ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని జాతీయ దీక్ష భూమి కొత్తపల్లిలో దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో దీక్షలను ఆచరించనున్నారు..
భక్తులు వారి వారి వీలును బట్టి 41 రోజులు మాలధారణ గావిస్తారు. ఈ సమయాల్లో దీక్షాపరులతోపాటు కుటుంబ సభ్యులు ఎంతో భక్తిభావంతో ఉంటారు. మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు. నిత్యం ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. తండాలు సేవాలాల్ నామస్మ రణతో మార్మోగుతాయి. శ్రీరామనవమి రోజున మహారాష్ట్రలో వాసిం జిల్లా పౌరదాదేవిలో ప్రత్యేక పూజలు చేసి దీక్ష విరమణ చేస్తారు..
నేపథ్యం..#దీక్షగురు ప్రేంసింగ్ మహారాజ్ 1978లో కెరమెరి మండలం శంకర్ ద్దిలో మహా తపస్సు చేశారు. 1979 జనవరి 11న పౌరగఢ్ పీఠాధిపతి రాంరావ్ మహారాజ్ తపస్సుని విరామింపజేశారు. నాటి నుంచి ఏటా జనవరి 11ని గురుకృపా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అదే ఏడాది శివరాత్రి నుంచి సేవాలాల్ దీక్ష ప్రారంభమైంది.లంబాడాలను చెడుమార్గాలు నుంచి దూరం చేస్తూజాతిని ఏకతాటిపై తీసుకురావడానికి వివిధ రాష్ట్రాల్లో తిరిగి ఆధ్యాత్మిక చైతన్యం చేశారు.. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో విస్తరించడంతో ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. వేలాది మంది యువత దీక్షలు స్వీకరిస్తున్నారు.