కథ అనగానే చాల మందికి గుర్తొచ్చేది నాన్నమ్మ, అమ్మమ్మ, తత్తయ్యలు. నిజం, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.ఒకప్పుడు కుటుంబం అంటే అమ్మ నాన్న మాత్రమే కాదు పెద్దనాన్న,పెద్దమ్మా, పిన్నులు, బాబాయిలు, మావయ్యలు, అత్తయ్యలు అని ఎంతో మంది ఉంటారు. పిల్లలకి నడవడికి, ప్రవర్తనా, ముఖ్యముగా మంచి కి చెడు కి మధ్య తేడా తెలిసేది. ఇంటిలోని పెద్ద వారు పిల్లలకి కథ రూపం లో యెన్నో విషయాలు చెప్పేవారు. ఆ కథలు వారి అభివృద్ధి కి చాల ధోహదపదేవి. కానీ ఇప్పటి పరిస్థితి, కాలానుగుణంగా చిన్న కుటుంబాలుగా మారిపోయాం. పిల్లలతో గడిపే సమయం తగ్గిపోయింది.పిల్లల ఎదుగుదలలో కథలు చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. పిల్లలకి టీవీలూ, మొబైల్ అవసరం లేకుండా, వాళ్లకి అర్ధమైన రీతిలో కథలు చెప్పడానికి కృషిచేసేదే మా ఈ అమ్మతో కాసేపు.ఇందులో కథలు మాత్రమే కాదు పద్యాలు, శ్లోకాలు, పొడుపు కథలు, మంచి సూక్తులు, మాటలు ఇంకా అనేక విషయాలతో మా ఈ అమ్మతో కాసేపు ఛానెల్ ద్వారా ముందుకు వస్తున్నాం. మీరు కూడా కథలు కానీ, శ్లోకాలు కానీ మా తో పంచుకోవాలి అనుకుంటే ఈ క్రింద ఉన్నా ఈమెయిల్ ఐడీ కి పంపండి. ammathokaasepu@gmail.com