Channel Avatar

విజయగీతామృతం @UChbIhtVGQ2esBEM6njN-vnw@youtube.com

77K subscribers - no pronouns :c

🕉️🔱విజయగీతామృతం అనేది ఒక ఆధ్యాత్మిక సమాచార వేదిక 🔱🕉️ ఈ వ


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

విజయగీతామృతం
Posted 14 hours ago

భగవద్గీతలో మీ జీవితాన్ని సమూలంగా మార్చివేసే 5 అధ్బుత అంశాలు ఇవే 🙏

13 - 0

విజయగీతామృతం
Posted 19 hours ago

శనివారము, ఫిబ్రవరి, 1, 2025
-----------------------------------------
మాసం: మాఘ మాసం
ఆయనం: ఉత్తరాయణం
పక్షము: శుక్ల పక్షము
ఋతువు: శిశిర ఋతువు
అమృతకాలము: 19:06 నుండి 20:36 వరకు
సూర్యోదయము: 06:48
సూర్యాస్తమయము: 18:12
రాహు కాలం: 09:39 నుండి 11:04 వరకు
యమగండము: 13:55 నుండి 15:21 వరకు
దుర్ముహుర్తములు: 06:48 నుండి 07:34 వరకు, 07:34 నుండి 08:19 వరకు
అభిజిత్: 12:07 నుండి 12:53 వరకు
కరణం: గర 11:38 వరకు, వణిజ 22:26 వరకు
చంద్రోదయం: 08:51
చంద్రాస్తమయం: 21:04
చంద్ర రాశి: కుంభము 20:58 వరకు
తిథులు: తదియ 11:38 వరకు
నక్షత్రము: పూర్వాభాద్ర 02:33, ఫిబ్రవరి 02 వరకు
గుళిక కాలం: 06:48 నుండి 08:14 వరకు
శక: 1946 క్రోధి
వర్జ్యం: 10:11 నుండి 11:40 వరకు
యోగా: పరిఘ 12:25 వరకు

నేటి మాట

మనకు కావల్సింది - భగవంతుడిని ఎలా అడగాలి???

ఈరోజుల్లో ఇది చాలా మందికి ఒక పెద్ద విచారం!!...
మనము భగవంతుడు అనే నమ్మకం , విశ్వాసంతో ఆయన పాదాల చెంతకు చేరినపుడు, ఇంకా ఆయనకు నివేదించడం అవసరమా???
మన కన్న తల్లి టైం కి మనకు ఏమి కావాలో తెలుసుకొని అన్నీ అందిస్తుంది,
మనము ఉద్యోగం చేసే కంపనీ వారు మనకు ఎప్పుడు ఏమీ కావాలో అన్నీ అందిస్తుంది ...
మరి వీటన్నిటినీ సృష్టించిన ఆ దేవదేవుడు నీకు ఏమి కావాలో ఆయనకు తెలియదా !!!...

" మీరు భగవంతుడుని అది కావాలి, ఇది కావాలి అని అడగవద్దు"...
మనసులో భక్తి, ప్రేమ, విశ్వాసాలు వృద్ధి చేసుకోండి, అయన ఇచ్చినది స్వీకరించడానికి సిద్ధపడి ఉండండి...

రాముడు వచ్చి తన అంత్యక్రియలు నిర్వహించాలని జటాయువు కోరుకుందా?
శబరి అడిగిందా రాముడు తన దగ్గరకు రావాలని!?
కృష్ణుని కుచేలుడు అడిగాడా తనకు సంపదలు ఇవ్వమని ?

వారిలో ఉండిన ప్రేమ, భక్తి, విశ్వాసాలే భగవంతుణ్ణి వారి చెంతకు రప్పించాయి.

మీ మనసులో భగవంతుని పట్ల దృఢమైన భక్తి, ప్రేమ విశ్వాసాలు ఉంటే మీరు ఎదీ అడగనవసరం లేకుండానే ఆయనే స్వయంగా అన్నీ సమకూరుస్తాడు.

యాచించడం నిజ భక్తుని లక్షణం కాదు!!...
"మీ మనసులో భగవంతుని నిలుపుకొండి...సమస్తమూ మీ చెంతకే వచ్చి చేరుతుంది..."
ఇది సత్యం ...

🌹శుభమస్తు🌹
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

2.1K - 9

విజయగీతామృతం
Posted 1 day ago

శుక్రవారము, జనవరి, 31, 2025
-----------------------------------------
మాసం: మాఘ మాసం
ఆయనం: ఉత్తరాయణం
పక్షము: శుక్ల పక్షము
ఋతువు: శిశిర ఋతువు
అమృతకాలము: 21:31 నుండి 23:01 వరకు
సూర్యోదయము: 06:48
సూర్యాస్తమయము: 18:11
రాహు కాలం: 11:04 నుండి 12:30 వరకు
యమగండము: 15:20 నుండి 16:46 వరకు
దుర్ముహుర్తములు: 09:05 నుండి 09:50 వరకు, 12:52 నుండి 13:38 వరకు
అభిజిత్: 12:07 నుండి 12:52 వరకు
కరణం: కౌలవ 13:59 వరకు, తైతిల 00:49, ఫిబ్రవరి 01 వరకు
చంద్రోదయం: 08:10
చంద్రాస్తమయం: 20:06
చంద్ర రాశి: కుంభము
తిథులు: విదియ 13:59 వరకు
నక్షత్రము: శతభిషం 04:14, ఫిబ్రవరి 01 వరకు
గుళిక కాలం: 08:14 నుండి 09:39 వరకు
శక: 1946 క్రోధి
వర్జ్యం: 12:33 నుండి 14:03 వరకు
యోగా: వారీయన 15:33 వరకు

🌹 ప్రతి తండ్రి కొడుక్కి/ కూతురికి నేర్పాల్సిన 5 జీవిత పాఠాలు ( వాళ్లు వినడం లేదు కదా అనిమాత్రం అనుకోవద్దు)

⿡ ఆచారవ్యవహారం – ఇతరుల పట్ల మంచి సంస్కారం, మర్యాద, గౌరవం ఎలా చూపాలో నేర్పాలి.

⿢ శ్రమ& పట్టుదల – ఎలాంటి పరిస్థితుల్లోనైనా కష్టపడి, ప్రయత్నించాలి అనే నమ్మకం కలిగించాలి.

⿣ డబ్బు – డబ్బు ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం, ఖర్చు చేయడం ఎలా అనేది నేర్పాలి.

⿤ ఆత్మ గౌరవం – ఎవరి ముందూ తలదించుకోవద్దని, తప్పు చేస్తే ఒప్పుకోవాలని, నిజాయితీగా ఉండాలని చెప్పాలి

⿥ కష్టనష్టాల్లో ధైర్యం – ఓటమిని ఒప్పుకోవడం, తప్పిదాల నుంచి నేర్చుకోవడం, ఎప్పుడూ ముందుకు సాగడం నేర్పించాలి.

తండ్రి మాటలు కొడుకు/కూతురు, భవిష్యత్తును ఖచ్చితంగా తీర్చిదిద్దుతాయి! 💪👨‍👦

1.5K - 2

విజయగీతామృతం
Posted 2 days ago

గురువారము, జనవరి, 30, 2025
-----------------------------------------
మాసం: మాఘ మాసం
ఆయనం: ఉత్తరాయణం
పక్షము: శుక్ల పక్షము
ఋతువు: శిశిర ఋతువు
అమృతకాలము: 20:03 నుండి 21:33 వరకు
సూర్యోదయము: 06:49
సూర్యాస్తమయము: 18:11
రాహు కాలం: 13:55 నుండి 15:20 వరకు
యమగండము: 06:49 నుండి 08:14 వరకు
దుర్ముహుర్తములు: 10:36 నుండి 11:21 వరకు, 15:09 నుండి 15:54 వరకు
అభిజిత్: 12:07 నుండి 12:52 వరకు
కరణం: బవ 16:10 వరకు, బాలవ 03:06, జనవరి 31 వరకు
చంద్రోదయం: 07:27
చంద్రాస్తమయం: 19:07
చంద్ర రాశి: మకరము 18:35 వరకు
తిథులు: పాడ్యమి 16:10 వరకు
నక్షత్రము: శ్రవణం 07:15 వరకు, ధనిష్ఠ 05:50, జనవరి 31 వరకు
గుళిక కాలం: 09:39 నుండి 11:04 వరకు
శక: 1946 క్రోధి
వర్జ్యం: 11:01 నుండి 12:31 వరకు
యోగా: వ్యతీపాత 18:33 వరకు

🌞 మాఘమాసం 30.1.25గురువారం నుంచి 🌞

🙏🌞🌞🌞🌞🕉🌞🌞🌞🌞🙏

🌞 చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం♪.

🌞 'మఘం' అంటే యజ్ఞం♪.

🌞‌ యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసం శ్రేష్ఠమైనదిగా భావిస్తారు♪.

🌞 ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసం అయ్యింది♪.

🌞 అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం♪. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు♪.

🌞 అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది♪.

🌞‌ ఇది మాధవ ప్రీతికరం♪. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు♪. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు♪.

🌞 ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి♪.

🌞 మాఘ విశిష్టతను గురించి.... 🌈

🌞 ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది♪.

🌞‌ మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియ లోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది♪. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం♪.

🌞 ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి♪.

✅👉 మాఘమాసంలో...♪

🌞‌ శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది♪. దీంతోపాటు పార్వతీ పూజ, లలితావ్రతం హరతృతీయ వ్రతం చేస్తుంటారు♪.

🌞 శుద్ధ చవితి న ఉమా పూజ, వరదా గౌరీ పూజ, గణేశ పూజ చెయ్యడం మొల్లపువ్వులతో శివపూజ చెయ్యడం ఉంది♪. ఈ చవితి నాడు చేసే తిలదానానికి గొప్ప పుణ్యఫలం చెప్పారు♪.

🌞 శుద్ధ పంచమి శ్రీపంచమి♪. ఆ రోజున సరస్వతీ పూజ చెయ్యటం విశేష ఫలప్రదం♪. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతికామ దహనోత్సవం అనే పేరున జరుపుకొంటారు♪.

🌞‌ శుద్ధ షష్టిని విశోకషష్టి అని, మందార షష్టి అని, కామషష్టి, వరుణ షష్టి అని కూడా అంటారు♪. ఈ రోజున వరుణ దేవుడిని ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి♪.

🌞 శుద్ధ సప్తమి ని రథసప్తమి అని అంటారు♪. ఈ రోజున సూర్యజయంతిని జరుపుతారు♪. రథసప్తమీ వ్రతం ఎంతో విశేషమైనది♪.

🌞 శుధ్ద అష్టమి నాడు భీష్మాష్టమిని చేస్తారు♪. కురువృద్ధుడు భీష్ముడికి తర్పణం విడవటం ఈనాటి ప్రధానాంశం♪.

🌞 శుధ్ద నవమి నాడు నందినీదేవి పూజ చేస్తారు♪. దీన్నే మధ్వనవమి అని అంటారు♪.

🌞 శుధ్ద ఏకాదశి కి జయ ఏకాదశి అని పేరు♪. దీన్నే భీష్మ ఏకాదశి వ్రతమని చెబుతారు♪. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు♪. ఈ తిథినాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతుంటారు♪.

🌞 శుధ్ద ద్వాదశి నాడు వరాహ ద్వాదశీ వ్రతం చేస్తారు♪.

🌞 శుధ్ద త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది♪.

🌞 మాఘపూర్ణిమ కు మరీమరీ విశిష్టత ఉంది♪. ఈ రోజున కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటం, ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేయటం విశేష ఫలప్రదాలు♪. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘపూర్ణిమను చెబుతారు♪.

🌞 మాఘమాసంలో వచ్చే.... 💐

🌞‌ కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్యప్రాప్తి వ్రతం చేస్తారు♪.

🌞‌ కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి♪.

🌞‌ కృష్ణ అష్టమి నాడు మంగళా వ్రతం చేస్తుంటారు♪.

🌞‌ కృష్ణ ఏకాదశి ని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజున గుర్తు చేసే తిథి అని చెబుతారు♪.

🌞 కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశీ వ్రతం జరుపుతుంటారు♪.

🌞 కృష్ణ త్రయోదశి ని ద్వాపరయుగాదిగా పేర్కొంటారు.

🌞 కృష్ణ చతుర్దశి నాడు మహశివ రాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు♪.

🌞‌ మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య నాడు పితృశ్రాద్ధం చెయ్యడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు♪.

🌞 ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది♪. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది♪.
❀┉┅━❀🕉❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

🙏🌞🌞🌞🌞🕉🌞🌞🌞🌞🙏

2.9K - 16

విజయగీతామృతం
Posted 3 days ago

బుధవారము, జనవరి, 29, 2025
-----------------------------------------
మాసం: పుష్య మాసం
ఆయనం: ఉత్తరాయణం
పక్షము: కృష్ణ పక్షము
ఋతువు: హేమంత ఋతువు
అమృతకాలము: 21:19 నుండి 22:51 వరకు
సూర్యోదయము: 06:49
సూర్యాస్తమయము: 18:10
రాహు కాలం: 12:29 నుండి 13:55 వరకు
యమగండము: 08:14 నుండి 09:39 వరకు
దుర్ముహుర్తములు: 12:07 నుండి 12:52 వరకు
అభిజిత్: ఏమి లేదు
కరణం: చతుష్పాద 06:54 వరకు, నాగ 18:05 వరకు, కింస్తుఘ్న 05:10, జనవరి 30 వరకు
చంద్రోదయం: చంద్రోదయం లేదు
చంద్రాస్తమయం: 18:05
చంద్ర రాశి: మకరము
తిథులు: అమావాస్య 18:05 వరకు
నక్షత్రము: ఉత్తరాషాఢ 08:20 వరకు
గుళిక కాలం: 11:04 నుండి 12:29 వరకు
శక: 1946 క్రోధి
వర్జ్యం: 12:09 నుండి 13:41 వరకు
యోగా: సిద్ధి 21:22 వరకు

🕉️*మానవ జీవితం - కర్మలు*🕉️

మానవుడు విడువవలిసినవి - చేయవలసిన కర్మలు కొన్ని వుంటాయి, అవి ఏవి ? ఏమిటి??_
'అహంకార ఆడంబరాలకు భగవంతుడు లొంగడు...'
ఎపుడూ, ఏది చేసినా కర్మే ఔతుంది, ఎపుడూ మానసికంగా,(మనసు, మాట తనువు) వాచకంగా, శారీరికంగా, భగవంతుని చింతించ డానికే ప్రయత్నించాలి.

ప్రతీమానవునికీ కర్మలంటూ ఉంటాయి, అవి 4 విధములు

1, వ్రతములు, నోములు, శ్రాధ్ధములు, గ్రహశాంతికి నమిత్తం చేసే కర్మలు, సామాన్య మానవుడు సంసార జీవితమును గడపడం లో ఆచరించేవి ఇవి,
ఇవన్నీ 'నైమిత్తిక' కర్మలు

2, మంచి వర్షాలు కురవాలి, పంటలు పండాలి, లోకమంతా శాంతిని అనుభవించాలి.. అందుకోసం చేసే కర్మలు
యజ్ఞ, యీగాదులు, మనం చేసే పూజలు, అన్నీ 'కామ్యకర్మలు ' అంటారు.

3, మనం విడువవలసిన కర్మలు కొన్ని ఉంటాయి, మాంసాహారము, మత్తు పదార్థాలు, పూర్తిగా నిషేధించాలి.
సాత్వికాహారం తీసుకోవాలి, సాత్వికమైనదే కదా అని అతిగా భుజింపకూడదు ఎట్టి ఆహారమో అట్టి తలంపులు.
ఎట్టితలంపులో అట్టి మనసు, అన్ని సమయాల్లోనూ భుజింపకూడదు, ఇవన్నీ నిషిద్ధమైన కర్మలు.
... ఇక

4, దోషపరిహారంకోసం చేసే కర్మలు.
అవి - క్షేత్ర సందర్శనం, పవిత్ర నదీ స్నానం, మొదలైనవి.
గంగ నీరు గంగకే అర్పించునట్లు, మీ హృదయాన్ని భగవంతునికే అ ర్పించండి.
అపుడన్నీ భగవంతుడే చేయిస్తాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు.
ఆచరణలో ఫలాసక్తి చూపించకోవాలి,
మంచి చేసినా, చెడ్డ చేసినా తనకుతాను చేసుకోవడమే కదా! ...

*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

2.4K - 11

విజయగీతామృతం
Posted 4 days ago

మంగళవారము, జనవరి, 28, 2025
-----------------------------------------
మాసం: పుష్య మాసం
ఆయనం: ఉత్తరాయణం
పక్షము: కృష్ణ పక్షము
ఋతువు: హేమంత ఋతువు
అమృతకాలము: 02:06, జనవరి 29 నుండి 03:40, జనవరి 29 వరకు
సూర్యోదయము: 06:49
సూర్యాస్తమయము: 18:09
రాహు కాలం: 15:19 నుండి 16:44 వరకు
యమగండము: 09:39 నుండి 11:04 వరకు
దుర్ముహుర్తములు: 09:05 నుండి 09:50 వరకు, 23:13 నుండి 00:04, జనవరి 29 వరకు
అభిజిత్: 12:07 నుండి 12:52 వరకు
కరణం: విష్టి 08:09 వరకు, శకుని 19:35 వరకు
చంద్రోదయం: 06:40, జనవరి 29
చంద్రాస్తమయం: 17:03
చంద్ర రాశి: ధనస్సు 14:52 వరకు
తిథులు: చతుర్దశి 19:35 వరకు
నక్షత్రము: పూర్వాషాఢ 08:58 వరకు
గుళిక కాలం: 12:29 నుండి 13:54 వరకు
శక: 1946 క్రోధి
వర్జ్యం: 16:46 నుండి 18:19 వరకు
యోగా: వజ్ర 23:52 వరకు

🕉 జై శ్రీమన్నారాయణ 🕉

🌴" యుగాలు గడిచినా, తరాలు మారినా సనాతన ధర్మం అనేది మార్పు చెందేటటువంటిది కాదు. నాటి నుండి భారతీయులు సనాతన సంస్కృతి, సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలును చక్కగా పాటిస్తూ వచ్చారు. కానీ నేడు ఎవరైతే వాటిని కాపాడుకోవాలో వాళ్ళే వాటిని నాశనం చేస్తున్నారు! ముఖ్యముగా సనాతన ధర్మ రక్షణలో ముఖ్యపాత్ర పోషించవలసిన స్త్రీలు నేడు వాటిని పక్కన బెట్టి పరదేశి అలవాట్లకు ఆకర్షితులు కావడం చాలా బాధాకరం! స్త్రీలు దేశానికి, సమాజానికి, సంస్కృతి సంప్రదాయాలకు వెన్నెముక వంటివారు. వారిలో ఉండే అసలైన శక్తి తెలుసుకోలేక పోతున్నారు. వేయి మంది పురుషులులో ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఒక్క స్త్రీలోనే ఉంటుంది. తాను తలచుకుంటే ఈ ప్రపంచాన్ని అంతా ఒక చుట్ట మాదిరి చుట్టేయగలదు. దేశము, సమాజం సుఖ శాంతులతో ఉండవలెనంటే స్త్రీలు తమ ఆచార వ్యవహారాలు చక్కగా పాటించాలి. సనాతన సంప్రదాయాలు ఆచరించి ప్రపంచానికి ఆదర్శమునందించాలి. ఈ విషయములో పురుషులు స్త్రీలకు చక్కగా సహకరించాలి. వారికి తగ్గ గౌరవమునివ్వాలి. వారికి సరైన విధముగా రక్షణ కల్పించి కాపాడుకోవాలి. అప్పుడే దేశమునకు, సమాజానికి మంగళం కలుగుతుంది. తద్వారా ప్రపంచం సుఖ శాంతులతో ఉండగలుగుతుంది."🌴
సర్వేజనాః సుఖినోభవంతు

3.6K - 18

విజయగీతామృతం
Posted 5 days ago

సోమవారము, జనవరి, 27, 2025
-----------------------------------------
మాసం: పుష్య మాసం
ఆయనం: ఉత్తరాయణం
పక్షము: కృష్ణ పక్షము
ఋతువు: హేమంత ఋతువు
అమృతకాలము: 04:11, జనవరి 28 నుండి 05:47, జనవరి 28 వరకు
సూర్యోదయము: 06:49
సూర్యాస్తమయము: 18:09
రాహు కాలం: 08:14 నుండి 09:39 వరకు
యమగండము: 11:04 నుండి 12:29 వరకు
దుర్ముహుర్తములు: 12:52 నుండి 13:37 వరకు, 15:08 నుండి 15:53 వరకు
అభిజిత్: 12:06 నుండి 12:52 వరకు
కరణం: బవ 08:49 వరకు, వణిజ 20:34 వరకు
చంద్రోదయం: 05:48, జనవరి 28
చంద్రాస్తమయం: 16:02
చంద్ర రాశి: ధనస్సు
తిథులు: త్రయోదశి 20:34 వరకు
నక్షత్రము: మూల 09:02 వరకు
గుళిక కాలం: 13:54 నుండి 15:19 వరకు
శక: 1946 క్రోధి
వర్జ్యం: 07:24 నుండి 09:02 వరకు, 18:36 నుండి 20:12 వరకు
యోగా: హర్షణ 01:57, జనవరి 28 వరకు

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం

భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి...

భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు. మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి.

సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును.

⚜ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి.

⚜ మహా విష్ణు దేవతలందరిలో ఉత్తమోత్తమైన దేవుడు... సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు... చక్రీ సర్వోపగతుండు. ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును.

⚜ ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే... జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది... రాజ యోగం కలుగుతుంది.

⚜ పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి.

⚜ జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది.

⚜ మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం.

⚜ ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది.

⚜ ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు.

⚜ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది. తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది...

⚜ జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది...

┈┉┅━❀꧁🪷ॐ🪷꧂❀━┅┉┈

3.6K - 18

విజయగీతామృతం
Posted 6 days ago

ఆదివారము, జనవరి, 26, 2025
-----------------------------------------
మాసం: పుష్య మాసం
ఆయనం: ఉత్తరాయణం
పక్షము: కృష్ణ పక్షము
ఋతువు: హేమంత ఋతువు
అమృతకాలము: 02:28, జనవరి 27 నుండి 04:07, జనవరి 27 వరకు
సూర్యోదయము: 06:49
సూర్యాస్తమయము: 18:08
రాహు కాలం: 16:43 నుండి 18:08 వరకు
యమగండము: 12:29 నుండి 13:54 వరకు
దుర్ముహుర్తములు: 16:38 నుండి 17:23 వరకు
అభిజిత్: 12:06 నుండి 12:51 వరకు
కరణం: కౌలవ 08:48 వరకు, తైతిల 20:54 వరకు
చంద్రోదయం: 04:53, జనవరి 27
చంద్రాస్తమయం: 15:03
చంద్ర రాశి: వృశ్చికము 08:26 వరకు
తిథులు: ద్వాదశి 20:54 వరకు
నక్షత్రము: జ్యేష్ఠ 08:26 వరకు
గుళిక కాలం: 15:19 నుండి 16:43 వరకు
శక: 1946 క్రోధి
వర్జ్యం: 16:38 నుండి 18:16 వరకు
యోగా: వ్యాఘాత 03:34, జనవరి 27 వరకు

🕉"శరణాగతి"🕉

ఆధ్యాత్మిక సాధనకు శరణాగతి చాలా ముఖ్యం!!.…

ఇది మనిషిలోని చింతలన్నింటినీ ఏరిపారేసి మనస్సును, బుద్ధిని భగవంతుని యందు స్థిర పరుస్తుంది.

" ఓ భగవంతుడా!!... కష్టమెుచ్చినా సుఖమెుచ్చినా అంతా మీ ఇష్టం.

ఈ శరీరం మీది, ఈ ప్రాణం మీది, ఈ జీవితం కూడా మీదే, నాపై సర్వాధికారాలు మీవే...

నేను నీ వాడను, నీవు నా వాడవు.

నాకు నీవు తప్ప వేరే ఆధారం ఏదియూ లేదు.

నేను మిమ్ములను తప్ప వేరే దేనినీ ఆశ్రయించను.

ఈ జీవితాన్ని మీకు అప్పగించు చున్నాను.

"దీనిని మీ ఇష్టం వచ్చిన రీతిగా నడిపించుకొండి"

అని భగవంతునికి మెురపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి.

ఫలితం ఏదైనప్పటికీ భగవత్ప్రసాదంగా స్వీకరించాలి.

"ఇదే నిజమైన శరణాగతి,

ఇట్టివాడు భగవంతునకు అత్యంత ప్రియమైనవాడు"...

ప్రపంచంలో వీరు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు!!...

🕉 సర్వేజనా సుఖినోభవంతు 🕉

2.9K - 6

విజయగీతామృతం
Posted 1 week ago

నేను భగవద్గీత వల్ల పొందిన గొప్ప ప్రయోజనాలు 🙏

15 - 0

విజయగీతామృతం
Posted 1 week ago

శనివారము, జనవరి, 25, 2025
-----------------------------------------
మాసం: పుష్య మాసం
ఆయనం: ఉత్తరాయణం
పక్షము: కృష్ణ పక్షము
ఋతువు: హేమంత ఋతువు
అమృతకాలము: 23:09 నుండి 00:50, జనవరి 26 వరకు
సూర్యోదయము: 06:49
సూర్యాస్తమయము: 18:08
రాహు కాలం: 09:39 నుండి 11:04 వరకు
యమగండము: 13:53 నుండి 15:18 వరకు
దుర్ముహుర్తములు: 06:49 నుండి 07:35 వరకు, 07:35 నుండి 08:20 వరకు
అభిజిత్: 12:06 నుండి 12:51 వరకు
కరణం: బవ 08:03 వరకు, బాలవ 20:31 వరకు
చంద్రోదయం: 03:56, జనవరి 26
చంద్రాస్తమయం: 14:09
చంద్ర రాశి: వృశ్చికము
తిథులు: ఏకాదశి 20:31 వరకు
నక్షత్రము: అనూరాధ 07:07 వరకు
గుళిక కాలం: 06:49 నుండి 08:14 వరకు
శక: 1946 క్రోధి
వర్జ్యం: 13:02 నుండి 14:43 వరకు
యోగా: ధ్రువ 04:38, జనవరి 26 వరకు

🕉 విలువ🕉

🍁🍁🍁🍁

మనిషి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రకృతిలోని ఏ వస్తువు పనికిరానిది కాదు. అన్నీ ప్రధానమైనవే!

మన కాళ్ల కింద నలిగే గడ్డిపరక చిన్నదే కానీ, అది గాలికి ఎగిరి కంటిలో పడితే కలిగే బాధ భరించలేనిదిగా ఉంటుందంటారు కబీరుదాసు.

దేన్నీ తక్కువ చేసి చూడకూడదనేదే కబీర్ ఆలోచన లోని అంతరార్థం.

ఇంట్లో ఉండే చీపురు చిన్నదే! కానీ, దాని ఉపయోగం ఎంతో గొప్పగా ఉంటుంది. అది లేకుండా పరిశుభ్రతే లేదు!

ప్రాణి యొక్క విలువ కూడా అది చేసే పనిని బట్టి కాదు.. దానిలోని గుణగణాలను బట్టి ఉంటుంది.

రామాయణంలో రావణ సంహారానికి సముద్రం మీద వంతెన కట్టేటప్పుడు చిన్న ప్రాణియైన ఉడుత ఇసుకలో దొర్లుతూ వచ్చి శరీరానికంటిన ఇసుక రేణువులను విదిలిస్తుంటుంది.

అది చూసిన శ్రీరామచంద్రుడు ఉద్వేగభరితుడై ఉడుతను ఒడిలోకి తీసుకొని దాన్ని ప్రేమగా నిమురుతాడు.

అంటే.. ఉడుత చేసిన పని చిన్నదే కానీ, అదో మహత్కార్యంగా భావించబడింది.

మనం హృదయపూర్వకంగా చేసే మంచి పనితో భగవంతుడు తృప్తి చెందుతాడు.

ఎవరైనా పొందే గౌరవ మర్యాదలు వారు చేసే వృత్తులను బట్టి కాకుండా వారి ప్రవృత్తులనుబట్టి ఉంటుంది..

🌸జై శ్రీమన్నారాయణ🌸

సర్వేజనాః సుఖినోభవంతు

2.9K - 16