VMYF ఒక ప్రోయాక్టివ్ యువసైన్యం. VMYF ప్రధానంగా యువత మరియు బాల బాలికల సాధికారత కోసం కృషి చేసే ఒక యువజన సంస్థ.
మేము స్వామి వివేకానంద బోధనలతో స్ఫూర్తి పొందిన వారము. యువత వారి అంతర్గత శక్తిని గుర్తిస్తే వారిని వారు శారీరికంగా, మానసికంగా, బౌద్ధికంగా, భావుకంగా, ఆధ్యాత్మికంగా శక్తివంతం చేసుకోగలరని మా దృఢమైన విశ్వాసం. అంతే కాక వారు తద్వారా దేశానికి సైతం ఎంతో మేలు చేయగలరని మా నమ్మకం.
ఈ వీడియోలు యువతకు తమ వ్యక్తిత్వ నిర్మాణానికి, శీలనిర్మాణానికి, మరియు తమ బాధ్యత నిర్వహణకు సంబంధించిన ఒక మౌలిక అవగాహన కలిగించడానికి తయారు చేయబడ్డాయి. ఈ వీడియోలను జాగ్రత్తగా పరిశీలించి ఆచరణ లో పెట్టినవారు తమలో ఒక ఖచ్చితమైన మార్పును గమనించగలరు.
Contact: 8977936702 / 8688667209