Channel Avatar

Mangalagiri NEWS BULLETIN @UCUJuYAmcL0PXvFK6p-GcObw@youtube.com

18K subscribers - no pronouns :c

Mangalagiri news bulletin is news channel which is the cove


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Mangalagiri NEWS BULLETIN
Posted 1 year ago

వైఎస్ షర్మిల అరెస్ట్

AP: మెగా డీఎస్సీ ప్రకటించాలంటూ కాంగ్రెస్ చేపట్టిన 'ఛలో సెక్రటేరియట్' ఉద్రిక్తంగా మారింది. ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు, కార్య కర్తలతో ఏపీసీసీ చీఫ్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయల్దేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

3 - 0

Mangalagiri NEWS BULLETIN
Posted 1 year ago

వాట్స్ యాప్ మెసేజ్ కు స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే

దుగ్గిరాల రాంనగర్ కు చెందిన శాఖమూరి సురేష్ ఇటీవల బ్రెయిన్ క్యాన్సర్ కు గురయ్యారు. దీనితో ఆకుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్న సమాచారాన్ని స్థానికులు వాట్సాప్ సందేశం ద్వారా గురువారం ఎమ్మెల్యే ఆర్కేకు తెలిపారు. దీనితో స్పందించిన ఎమ్మెల్యే ఆర్కే వెంటనే బాధితుడిని పరామర్శించి తక్షణ సహాయంగా రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ హనుమంతరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

8 - 0

Mangalagiri NEWS BULLETIN
Posted 1 year ago

వాలంటీర్లే సంక్షేమ పథకాల సైనికులు - ఎమ్మెల్యే ఆర్కే.....

దుగ్గిరాల మండల వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, ఇన్చార్జి గంజి చిరంజీవి....

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్కే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరికీ మంచి చేస్తున్న వ్యక్తిగా దేశ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు నిలిచిపోతారని అన్నారు..

18 గ్రామాల నుండి వచ్చిన సుమారు 400 మంది వాలంటీర్లు ఇబ్బంది పడకుండా రూ.50,000/- తన సొంత ఖర్చులు వెచ్చించి భోజన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే ఆర్కే...

5 - 1