in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
కార్తీక బహుళ అష్టమి
ప్రతీ మాసంలో వచ్చే బహుళ అష్టమి నాడు కాలభైరవ స్వామీనీ దర్శించిన,పూజించిన, స్వామీనీ స్తోత్రములతో స్తుతించిన , జపించిన కాల భైరవ స్వామి అనుగ్రహం లభించితీరుతుంది- గరుడ పురాణం.
ఓం కాలకాలయ విద్మహే కాలతీతాయ ధీమహి
తన్నో భైరవ ప్రచోదయాత్
విఘ్నాలు అరికట్టేవాడు వినాయకుడు, రక్షణ కల్పించేవాడు భైరవుడు. భయాలను దూరం చేసేవాడు భైరవుడు. కలియుగంలో చండి, వినాయకుడు, భైరవుడు శిగ్రముగా ఫలితాలిస్తారు. విశ్వమును సృష్టించేది, పోషించేది, లయం చేసే కారణముగా శివుడిని కాలుడు, భైరవుడు అంటారు. సృష్టిలో కాల భైరవ సాధన సర్వోతకృష్టమైనది. కాలం అంటే మృత్యువు, సమయం, దుఃఖం, కష్టం, బాధలు, సమస్యలు వీటిపైన విజయంను ప్రసిందిమంచేవాడు కాలభైరవడు. అష్టభైరావులు, అష్టదిక్కులలో, అష్ట భైరవి శక్తులతో కొలువుదీరి వుంటారు.
కపాలమును దరించినవాడు, చెవులకు కుండలములు దరించినవాడు. భికరమైన ఆకారము గలవాడు, పరక్రామం కలవాడు, పాముని యజ్ఞణోపవీతముగా దాల్చినవాడు. కవచమును దరించినవాడు, శులమునుపట్టినవాడు, మహావీరత్వము కలవాడు, శివునికి ఇష్టుడు,
ఈ కాలభీరావాష్టకం ను ఎవరైతో స్మరిస్తారో వారికీ భయలు, బాధలు దరిచేరవు.
నిర్మలమైనా మనసుతో, భక్తి శ్రద్దలతో, పరిపూర్ణమైన విశ్వాసం తో, ఎవరైతో కాలభైరవుని ఆరాధిస్తారో వారికీ సర్వకార్యముల యందు విజయం ప్రాపిస్తుంది.
కాలభైరవాష్టకం
https://youtu.be/0OsEnqYFhnc
కాల భైరవ రక్షా స్తోత్రము
https://youtu.be/pFGPji5u32Q?si=QpPW_...
ధన్యవాదములు
@Shastidevi
85 - 1
ఈరోజే కార్తీకమాసం బహుళ చతుర్ధి -సంకటహర చతుర్ధి - వ్రతకథ
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. చంద్రోదయ సమయానికి చతుర్థీతిథి ఖచ్చితంగా ఉండాలి.ఈ వ్రతాన్ని ఆచరించేవారు విఘ్నేశ్వరుని ప్రతిమను పెట్టుకుని షోడశోపచారాలతో పూజించాలి.
విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదించే స్తోత్రమ్
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః*l
ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే
సంకట హర చతుర్థి వ్రత కథ
సంకష్ట చతుర్థి వ్రతము యొక్క మహత్యమును వ్రత విధానమును సాక్షాత్తు బ్రహ్మ ద్వారా భూలోకంలో మానవాళికి లభించింది.
ఒకప్పుడు పరమేశ్వరాజ్ఞ తో పార్వతీదేవి యీ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించి మహాపలాన్ని పొందింది.
కుమారస్వామి యీ వ్రతం గావించాడు. అలాగే ఆగస్త్యా మహర్షి విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందే సప్తసముద్రాలను అపోశనం పట్టాడు.
అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతిదేవి యీ పవిత్ర చతుర్థివ్రతాన్ని చేసి నలమహారాజుని తిరిగి పొందుతుంది.
శివుని ఫాలాగ్నికి బస్మమైనా మన్మధుడు తన తదుపరి జన్మలో శ్రీకృష్ణ - రుక్మిణి పుత్రుడుగా జన్మిస్తాడు. అతడికి ప్రధ్యుమ్యుడు అని పేరు పెడతారు. ప్రధ్యుమ్నుడు పసిబాలుడుగా ఉండగా శంబరాసురుడు అతన్ని ఎత్తుకొని పోయి పాతాళంలో బంధీస్తాడు. అక్కడే ప్రధ్యుమ్నుడు పెరిగి పెద్దవాడు అవుతాడు. అపురూప సుందరుడైనా అతడిని శంబరాసురుడు కుమార్తె ప్రేమిస్తుంది. ఇదిలా ఉంటే ద్వారకా లో రుక్మిణిదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరించలేకపోతుంది. రుక్మిణి దేవి ఒకరోజు లోమశుడనే మహర్షిని సందర్శించి తన పుత్ర వియోగ దుఃఖ భారాన్ని వినిపించింది.
అమ్మ రుక్మిణిదేవి? నీ ఆవేదన నాకు అవగతమైంది. యీ పుత్రవియోగం తిరిపోవలనంటే సంకష్ట చతుర్థి వ్రతమును ఆచరించు. ఆ వ్రత మహత్యం వలన నీ కుమారుడు తిరుగోస్తాడు అని చెప్పాడు. ఆ మహర్షి చెప్పినవిధముగా రుక్మిణిదేవి యీ సంకష్ట చతుర్థి వ్రతమును ఆచరించింది. ఆ వ్రత ప్రభావం చేత ప్రధ్యుమనుడు శంబరాసురుడుని సంహారించి ఆ రాక్షసకుమార్తెను వివాహం గావించుకొని రుక్మిణి శ్రీ కృష్ణ పరమాత్మను కలిసాడు. ఆ తర్వాత కాలంలో ప్రధ్యుమ్నుడు కొడుకు కూడ బాణాసురుడు యెక్క అంతపురంలో బందిగా ఉన్నప్పుడు, కొడుకు జాడ తెలియక చింతపడుతుంటే ప్రధ్యుమ్నుడు తల్లి ఐన రుక్మిణి దేవీ అతనికి ఈ వ్రత మహాత్మ్యంను వివరించింది.
వ్రత మహాత్మ్యం ను తెలుసుకొన్న ప్రధ్యుమ్నుడు ఆదే మాసం లో బహుళ చతుర్థి నాడు ఈ వ్రతమును ఆచరించాడు. అప్పుడు గణేసుని అనుగ్రహం వలన, బాణాసురుడు యెక్కఅంతఃపురములో, బందీగా ఉన్నట్లు తెలుసుకొన్నాడు. ఉద్దవు ని సలహా మేరకు శ్రీకృష్ణుడు ఈ వ్రతమును ఆచరించి బాణసురడతో యుద్ధం చేసి, అసురడ్ని చంపి వేస్తాడు.
అనేక పర్యాయ పర్యాలు దేవతలు, అసురులు కూడా తమకు సంభవించిన విఘ్నముల ఉపశాంతికై ఈ వ్రతాన్ని ఆచరించారు కనుక ఆపదనులోను కష్ట కాలం నందు వాటి శాంతికి ఈ వ్రతాన్ని చేయాలి ఈ వ్రతానికి దీటైన సర్వసిద్ధి కర వ్రతం ఇంకొకటి ఎక్కడా కనపడదు.
సంకటహరచతుర్థి మహాత్యం మరియొక కథ
పూర్వం కృతవీర్యుడునే మహా బలపరాక్రమ సంపన్నుడైన రాజు ఉండేవాడు. అతడు సకల సద్గణోపేతుడు. అనేక యజ్ఞలు చేసి భారీగా దానధర్మలు చేసినవాడు. సత్యవ్రతుడు, ఇంద్రియలు తన వశం చేసుకున్నట్టి జితేంద్రీయుడు. అట్టి కృతవీర్యనకుసుగంది పేరుగల భార్య ఉండేది. ఆమె మహా పతివ్రత, సుగణవతి, సౌశీల్యవతి.
ఇంత అపూర్వ గుణ సంపత్తి కలిగి ఉన్న దంపతులకు పుత్ర సంతతి మాత్రం కరువైంది. సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, ఇవ్వని ధానం లేదు. అనేక క్రతువులను, యజ్ఞలను నిర్వహించిన ఫలితం మాత్రం సూన్యం. ఈ రకంగా నిరాశకు గురువైన ఆ రాజు ఒకనాడు తన మంత్రులకు రాజ్యాభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళాడు. ఆక్కడ నిష్టతో తపస్సు చేస్తున్న కృతవీర్యనుకు నారద మహర్షి సందర్శన భాగ్యం కలుగుతుంది. నారదముని ఆ కృతవీర్యుని సంకల్పం తెలుసుకొని,ఆశీర్వాదించి,పితృలోకానికి వెళ్లి కృతవీర్యుని తండ్రిని కలిసి, అతని కుమారుడు సంతతి కోసం పడే ఆరాటన్ని, భాదను వివరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
నారదముని వల్ల తన వంశచ్చేదాం గురించి తెలుసుకొని కడు ధుఃఖితుడైన ఆ కృతవీర్యుడు తండ్రి, బ్రహ్మ లోకానికి వెళ్లి, చతుర్ముకుడికి సాష్టంగా నమస్కార మాచారించి తన వంశ విచ్చేదనముకు కారణం తెలపమంటూ ప్రార్ధించాడు. బ్రహ్మ, కృతవీర్యుని తండ్రి తో కృతవీర్యుని యొక్క పూర్వజన్మ వృత్తంతము ఇలా చెప్పెను.
పూర్వం మీ నగరం లోనే సామూడు అను పేరుగల దూర్మార్గుడు చోరుడు ఉండేవాడు. ధనం మీద గల కాంక్షచేత విప్రులను సంహారించి వారి సంపదలు దోచుకొని ఆ రాత్రి తన ఇల్లు చేరుకొన్నాడు. ఆనాడు మాఘ బహుళ చవితి, సాయంసంధ్య గడిచి చంద్రుడు ఉదయంచే సమయంలో తన కుమారుడుని గణేశా!గణేశా! రా అంటూ పిలిచాడు, ప్రొద్దుటి నుంచి అన్నపాధులు లేనివాడు అవటం వలన, రాత్రికి కుమారుని తో కలిసి గణేశాప్రసాదన్ని భుజిస్తాడు. కొంతకాలానికి అతడు మరణిస్తాడు.
ఆ బహుళ చవితినాడు తనకు తెలియకుండానే ఉపవాసం ఉండి, చంద్రదయం సమయం లో గణేశా స్మరణ కావించి ప్రసాదన్ని భుజంచినందు వల్ల సంకష్టచతుర్థి వ్రత మహత్యం వల్ల ఈ జన్మలో కృతవీర్యుడానే రాజుగా నీకు పుత్రుడిగా జన్మించాడు. ధనకాంక్షతో విప్రులను సంహారించడం వల్ల బ్రహ్మహత్య పాతకం వల్ల తనకు సంతతి కలగలేదు అని బ్రహ్మ, కృతవీర్యుని తండ్రి కి వివరిస్తాడు. అప్పుడు కృతవీర్యుని తండ్రి, ఈ బ్రహ్మహత్య పాతకం నివారణో పాయం చెప్పవలిసిందిగా బ్రహ్మను స్తుతిస్తాడు.
బ్రహ్మ ఇలా బదులిచ్చాడు.
ఓయి : నీ కుమారుడు సంకష్టచతుర్థి వ్రతమును, శ్రద్దభక్తులతో, నియమనిష్ట లతో ఆచరించినట్లు ఐతే ఆ మహాపాతకం నుండి విముక్తి కాగలడు చెప్పాడు బ్రహ్మ.
అనఁతరము, కృతవీర్యునకు స్వప్నం లో అతని తండ్రి, బ్రహ్మ దేవుడు చెప్పిన వ్రతాన్ని యదతదముగా కుమారుని కి చెప్పి. ఈ వ్రతాని ఆచరించి సంతానని పొందామని ,కృత వీర్యునిని ఆశీర్వాదించి అదృష్యమైనాడు.
అప్పుడా కృతవీర్యుడు గణపతి ని ప్రతి మాసంలో వచ్చే బహుళ చవితి నాడు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. గజానుని అనుగ్రహం చేత, కృతవీర్యునికి కార్తవీర్యార్జునడు పుత్రుడు కలుగుతాడు. కార్తవీర్యార్జునడు భక్తితో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల చక్రవర్తి అవుతాడు. ఇలా సంకష్ట చతుర్థి వ్రత మహత్యం ను సుతుడు సోనాకాది మునులకు వివరించాడు.
ప్రతీ మాసంలో సాయంత్రం చంద్రోదయ సమయం లో చతుర్థి ఉన్న రోజు లేకా ఉదయం సూర్యోదయం చతుర్థి ఉన్న రోజూ కూడా ఈ వ్రతని చేసుకోవచ్చు అని గణేశా పురాణం లో వివరించారు.
సంకష్ట చతుర్థీ, సంకష్ట గణపతి తదితర వ్రతముల లొ స్వామినీ "గ" కార ఆష్ట్రోత్తర శతనామావళి నామాలతో పూజించాలి.
గకార గణపతి అష్టోత్తర శతనామావళి:
https://youtu.be/PyHtYg0--v0?si=Y5I_r...
1. సంకట నాశన గణేశ స్తోత్రం
https://youtu.be/kTUom-LcQ2A?si=v2hQX...
2. గణేశ ధ్యాన శ్లోకం
https://youtu.be/7vHcgd7mr6Q?si=Gbodw...
3. వినాయక అష్టకం
https://youtu.be/5ER_272Nu1k
ధన్యవాదములు.
జయ శ్రీరామ.
https://youtu.be/kTUom-LcQ2A?si=NvxNj...
40 - 0
అరుణాచల మహత్మ్యం - రెండవ భాగము,అధ్యాయము - 7
మహర్షి అయిన మార్కండేయుని అభ్యర్థనను మన్నించి నందీశ్వరుడు సంతోషముతో ఇలా పలికాడు: “వత్సా! వినుము. అరుణాచల పూజా ఫలమును వివరిస్తాను. ఆదివారమునాడు అరుణాచలుని ఎర్ర కలువలతో పూజిస్తే సార్వభౌమత్వము సిద్ధించును. సోమవారం కరవీర, కస్తూరీ పుష్పములతో పూజించినవారు సత్యలోకమును పొందుతారు. గురువారంనాడు అరుణాచలుని తెల్లతామరలతో పూజిస్తే సిద్ధులతో కూడిన జనలోక నివాసము సిద్ధించును. చంపక పుష్పముతో శుక్రవారంనాడు శోణగిరీశుని పూజిస్తే, బ్రహ్మర్షులతో కూడి తపోలోకములో నివసించు భాగ్యము కలుగును. శనివారంనాడు. జాతిమల్లికా పుష్పములచే అరుణగిరినాథుని పూజించినవారు మహాపాప కర్మలను చేసినవారైనా, వారికి యమలోక బాధలు ఉండవు.
పాడ్యమినాడు అరుణాచలునికి పాయసము నివేదించినవారికి సదా ధనధాన్యము అభివృద్ధి కలుగును. విదియనాడు పెరుగు అన్నం శివునికి సమర్పిస్తే, అటువంటివారు భాగ్యవంతులై సోమపానం చేస్తారు. తదియనాడు అపూపములను వండి నివేదిస్తే జీవితకాలమంతా దృఢగాత్రులై ఆరోగ్యంగా వుంటారు. చతుర్థినాడు పూర్ణకుంభము సమర్పించుకుని అరుణాచలుని అర్చించు భాగ్యశాలురకు సకలకోరికలు తీరును.
పంచమినాడు పులగము నైవేద్యము సమర్పించి హరుని తృప్తి పరచితే అక్షయ వైభవము కలుగుతుంది. షష్టినాడు చక్కెర పొంగలి సమర్పించినవారి సంతానము అవిచ్ఛిన్నంగా కొనసాగును. సప్తమీ తిథియందు నువ్వుల అన్నం నైవేద్యము పెడితే సమస్త ఋణబాధల నుంచి విముక్తి పొందుతారు. అష్టమినాడు రాజనాల బియ్యముతో అన్నం వండి నైవేద్యము పెడితే, సేవలు ఏమీచేయకుండానే రాజులను తమ వశము చేసుకుంటారు. నవమీ తిథియందు గోధుమ అన్నమును శోణగిరినాథునికి నివేదిస్తే రాజక్షయాది రోగములనుండి విముక్తులు అవుతారు. కరంభము (సర్వశాకములతో కూడిన అన్నం) దశమినాడు శివునికి అర్పించి పూజించు భాగ్యవంతులు సర్వలోక ప్రియులవుతారు. ఏకాదశియందు అటుకులు నైవేద్యం చేస్తే ఎల్లపుడు అభయము లభించును. ద్వాదశి తిథినాడు సూపాన్నం (పప్పు అన్నము) అరుణాచలేశు నికి నైవేద్యం సమర్పించినవారి కోరిన కోరికలు నిర్విఘ్నముగా నెరవేరును.
త్రయోదశినాడు సత్తుపిండి నైవేద్యం పెడితే సదా శాంతియుతంగా జీవించగలరు. చతుర్థశినాడు వివిధ ఫలములను శోణగిరినాథునికి అర్పించితే అజ్ఞాని అయినా మహాపండితుడు అగును. పౌర్ణమినాడు పనసపండు ఈశ్వరునికి అర్పించుకున్నవారికి కంటి జబ్బులు ఉండవు. అమావాస్యనాడు కందమూలములను అర్పించినవారి శివార్చన చేయువారి పితృదేవతలు సంతృప్తులవుతారు.
అశ్వనీ నక్షత్రమున అరుణాచలేశ్వరునికి వస్త్రములు సమర్పించాలి. భరణీ నక్షత్రమున శోణేశ్వరునికి ఆభరణములు అర్పించాలి. కృత్తికా నక్షత్రమున దీపములు వెలిగించాలి. రోహిణియందు వెండి, మృగశిరయందు చందనము, ఆర్దాయందు హరిచందనము, పునర్వసునందు పునుగు అనే సుగంధ ద్రవ్యములు సమర్పించి శోణాద్రినాథుని తృప్తి పరచాలి. పుష్యమినందు కర్పూరం, ఆశ్లేషయందు కుంకుమ పువ్వు, పూర్వఫల్గుణీయందు తాంబూలము, ఉత్తర ఫల్గుణీయందు అగరు ధూపమును, హస్తా నక్షత్రమునందు కాలాగరు ద్రవ్యమును, చిత్రా నక్షత్రంనాడు యక్షకర్దమమును, స్వాతియందు తులసీ పుష్పములు, విశాఖయందు చామరములు, అనూరాధనాడు ముత్యాలగొడుగు, జేష్టయందు గోవులను, మూలా నక్షత్రమందు ముత్యాల సరులను, పూర్వాషాఢ యందు కిరీటం, ఉత్తరాషాడయందు రత్నాభరణములు, శ్రవణా నక్షత్రమున భద్రపీఠము, ధనిష్ఠా నక్షత్రమున బంగారము, శతభిషంలో వస్త్రములు,పూర్వాభాద్రయందు భోగ్య వస్తువులు, ఉత్తరాభాద్రయందు ఆశ్వరాకు (గుర్రమును), రేవతీ నక్షత్రమందు బంగారు రథమును అరుణగిరీశ్వరమును సమర్పించాలి. ఏ వస్తువు సమర్పించినా అరుణాచలేశ్వరునికి మహాహ్మ చేయవలెను.
సూర్యుడు మేషరాశియందు ప్రవేశించినపుడు సింధువార, కురుపకు పాటలీ, కుటజ, నీప, జీవంతిక, మల్లిక, పద్మ, దమనక, నందివర్ధన, కలువు పువ్వలతో అరుణాచలుని అర్చించి శివపంచాక్షరిని జపించాలి. పార్వతీ పరమేశ్వరులను పంచామృతంతో అభిషేకించాలి. రెండు సంక్రమణ కాలములందు షడక్షరీ మంత్రమును జపిస్తూ పంచగవ్యములతో అభిషేకించాలి. తర్వాత ప్రణవము (ఓంకారం) జపించుచు, పాలతో అభిషేకం చేయాలి. విషువత్తులందు, పూర్వాహ్లమందు (మధ్యాహ్నం ముందు) తులసితోను, మధ్యాహ్నం మాలలతోను, అపరాహం (సాయం) నందు మల్లెలతోను శివుని పూజించాలి. శతరుద్రీయ జపము చేస్తూ శంకరునికి సహస్ర ఘటాభిషేకము చేయాలి. అపవర్గమును (మోక్షమును) కోరువారు శివరాత్రినాడు మూడు ఆకుల బిల్వపత్రములతోను; పద్మ, కర్ణికా పుష్పములతోను అరుణాచలుని పూజిస్తూ జాగరణ చేయుచు నియమ నిష్టాపరులై నృత్య, గీత, వాద్యములతో, దివ్య ఆగమ విధానముతో అరుణాచలేశ్వరుని సేవించాలి.
పుష్యమాసములో శివభక్తులైనవారు మహేశ్వరునికి వ్యాహృతులు (హెూమాగ్ని మంత్రము) పలుకుతూ ఆగ్నేయోత్సవము జరపాలి. వైశాఖ మాసములో విశాఖ నక్షత్రంనాటి శివ తంత్రానుసారము అరుణాచలునికి దమనకోత్సవము నిర్వహించాలి. మార్గశిరములో వేకువజామున సామవేదము పఠిస్తూ మహాదేవునికి మహాపూజ చేయవలెను. శనిప్రదోషమునందు, ఆల్ట్రా నక్షత్రమందు వ్యతీపాత పర్వదినములందు, ఆది, సోమవారములలోను ఆగమ పద్ధతిలో శివుని పూజించాలి. ఉపనయన సమయంలో, దీక్షలు ప్రారంభమందు, పుత్రోత్సవ, వివాహ శుభ సమయములలో అరుణాచలునికి విశేషపూజ చేయవలెను. జన్మ నక్షత్ర దినమున సంపదలు వచ్చినా, ఆపదలు వచ్చినా, యుద్ధమునకు బయలుదేరునపుడు శోణాద్రికి పూజలు జరపాలి. దూరముగా వుంటే అరుణాచల స్మరణ చేయాలి.
అరుణాచలములోనే ఉంటే త్రికాలాలలోను శోణగిరిని అర్చించాలి. ఇంకా తెలుపవలసినది ఏమున్నది వత్సా!" అని నందీశ్వరుడు మార్కండేయుని భుజములు తట్టి
“స్వర్గ, అపవర్గముల ప్రాప్తికి అరుణాచలునికి మించిన దైవము లేడు. అరుణాచల స్మరణ, శ్రవణ, దర్శన మాత్రములచే మానవుడు పునీతుడగుట నిశ్చయము. ఈ క్షేత్రములో జన్మించినవారికి ఈ జన్మయందు సమస్త భోగములు, మరణానంతరము ముక్తి సిద్ధము. ఇతర ప్రదేశములలో మరణించినవారు మహాపాపులైనా వారికి అరుణాచలములో శ్రాద్ధకర్మ చేయబడితే అపవర్గము సిద్ధించును. అయోధ్య, మధుర, కాశీ, మాయా, అవంతిక, ద్వారకలకన్నా అరుణగిరి అత్యంత విశిష్టమైనది" అని పలుకుచున్న శిలాదపుత్రుడైన నందీశ్వరుని చూసి మార్కండేయ మహర్షి, “దేవా! మహనీయ కీర్తిమంతా! మేము అరుణాచల మాహాత్మ్యమును ఇంకా వినగోరుచున్నాము” అన్నాడు.
ఉమామహేశ్వర స్తోత్రం
https://youtu.be/JZhuqFBMs2A?si=0ncm4...
తదుపరి అధ్యాయం -8
ధన్యవాదములు
kANAKADHAARA@Shastidevi
https://youtu.be/JZhuqFBMs2A?si=0ncm4...
37 - 1
అరుణాచల మహత్మ్యం - రెండవ భాగము - అధ్యాయము 6
మార్కండేయునితో నందికేశ్వరుడు ఇలా అన్నాడు: "నాయనా మృకండపుత్రా! లోకానికి మేలు చేసే నీ ప్రశ్న చాలా ప్రశంసనీయమైనది. మానవులు చేయు పాపములకు ప్రాయశ్చిత్తములను వివరిస్తాను. శ్రద్ధగా వినుము. నేను చెపుతున్నదంతా శ్రద్ధగా విని భగవంతునియందు విశ్వాసము కలిగినవారికి తెలియజేయాలి.
బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోరేవాడు అరుణాచలమును చేరి ఖడ్గతీర్థములో స్నానమాచరించి భస్మ, రుద్రాక్షలు ధరించి పంచాక్షరీ మంత్రము జపించి, నిష్ఠతో ఉపవాసం ఉండి, అరుణాచలేశ్వరుని పూజించి ఒక సంవత్సరము ఇంద్రియ నిగ్రహముతో భిక్షాన్నము భుజిస్తూ బ్రాహ్మణులకు అన్నదానము చేయాలి. తర్వాత భక్తితో శివునికి విశేష పూజలు చేయాలి. మద్యపానము నుండి విముక్తి కోసం ఇంతకుముందు చెప్పిన పద్ధతులను ఆచరిస్తూ, అరుణాచలములో నివసిస్తూ శివునికి శతరుద్రీయము పఠిస్తూ పాలతో అభిషేకము చేయాలి.
బంగారం అపహరణ దోషము పోవడానికి అరుణాచల క్షేత్రంలో శివునికి బిల్వపత్రములతో పూజ చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారిని సంతృప్తి పరచాలి. ఈ విధంగా నియమబద్ధంగా జీవిస్తూ శోణగిరిని మూడు మాసములు సహస్ర దీపములతో అర్చించి, అవునేతి దీపములను పండితులకు, బ్రాహ్మణులకు దానము చేయాలి. ఇలా చేసి షడక్షరీ జపము చేస్తే గురుభార్యతో సంగమించిన దోషము పోవును. కలకాలం శివలోక నివాసము ప్రాప్తించును. ఈ క్షేత్రంలో ఇంద్రియనిగ్రహం కలిగి, సరికొత్త పుష్పములతో ఒక మాసము శివుని అర్చించి శివభక్తునికి శక్తికొలది ధనము దానము చేస్తే, పరుల భార్యను అపహరించిన దోషము పోవును. పరులకు విషమిచ్చి చంపిన పాపం పోవాలంటే,
అరుణాచలంలో నియమబద్ధ జీవనం గడుపుతూ శివునికి పాలను నైవేద్యం సమర్పించాలి. లోభత్వము (పిసనారితనం) పోవాలంటే వేదపఠనం చేస్తూ బ్రాహ్మణులకు వేదమును నేర్పాలి. గృహములను దహించిన పాపనివృత్తికి, మూడు మాసములు నియమబద్ధుడై అరుణాచలములో నివసించి ఒక బ్రాహ్మణునికి గృహదానము చేస్తే పోవును. ధర్మనింద చేసినవాడు ఒక సంవత్సర కాలము అరుణాచలములో నియమబద్ధంగా నివసించి, యధాశక్తిగా యాగము చేస్తూ శివార్చన జరిపించాలి.
వ్రతనిష్ఠుడై ఒక మాసము అరుణాచల నివాసము చేస్తూ శివునికి, బ్రాహ్మణులకు సహస్ర గోదానములు చేసి ఒక పండుగ దినమున బ్రాహ్మణులకు అన్నదానము చేసి, నల్ల ఎద్దును ఆబోతుగా వదిలితే గురుద్రోహికి పాపవిముక్తి కలుగును. స్త్రీ, శిశు హంతకులు అరుణాచలములో వ్యతీపాతమునందు నువ్వులు దానమిస్తే వారి పాపము తొలగును. రహస్యముగా పాపములు ఆచరించినవారు నియమబద్ధంగా జీవిస్తూ గుప్తదానములు చేయాలి. అసత్యములు చెప్పినవారు అరుణగిరియందు ఆరు మాసములు దీక్షాబద్ధులై అరుణాచల స్తోత్రములు పఠిస్తూ గడపాలి.
బావులు, చెరువులను నాశనం చేసినవారు శోణ క్షేత్రములో భక్తిగా వుంటూ అక్కడ బావులను, చెరువులను తవ్వితే పాపం పోతుంది. శివునికి క్షేత్రము (పొలము)ను దానము చేస్తే, ఇతరుల పొలమును అపహరించిన పాపం పోతుంది. తోటలను నాశనము చేసినవాడు దేవాలయమునకు తోటలను దానము చేస్తే పాపం పోవును. పరుల గృహములను స్వాధీనము చేసుకున్నవాడు శివునికి ఆలయము నిర్మిస్తే పాపవిముక్తుడై శివ సాయుజ్యము పొందును. పరులకు ద్రోహము చేసినవాడు అరుణాచలములో నివసించు సాధువులకు ధనము సమర్పించి వారిని తృప్తిపరిస్తే, అటువంటివారికి మోక్షము నిశ్చయము. మాంసభక్షకులు మూడు పక్షములు (45 రోజులు) అరుణాచలములో నివసించి, అరుణాచలునికి మనోహరమైన నైవేద్యములు సమర్పించి మూడుసార్లు అరుణాచల నామము ఉచ్చరిస్తే ఆ దోషము తొలగిపోతుంది.
మోక్షమును కోరువారు అరుణాచలములో నివసిస్తూ అరుణాచల సంతమును జపిస్తూ శోణగిరినాథుని పూజించాలి. అరుణాచలమునకు ఉరములతో ప్రదక్షిణము చేసే సర్వదా శుభము కలుగును. కాలు తడబడినా. కుమ్ము వచ్చినా, దుఃస్వప్నములు కలిగినా, ఎక్కువ సంతోషము కలిగినా కని జ్ఞానము కలవారు అరుణాచలుని స్మరిస్తారు.
వర్ణాశ్రమ భ్రష్టులైనవారు, శివాపచారము చేసినవారైనా మూడు రోజులు అరుణాచలములో నివసించగానే పాపవిముక్తులు అవుతారు. వేదశీర్షుడని ఆ వేదములలో కీర్తింపబడిన సదాశివుడు అరుణాచలములో పార్ధివ (భూమి) రూపములో ఉన్నాడు. అరుణగిరి భూకైలాసము. అది భూమిపై గల శివలోకము. ఇతర క్షేత్రములలో మానవులు తపస్సు వలన సిద్ధులు అవుతారు. కానీ అరుణగిరిని స్మరించినంత మాత్రముననే ముక్తులవుతారు. గంగ, ప్రయాగ, కాశీ, పుష్కర, సేతుబంధములలో చేసిన కర్మకు ఫలితముకంటే, ఎన్నో రెట్లు అధికంగా అరుణాచలములో చేసిన కర్మకు ఫలితము వుండును. అందుచేత అగ్నిష్టోమ, వాజపేయ, వైరాజ, సర్వతోముఖ, రాజసూయ, అశ్వమేధాది యాగములు అరుణాచలములో చేయవలెను.
అరుణాచలములో ఒక్కనాడు ఉపవాసము చేసినందుకు నూరు చాంద్రాయణములు, వేయి సాంతపనములు (గోపంచక గోమూత్రం మొదలగునవి భక్షణము) చేసిన ఫలము లభించును. 'సొంతపము' అనగా అయిదు రోజులు గోపంచక భక్షించడం. గోపంచకములోని ఒక వస్తువు దినమునకు ఒకటి చొప్పున 5 దినములు భక్షించి 6వ నాడు నీటిని మాత్రము ఆహారంగా స్వీకరించి 7వ నాడు ఉపవాసము ఉండాలి. అరుణాచలములో చేసే మహాదానములకు, ఇతరత్ర చేసిన దానములకు 16 రెట్లు అధిక ఫలితం వుండును. కల్పములలో చేసిన పుణ్యకార్యములకు రెట్టింపు ఫలితము లభించును" అని నందీశ్వరుడు పలుకగా విని మార్కండేయుడు, “ఆయా ఋతువులలో, ఆయా దినములలో అరుణాచలునికి అర్పించవలసిన వస్తువులను గురించి తెలుపమని" నందీశ్వరుని అర్థించాడు.
రుద్ర స్తుతి
https://youtu.be/8Z8CxWIbQxg?si=LrD60...
తదుపరి అధ్యాయం -7
ధన్యవాదములు
KANAKADHAARA@Shastidevi
39 - 1
క్షీరాబ్ధి ద్వాదశి - క్షీరసాగర మధనం
దుర్వాస మహర్షి శాపంవల్ల దేవతల ఐశ్వర్యం సముద్ర పాలు అయ్యింది.
శ్రీమహావిష్ణువు సూచనపై దేవేంద్రుడు బలిచక్రవర్తిని సేవిస్తూ క్షీరసాగర మథనానికి రాక్షసుల్ని ఒప్పించాడు. దేవతలూ రాక్షసులూ కదిలారు. మందర పర్వతాన్ని వికలించారు. కానీ దాన్ని ఎత్తలేక చతికిలపడ్డారు. అప్పుడు శ్రీహరి అక్కడికి వచ్చాడు. ఒక బంతిని చేతితో కదిల్చినట్లుగా మందర పర్వతాన్ని కదిపాడు. గరుడుడిని పిలిచి దాన్ని క్షీరసాగరందాకా తెప్పించాడు. దేవదానవులు వాసుకిని (సర్పరాజు) ప్రార్ధించారు. ఇప్పుడు మందర పర్వతం కవ్వం అయితే వాసుకి కవ్వపు తాడు. వాసుకిని రాక్షసులు తోకవైపు, దేవతలు తలవైపు పట్టుకున్నారు. అది అవమానంగా భావించిన రాక్షసులు మేము తలవైపే ఉంటామన్నారు.
మథనం ప్రారంభమయింది. అలా మొదలయ్యిందో లేదో మందరం బుడబుడమని మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడే కూర్మరూపాన్ని ధరించి సముద్రం అడుక్కి వెళ్ళి పర్వతాన్ని వీపుపై ఉంచుకొని పైకి ఎత్తాడు. పర్వతం లేచింది. జై శ్రీమన్నారాయణ! జై శ్రీమన్నారాయణ! అన్న నినాదాలు మిన్నుముట్టాయి. పర్వతం సముద్రంలో గుబగుబలాడుతూ తిరుగుతోంది. అటు రాక్షసులూ ఇటు దేవతలూ ఉత్సాహంగా చిలుకుతున్నారు. అట్టహాసాలు, కేకలు, హెచ్చరికలు. వీటితో దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయి. వాళ్ల వేగానికి సముద్రం అల్లకల్లోలమైపోతోంది. అందరూ చూస్తుండగానే సముద్రంలోంచి హాలాహలం పుట్టుకొచ్చింది. దేవదానవులు హడలిపోయారు. దేవతలు ఈశ్వరుణ్ణి శరణు వేడారు.
శివుడు పరమ దయామయుడు. 'కష్టంలో ఉన్నవాళ్ల కష్టాన్ని తీర్చటం ప్రభువుల విధి. ఆయన లోకహితం కోరి, హాలాహలం మింగటానికి సిద్ధమై ఆ విషయం పార్వతికి చెప్పాడు.
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
మింగేవాడు తన భర్త అనీ మింగబోయేది హాలాహలమనీ మింగితే లోకానికి మంచి జరుగుతుందనీ తెలుసు. తెలిసే సర్వమంగళ (పార్వతీదేవి) అంగీకరించింది. ఆ తల్లికి తన మంగళసూత్రం గట్టిదన్న నమ్మకం.
శివుడు ఆ గరళాన్ని కొద్దిపాటి ఫలరసంలా మ్రింగి కంఠంలోనే ఉంచాడు. ఎందుకంటే పొట్టలో లోకాలు ఉన్నాయి కాబట్టి.
మళ్ళీ మథనం ప్రారంభమయ్యింది. ఈసారి వరుసగా సాగరంలోంచి కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం పుట్టాయి. తరువాత అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి పుట్టారు. లక్ష్మీదేవి విష్ణువును వరించింది. తరువాత 'వారుణి 'పుట్టింది. దానిని రాక్షసులు తీసుకున్నారు. ఆ తరువాత చేతిలో అమృతభాండంతో దివ్యకాంతులు వెదజల్లుతూ ధన్వంతరి ఆవిర్భవించాడు. దానికోసం దేవదానవుల్లో యుద్ధం మొదలయ్యింది.
అప్పుడు శ్రీమన్నారాయణుడు 'మోహిని' అవతారం ధరించాడు. మోహిని దేవతల్నీ, రాక్షసుల్నీ విడిగా రెండు వరుసల్లో కూర్చోబెట్టింది. రాక్షసులకు ఒయ్యారాల్ని ఒలకబోస్తూ, దేవతలకు అమృతాన్ని ధారబోసింది. అది గమనించాడు రాహువు. దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని త్రాగడం మొదలుపెట్టాడు. సూర్యచంద్రులు మోహినికి సైగ చేశారు. అంతే! మోహిని ఆదేశం, సుదర్శనుడి ఆగమనం వెంటవెంటనే జరిగాయి. రాహువు తల తెగి క్రింద పడింది. కానీ అమృతం త్రాగిన కారణంగా అది మరణించలేదు. మొండెం మాత్రం నేలకూలింది.
రాక్షసులు పట్టరాని కోపంతో దేవతలపై విరుచుకు పడ్డారు. తన మీదకు వచ్చిన కాలనేమి, సుమాలి, మాల్యవంతుడు అనే రాక్షసుల్ని శ్రీహరి వధించాడు.బలాసురుణ్ణి, పాకాసురుణ్ణి, నముచినీ ఇంద్రుడు వధించాడు. ఇంతలో నారద మహర్షి వచ్చి ఇరుపక్షాలకు సర్దిచెప్పి యుద్ధాన్ని విరమించేలా చేశాడు.
రాక్షసులు బలిచక్రవర్తితో కలిసి పడమటి కొండవైపుకు చేరుకున్నారు. శుక్రాచార్యుడు మృతసంజీవిని విద్య ద్వారా రాక్షసుల్ని తిరిగి బతికించాడు.
సర్వం శ్రీ కృష్ణావిందార్పణమస్తు
లక్ష్మీ నారాయణ స్తోత్రము
https://youtu.be/7GqhMr6Fj8U?si=xus-6...
ధన్యవాదములు
Kanakadhaara@Shastidevi
46 - 0
కాలభైరవుడికిఅష్టమిఅత్యంత ప్రీతిపాత్రమైనది. కార్తిక మాసంలో అష్టమి నాడు లేచి లేవగానే కాలభైరవుడిని తలచుకోవాలి. స్నానం తరువాత విభూతి కానీ తిరునామం కానీ దిద్దుకోవాలి. స్త్రీ లు కుంకుమ ధరించాలి.
దానం:
వేలాది సంవత్సరాలనుండి కార్తిక మాసంలో స్వల్ప దానం చేస్తే మహాపుణ్యం అంటారు. విడిగా ఎంత పుణ్యం చేసిన, ఎన్ని దానాలు చేసిన రాని పుణ్యం కార్తిక మాసం లో చిన్న దానం వలన పుణ్యం వస్తుంది. ఆకలితో వున్న వానికి భోజనం పెడితే ఎంత ఇష్టంగా తింటాడో ఈ మాసంలో హరి కూడా భక్తి అనే ఆకలితో ఉంటాడు. నామస్మరణ అనే ఆహారాన్ని, భక్తి అనే ఆహారాన్ని తినటానికి సిద్ధంగా ఉంటాడు.
ఈ రోజు ఇష్టదేవతను భక్తిశ్రద్ధలతో ఆరాధించి స్వయంపాకం దానం చేయాలి. స్వయంపాకంలో ఉసిరికాయలు తప్పనిసరిగా ఉండాలి.
ఉసిరికాయలను తమలపాకులలో పెట్టి దానం చేయాలి. తులసీదళం, ఉసిరికాయ, బిల్వ పత్రం, దక్షిణతో పాటు ఒక మహాత్ముడికి అర్హత కలిగిన వారికి దానం చేస్తే ఆ ఇంట్లో నిత్యానందం కలుగుతుంది. పొరపాటున జాతకవశాత్తు దుఃఖం వస్తే అది ఎదుర్కొనే మనోబలం, సహాయకులు లభిస్తారు. రెండు తక్కువ కాకుండా తమలపాకులు, వక్కలు, తులసీ దళాలు, బిల్వపత్రాలు, ఫలాలు కూడా దానం చేయవచ్చు. స్వయం పాకం ఎండుమిరపకాయలు, కూరగాయలతో కలిపి దానం చేయాలి. దీనివలన కుటుంబంలో వచ్చే దీర్ఘవ్యాధులు పోతాయి.
పూజ:
ఉదయం 6 గం|| నుండి 7 గం॥ లోపు అభిషేకం చేయటం చాలా మంచిది. దానికి ప్రదోష కాలం అని పేరు ఆ కాలంలో చేసే రుద్రాభిషేకం, హరహర మహాదేవ, శంభోశంకర, నమఃశివాయ అని పలికే శివ నామ స్మరణ వలన నారాయణ, వాసుదేవ, పరంధామ అని ఎలుగెత్తి పిలిచే హరి నామ స్మరణ వలన మహా ఫలితం వస్తుంది. అందువలన పూర్వకాలం లో ఈ పని చేసేవారు. దీని వల్ల విడి రోజులలో చేసే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. అష్టమి అష్టకష్టాలు తొలగిస్తుంది. అష్టమి నాడు హరి నామస్మరణ చేసి పరమ పాపాత్ముడు కూడా బాగు పడ్డాడు అని వశిష్ఠుడు జనక మహారాజుకి ఒక కథ చెప్పారు.
విఘ్నేశ్వరుని, గురువుని తలుచుకొని కాలభైరవ అష్టకం చదువుకోవాలి. అష్టమి నాడు కాలభైరవాష్టకం స్వగృహంలో కానీ, గుడిలో కానీ, చదివితే అప మృత్యు భయం ఉండదు. దుర్మరణం పాలు కారు. పారాయణ చేయలేని వారు విన్నా చాలు, ఆ ఇంటిలో ఉన్న వారు పూర్ణ ఆయుష్షు పొందుతారు.
అష్టమి నాడు నక్త ఉపవాసం చేయాలి. సూర్యుడు అస్తమించాక మరలా స్నానం చేసి శివాలయంకి కానీ, విష్ణుఆలయంకి కానీ, అమ్మవారి ఆలయంలో కానీ ప్రదక్షిణం చేయండి. హరినామ స్మరణ చెయ్యాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశ్శివాయ మరియు గురోపదేశం తీసుకున్న వారు, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే వీటిని అష్టమి నాడు ఆలయంలో కూర్చుని జపం చేస్తే అఖండ ఫలితం వస్తుంది. ఇలాంటి మంత్రాలు గురుముఖతః వినకుండా చేయకూడదు. గురోపదేశం పొందాలని శాస్త్రం. ఉపదేశం అనగా ఆద్య ఉచ్చారణ. ఇవి అపారమైన శక్తి కలిగి కొంచెం నియమంతోచేయవలసిన మంత్రాలు. అనంతరం గురువు దగ్గర కూర్చుని గురువును భక్తి శ్రద్ధలతో సేవించాలి. కార్తిక మాసం అంతా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
శివ మానస స్తోత్రములో శంకరాచార్యుల వారు చెప్పారు “సంచారః పాదాయెహెూ ప్రదక్షిణ విధిః" మేము కాళ్లతో తిరిగిన దంతా నీ ప్రదక్షిణ అనుకో. "స్తోత్రాణి సర్వాగిరః" మేము మాట్లాడిన మాటలన్నీ నీ స్తోత్రాలు అనుకో. “యద్యత్ కర్మ కరో మీ తత్ దఖిలం శంభోతవారాధనం”. మేము చేసిన కర్మలన్నీ నీ ఆరాధన అనుకో. ఇది నా మానస పూజ అని
శంకరాచార్యుల వారు శివ మానస స్తోత్రంలో స్తుతించారు.
శివ మానస స్తోత్రం
https://youtu.be/nMUAi-2vQx8?si=60uUF...
కాలభైరవ స్వామీ స్తోత్రాలు
https://youtu.be/s2OnsecmXnI?si=LDVO6...
ధన్యవాదములు
KANAKADHAARA@Shastidevi
61 - 2
కార్తీక మాసం - అరుణాచల మాహాత్మ్యము, రెండవ భాగం అధ్యాయము - 5
మార్కండేయుడు ఇలా ప్రార్ధించగా నందీశ్వరుడు ప్రసన్యుడై "వత్సా మార్కండేయా! శుద్ధసత్త్వగుణ సంపన్నులైన నీవంటి మానవులు దుర్లభము. సామాన్యంగా మానవులు రజో, తమో గుణములతో ఉంటారు. సాత్త్వికులు, పుణ్యశీలురైన మానవులు మోక్షమును పొందుతారు. కర్మానుసారముగా మానవులు అనుభవించుటకు బ్రహ్మ కొన్ని కొన్ని నరకములను సృష్టించాడు.
బ్రాహ్మణుని హత్య చేసిన నరుడు మహారౌరవాది నరకములకు పోయి, అక్కడ మ్రగ్గి తర్వాత గాడిద, కుక్క, పంది రూపములనుగాని; చండాల రూపమునుగాని పొందును. సురాపానము చేసిన బ్రాహ్మణుడు రౌరవ నరకములో బాధను అనుభవించి తర్వాత క్రిమి, కీటక, దీపం పురుగు రూపములను పొందును. బ్రాహ్మణుని ధనమును అపహరించినవాడు. బ్రహ్మరాక్షసుడు అగును. ఈ జన్మలో ఏఏ వస్తువులను అపహరించునో, ఆయా వస్తువులు తర్వాతి జన్మలో లేకుండా పోవును. గురు భార్యతో సంగమించిన నరుడు చురకత్తులే ఆకులుగా గల అసిపత్రవనములో పీడింపబడి మరుజన్మలో నపుంసకుడగును. పరస్త్రీ సంగమం చేసినవాడు కాల్చిన ఇనుప కడ్డీతో కొట్టబడి కాలసూత్రము అనే నరకములో బాధలను అనుభవించును.
ఇళ్ళను తగలబెట్టినవాడు ఘోర నరకములోను, విషమిచ్చి చంపినవాడు సుఘోరనరకములోను, లోభి మహాఘోర నరకములోను, ధర్మనిందకుడు అవీచి నరకములోను, మిత్రద్రోహి కరాళ నరకములోను, హింసించేవాడు భీమ నరకములోను బాధలను అనుభవిస్తారు. రహస్యంగా పాపమును ఆచరించువాడు సంహార నరకబాధను పొందుతాడు. అసత్యములాడువాడు భయానక నరకంలో బాధను అనుభవించును. బావులు, దిగుడు బావులు,చెరువులు, పొలములను అపహరించువారు అసివన నరకములో చిత్రహింసను అనుభవిస్తారు. పరులకు ద్రోహము చేసేవాడు వజ్ర నరకంలోను, మాంసమును భుజించువాడు తరళ నరకములోను, తల్లితండ్రులకు ద్రోహము చేసినవాడు తీక్షణ నరకములోను, జపమును దూషించువాడు తాపములోను మ్రగ్గుతారు. అశ్వహంతకుడు గాలిలేని నరకములో పడి ఉక్కిరిబిక్కిరగును. గోహత్య చేసినవాడు దారుణ నరకములో పడి చాలా బాధపడును. చిన్నపిల్లలను హత్య చేసినవాడు చండ నరకములోను, స్త్రీని చంపినవాడు కుకూల నరకములోను హింసింపబడతారు. దేవతా ధనమును అపహరించినవాడు దహన నరకములో దుర్భర బాధను అనుభవించును. పరుల ధనాన్ని అపహరించినవాడు ఘోరఘోర నరకంలో శిక్షలు అనుభవిస్తారు.
పాపులందరిని యమభటులు నరకమునకు తీసుకెళ్ళి తాళ్ళతో కట్టి, దుడ్డుకర్రలతో మోది, శూలములతో పొడిచి హింసిస్తారు. వాడియైన, దృఢమైన ముక్కులు గల రాబందులు వారిని పొడిచి పొడిచి తినును. క్రూర సర్పములు వారిని కరచును. వేటకుక్కలు, పెద్దపులులువంటి క్రూర జంతువులు వారిని బాధించును. ఆయుధములతో పొడిచి ముక్కలు ముక్కలు చేసి మంటలలో దహించి, మరుగుతున్న నూనెలో ముంచి, సూదులతో పొడిచి, మోయలేని బరువులు మోయించి యమభటులు పాపులను హింసిస్తారు.
బ్రహ్మహత్య చేసినవాడు క్షయరోగంతో పీడింపబడును. బంగారాన్ని దొంగిలించినవాడు కుళ్ళిపోయిన గోళ్ళతో బాధపడును. త్రాగుబోతుకు దంతములు పుచ్చిపోవును. గురుభార్యతో రమించినవాడు దుర్గంధ చర్మరోగము తోను పడుకుని బాధపడును. గురుద్రోహి అపస్మారక వ్యాధితో బాధపడును. వేదమును దూషించినవాడు చండాలుడుగా జన్మించును. తప్పుడు సాక్ష్యమును పలికేవాడు కంటిజబ్బుతోను, అతిగా భుజించువాడు అజీర్ణ రోగముతోను బాధపడును. విద్యను దొంగిలించినవాడు మూగవానిగాను, పుస్తకములు దొంగిలించినవాడు అంధునిగాను, పరస్త్రీతో సంగమించినవాడు కుంటివాడిగాను, పరనింద చేయువాడు చెవిటివానిగాను, సదాచారరహితుడు పందిగాను జన్మిస్తారు. చోరుడు చెడిపోయిన నాలుకతో బాధపడతాడు. అతిధులను, బీదవారిని నిర్లక్ష్యం చేసినవాడు చెంపపోటుతోను; పర్వదినములలో స్త్రీలతో రమించినవాడు మేహవ్యాధితోను, అభోజ్య వస్తువులను భుజించినవాడు నోటిపూతతోను బాధపడును. మర్యాద పాటించనివాడు దాసుడుగాను పుట్టును.
ప్రమాణము చేసి నిలబెట్టుకోనివాడు అల్పాయువుగాను, కఠినముగా మాట్లాడువాడు కుక్కగాను, విష్ణుద్రోహి ఊసరవెల్లిగాను, శివద్రోహి పందికొక్కుగాను జన్మిస్తారు. ఈ విధంగా ఆయా పాప ఫలితములను తెలుసుకుని తగిన ప్రాయశ్చిత్తములు చేసుకోవాలి. అందుచేత ఆస్తికులైనవారు అరుణాచలక్షేత్రములో తమ ప్రవర్తనయందు జాగ్రత్తగా ఉండాలి.” నందీశ్వరుని వలన ఇలా పాపములను, వాటి ఫలితములను తెలుసుకున్న మార్కండేయుడు ఆయనను మళ్ళీమళ్ళీ నమస్కరించి, 'ఆయా పాపములకు పరిష్కారము ఏమిటి?' అని అడిగాడు.
తదుపరి - అధ్యాయం 6
ధన్యవాదములు
KANAKADHAARA@Shastidevi
29 - 1
కార్తీక మాసం - అరుణాచల మాహాత్మ్యము, రెండవ భాగం
అధ్యాయము 4
భరత ఖండములో దక్షిణ దిక్కున గల ద్రావిడ దేశములో 'అరుణాచలము' అనే శివక్షేత్రము కలదు. దాని చుట్టూ మూడు యోజనముల వరకు శివయోగులు నివసించి శివుని సేవిస్తుంటారు. బహు రమ్యమైన
ఆ నగర మధ్యభాగం శివునికి హృదయము వంటిది. అక్కడ శివుడు పర్వత ఆకారములో అరుణాచలమనే పేరుతో జనులకు మేలు చేయు పుద్దేశ్యంత నిలిచి ఉన్నాడు. అది సిద్దులకు, మహర్షులకు, దేవతలకు, విద్యాధర, యుద్ధ గంధర్వ, అప్పరసలు అందరికి అత్యంత ప్రియమైన నివాస స్థానము. పర్వతము స్వయంగా శివుడే కనుక అది మహరులకు కైలాసముకన్నా మేరువుకన్నా ఎక్కువగా పూజనీయమైనది. దేవతలు 'ఇక్కడ కనీసం జంతువుగా పుట్టినా మేల'ని భావిస్తారు. చెట్లకు కూడా ప్రయత్నాలు లేకుండానే ముక్తి లభించే పరమపుణ్య స్థానము ఇది.
ఆ పర్వతముపై పెరిగే వృక్షములు అరుణాచలుని పత్ర, పుష్ప, ఫలములతో అర్చిస్తూ ఉంటాయి. కనుక కల్పవృక్షములుకూడా ఈ వృక్షములతో సమానము కాదు. అక్కడి బోయలు బోయ రూపము ధరించిన శివుని స్వరూపమునే ఆరాధిస్తారు. కనుక వారు వృత్తిరీత్యా హింస చేసినా కూడా వారు శివునికి ప్రియులే అవుతారు. అరుణగిరికి ప్రదక్షిణము చేయు మేఘములు అనంతమైన గిరిప్రదక్షిణ ఫలమును పొందుతాయి. కిలకిలా రావము వినిపించే పక్షులు, చక్కని సంగీతమును ఇచ్చు వెదురులు గంగాతీరములో నివసించే పక్షిగణములకన్నా, వేణువనములకన్నా తమను మిన్నగా భావిస్తాయి.
అరుణగిరిపై ఉండే మిణుగురు పురుగులు రాత్రి సమయంలో తమ వెలుగు వలన చీకటిని పోగొట్టి, అరుణాచలునికి హారతి ఇచ్చినట్లు వుండును. ఆ గిరిపై ప్రవహించే సెలయేరుల తీరములో పెరిగే వృక్షములు ఆ గిరిని కౌగలించుకొని, 'శివుని కౌగలించుకొను సౌభాగ్యంలో పార్వతిని మించిపోయామ'ని భావిస్తాయి. అరుణగిరి శిఖరముల మీద మెరుస్తున్న నక్షత్రములు, తాము శివుని జటాజూటమందు నివసించు చంద్రుని హేళన చేస్తున్నట్లు ఉంటాయి. ఆ పర్వతముపై సంచరించే లేళ్ళు, శివుని చేతిలో ఎల్లపుడు నివసించే లేడిని పరిహాసము చేస్తున్నాయా అన్నట్లు వుంటాయి. గిరిపాదములో నివసించు శబరి కులస్థులు బలములో శుంభనిశుంభులవలెసాటిలేనివారై జీవిస్తారు. గిరిపై నివసించు వృక్షములను, జంతువులను, శబరులను చూసి గణపతి, స్కందులే అసూయ పడతారు. సింహము, పులులు మొదలైన క్రూర జంతువులు సైతం 'మరణించిన తరువాత కూడా 'అరుణాచలవాసులే' అని అరుణాచలేశ్వరునిచేత ప్రేమతో ఆదరింపబడతాడా.
అరుణగిరికి తూర్పు దిక్కులో భాస్కర పర్వతము కలదు. ఇంద్రుడు ఇక్కడ ఉండి ఎల్లపుడు అరుణాచలేశుని సేవించును. పడమర గల దండాద్రిలో వరుణుడు నివసించి ఎల్లపుడు అరుణగిరిని కొలుచును. దక్షిణమున గల అమరాద్రి పైన యముడు నివాసం ఏర్పరచుకుని అరుణగిరిని పూజించే భాగ్యము సంపాదించాడు. ఉత్తరమున గల త్రిశూలాద్రిపై విష్ణువు నివసిస్తున్నాడు. ఈ త్రిశూలాద్రి గుహలలో ఎందరో సిద్ధులు నివసిస్తున్నారు.
ఈ గిరికి చుట్టుప్రక్కల ఉన్న ఇతర పర్వతములపై నివసిస్తున్న దిక్పాలకులు అరుణాచలునికి నిత్యార్చనము చేస్తుంటారు. ఈ కొండమీద గల వృక్షములన్నీ, ఆగమ శాస్త్ర విధానంగా పూజ చేసే మానవులకన్నా అధికముగా గౌరవించబడును. ఈ పర్వతమును చూసి పార్వతి తల్లితండ్రులు మేనకా, హిమవంతులు 'తమ అల్లుడు కూడా తమవంటి పర్వతమే' అని ఎల్లపుడు మురిసిపోతుంటారు. ఈ అరుణగిరి సాక్షాత్తు శివుడే. కదిలే శివుడు కదలని రూపమును పొంది కదలక, మెదలక నిలిచి ఉన్నాడు. ఈ కొండపై మొలిచిన చెట్లు, తోటలు, ఔషధులు 'పరమశివుడు జటాధారి' అని తెలుపును. గిరి శిఖరము, ఇరుప్రక్కల ఉన్న శిఖరములు 'పరమేశ్వరుడు త్రినేత్రుడు' అని గుర్తు చేస్తాయి. వర్షాకాలములో అరుణగిరిని స్పర్శిస్తూ విహరిస్తున్న మేఘములు, ఆ శివుని గరళ (విషము) కంఠమును గుర్తు చేస్తాయి.
'సహస్రపాదుడు, సహస్రశీర్హుడు' అని వేదములచే కీర్తింపబడే శివుడు ఇక్కడ ప్రత్యక్షముగా సహస్ర పాదములతో, సహస్ర శిరములతో తెలియబడు చున్నాడు. 'శివుడు శిరస్సునందు గంగను ఎలా ధరించాడు?' అని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ అరుణాచలము నుండి భూమిపైకి జాలువారే నదులను చూసినపుడు మన సందేహాలు నివృత్తి అవుతాయి. శరత్కాలములో తెల్లని మేఘములు పర్వతముపై నిలిచిన దృశ్యము చూస్తే, 'శివుడు వృషభ (ఎద్దు) వాహనుడై దర్శనమిస్తున్నాడా?' అనిపిస్తుంది. ఈ కొండ స్థిరముగా వుండుట వలన శివుని స్థావరత్వమును, అరణ్యము వలన చేరడానికి వీలుకానిదిగా ఉండుటచే ఆయన భీమత్వమును ప్రకటిస్తున్నది.
శివుని ఉగ్రతను తెలియచేస్తూ అరుణాచలము భయంకరంగా, దుర్గమంగా (చొరబడుటకు వీలు లేనిదిగా) ఉండును. గిరి ప్రాంతములో సంచరించే భయంకరమైన పాములు మహాసర్పములైన అనంత, తక్షకులతో పోటీపడుచున్నట్లు ఉండును. పరమేశ్వరుడు తన అష్టమూర్తి రూపమును ప్రకటిస్తున్నాడా అన్నట్లు, గిరికి ఎనిమిది దిక్కులయందు తన వైభవమును ప్రకటిస్తున్నాడు. అక్కడ ఉన్న అరణ్యములో ప్రవహించే నదులు ఇడా, పింగళా నాడులుగాను, కొండ మధ్యనుండి ప్రవహించే నది సుషుమ్నా నాడిగాను చెప్పవచ్చును.
జ్యోతిస్తంభరూపమైన శివుని మూలమును, చివరను కనుగొనడానికి ప్రయత్నించిన బ్రహ్మ, విష్ణువులు వరాహ, హంస రూపములను ధరించి విఫలమైన తర్వాత అహంకారమును పోగొట్టుకుని శివుని ప్రార్థించగా, సదాశివుడు అరుణాచలుడై స్థావర రూపమును ధరించి నిలిచాడు. గౌతమ మహర్షి వేయి సంవత్సరములు అక్కడ కఠోరతపస్సు చేసి పరమశివుని సాక్షాత్కారము పొందాడు. సుకుమారి అయిన పార్వతి ఇక్కడ తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి, శివుని శరీరంలో అర్థభాగమును పొందినది. ఆ గౌరీదేవిచేత ప్రవాళ పర్వతము (పవళ కుండ్రు)పై ప్రతిష్ఠింపబడిన లింగము 'ప్రవాళాద్రీశ్వరుడు' అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. భౌతిక, ఆధ్యాత్మిక సుఖములు రెండింటినీ ప్రసాదించే ఈ లింగము మహాశక్తివంతము. అది మానవులకు కైవల్యమును ప్రసాదించును. గౌరిచేత నియమింపబడి మహిషాసురుని సంహరించిన దుర్గాదేవి, అక్కడ ఉన్న భక్తులకుప్రత్యక్షమై మంత్రసిద్ధిని ప్రసాదించును. దుర్గాదేవి ఖడ్గము చేత సృష్టింపబడిన ఖడ్గతీర్థములో స్నానము చేస్తే సర్వపాపములు నశించును. ఆమెచేత ప్రతిష్టింపబడిన పాపనాశన లింగమునకు నమస్కారము చేసిన మాత్రంచేత పాపములు నశించును.
వజ్రాంగద మహారాజు మొదట అరుణాచలుని పట్ల అపచారము చేయుటచే తన సర్వస్వమును పోగొట్టుకుని, తర్వాత అరుణాచలుని భక్తితో సేవించి శివ సాయుజ్యమును పొందాడు. అరుణాచలునికి ప్రదక్షిణము చేసి ''కాంతిశాలి, కళాధరులు' అనే విద్యాధరులు (దేవజాతి) దుర్వాస ముని శాపము నుండి విముక్తులయ్యారు.
శోణశైలముకన్నా గొప్ప క్షేత్రము లేదు, పంచాక్షరిని మించిన మంత్రము లేదు, శివధర్మముకన్నా గొప్పదైన ధర్మము లేదు, మహేశ్వరుని మించిన దైవము లేదు, శివజ్ఞానముకన్నా ఉత్కృష్టమైన జ్ఞానము లేదు, శ్రీరుద్రముకన్నా వేదము లేదు, విష్ణుమూర్తిని మించిన శివభక్తుడు లేడు, విభూతిని మించిన రక్ష లేదు, భక్తిని మించిన సదాచారము లేదు, రక్షాకరము (రక్ష కట్టిన చేయి) కంటే గురువు లేడు, రుద్రాక్షకంటే మేలైన భూషణము (ఆభరణము) లేదు, శివాగమమును మించిన శాస్త్రము లేదు. బిల్వదళమును మించిన పత్రము, సువర్ణమును మించిన పుష్పముగాని లేవు. వైరాగ్యమును మించిన సుఖము లేదు, ముక్తిని మించిన పరమపదము లేదు.
కైలాస, మందర, మేరు పర్వతములు ఏవీ కూడా అరుణాచలమునకు సాటిరావు. ఆ పర్వతములన్నీ శివుని నివాసస్థానములే అయినా అరుణాచలము స్వయంగా శివుడే" అని నందీశ్వరుడు అరుణాచల క్షేత్రమాహాత్మ్యమును కీర్తింపగా, మార్కండేయుడు ఆయనకు సవినయంగా పదేపదే నమస్కరించి, "ఓ మహాప్రభూ! నందీశ్వరా! మానవులు ఎటువంటి కర్మల వలన పునర్జన్మను పొందుతారు. ఎటువంటి కర్మల వలన నరకము ప్రాప్తించును. వాటికి గల ప్రతిక్రియలేవి? దయచేసి వాటిని మాకు తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాము
ధన్యవాదములు
Kanakadhaara@shastidevi
గురుబోధ: దీపారాధన చేయవారు, ఆజ్యం పోసిన ప్రమిద కింద ఆకుగాని, వేరొక మట్టిప్రమిద గాని ఉంచాలి. నేరుగా దీపాన్ని నేలపై పెట్టకూడదు.
17 - 0
కార్తీక మాసం - అరుణాచల మాహాత్మ్యము, రెండవ భాగం
అధ్యాయము 3
కరుణామయుడైన నందీశ్వరునకు నమస్కరించి మార్కండేయ మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు: “ఓ భగవాన్! మా వంటివారి యందు ఇంత కరుణ కురిపిస్తున్న నీ కరుణా స్వరూపమునకు మేమే సాక్షులము. ఇంతకు ముందు మీరు తెలిపిన అన్ని క్షేత్రములయొక్క ఫలప్రాప్తి తెలుసుకున్నాను. కానీ ఏ క్షేత్రములో జ్ఞానులకు, అజ్ఞానులకు, చరాచరములన్నింటికి సర్వఫలితములు కలుగుతాయో; దేనిని స్మరించితే ముక్తి కలుగునో అటువంటి క్షేత్రరాజమును తెలుసుకోవాలని అనుకుంటున్నాము. దయచేసి ఆ క్షేత్రము ఎక్కడ ఉన్నదో మాకు తెలియజేయండి. ఇది ఇక్కడ ఉన్న సకల ఋషులందరి మనఃపూర్వక ప్రార్ధన.
పులహ, పులస్త్య, వసిష్ట, మరీచి, అగస్త్య, దధీచి, సకృ, భృగు, అత్రి, జాబాలి, జైమిని, ధౌమ్య, జమదగ్ని, యాజి, ఉపయాజి, భరత, అర్వరీవంత, పిప్పలాద, కణ్వ, కుముద, ఉపమన్యు, కుముదాక్ష, కుత్స, వత్స, వరతంతు, విభాండక, వ్యాస, కణ్వరీష, కండు, మాండవ్య, మతంగ, కుక్షి, మాండకర్ణి, చండకౌశిక, శాండిల్య, శకటాయన, కౌశిక, శాతాతప, మధుచ్చంద, గర్గ, సౌభరి, రోమశ, ఆపస్తంభ, పృథుస్తంభ, భార్గవ, ఉదంక, పర్వత, భారద్వాజ, నారద, వహ్ని, దృఢమన్యు, బోధాయన, సుబోధ, హరీత, మృకండు, దుర్వాస, చాల్భ్య, దాంత, శ్వేతకేతు, కౌండిన్య, పుండరీక, రైభ్య, తృణబిందు, వాల్మీకి, జాలపాద, శక్తి, కాంక్వార్య, నదంత, దేవదత్త, న్యంకు, శుశ్రుత, అగ్నివేశ్య, గాలవ, లోకాక్షి, మరుత్వంత, విశ్రవస, సైంధవ, అంశుమంత, శిశుపాయన, మౌద్గల్య, సత్యచావనమాతుర, ఋష్యశృంగ, ఏకపాద, క్రౌంచ, దృఢ, గోముఖ, దేవల, అంగీరస, వామదేవ, ఔర్వ, పతంజలి, కపింజల, సనత్కుమార, సనక,
సనందన, సనత్సుజాతుడు, హిరణ్యనాభ, సత్యునామవాతాశన, సహోరాత, నిదాఘ, ఉతథ్య, సంవర్త, శౌల్కాయన, పరాశర, వైశంపాయన, కౌశల్బ్ శారద్వత, కపిధ్వజ, కుశ, స్వార్చిక, కైవల్య, యాజ్ఞవల్క్య, అశ్వరాయన, కృష్ణ, తపోతమ, అనంత, అమలకప్రియ, చరక, పవిత్ర, కపిల, కణాశి, సీరనారాయణులు, ఇతర దేవర్షులు ఎంతో కుతూహలముతో మీరు చెప్పే సమాధానం కొరకు ఆత్రుతగా వేచి ఉన్నారు. తాము శివభక్తాగ్రగణ్యులు. సమస్త వేదాంతవేత్తలు, సర్వవ్యాపకులు. అటువంటి తమ అమృత పలుకులను వినుటకు ఉత్సాహముతో వేచి ఉన్నాము.
మేము పూర్వమే మీచేత శిక్షణ పొంది ఉన్నాము. మిమ్మల్ని మించిన బోధకులు లేరు. పురాణములను, ఆగమములను శివుని నోటినుండిగాని, దేవి నోటినుండిగాని, స్కందుని నోటినుండిగాని, మీ నోటి నుండిగాని మాత్రమే వినడానికి తగినది. మాకు తమయందు భక్తి ఉండుట సత్యమే అయితే, తమకు మాయందు అపారమైన దయ ఉంటే తాము ప్రసన్నులై, శరణాగతులమైన మాకు ఈ రహస్యమును బోధించండి” అని మార్కండేయ మహర్షి వినయముగా విన్నపము చేసాడు. ఆ ప్రార్థనను శిలాద పుత్రుడైన నందికేశ్వరుడు ఆలకించి ప్రసన్నుడై చిరునవ్వుతో, పూర్వము మహెూన్నతమైన శివభక్తిని ప్రదర్శించినపుడు శివునిచే ప్రసాదించబడిన శరీరము గల మార్కండేయుని చూసి ఇలా చెప్పసాగాడు:
"ఓ మార్కండేయా! నీ మనసును తెలుసుకోవడానికి మాత్రమే అలా అన్నానుగానీ వేరే కాదు. ఈ లోకములో నీవంటి శివ ధర్మపరాయణురు మరొకడు లేడు కదా! నీకుగాక మరెవరికి ఇలాంటి విషయములు చెపుతాను? స్వల్పాయుష్కుడవైన నీవు శివభక్తి వలన చిరంజీవివి అయ్యావు. నిన్ను చంపుటకు వచ్చిన యముడు తన ఆజ్ఞనే పాటిస్తున్నా, నీ కొరకు శివుడు క్రోధముతో తన పాదముయొక్క బొటనవేలితో యముని అణిచివేసాడు కదా! నీకు శివధర్మ రహస్యములన్నీ క్షుణ్ణంగా తెలుసు. కాలవశమున భ్రాంతునివలె కనిపిస్తున్నావుగానీ నీవు అంతరంగములో పరిపక్వతను పొందే వున్నావు. నీవలె నన్నింతకాలం సేవించినవారు ఎవరు ఉన్నారు? నీవలె నాకు ప్రీతిపాత్రుడు ఇంకెవరున్నారు?
శివాజ్ఞచేత నీకు శివధర్మ శాసనమును బోధిస్తాను. శ్రద్ధ, భక్తి గలవాడు మరియు కైవల్యము కోరుకునే శిష్యునికి ఆదరముతో స్వయంగా బోధ చేయువాడే నిజమైన గురువు. ఉపదేశముచేత శిష్యుని సంతుష్టుని చేయనివాడు ఏమి గురువు? నీవు నీ మనసును ఆధీనంలో ఉంచుకొని భక్తి విశ్వాసభరితుడవై నేడు నీకు బోధించు శివరహస్యమును శ్రద్ధగా వినుము. పార్వతీపరమేశ్వరులను ధ్యానించి నమస్కరింపుము. ఓంకారమును ఉపాంశువుగా (శబ్దము పైకి రాకుండా కేవలం పెదవుల కదలికతో) ఉచ్చరింపుము. నీకు శ్రేయస్సు కలుగును.
భరత ఖండములో దక్షిణ దిక్కున గల ద్రావిడ దేశములో ‘అరుణాచలము' అనే శివక్షేత్రము కలదు. దాని చుట్టూ మూడు యోజనముల వరకు శివయోగులు నివసించి శివుని సేవిస్తుంటారు. బహు రమ్యమైన
ఆ నగర మధ్యభాగం శివునికి హృదయము వంటిది. అక్కడ శివుడు పర్చగ ఆకారములో అరుణాచలమనే పేరుతో జనులకు మేలు చేయు వుద్దేశ్యంతో నిలిచి ఉన్నాడు. అది సిద్దులకు, మహర్షులకు, దేవతలకు, విద్యాధర, యుక్త గంధర్వ, అప్సరసలు అందరికి అత్యంత ప్రియమైన నివాస స్థానము. పర్వతము స్వయంగా శివుడే కనుక అది మహర్పులకు కైలాసముకన్నా, మేరువుకన్నా ఎక్కువగా పూజనీయమైనది. దేవతలు 'ఇక్కడ కనీసం జంతువుగా పుట్టినా మేల'ని భావిస్తారు. చెట్లకు కూడా ప్రయత్నాలు లేకుండానే ముక్తి లభించే పరమపుణ్య స్థానము ఇది.
ఇంకా ఉంది, తదుపరి అధ్యాయం -4
ఉమా మహేశ్వర స్తోత్రం
https://youtu.be/JZhuqFBMs2A?si=_ImGd...
ధన్యవాదములు
Kanakadhaara@shastidevi
45 - 3
కార్తీక మాసం సందర్భముగా అరుణాచల మాహాత్మ్యము -రెండవ భాగము అధ్యాయము - 2
నందీశ్వరుడు, మార్కండేయ మహర్షి తో శివక్షేత్రాలు గురించి వివరించుట :
పార్వతీదేవి అమ్మవారు కాంచీపురములోని కంపానదీ తీరంలో ఏకామ్రనాథుని ఏకాగ్రభక్తితో కొలిచింది. అప్పుడు కంపానదిలో వరద రావడంతో, ఆమె పూజిస్తున్న సైకత (ఇసుక) లింగం కొట్టుకొని పోకుండా గట్టిగా తన హృదయమునకు హత్తుకొంది. అపుడు ఆమె చేతి ఆభరణముల నొక్కులు ఆ లింగముపై ముద్రితమైనవి.
తిల్లీవనం (చిదంబరం) మధ్యలో గల వ్యాఘ్రపురములో నృత్యము చేస్తున్న నటరాజమూర్తిని పతంజలి మహర్షి పూజించాడు. దేవేంద్రుని వాహనమైన ఐరావతము (ఏనుగు) యొక్క దంతము ఒకటి దేవదానవ యుద్ధములో విరిగిపోగా, ఆ ఐరావతము శ్వేతారణ్యములో తపస్సు చేసి తిరిగి దానిని పొందినది. సేతుబంధ క్షేత్రములో శ్రీరాముడు పాపవిమోచకుడైన రామనాథేశ్వరుని ప్రతిష్ఠించి పూజించాడు. జగద్రక్షణకై గతప్రతి అనే స్థానములో పరమశివుడు జంబూవృక్షము క్రింద నిలిచి పూజలు అందుకొంటున్నాడు. మణిముక్తానదీ తీరములో ఈశ్వరుడు వృద్ధాచలేశ్వరుడుగా నిత్యనివాసం ఏర్పరచుకున్నాడు. అనుత్తమమైన మధ్యమార్జున క్షేత్రములో వరప్రదాయకుడై పరమశివుడు గౌరీసమేతుడై పరమశివుడు ఎల్లపుడూ శోభిల్లుతున్నాడు. సోమనాథుడుగా ఉన్న సోమతీర్ధములో దేహము విడిచినవారికి సంసార బంధము నుండి విముక్తి లభించుట తథ్యము. సిద్ధవటములో సిద్ధులు ఎల్లవేళలా జ్యోతిర్లింగమును సేవిస్తుంటారు.
వల్మీక లింగ క్షేత్రమైన కమలాలయము (తిరువారూర్)లో తపస్సు చేసి లక్ష్మీదేవి తన పతిని మరల పొందినది. మోక్షమును కోరిన బ్రహ్మ, విష్ణువులు కంకాద్రిలో ఇప్పటికీ తపస్సును చేస్తున్నారు. కలియుగాంతములో భూమి సముద్రములో మునిగిపోగా, పార్వతీ పరమేశ్వరులు ద్రోణపురములో నౌకలో విహారము చేస్తుంటారు. ఆర్యపుష్కరిణీ తీరములోని బ్రహ్మపురీ క్షేత్రంలో రావణుని పుత్రుడు అయిన ఇంద్రజిత్తు శివుని స్థాపించాడు. శతకోటి పాపములను క్షణములో హరించే శంకరుడు వెలసి జ్ఞానభిక్ష పెట్టే క్షేత్రము అయిన కోటికా క్షేత్రము పరమపావనమైనది.
గోకర్ణ క్షేత్రములో ఉండే శివమహాదేవుని కొరకు స్వర్గమునే వద్దన్నాడు. పరశురాముడు. త్రిపురాంతక క్షేత్రములో వెలసిన పరమేశ్వరుడి దర్శన మాత్రంచేత నరకభయం పోవును. భక్తజనుల సంసార తాపమును పోగొట్టుటకు కాలాంజన క్షేత్రంలో పరమశివుడు కంకణము కట్టుకున్నాడు. క్షీరమును (పాలను) కోరేవారికి ప్రియాలవణ క్షేత్రములో మరొక క్షీరసాగరమును సృష్టించాడు. ప్రభాస క్షేత్రములో బాలేందుశేఖరుడు (బాలచంద్రుని ధరించినవాడు) బలరామకృష్ణులకు అక్షయ ఫలమును ప్రసాదించలేదా? శివుని పట్ల మహాపరాధము చేసిన దక్ష ప్రజాపతి యొక్క ప్రార్ధన వలన ప్రసన్నుడై, శంకరుడు వేదారణ్య తీర్థములో నివాసము ఏర్పరచుకున్నాడు. మహాశివ క్షేత్రమైన హేమకూటములో తపస్సు చేసినవారికి పునర్జన్మ భయము లేదని ప్రతీతి. వేణువనములో గల వెదురు గుబురులోని ఆణిముత్యములవలె పార్వతి నెలసింది. జాలంధర క్షేత్రములో జలంధరుడు తపస్సు చేసి శివుని మెప్పించి గణనాథత్వమును పొందాడు. జ్వాలాముఖీదేవి జ్వాలాముఖీ క్షేత్రములో కాలరుద్రుని పూజించింది. వినాయకుడు సంపద కొరకు త్య్రంబకుని పూజించినస్థలము భద్రవటీ క్షేత్రము. స్యగ్రోధ అరణ్యములో ఉగ్రుడు (శివుడు) కాళీ సహితుడై చండతాండవము చేసాడు కదా! వాయుదేవుని పుత్రుడైన ఆంజనేయస్వామి గంధమాధన క్షేత్రములో మృత్యుంజయుని (శివుని) అర్చించాడు. మహావ్యాకరణ పండితుడైన పాణిని ఆ పాండిత్యమును సంపాదించిన క్షేత్రము గోపర్వతము. ప్రచేతసుడు (వాల్మీకి) తపస్సుచేత మహాకవి అయినది వీరకోష్టములోనే. ద్రుహిణుడు మొదలైన దేవతలందరు శివునిచే మహాతీర్ధములో ఉపదేశమును పొందారు. మహేశ్వర క్షేత్రమైన మయూరపురములో దేవేంద్రుడు తపస్సు చేసి కలియుగములో కూడా హాదినీశక్తిని పొందాడు.
శివుని శిరస్సునుండి భూమిపైకి దూకిన గంగాదేవి మాఘమాసములో మానవుల పాపములను పోగొట్టుటకై కుంభకోణములో నివసించును. గోదావరి తీరములోని త్ర్యంబక క్షేత్రంలో కుమారస్వామి తపస్సు చేసి, శక్తిని పొంది తారకాసుర సంహారము చేసాడు. ఓ వేదవిత్తమా! శ్రీపాటల క్షేత్రంలో త్రిశంకుడు తపం ఆచరించి, నశించిన తన జాతిని తిరిగి పొందాడు. ఓ మృకండు పుత్రా! నీ (మార్కండేయుని) కొరకు పరమశివుడు మృత్యువును శూలంతో పడగొట్టిన క్షేత్రము కదంబపురి క్షేత్రము. పడికంఠుని కొరకు పరమశివుడు. అవినాశి క్షేత్రములో వెలసి ఉన్నాడు. రక్తకాననము క్షేత్రంలో శివుడు మిత్రావరుణులకు వరప్రదానము చేసాడు.
పాతాళములో హాటకేశ్వర క్షేత్రము ఉన్నది. అక్కడ బలి చక్రవర్తి పరమేశ్వరుని అర్చించి మరల తన పదవిని పొందాడు. శివునికి ప్రియనివాసం అయిన కైలాసములో కుబేరుడు ఎల్లప్పుడూ శివుని అర్చిస్తూ 'శివునికి మిత్రుడు' అని పేరు పొందాడు. ఈ విధంగా నీకు శివునికి సంబంధించిన అనేక క్షేత్రములను తెలిపాను. మరల నీవేమి కోరుచున్నావో సంకోచం లేకుండా అడుగుము." పరమకరుణతో, ప్రసన్నవదనంతో పలుకుచున్న నందీశ్వరునకు మరల మరల నమస్కరిస్తున్న మార్కండేయుని తలపై నందీశ్వరుడు చేతితో ప్రేమగా తాకాడు
తదుపరి అధ్యాయం -3
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
https://youtu.be/DisS-B3P9J8?si=AS-J-...
ధన్యవాదములు
KANAKADHARA@Shastidevi
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
https://youtu.be/DisS-B3P9J8?si=AS-J-...
15 - 1
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః |
Contact
Email: shasti3823@gmail.com