Channel Avatar

Thulasi Chandu @UCZN6X0ldwi-2W4TV-ab5M_g@youtube.com

693K subscribers

Hello, I’ve worked as a journalist in mainstream media. The


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Thulasi Chandu
Posted 4 hours ago

Watch them ❤️ watch video on watch page

8 - 0

Thulasi Chandu
Posted 1 week ago

Met wonderful people in Bangalore Media Rumble by Newslaundry and The News Minute.
1.Fact-checking Alt News Zubair is a warrior in destroying fake news and propaganda
2.Prakash Raj you all know about him
3. Jai Bheem Director Gnanavel
4. Tangalan Actress Parvathy

5K - 449

Thulasi Chandu
Posted 1 week ago

It's Amazing to participate meet and greet my Journalist Tribe across the country in one place Bangalore!
Thanks to the Media Rumble by‪@thenewsminute‬​ and   @newslaundry for this initiative.
We shared our thoughts on Creating a new news ecosystem!

3K - 213

Thulasi Chandu
Posted 1 week ago

🥺 watch video on watch page

85 - 6

Thulasi Chandu
Posted 2 weeks ago

ఈ గంటన్నర సంభాషణ నాకు ఎంతో నచ్చింది..
హాయిగా నవ్వుకున్నాం.. మా సంభాషణ ఆమెను గతంలోకీ తీసుకెళ్లింది
గుండెల్లో గూడుగట్టుకున్న బాధ కన్నీళ్లుగా ఉబికి వచ్చాయ్..
తన జీవితంలో ఎంత కష్టముందో ప్రజల పాటల వెనుక ఆమె ఎంత బరువు మోశారో, మోస్తున్నారో చెప్తోంటే మన గుండె బరువెక్కిపోతుంది. నా దృష్టిలో తెలంగాణ బహుజన బ్రాండ్ అంబాసిడర్, బతుకమ్మ బ్రాండ్ అంబాసిడర్ విమలక్క.. ఎందుకో చూడండి. watch video on watch page

103 - 1

Thulasi Chandu
Posted 2 weeks ago

GST 2.O సంస్కరణలతో నిజంగా ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్.
కానీ.. షరతులు వర్తిస్తాయ్! watch video on watch page

161 - 15

Thulasi Chandu
Posted 3 weeks ago

ఇది విశాఖ ఉక్కు చరిత్రను చెప్పే వీడియో.. రీసెర్చ్ చేస్తున్నంతసేపూ నాకు ఒకటే అనిపించింది.
"ఆంధ్రప్రేదేశ్ రాజకీయ నాయకులు ఎంత షేమ్ లెస్ గా బతుకుతున్నారు" అని !!
ఈ మాట చెప్పడానికి నాకేం భయం లేదు. 32 మంది చనిపోయారు అని అంటారు కదా వైజాగ్ స్టీల్ ఉద్యమంలో వాళ్లు ఎవరో తెలుసా? వాళ్ల పేర్లు ఎక్కడెక్కడ ఎలా చనిపోయారో తెలుసుకోవడానికి నాకు 20 రోజుల టైం పట్టింది. కేవలం చావులు మాత్రమే కాదు.. పదేళ్ల పిల్లల్ని కూడా తుపాకీ తూటాలు చీల్చుకొని వెళ్లాయ్ అప్పుడు.
1966లో 67 మంది ప్రజా ప్రతినిధులు.. ఈ పదవులు ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఉక్కు సంకల్పంతో ఉద్యమించారు..
Watch: https://youtu.be/4RCJvEAhlQs
ఒక్కరు..
ఒక్కరు..
ఒక్క లీడర్ ఉన్నాడా అలాంటి సంకల్పంతో ఇప్పుడు ఏపీలో..
Shameless Fellows
నేను MLA, నేను MP, నేను Minister అని చెప్పుకునే ముందు కొంచెం సిగ్గుతెచ్చుకోండి.
APలో ఒక ఓడ మల్లయ్య..
అవసరమైనప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్నాడు ప్రతిపక్షంలో..
అధికారంలోకి రాగానే నేను అనపాలజిటిక్ సనాతనీ అని గుండెలు బాదుకుంటున్నాడు. ఏదీ ఆ రోషం ఇప్పుడు చచ్చిపోయిందా.. ఇప్పుడు గుర్తుకురావట్లేదా ఆ 32 మంది అమరుల త్యాగం??
ఇది రాజకీయ నాయకుల కోసం కాదు.. విద్యార్థులపైన ఒక హోప్ తో చేసిన వీడియో!!
స్వార్థ రాజకీయ నాయకులు వెంటిలేటర్ పైకి చేర్చేశారు స్టీల్ ఫ్యాక్టరీని.. పోతున్న ప్రాణాలను ఆపే సత్తా ధైర్యం సాహసం పిడికిలి బిగించి పోరాడగలిగే యువతకు మాత్రమే ఉంది. వాళ్ల కోసమే ఈ వీడియో, జర్నలిస్టుగా నా విధి అసలేం జరిగిందీ అని చెప్పడం. ప్రజా ప్రతినిధులు ఫెయిలయ్యారు.. యువత కచ్చితంగా ఫెయిలవ్వకూడదు.. విశాఖ ఉక్కును చంపెయ్యకూడదు!

Watch: https://youtu.be/4RCJvEAhlQs

#SaveVizagSteel
#VisakhaUkkuAndhrulaHakku✊🏼

2.7K - 277

Thulasi Chandu
Posted 1 month ago

మనసంతా పిల్లల పైన ప్రేమ..
తన టీచింగ్ వృత్తిపట్ల నిబద్ధత ఉంటే..
ఒక ప్రభుత్వ టీచర్ ఏం చెయ్యగలరో
ఈ భీంపుత్ర శ్రీనివాస్ నిరూపిస్తున్నారు.
ఇలాంటి టీచర్లే దేశ నిర్మాతలు.
ఏమంటారు?
#greatteacher #indianteacher #instareels #internalbodyparts watch video on watch page

75 - 3

Thulasi Chandu
Posted 1 month ago

సీఎం గారికి నా విజ్ఞప్తి...
మంచిర్యాల్ జిల్లా మందమర్రిలోని ఒక ప్రభుత్వ టీచర్. భీంపుత్ర శ్రీనివాస్. మనం ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని కోరుకుంటామో అంతకు మించే తన విద్యార్థులతో ప్రయోగాలు చేస్తున్నారు. తరగతి గదిని ప్రయోగశాలగా మార్చుకున్నారు. పంట పొలాలు, నీటి ప్రాజెక్టులు, కర్మాగారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అడవులు, చారిత్రక కట్టడాల దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్లి పాఠాలు చెప్పడం ఒక ఎత్తైతే.. క్లాస్ రూమ్ ని పిల్లలకు favourite place గా మార్చడానికి ఈ ప్రైమరీ టీచర్ తరగతి గదిలో చేస్తున్న ప్రయోగాలు మరో ఎత్తు. అందులో భాగంగా శరీరం లోపలి భాగాలు internal organs పిల్లలకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రత్యేకమైన డ్రెస్సులు తయారు చేశారు ఈ మాస్టర్. నాకు తెలిసినంతవరకు మన దేశంలో మరే టీచర్ internal body parts గురించి పిల్లలకు ఇంత క్రియేటివ్ గా చెప్పలేదు.
అంతే కాదు.. భీంపుత్ర శ్రీనివాస్ గారు రోజూ పిల్లల్లాంటి యూనిఫాంలోనే స్కూలుకు వెళ్తుండటం మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
"ఇంత కమిట్మెంట్ ఎలా వచ్చింది సార్ అంటే ఒక దళితుడిగా తను ఎదుర్కొన్న వివక్షలో నుంచి.." అన్నారు.
ఆయనతో నేను చేసిన ఈ podcast లో ఆయన పనితీరును వివరంగా చెప్పారు.
ఇలాంటి టీచర్లను ప్రభుత్వం నెత్తిన పెట్టుకొని ప్రచారం చెయ్యాలి, ప్రోత్సహించాలి. ప్రతి స్కూల్లో ఇలాంటి టీచర్లు తయారవ్వాలి. విద్యాశాఖ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి @revanth_anumula గారికి నా విజ్ఞప్తి.. మందమర్రి ఫిల్టర్ బెడ్ పాఠశాల టీచర్ చేస్తున్న పాఠశాల ప్రయోగాల పైన విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టేలా చూడగలరు. టీచింగ్ వృత్తిలో ఏం సాధించొచ్చో, ఎంత job satisfaction పొందొచ్చో ఈ టీచర్ తో మొత్తం టీచర్లకూ, ఇప్పుడే టీచింగ్ వృత్తిలోకి వస్తున్న వాళ్లకూ ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయించినా మంచి ఫలితాలుంటాయి.
For more information please watch it: youtu.be/L_PcsGAaqnU?fe… watch video on watch page

197 - 13