Channel Avatar

Make Life Beautiful in telugu @UCVsapUqnsVNEn0kkcNpPCog@youtube.com

3.1K subscribers - no pronouns :c

Hai Friends! I am Vasundhara Meher, welcome to my channel�


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Make Life Beautiful in telugu
Posted 4 weeks ago

Krishnashtami videos: www.youtube.com/playlist?list...

1 - 0

Make Life Beautiful in telugu
Posted 5 months ago

శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏🏼🙏🏼

1 - 0

Make Life Beautiful in telugu
Posted 6 months ago

రవ్వ వడియాలు👇👇
https://youtu.be/9wzZHXwFfh0

2 - 0

Make Life Beautiful in telugu
Posted 6 months ago

హాయ్ అండి చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలి అది షార్ట్స్ కోసం వేరే ఛానల్ షార్ట్ వీడియోస్ కీ సెపరేట్ ఛానల్ చేశా ఇక నుంచి make life beautiful in telugu shorts(mlb shorts)👇👇link here
youtube.com/@123vassu
Please support our shorts channel also☺️

7 - 0

Make Life Beautiful in telugu
Posted 8 months ago

Happy new year to all💐💐 from vasundhara meher

1 - 0

Make Life Beautiful in telugu
Posted 10 months ago

మీకు, మీ కుటుంబ సభ్యుల అందరికి విజయదశమి శుభాకాంక్షలు ☺️

2 - 0

Make Life Beautiful in telugu
Posted 11 months ago

హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి దసరా.. చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా విజయదశమి పండగను జరుపుకుంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఈ తొమ్మిది రోజులు శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇస్తారు. అమ్మవారిని తొమ్మిది రోజులు రకరకాలుగా అలంకరించి.. అమ్మవారికి ఇష్టమైన పదార్ధాలతో నైవేద్యం పెడతారు. ఇక నవరాత్రుల్లో మూడో రోజు కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు. ఈరోజు కొబ్బరన్నం తయారీకి  గురించి తెలుసుకుందాం..

1 - 0

Make Life Beautiful in telugu
Posted 11 months ago

త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.
అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.

https://youtu.be/ha-sLGOnei8

1 - 0

Make Life Beautiful in telugu
Posted 11 months ago

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. ఈ రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయ కలిగిన మోముతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించిన అమ్మ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది
💐🌹🌹🌹🌹🌹🌹🌹
* దుర్గాదేవి చరిత్ర👇👇👇🙏🏼🙏🏼
హిరణ్యాక్షుని వంశానికి చెందిన రురువనే రాక్షసునకు దుర్గముడనే కుమారు డుండేవాడు. వాడు బ్రహ్మనుగూర్చి వేయి సంవత్సరములు తపస్సు చేసి దేవతలకు, ఋషులకు బలం చేకూర్చే వేదాలను తన కిమ్మని కోరాడు. అలా వేదాలను వశం చేసుకొని, ఆ బలంతో ప్రజాపీడనం ఆరంభించాడు. బ్రాహ్మణులు వేదాలు మరచి లోకంలో కర్మభ్రష్టత ఏర్పడచేయగా, దేవతలకు, పితృదేవతలకు హవ్యకవ్యాలు నశించాయి. దానితో వర్షాదికం లేక కరువుకాటకాలతో లోకం క్షోభలో పడ్డది. దుర్గముడు అమరావతిపైకి దండెత్తి స్వర్గమును ఆక్రమించి మదోన్మత్తుడై విహరింపసాగాడు.
దేవ ఋషిగణాలు సమావేశమై ఈ బాధలనుండి రక్షింపగలది జగజ్జననియే అనంతకోటి బ్రహ్మాండనాయికే! తే నమో నమః|
అని నిశ్చయించి, ఆర్తులై ఆమెను ఇలా వేడుకొన్నారు. ప్రసీద త్వం మహేశాని! ప్రసీద జగదంబికే!
- అని ఇలా బహుధా ప్రార్ధించారు. వారి ప్రార్ధనకు సంతసించిన దేవి అద్భుతస్వరూపంతో సాక్షాత్కరించింది. ఆ తల్లి శతాక్షిగా కన్నులనుండి కరుణరసం సర్వ ఓషధులతోడి సంతత ధారగా 9రోజులు వర్షింపగా జలాశయాలు నిండాయి. ఆమె చేత ధరించిన శాకములు, భోజ్యపదార్థాలతో లోకాల ఆకలి తీరింది. ఆమె శాకంభరిగా కీర్తింపబడింది. దుర్గముడు ఈ విషయం తెలుసుకొని ఆమెను జయింప నిశ్చయించుకొని వచ్చాడు. అపార సైన్యముతో పరివారంతో కూడివున్న దేవిని చుట్టుముట్టాడు. వాడు వేసిన శరవర్షానికి దేవ, ఋషులు గురికాకుండా అమ్మవారు చక్రాన్ని పంపింది. వాడు భయంకర ధనుష్టంకారం చేసి బాణములతో నిప్పులు కురిపింపసాగాడు. తల్లి తొంబదియారు శక్తుల నావిర్భవింపజేసి విలయతాండవం చేస్తూ నూరు అక్షౌహిణీల రాక్షససైన్యాన్ని హతం చేసింది. పదిరోజులు అలా మహాయుద్ధం సాగింది.
అమ్మవారు విజృంభించి శరసంధానం చేస్తూ ఒక బాణంతో దుర్గముని రథం టెక్కాన్ని, మరోబాణంతో సారథిని నాల్గు బాణాలతో రథాశ్వాలను కూల్చింది. మరో అద్భుతబాణంతో దుర్గముని రొమ్ము చీల్చగా వాడు నెత్తురు కక్కుచు నేలకూలాడు. ఇంద్రాదిదేవతలు, మహర్షులు ఆమెను బహుధా స్తుతించారు.
శ్లో॥ మాతర్మే మధుకైటభఘ్ని! మహిష ప్రాణాపహారోద్యమే! హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని! నిశ్శేషీకృత రక్తబీజదనుజే! నిత్యే! నిశుంభాపహే! శుంభధ్వంసిని! నాశ యాశు దురితం దుర్గే! నమస్తే.. బికే!
శ్లో॥ భుజాష్ట యుక్తాం మహిషస్య మర్దినీం స శంఖ చక్రాం శరచాపధారిణీం| తాం దివ్యయోగిం సహజాతవేదసీం దుర్గాం సదాహం శరణం ప్రపద్యే ॥ శ్లో॥ సర్వమంగళ మాంగళ్యే! శివే! సర్వార్థసాధికే!
శరణ్యే! త్ర్యంబకే! దేవి! నారయణి! నమోస్తుతే॥
అని స్తుతించే వారి ననుగ్రహిస్తూ "ఓ దేవ మహర్షులారా! దుర్గముని వధించినందున నన్ను “దుర్గ" గా భావించి సేవించుచు ఉండుడు. నేను మీ పాపములను హరించి సమస్త శుభములు చేకూర్చగలను" అని చెప్పి అంతర్థానమైంది. అట్టి దుర్గామాతను పూజించినవా రందరూ ఆమె అనుగ్రహంవలన లోకంలో సుఖశాంతులతో వర్ధిల్లసాగారు.

5 - 0