in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
శ్రేయోభిలాషులకు శుభోదయము.⚘️
మీకు,మీ కుటుంబ సభ్యులకు,
"దీపావళి"శుభాకాంక్షలు💐💐💐
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం
శ్రీరంగ ధామేశ్వరీం I
దాసీభూతసమాస్త దేవ వనితాం
లోకైక దీపంకురాం I
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ
బ్రహ్మేంద్ర గంగాధరాం I
త్వాం త్రైలోక్య కుటుంబినీం
సరసిజాం వందే ముకుందప్రియాం II
ఓం శ్రీ మహాలక్ష్మి దేవియై నమః !!
సర్వేజనా సుఖినోభవంతు.
సమస్త సన్మంగళాణి భవంతు.
🙏🙏🙏
1 - 0
*🎻🌹🙏 విజయ దశమి శుభాకాంక్షలు 🕉️🙏* *విజయదశమి కథ...!!*
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఈ రోజు ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు ఈరోజు
ప్రారంభిస్తే విశేషంగా లాభిస్తుంది.
🌿శమీ చెట్టు యొక్క పూజ ఈ రోజు విశేషంగా లాభిస్తుంది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది.
🌸విజయదశమి రోజున పూజలు అందుకొన్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది.
🌿విజయదశమి హిందువులకు ఏడాదికి ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ, దీన్ని దసరా అని కూడా అంటారు. దుష్ట శక్తులను సంహరించి జగత్తును కాపాడిన జగన్మాత విజయంగా భావిస్తారు.
🌸మరో విధంగా చెడు మీద మంచి విజయం సాధించినట్టుగా సూచిస్తుంది. ఈ పండుగ పది రోజులు జరుపుకుంటాం.
🌸చివరి మూడు రోజులకు అంటే దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశమికి ఒక విశిష్టత ఉంది.
🌿మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను జయించాలన్న దృష్టితో ప్రజలను చిత్రహింసలు పెడుతుండేవాడు. ఆ బాధలను తట్టుకోలేక ముల్లోకాల బాధితులు త్రిమూర్తుల వద్దకు వచ్చి తమ ఆవేదనను వెళ్లబుచ్చకున్నారు.
🌸ఈ బాధ్యతను ఆదిపరాశక్తి జగన్మాత అయిన దుర్గాదేవి తీసుకుంది. ఆ రాక్షసుడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. వెంటనే తాను తనను వివాహం చేసుకోవాలన్నట్లు సదరు రాక్షసుడికి తెలిపింది
🌿దీంతో ఆ ముగ్ధమనోహర రూపానికి దాసుడైపోయినా రాక్షసుడు వెంటనే అంగీకరించాడు. కానీ వివాహం చేసుకోవాలంటే తనపై యుద్ధం చేసి గెలవాలని జగన్మాత షరతు పెట్టింది. అందుకు అంగీకరించిన రాక్షసుడు యుద్దానికి సిద్ధమయ్యాడు.
🌸వీరిద్దరి మధ్య తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం కొనసాగింది.
ఈ నేపథ్యంలో రోజుకొక రూపం చొప్పున తొమ్మిది అవతారాలతో పోరాడిన జగన్మాత పదవ రోజు మహాకాళీమాతగా అవతారమెత్తి మహిషాసురున్ని సంహరించి దశమి రోజున విజయం సాధించి ముల్లోకాలను కాపాడింది.
🌿ఈ అపూర్వ విజాయానికి ప్రతీకగానే మనం ప్రతి ఏటా ఈ పదిరోజులను పండుగగా భావిస్తూ మొదటి తొమ్మిది రోజులు నవరాత్రులుగా దుర్గాదేవిని రోజుకొక రూపంతో అలంకరించి పదవరోజు అంటే దశమి రోజున విజయదశమిగా జరుపుకుంటున్నాం. ఇది దక్షిణాదిన తెలసిన కథ.
🌹🙏 విజయదశమి ప్రశస్తి....🙏🌹
🌸విజయదశమి చాలా శుభప్రదమైన దినం. ఆ రోజున కళాకారులు, విద్యార్థులు తమ కొత్త కార్యక్రమాలు ఆరంభించే రోజుగాను, దేవిని పూజించి ఆరాధిస్తారు. విజయదశమి వైభవంగా
జరుపుకొనవలసిన పండుగ.
🌿విశిష్టమైన ఆ పండుగ మహిమ
తెలుసుకుందాము.
🌸కాలరూపిణిగా భావించే అంబికకు సహస్రనామాలలో విజయ అనే పేరు వున్నది. ఆశ్వీయుజ శుక్లపక్ష దశమినాడు అంటే విజయదశమినాటి సాయంకాలం, నక్షత్రాలు కనిపించే సమయానికి విజయ అనే పేరు వున్నది.
🌿ఆ శుభముహూర్తంలో, ఆరంభించే కార్యాలు అన్నీ జయప్రదమవుతాయని
"ముహూర్త చింతామణి" అనే గ్రంధం తెలియ చేస్తున్నది.
🌸దసరా ఉత్సవాలు జరిపేటప్పుడు విజయదశమినాడు విజయ అనబడే ఆ శుభ ముహూర్త సమయాన్నే బాణము వేయడం జరుగుతుంది.
🌿జీవితంలో విజయాలు సాధించాలనుకున్నవారు, ఆసమయంలోనే తమ జైత్రయాత్ర ప్రారంభించాలని "రత్నకోశం" అనే గ్రంధం తెలియ చేస్తున్నది.
🌸ఉత్తర దేశ రాష్ట్రాలలో బయలు మైదానంలో జరిపే "రామలీలా" మహోత్సవంలో రామకధా నాటకానికి ముఖ్యమైన రోజు విజయదశమి.
🌿ఆ రోజున రాముని పాత్ర ద్వారా బాణాలు వేసి రావణుని, కుంభకర్ణుని, ఇంద్రజిత్ ని సంహరిస్తారు. ఈ ముగ్గురి రూపాలను తయారు చేసి దహనం చేస్తారు. ఈ చర్య దుర్మార్గాన్ని నాశనం చేసి సన్మార్గాన్ని, ధర్మాన్ని నిలబెట్టడం కోసమని తెలియచేస్తున్నది.
🌸శ్రీ రాముడు తొమ్మిది రోజులు శక్తిదేవతని ఆరాధించి పదవ రోజైన విజయదశమినాడు విజయం పొందాడు. ఈ కారణంగానే తరువాత
వచ్చిన రాజులు పదవరోజున ఆయుధ పూజలు చేయడం, శతృవుల మీద దండయాత్ర చేయడం ఆరంభించారు.
🌿ఈ ఆచారాలు యీ విధంగా ప్రారంభమై "దసరా ఉత్సవాలకి" నాంది పలికింది.
🌸చాముండి మాత తొమ్మిది రోజులు మహిషాసురునితో యుధ్ధం చేసి, పదవరోజైన విజయదశమినాడు మహిషాసురిని సంహరించినదని దేవీమహాత్యం తెలుపుతున్నది.
🌿భండాసురునితో లలితాపరమేశ్వరి తొమ్మిది రోజులు యుధ్ధం చేసి, పదవ రోజు ఆ దానవుని సంహరించి విజయం పొందినదని లలితోపాఖ్యానము తెలియ చేస్తున్నది. దేవి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టినదనడానికి నిదర్శనాలు.
🌸విజయదశమి నాడు మరాఠీవారైన ఛత్రపతి శివాజీ, హిందూ ధర్మాన్ని కాపాడడానికి, భవానీ దేవి ముందు శపధం చేసి బయలుదేరినట్టు చరిత్ర తెలుపుతున్నది.
🌿విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం విశిష్టం. మహావిష్ణువు ఆలయాలలో, స్వామి అశ్వవాహనం మీద జమ్మి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం యీనాటికి ఆచారంగా వున్నది.
🌸నవరాత్రులలో ఆఖరి రోజున ముగ్గురు దేవేరులు ఏకమై శివశక్తి రూపమై అనుగ్రహం కటాక్షిస్తున్నది. ఈరోజునే విజయదశమి అని మహాశక్తిగా పూజిస్తున్నారు. శివశక్తులు ఏకమైనందున సర్వ శుభాలు, లభిస్తాయి.🌿విజయ దశమి నాడు అక్షరాభ్యాసము, అని బాలలకు విద్య ఆరంభిస్తారు. ఆనాడు ఆరంభిస్తే పిల్లలు ఉన్నత
విద్యావంతులౌతారని చెప్తారు.
విజయదశమి విజయాలనొసగే రోజు...స్వస్తి...🚩🌞🙏🌹🎻
*విజయదశమి శుభాకాంక్షలు 💐🪷🌿🌷☘️🌹🕉️*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
#dasara
5 - 0
💠🔶🔷 *శ్రీ దేవీ శరన్నవరాత్రులు* 💠🔶🔷
*11/10/2024 - శుక్రవారం - ఆశ్వీజ శుద్ధ అష్టమి/నవమి*
‼️ *శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకారము*‼️
*నైవేద్యం: పరవాన్నం, గారెలు పానకం, వడపప్పు*
*చీరరంగు: కనకాంబరం/ఎరుపు*
శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు అనగా నవమి రోజున *మహానవమి* గా జరుపుకుంటారు. ఆ రోజున అమ్మవారిని *మహిషాసురమర్ధినిగా అలంకరిస్తారు.* దేవి అవతారాలలో అత్యుశ్ర రూపం మహిషాసురమర్ధినీ దేవి. 👉 ఈరోజు మహిషాసుర మర్ధినీ అమ్మవారిని పటము లేదా కళశంలో ఆవాహన చేసి ఈరోజు క్రింద తెలిపిన *మహిషాసురమర్ధినీదేవి అమ్మ అవతారాన్ని అష్టోత్తర శతనామంతో* పూజ చేయగలరు. మహిషాసురడనే రాక్షసుడిని సంహరించిన అమ్మను *మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే* , సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది.
💐🌸🌺🌻🌹🌷🌞🌝
💐 *శ్రీ మహిషాసురమర్ధినీ దేవి అష్టోత్తరం* 👇
ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మయాయై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహాబుద్ధ్యై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహా బలాయై నమః
ఓం మహా సుధాయై నమః
ఓం మహా నిద్రాయై నమః
ఓం మహా ముద్రాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహాజయాయై నమః
ఓం మహాతుష్ట్యై నమః
ఓం మహా లజ్జాయై నమః
ఓం మహా ఢృత్యై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహాదంష్ట్రాయై నమః
ఓం మహాకాంతాయై నమః
ఓం మహాస్మృత్యై నమః
ఓం మహాపద్మిన్యై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహా భోదాయై నమః
ఓం మహా తపసే నమః
ఓం మహా సంస్థానాయై నమః
ఓం మహారవాయై నమః
ఓం మహా రోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాబంధసంహార్యై నమః
ఓం మహాభయ వినాశిన్యై నమః
ఓం మహానేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహావక్షసే నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహామహీరుహాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం మహాఛాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహాపర్వతనందిన్యై నమః
ఓం మహాబ్రహ్మమయై నమః
ఓం మహామాత్రవే నమః
ఓం మహాసారాయై నమః
ఓం మహాసురగ్న్యై నమః
ఓం మహత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం చర్చితానందాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహా మంత్రాయై నమః
ఓం మహీమ్యై నమః
ఓం మహామహికులాయై నమః
ఓం మహాలోలాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం మహానీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహాకలాయై నమః
ఓం మహాచిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహాహేతవే నమః
ఓం మహాయశస్విన్యై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహా సాధ్యాయై నమః
ఓం మహా సత్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహాసుఖిన్యై నమః
ఓం మహాదుఃస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షప్రదే నమః
ఓం మహాపక్షాయై నమః
ఓం మహీయస్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహావాణ్యే నమః
ఓం మహారోగవినాశినే నమః
ఓం మహాధారాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహామార్యే నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహాక్షేమకర్యే నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయినే నమః
ఓం మహావిషఘ్న్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాదుర్గవినాశిన్యై నమః
ఓం మహావర్షాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహాసుభ్రద్రాయై నమః
ఓం మహ్యై సుభగాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాసత్యే నమః
ఓం మహాప్రత్యంగిదేవతాయై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహ్యై మంగళకారిణ్యై నమః
ఓం మహారమ్యై నమః
ఓం మహారాజ్యై నమః
ఓం మహా రాగిణ్యై నమః
ఓం మహా రాజరాజ సింహాసిన్యై నమః
*ఇతి శ్రీ మహిషాసురమర్దని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం*
తదుపరి నైవేద్యం తాంబూలం హారతి నిచ్చి మీకు వచ్చిన స్తోత్రములు పాటలు చదువుకోండి.
*అయిగిరినందిని నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే* *గిరివర వింధ్య శిరోధిని వాసిని, విష్ణువిలాసిని జిష్ణునుతే |* *భగవతి హే శితికంఠ కుటుంటిని, భూరికుటుంబిని భూరికృతే* *జయజయహే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ॥*
*శ్రీ మాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీ సరస్వత్యై నమః*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#dasara
2 - 0
*దుర్గా ద్వాత్రింశ న్నామమాల*
[అమ్మవారి శక్తివంతమైన 32 నామాలు)
*దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ l*
*దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ II*
*దుర్గతోద్ధారిణీ దుర్గనిహన్త్రీ దుర్గ మావహా l*
*దుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోకదవానలా ll*
*దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ l*
*దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా ll*
*దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమధ్యానభాసినీ l*
*దుర్గమోహా దుర్గమగా దుర్గమార్ధస్వరూపిణీ ll*
*దుర్గమాసుర సంహన్త్రీ దుర్గమాయుధ ధారిణీ l*
*దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ ll*
*దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గదారిణీ l*
*నామావళి మిమాంయస్తు దుర్గాయా మమ మానవః ll*
*పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః ॥*
3 - 0
💠🔶🔷 = *శ్రీ దేవీ శరన్నవరాత్రులు* = 💠🔶🔷
*09/10/2024 - బుధవారం - ఆశ్వయుజ శుద్ధ సప్తమి*
‼️ *దేవి శ్రీ సరస్వతీ అలంకారము*‼️
*చీర/రెవిక రంగు: తెలుపురంగు నైవేద్యం: దధ్యోజనం*
శరన్నవరాత్రులలో భాగంగా మూలా నక్షత్రం రోజున ధర్మసింధు ప్రామాణికంగా *శ్రీ పుస్తకరూప సరస్వతీ దేవి* అవతారంలో మాత దర్శనమిస్తారు👉 ఈరోజు సరస్వతీ దేవి అమ్మవారిని పటము లేదా కళశంలో ఆవాహన చేసి ఈరోజు క్రింద తెలిపిన సరస్వతీ అమ్మ అవతారాన్ని అష్టోత్తర శతనామంతో పూజ చేయగలరు. సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్థినీ విద్యార్థులకు వాగ్దేవి అనుగ్రహంవలన సర్వ విద్యలయందు విజయం పొందుతారు.
*యా కుందేందు తుషారహార దవళా యాశుభ్ర వస్త్రాన్వితా*
*యా వీణా వరదండ మండిత కరా యశ్వేత పద్మాసనా*
*యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భిర్దేవైస్సదా పూజితా*
*సమాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా"*
💐🌸🌺🌻🌹🌷🌞🌝
💐 *శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామావళి* 💐 👇
ఓం శ్రీ సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రికాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకహస్తాయై నమః (10)
ఓం జ్ఞానముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతక నాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగాయై నమః (20)
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వాయై నమః (30)
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః (40)
ఓం వసుధాయై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యావాసాయై నమః (50)
ఓం చండికాయై నమః
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
ఓం సౌదామిన్యై నమః
ఓం సుధామూర్తయే నమః
ఓం సువీణాయై నమః (60)
ఓం సువాసిన్యై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం బ్రహ్మజాయాయై నమః
ఓం విశాలాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః
ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం శుభదాయై నమః (70)
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురాసుర నమస్కృతాయై నమః
ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం ముండకాంబికాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం ప్రహరణాయై నమః
ఓం కళాధారాయై నమః (80)
ఓం నిరంజనాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్రగంధాయై నమః
ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః (90)
ఓం వంద్యాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం ద్విభుజాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం నీలజంఘాయై నమః
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100)
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మంత్రవిద్యాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం మహాసరస్వత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108)
*ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తం*
తదుపరి నైవేద్యం తాంబూలం హారతి నిచ్చి మీకు వచ్చిన స్తోత్రములు పాటలు చదువుకోండి.
*శ్రీ మాత్రే నమః శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీ సరస్వత్యై నమః*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#dasara
5 - 0