in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
అనంతపురం:
*జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన విద్యార్థిని అభినందించిన నారాయణ పాఠశాల యాజమాన్యం*
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ నెల 6 నుంచి 8 వ తేదీ వరకు తిరుపతి లో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ 63 కేజీ ల విభాగంలో ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించి, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న విద్యార్థి వి.హరి చరణ్ తేజ్ ను నారాయణ పాఠశాల ఏజీఏం వి.రామకృష్ణ, జీసస్ నగర్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ ఏ.నాగ రాజేశ్వరి అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో మరింత ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు తేవాలని వారు ఆకాంక్షించారు.
68వ స్కూల్ గేమ్స్ జాతీయ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు మధ్యప్రదేశ్ లోని విడిషా లో జరగనున్నాయి.
14 - 0
అనంతపురం కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో మంగళవారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం అనంతపురం పార్లమెంట్ సభ్యులు మరియు దిశ చైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించగా, సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.i0, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ వసీం, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డిఆర్ఓ ఏ.మలోల, జడ్పి సిఈఓ వెంకటసుబ్బయ్య, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, సిపిఓ అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
16 - 0
Full Video link.... https://youtu.be/znhzZa3fZz4
సెల్ ఫోన్ల రికవరీలో 10 వేల మైలురాయి దాటిన అనంత పోలీసులు
* జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి మార్క్ ... సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే అనంత పోలీసులు టాప్
* ఈరోజు అందజేసిన వాటితో కలిపి ఇప్పటి వరకు జిల్లా పోలీసుశాఖ అందజేసిన మొబైల్ ఫోన్లు 10,195... వీటన్నింటి విలువ సుమారు రూ 18.85 కోట్లు
* అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో రికవరీ మొబైల్ ఫోన్ల మేళా... రూ.3.45 కోట్ల విలువ చేసే 1309 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ఈరోజు అందజేసిన జిల్లా ఎస్పీ
* మిస్సయ్యి ఇక దొరకవని ఆశలు వదలిన సెల్ ఫోన్లను పోలీసుల ద్వారా అందుకుని జిల్లా పోలీసుశాఖ పట్ల హర్షం వ్యక్తం చేసిన బాధిత ప్రజలు
----****----****-----****----****----***
* జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు ఈరోజు రూ. 3.45 కోట్లు విలువ చేసే 1309 సెల్ ఫోన్లను బాధిత ప్రజలకు అందజేశారు
* జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకు గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీలో రాజీపడని జిల్లా పోలీసులు
* ఇప్పటి వరకు అందజేసిన 10,195 మొబైల్ ఫోన్లలో అనంతపురం జిల్లావాసులకు- 6504, శ్రీ సత్య సాయి -1012, కర్నూలు- 589, కడప-401, చిత్తూరు-92, గుంటూరు-81, తిరుపతి-55, నెల్లూరు-53, తూర్పు గోదావరి-38, ప్రకాశం-36, కృష్ణ-35, పశ్చిమ గోదావరి-33, విజయవాడ-28, విజయనగరం-21, కాకినాడ-18, శ్రీకాకుళం-15, ఏలూరు-12, ఒంగోలు-09, విశాఖపట్నం-07... మరియు
కర్నాటక -415, తెలంగాణ-385, కేరళ-93, తమిళనాడు-71, మహరాష్ట్ర-60, పశ్చిమ బెంగాల్ - 39, ఉత్తరప్రదేశ్ - 19, బీహార్-15, అస్సాం-13, రాజస్థాన్-11, ఒడిస్సా-09, గుజరాత్-08, మధ్యప్రదేశ్-05, హర్యాన-03, జమ్ము కాశ్మీర్-03, ఛత్తీస్ ఘడ్-02, జార్కండ్-02, డెహ్రాడూన్-01, డిల్లీ-01, పంజాబ్ -01...
* 26-06-2022 వ తేదీన జిల్లా పోలీసుశాఖ చాట్ బాట్ సేవలు ప్రారంభించి చోరీకి గురైనా లేదా మిస్సయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ప్రజలకు అందజేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే
* ఇప్పటి వరకు రికవరీ చేసి అందజేసిన 10,195 ఫోన్లలో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలలోని బాధితులకు ముట్టజెప్పిన ఫోన్లు 1156... మన రాష్ట్రంలోని 19 జిల్లాల బాధితులకు అందజేసినవి 2,535... రికవరీ చేసి అందజేసిన మొబైల్ ఫోన్లు ధర రూ. 499 నుండీ రూ 1,41,000/- వరకు ఉన్నాయి
* సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచన
* అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కల్గిన బాక్సు ఉంటేనే కొనండి
* ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రదేశాలలో మోసపు మాటలతో నమ్మబలికే వారి పట్ల ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి
* అపరిచితులతో ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు... అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతాడని గుర్తించి దూరంగా ఉండాలి
* మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసిన జిల్లా పోలీస్ ... చాట్ బాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న అనంత పోలీసులు
* ఫోన్ చోరీకి గురైనా మిస్ అయినా చాట్ బాట్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న CEIR ద్వారా నమోదు చేసుకోవాలి.
* CEIR లో ఎలా నమోదు చేసుకోవచ్చో చాట్ బాట్ లో సూచనలు కూడా చేశాం. వెంటనే సిమ్, IMEI నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ నంబర్ , మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండే వీలుంటుంది.
* ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు జవాబుదారీగా అందించేందుకు కృషి చేసిన జిల్లా పోలీస్ సైబర్ విభాగం సి.ఐ షేక్ జాకీర్ మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ
* బిల్లు లేకుండా సెల్ ఫోన్ అమ్ముతామంటు నమ్మబలికే వ్యక్తులు మరియు సెల్ ఫోన్ దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తదితర ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరించే వారిపై సమీపంలోని పోలీసు స్టేషన్ కు లేదా డయల్ - 100/112 కు సమాచారం చేరవేయాలని విజ్ఞప్తి
** మీ సెల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకు గురైనా ఈకింద కనపరిచిన లింక్స్ ఓపెన్ చేసి సమాచారం పొందుపరచండి....
1)To report Lost/Theft Mobile
A) Chatbot : bit.ly/3yjd0rm
B) www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect…
** సైబర్ నేరానికి గురైతే ఈక్రింది కనపరిచిన లింక్ కు లేదా టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి...
2) Cyber Crime Complaint www.cybercrime.gov.in
Dial 1930 for cyber complaints
** నూతన యాప్ " అఫెండర్ సర్వేలెన్స్ " ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
జిల్లా ఎస్పీ గారు ఈసందర్భంగా నూతన యాప్ "అఫెండర్ సర్వేలెన్స్ " ఆవిష్కరించారు. రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, ప్రాపర్టీ అఫెండర్స్, హంతకులు, తదితర నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి పర్యవేక్షించడానికి ఈ యాప్ పోలీసులకు దోహదపడుతుంది. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఏవైనా నేరాలకు ఒడిగట్టాలనుకున్నా, రాత్రిళ్లు అనుమానాస్పదంగా నేరాల చేసేందుకు తిరుగుతున్నా ఈ యాప్ లోని ఫేస్ రికగ్నేషన్ వల్ల బయటపడిపోతారు. ఈ యాప్ ను రూపొందించిన మణికంఠ గౌతంను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
ఈకార్యక్రమాలలో అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి, డీఎస్పీలు వి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు, రవిబాబు, శ్రీనివాస్, రామకృష్ణుడు, మహబూబ్ బాషా, సి.ఐ లు ధరణీకిశోర్, క్రాంతికుమార్, షేక్ జాకీర్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
8 - 0
దేవరగట్టు బన్ని ఉత్సవం భద్రత ను పర్యవేక్షించిన...
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.
ప్రశాంతంగా ముగిసిన బన్ని ఉత్సవం... బన్ని ఉత్సవం ఇది ఒక సంబరం..
బన్ని ఉత్సవం లో పోలీసులకు సహాకరించిన ఇతర శాఖలకు, మీడియా వారికి ప్రత్యేక అభినందనలు తెల్పిన ... జిల్లా ఎస్పీ.
కర్నూలు జిల్లా, హోళగుంద మండలం , దేవరగట్టులో ఆదివారం దసరా పండుగ సంధర్బంగా బన్ని ఉత్సవాన్ని సంప్రదాయంగా కొనసాగించారు.
కట్టుదిట్టమైన భద్రత మధ్య బన్ని ఉత్సవం ముగిసింది.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ మీడియాతో మాట్లాడారు.
అక్టోబర్ 12 న దసర పండుగ సంధర్బంగా దేవరగట్టులో జరిగే బన్ని ఉత్సవం ప్రశాంతంగా ముగిసిందన్నారు.
కళ్యాణం, భవిష్యవాణి, బన్ని ఉత్సవం ప్రశాంతంగా జరిగాయన్నారు.
ప్రతి ఏటా కన్న ఈ ఏటా వర్షాలు బాగా పడడం వలన పంటలు బాగా పండి ప్రజలు 2 లక్షల కు పైగా బన్ని ఉత్సవం కు వచ్చారన్నారు.
ఎక్కడా కూడా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగలేదన్నారు.
చిన్న చిన్న చెదురు , ముదురు ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.
చిన్న చిన్న గాయాలైనా వారికి ఆదోని సబ్ కలెక్టర్ సహాకారంతో మెరుగైన వైద్యం అందించామన్నారు.
2 లక్షల మంది పై గా పాల్గొన్న ఈ బన్ని ఉత్సవంలో మొత్తం 60 మంది దాకా గాయాలు కావడం జరిగిందన్నారు. ( మొత్తం 60 మందిలో ... బన్ని ఉత్సవం సంధర్బంగా 30 మందికి , గుడి దగ్గర కొండ పైకి మెట్లు ఎక్కడం, దిగడం తోపులాట లో మరియు దూర ప్రయాణంలో చిన్న చిన్న ప్రమాదాలు ఇంకొ 30 మందికి గాయాలు కావడం జరిగిందన్నారు) . ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ పాయం లేదన్నారు.
ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించడంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయన్నారు.
బందోబస్తు విధులలో కర్నూలు జిల్లా పోలీసులతో పాటు , ఇతర జిల్లాల నుండి వచ్చిన పోలీసు సిబ్బంది అందరూ కూడా బాగా విధులు నిర్వర్తించినందుకు అభినందిస్తున్నామన్నారు.
ఈ బన్ని ఉత్సవం విజయవంతం కావడానికి మీడియా వారి సహాకారం కూడా ఉందన్నారు.
5 డ్రోన్ల తో నిఘా ఉంచామన్నారు. ఎక్కడ కూడా హింసాత్మక ఘటనలు జరగలేదన్నారు. ఒక సంబరం లాగా జరిగిందన్నారు.
జిల్లా ఎస్పీ తో పాటు జిల్లా టిడిపి పార్టీ ఇంచార్జ్ తిక్కారెడ్డి, ఆలూరు నియోజక వర్గ ఇంచార్జ్ వీరభద్రగౌడ్, పత్తికొండ ఆర్డిఓ భరత్ నాయక్ , డిస్పీలు వెంకట్రామయ్య, శ్రీనివాసాచారి, ఉపేంద్రబాబు , డివిజనల్ పంచాయితి అధికారి నూర్జహాన్, ట్రైనీ డిఎస్పీ ఉష శ్రీ, సిఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
3 - 0
కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ ఘాట్ దగ్గర దుర్గమాత విగ్రహానికి పూజలు నిర్వహించి, నిమజ్జనాన్ని ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టి.జి. భరత్, మాజీ రాజ్యసభ సభ్యులు టిజీ వెంకటేష్.
ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత రెడ్డి, నగర మేయర్ బివై రామయ్య, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నంది రెడ్డి సాయి రెడ్డి, కర్నూల్ డి.ఎస్.పి బాబు ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.
6 - 0
*మహాలక్ష్మి అలంకరణలో శ్రీ కనకదుర్గా దేవి*
దేవీ శరన్నవరాత్రులు
అనంతపురం నగరం సాయి నగర్ 4వ క్రాస్ అమ్మవారి చెరువు కట్టపై వెలసిన శ్రీశ్రీ కనకదుర్గ ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రులు 6వ రోజు అమ్మవారు శ్రీమహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. తెల్లవారుఝాము నుంచే అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారికి 500 రూపాయల కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది.
4 - 0
Tungabhadra Dam Levels
Date: 27.07.2024
Time: 7:00 pm
Present Level(Feet): 1631.44
Present Storage(TMC): 99.586
Hourly inflow :136734
Canals :8899
River/ROFS outflow: 149415
Outflow:158434
Average inflows: 122845
6 - 0
కలర్ ఫుల్ లైటింగ్ లో తుంగభద్ర డ్యాం..
TB డ్యామ్ 49.5 మీటర్ల ఎత్తు మరియు 33 క్రెస్ట్ గేట్లను కలిగి ఉంది. ప్రస్తుతం 28 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. తుంగభద్రమ్మ కలర్ ఫుల్ లైటింగ్ తో కళ కళ లాడుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 80 వేల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరుతుండటంతో జలాశయంలోని 33 గేట్లకు గాను 28 గేట్లను పైకెత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. జలాశయానికి వరద పోటు పెరగడంతో 20 గేట్లను రెండు అడుగులు, 8 గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో డ్యాం ను అలంకరించడంతో 28 గేట్ల ద్వారా కలర్ ఫుల్ లైటింగ్ మధ్య నీటి విడుదల ఆకర్షణీయంగా మారింది. రాత్రిపూట ఇంద్రధనస్సు రంగులతో ప్రకాశిస్తూన్న TB డ్యామ్ చూడటానికి ఒక విజువల్ ట్రీట్.
5 - 0
కలర్ ఫుల్ లైటింగ్ లో తుంగభద్ర డ్యాం..
TB డ్యామ్ 49.5 మీటర్ల ఎత్తు మరియు 33 క్రెస్ట్ గేట్లను కలిగి ఉంది. ప్రస్తుతం 28 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. తుంగభద్రమ్మ కలర్ ఫుల్ లైటింగ్ తో కళ కళ లాడుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి 80 వేల క్యూసెక్కుల దాకా వరద వచ్చి చేరుతుండటంతో జలాశయంలోని 33 గేట్లకు గాను 28 గేట్లను పైకెత్తి 72 వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. జలాశయానికి వరద పోటు పెరగడంతో 20 గేట్లను రెండు అడుగులు, 8 గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం రంగు రంగుల విద్యుత్ దీప కాంతులతో డ్యాం ను అలంకరించడంతో 28 గేట్ల ద్వారా కలర్ ఫుల్ లైటింగ్ మధ్య నీటి విడుదల ఆకర్షణీయంగా మారింది. రాత్రిపూట ఇంద్రధనస్సు రంగులతో ప్రకాశిస్తూన్న TB డ్యామ్ చూడటానికి ఒక విజువల్ ట్రీట్.
7 - 0
Tungabhadra Dam
*River Discharges:*
Date: 25.07.2024 Time: 8.00Am
Reservoir Level=1631.91Ft
Capacity= 101.421 TMC
Inflow = 75,000 cusecs
Spillway discharge is increased to 22,245 Cusecs (10 gates ×1.50ft)
*Total River Discharge including EPG is = 26,757 cusecs*
7 - 0
Agriculture, Fun, Creative, Comedy, News, Views, Politics, Cinemas, Music, Songs, Human Interesting, Stories, Public issues, Biographies, Nature, Environment, Science and Technology, Socio Economic Issues, Local Issues, Current Affairs,