Channel Avatar

K V Goud @UCV1Ien7b5yNkecpjnOzE5cw@youtube.com

36 subscribers - no pronouns :c

Political news


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

K V Goud
Posted 2 years ago

*తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ. ఆర్థిక. సామాజిక. విద్య రంగాల్లో అందరి కంటే ఎక్కువ నష్టపోయినది కేవలం బీసీలు మాత్రమే*

👉 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల అత్యంత అణచివేత, నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నది.


*◆రాజకీయ రంగం◆*

◆ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34 నుంచి 22 కు తగ్గించారు.

◆ మొదటి term లో నలుగురికి,
రెండవ term లో ముగ్గురికి మాత్రమే బీసీలకు మంత్రి పదవులు.

◆ కనీసం ఒకసారి కూడా బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు.

◆ గత ఎనిమిది నర సంవత్సరాలలో ఒక్క బీసీ మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు

*◆విద్యా రంగం◆*

● గత విద్య సంవత్సరం వరకు
ఒక్క బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాల లేదు.

● ఒకే ఒక్క బాలికల డిగ్రీ గురుకుల కళాశాల ఉంది

*◆ఆర్థిక రంగం◆*
👉 బడ్జెట్ లో కేటాయింపులు మూడుశాతం దాటలేదు.

👉 సామాజిక హోదాలో
బీసీలను అత్యంత దారుణంగా అణచివేత చేస్తున్నారు

👉 బీసీలను కులాల వారీగా వారి రాజకీయ అవసరాలకు ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి
పథకాలు అమలు చేస్తున్నారు.
ఆత్మ గౌరవ భవనాలు లాంటివి ఇందులో భాగమే.

👉 ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేసి గాలికొదిలేసారు.

👉బీసీ ఫెడరేషన్ లను నిర్వీర్యం చేసారు (అయిన కొందరు చరిత్రాత్మక పాలన అని, బడ్జెట్ కేటాయింపులు ఆమోగం అని అంటుంటే జాలికలుగుతుంది)

👉 *వీటన్నింటికి కారణం*
బీసీ ఉద్యోగులు... బీసీల గురించి గొంతు విప్పకపోవడం,
*బీసీ యువత,సామాజిక రాజకీయ ఉద్యమ బావజాలంలో పనిచేయకపోవడం...*

👉 బీసీ మేథావులు... బీసీలకు జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్యాయం పై
రచనలు చేయకపోవడం.

👉 కొంత అవగాహన కలిగిన మేధావులు మొదలు యువత వరకు.. వోటు హక్కు, రాజ్యాంగం, 340 ఆర్టికల్ అంటూ పడి కొట్టుకు పోతు వాస్తవిక అంశాలను పట్టించుకోవడం లేదు.

👉 సామాజిక, రాజకీయ మార్పులు కోసం జీవితం త్యాగం చేసిన బీసీ మహనీయులు గురించి శోధించకపోవడం.

*ఇవన్నీ ఒక ఎత్తు ఐతే... బీసీలను బీసీయేతర బావజాలం మింగేయడన్ని గుర్తించక పోవడం మరో వైకల్యం*

అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బీసీలను వదిలేస్తున్నారు.

బీసీల సంక్షేమం, బీసీల సమగ్రమైన అభివృద్ధి జరగాలంటే...

బీసీలు.. *జైబీసీ... జయహో బీసీ...* అనే నినాదంతో బీసీ వాదం అందుకోవాలి.

బీసీ మహనీయుల జయంతి, వర్దంతి కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి వారి ఆశయాల సాధనకు పూనుకోవాలి.

ప్రతి పల్లే,
ప్రతి పట్టణం.
ప్రతి నగరం.. లో.
బీసీ వాదం... నినాదమై మోగాలి.
బీసీ అస్తిత్వం...బ్లో అవుట్ కావాలి.

అందుకే.. *బీసీ-బడి పొలిటికల్ వర్కుషాప్* సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము...

మీ...
*కె వి గౌడ్.*
సెల్: 9700644644
https://youtu.be/-mvaei2Prpw

0 - 0