపథ్యం తనమాటలలోనే..
గతానుభవాలు .. స్మృతులతోపాటూ కథాపఠనం ..పాటలు .. హారతులు ... టోటల్ గా వినోదాన్ని పంచడానికై నేనెంచుకున్న మాధ్యమమిది .రేడియో టీవీ లకు ఆడియో సపోర్టు పలు విధాలుగా యిచ్చిన అపార అనుభవం తో పాటు అలనాటి రికార్డులను భద్రపరచి డిజిటైజ్ చేయించి మీకు వినిపించాలన్న తపనతో యిలా వచ్చాను .అడపాతడపా మంచి మిమిక్రీనివినిపించడమూ సహజంగా నేను చేస్తుంటాను .సమాజ హితవు కోరుతూ సుమతీ వేమన శతకాపద్యాలకు పలువురు ప్రముఖులు వ్రాసిన కథలను పిల్లలమనసుకెక్కేలా చదివి వినిపిస్తాను .నా ఆడియోలు విన్న వారు ఉత్తేజితులై యీరంగంలో మెళకువలూ తెలుసుకోగలరు .పుస్తకాలు చదవడం కన్నా వినడంలో వుండే సౌఖ్యాన్ని మీరే తెలుసుకుంటారు.ప్రముఖుల నవలలనూ.. కథలనూ నా గళాన్నే ఆయాపాత్రలకు అనువుగా మారుస్తూ చదివి వినిపించడం నాప్రత్యేకత. దాంతో కథను మీరు వింటూనే చూసిన అనుభూతినిపొందడం ఖాయం.