in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
....
SLBC ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
పదేళ్ల నుంచి SLBC పనులు చేయకపోవడం వల్లే ప్రమాదం...
కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్లు టన్నెల్ పూర్తైంది...
మధ్యలో పనిచేయకపోవడం వల్లే మెషీన్ బేరింగ్స్ పాడయ్యాయి....
కేసిఆర్ కు లాభం లేదనే SLBC పనులు పక్కకు పెట్టారు. -సీఎం రేవంత్ రెడ్డి
0 - 0
రంగారెడ్డి జిల్లా
RHYTM 2025 ఘనంగా నిర్వహించిన లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్
_ముఖ్య అతిథులుగా పాల్గొన్న
DRDO శాస్త్రవేత్త బి.శ్రీనివాస్
సిద్ధల బీరప్ప, శ్రీనివాస్ రెడ్డి
మహేశ్వరం లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మల్లాపూర్ లో ఉన్న లార్డ్స్ హై స్కూల్ లో *RYTHM 2025* వార్షికోత్సవాన్ని లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం చైర్మన్ సిద్ధల బీరప్ప, వైస్ చైర్మన్ బెర్లు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి ప్రముఖ ఆర్ సి ఐ/ డి ఆర్ డి ఓ శాస్త్రవేత్త బి.శ్రీనివాస్ మాట్లాడుతూ * ప్రతి పిల్లవాడు ఏకాగ్రత కోల్పోకుండా అన్ని కష్టాలను ఎదుర్కొంటూ తమ అపజయాలను మెట్లుగా మార్చుకుంటూ విజయ శిఖరాలకు చేరుకోవాలని కొన్ని ఉత్తమమైన ఉదాహరణలతో పిల్లలకు సూచించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మల్లాపూర్ EX మాజీ కౌన్సిలర్ దండు గణేష్ , యువ నాయకుడు బొర్రా మాధవ రెడ్డి , మహేశ్వరం మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ , జర్నలిస్ట్ గొంగడి శీనన్న,పాల్గొనడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దండు గణేష్ మాట్లాడుతూ లార్డ్స్ విద్యాసంస్థ 20 సంవత్సరాలలో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను ఉత్తమమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారని పొగిడారు మరియు ఈ కార్యక్రమంలో లార్డ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ సిద్ధాల బీరప్ప మాట్లాడుతూ తల్లిదండ్రులకు లార్డ్స్ యాజమాన్యంపై ఉన్న అమితమైన నమ్మకం మరియు వారి ప్రోత్సాహంతో అధ్యాపక బృంద అహర్నిశల కృషి, పిల్లల పట్టుదల మా ఈ విజయానికి కారణాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వైస్ చైర్మన్ బెర్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లార్డ్ స్కూల్లో విద్యతోపాటు అన్ని రంగాల్లో రాణించే విషయాల్లో ముందు ఉంటామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డిన్ సతీష్ కుమార్ గారు, మల్లాపూర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ కొండలరావు , లార్డ్స్ బ్రాంచెస్ ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం జరిగింది.
2 - 0
రంగారెడ్డి జిల్లా
మహేశ్వరం శివగంగ శివయ్య ను దర్శించుకున్న సబితా ఇంద్రారెడ్డి
_శివనామస్మరణతో మారు మోగిన మహేశ్వరం
-భక్తులతో కిటకిటలాడిన మహేశ్వరం శివగంగ
మహేశ్వరం:-
మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం శివగంగ దేవాలయంలో కొలువు దీరిన శివయ్య ను దర్శించుకున్న మజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో సాక్షాత్తు కైలాస వాసులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు కొలువు దీరిన శ్రీశ్రీశ్రీ శివగంగా రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించే "మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల" సందర్భంగా తనయుడు కౌశిక్ రెడ్డి తో కలిసి విచ్చేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గము ఎంఎల్ఏ పి.సబితా ఇంద్రారెడ్డి కి ఆలయ పండితులు పూర్ణకుంభంతో సాదరంగ ఆహ్వానించి ఆలయంలో అభిషేక,అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేసి శాలువ మెమోంటోలతో సత్కరించిన అలయ కమిటి అధ్యక్షుడు అల్లే.కుమార్ మరియు కమిటీ సభ్యులు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు,, కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.*
4 - 0
బిఆర్ఎస్ పార్టీ అధినేత,
తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని* ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ .
11 - 0
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ
మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి మరియు తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హిందూ స్వరాజ్య సంస్థాపకుడు భారతమాత వీరపుత్రుడు *చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి* సందర్భంగా చందన చెరువు కట్ట పైన వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది .. అధ్యక్షుడు బిక్షపతి చారి మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్
ధర్మపరిరక్షణలో వీరవిరాట్
17 ఏళ్లకే శత్రువు వెన్నులో వణుకు పుట్టించిన యోధుడు
మొఘలులు సైతం వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు
27 ఏళ్ళపాటు యుద్ధభూమిలో వెన్నుచూపని శత్రుభయంకరుడు
300 కోటలకు అధిపతి
3 వేళ్ల ఏళ్లయినా తగ్గదు శివాజీ ఖ్యాతి
మేరు నగధీరుడు.. మరాఠయోధుడు హిందూ బంధువులందరికీ
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు! తెలియచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మీర్పేట్ బిజెపి సీనియర్ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ *కీసర గోవర్ధన్ రెడ్డి . జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్ గారు. గాజుల మధుగారు. మాజీ కార్పొరేటర్లు ఏ బీమ్ రాజు గారు గౌరీ శంకర్ గారు కీసర జమునా కృష్ణారెడ్డి గారు. చెవ్వ శ్రవణ్ గారు.సీనియర్ నాయకులు. స్థూల ప్రభాకర్ గడ్డం జగన్ గారు. హర్పిత చారి మరియు హరిత రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి చందు గోపీనాథ్ సుధాకర్ సీత చంద్రశేఖర్ రెడ్డి. నవీన్. రాపల్లి కృష్ణమాచారి. దయానంద్ చారి. స్వర్ణ చారి. చంద్రశేఖర్ చారి*. బిజెపి రాష్ట్ర జిల్ల మున్సిఫల్ నాయకులు పాల్గొన్నారు..
3 - 0
మహా కుంభ మేళాలో పుణ్య స్నానం ఆచరించిన అనంతరం సతీసమేతంగా త్రివేణి సంగమంకు హారతులు ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
5 - 0
*_సీతారామాంజనేయ సేవలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి_*
మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సీతా మీడోస్లో నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవస్థానం పదో వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న *_మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి దేవాది దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెద్దబావి శోభా ఆనంద్ రెడ్డి , బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి మరియు ఇతర మాజీ కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు సబితా ఇంద్రారెడ్డి అభిమానులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
8 - 0
రంగారెడ్డి జిల్లా
మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్ పేట్ లోని తిరుమల గార్డెన్స్ లో 'thandavam,THE న్యూ మాస్టర్ మైండ్ స్కూల్ యొక్క వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ గొంగడి శీనన్న
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా THE MASTER MINDS SCHOOL CHAIRMAN RAJU SANGANI,PRINCIPAL YADAGIRI,హాస్య నటుడు జబర్దస్త్ చలాకి చంటి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
7 - 0
రంగారెడ్డి జిల్లా
మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ లోని తిరుమల గార్డెన్స్ లో న్యూ మాస్టర్ మైండ్ స్కూల్ యొక్క వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న *టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి * ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బంగారు అనిత ప్రభాకర్, హాస్య నటుడు జబర్దస్త్ చలాకి చంటి, టేకుల సుధాకర్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
5 - 0
మహేశ్వరం నియోజక వర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ శ్రీ సాయి బాలాజీ హోమ్స్ ఫేస్ 2 కాలని లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్న *టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహ రెడ్డి దంపతులు*
ఈ సందర్భంగా చిగిరింత దంపతులను కాలని వాసులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మాట్లాడుతూ...కాలనిలో సమస్యలు అన్ని పరిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పోటీ చేసిన సమయంలో ఈ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం చూసి ప్రచార సమయంలో చాలా ఇబ్బందులు పడ్డం అని అన్నారు. మీ అందరి సహకారంతో కార్పొరేటర్ గా గెలవడం మేయర్ కావడంతో రోడ్లు, డ్రినేజీలు పూర్తి చేయగలిగానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలని కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
11 - 0
DSK D6 News is an News and Entertainment channel Based In Digital Platform. Our team is always ready to provide the Breaking News ,Entertainment Videos, Political news, Celebrities Exclusive Interviews, Politician exclusive interviews, Latest update news of both telugu states (Andhra Pradesh & Telangana), Devotional Videos, Great Health Tips, Home Remedies, Tollywood events, Short films, Telugu Web Series, Gossips, Press Meets, Trailers, Teasers and more Fun Videos, Telangana Cultural Events Etc.
#DSKD6News #Gongadi Seenanna #TelanganaFolkArtists #DSK D6 News