Channel Avatar

BhakthiSadhana @UCRZetm9J7vAy1g0tJStHzLA@youtube.com

38K subscribers - no pronouns :c

Bhakthi Sadhana is a channel dedicated to all devotional peo


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

BhakthiSadhana
Posted 2 years ago

హిందూ పురాణాల ప్రకారం
*మధ్య వేలు* శని స్థానం. ఈయన జీవితానికి భద్రత కలిగిస్తాడు. కాబట్టి మధ్యవేలితో నుదుటిపై తిలకం ధరిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది.
*ఉంగరపు వేలు* సూర్య స్థానం. అందుకే ఈ వేలుతో నుదుటన బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి. అంతేకాదు సూర్యుడి తేజస్సు, శక్తి కలుగుతాయి. అలాగే
*ఉంగరపు వేలుతో* తిలకధారణ చేస్తే నుదుటిపై ఉండే ఆఙ్ఞా చక్రం ఉత్తేజితమై, మనిషి మేధస్సును మేల్కొల్పడానికి సహాయపడుతుంది. అందుకే *_దేవుడికి_* ఈ వేలుతోనే తిలకధారణ చేస్తారు.
పురాణాల ప్రకారం
*బొటన వేలు* శుక్ర స్థానం. ఈ గ్రహం ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కాబట్టి బొటనవేలుతో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి.
*చూపుడు వేలు* బృహస్పతి స్థానం. మరణించిన వారికి మాత్రం ఈ వేలుతో తిలకం దిద్దితే మోక్షం ప్రాప్తిస్తుంది. అమరత్వాన్ని కలిగించేది బృహస్పతి గ్రహం. అందుకే మిగతా సందర్భాల్లో *చూపుడువేలుతో* నుదుటిపై బొట్టు పెట్టడాన్ని అపవిత్రంగా భావిస్తారు. 🙏

1.5K - 8

BhakthiSadhana
Posted 2 years ago

*ॐ _31/08/2022 - శ్రీ వరసిద్ధి వినాయక చవితి వ్రతమ్_ 卐*
*మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి.*

*వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?*

గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. “ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి?

పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?”

“మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు.

వినండి.

పరమేశ్వరుడు విశ్వవ్యాపిత (అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని (అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు.

విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించు పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం.

ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు. *(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు).* మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది.

అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ” అని చెప్పాడు సూతుడు.

మట్టి గణపతులనే ఆరాధించడమే మన సంప్రదాయం. మట్టి గణపతులనే పూజించండి.

5.6K - 27

BhakthiSadhana
Posted 2 years ago

*ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూప ఆరాధన*
1. అశ్విని -- ద్వి ముఖ గణపతి ‌

2. భరణి -- సిద్ద గణపతి.

3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ గణపతి

4. రోహిణి - విఘ్న గణపతి ‌

5. మృగశిర - క్షిప్ర గణపతి

6. ఆరుద్ర - హేరంబ గణపతి

7. పునర్వసు - లక్ష్మి గణపతి

8. పుష్యమి - మహ గణపతి

9. ఆశ్లేష - విజయ గణపతి

10. మఖ - నృత్య గణపతి

11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి.

12 ఉత్తర - ఏకాక్షర గణపతి

13. హస్త - వరద గణపతి

14. చిత్త - త్య్రక్షర గణపతి

15. స్వాతి - క్షిప్రసాద గణపతి

16. విశాఖ - హరిద్ర గణపతి

17.అనూరాధ - ఏకదంత గణపతి

18. జ్యేష్ఠ - సృష్టి గణపతి

19 మూల ఉద్దాన గణపతి

20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి

21. ఉత్తరాషాఢ - ధుండి గణపతి

22. శ్రవణం - ద్వి ముఖ గణపతి

23. ధనిష్ట - త్రిముఖ గణపతి

24. శతభిషం - సింహ గణపతి

25. పూర్వాభాద్ర - యోగ గణపతి

26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి

27. రేవతి - సంకట హర గణపతి

"ఓం ఘః గణపతయే నమోః నమః '''🙏

పై గణపతి ఆరాధన వలన
మన పూర్వ జన్మ కర్మల నుండి బయటపడి భగవంతుని అనుగ్రహం పోందుతాము.

అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలుకు
ముడి పడి వుంది.
పై గణపతులు మరియు నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకోగలిగితే
ద్వాదశ భావాలు యెక్క రహస్యం అర్దం అవుతుంది.

*సర్వోజనా సుఖినోభావంత్*

7.4K - 75

BhakthiSadhana
Posted 2 years ago

*సాలిగ్రామం ఎలా పుట్టింది??*
సాలిగ్రామం అంటే తెలుసా?
గండకీ సరసస్తీరే చంద్ర తీర్థేన శోభితే!
సాలగ్రామ పురశ్రేష్ఠ కనకాఖ్య విమానగ!
శ్రీ మూర్తిదేవ శ్శ్రీ దేవ్యా కుబేరోముఖ సంస్థిత:!
గండకీ గణికా రుద్ర బ్రహ్మణా మక్షిగోచర:!
శ్రీవిష్ణుచిత్త కలిజిత్ స్తుతి భూషిత నిగ్రహ:!

సాలిగ్రామం అంటే తెలుసా.......?
విష్ణు చిహ్నంగల శిలనే సాలిగ్రామం అంటారు. అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలూ వేలు కాదు, లెక్కకు మిక్కిలిగా ఆ ఒక్క నదిలోనే పుడతాయి. మరెక్కడా దొరకవవి.

ఆనది పేరు గండకీ. చిన్నగా పెద్దగా రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. గండకీ నదిలోనే దొరుకుతాయి. గుండ్రని రాళ్ళలా ఉన్నా – తాబేలు నోరు తెరచుకున్నట్టు ఉండి లోపల శ్రీ మహా విష్ణువే శేషసాయిగా ఉండి దర్శన మిస్తాడంటారు. పూజిస్తుంటారు. మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడానికి వెనుక ఒక కథ ఉంది!

గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక స్త్రీ, గండకీ పేరుతోనే శ్రావస్తి నగరంలో ఉండేది. ఆమె అందాల వేశ్య. ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూవుండేవారు.

గండకీ అందరినీ అంగీకరించేది కాదు. ప్రతి రోజూ ముందొచ్చిన బేరం ఒప్పుకొనేది. ఆరోజుకి అతనే భర్త. రెండో మనిషికీ రెండో బేరానికి ఒప్పుకొనేది కాదు. ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు. ఆమె తల్లి గండ్రకి మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించి విఫలమైంది. సాక్షాత్తూ నారాయణుడికే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టింది.

ఒక రోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు బేరం చేసుకొని కానుకలు ఇచ్చాడు. అలవాటుగా గండ్రకి అతనికి స్నానం చేయించాలని దుస్తులు తీస్తే దుర్వాసన… ఒళ్ళంతా పుండ్లు. ఈగల ముసిరాయి. కుష్టు వ్యాధి ఉందని కూడా గ్రహించింది. తల్లి తిట్టి పొమ్మనబోతే గండ్రకి ఆమెనే తరిమేసింది.

సంపంగి తైలం పూసింది. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించింది. చేనేత వస్త్రాలు చుట్టింది. చక్కని భోజనం పెట్టింది. అతడు తినబోతే పుచ్చిన చేతులు. వేళ్లూడి పడితే పక్కన తీసి పెట్టింది. తినిపించింది. అదే కంచంలో తానూ తిన్నది. పక్కమీదకు చేర్చింది. విసురుతూ కూర్చుంది. జ్వరంతో అతడు ఆ రాత్రే ప్రాణాలు వదిలాడు. అప్పటి ఆచారం ప్రకారం సహగమనానికి పూనుకుంది. తల్లీ బంధువులూ తల్లడిల్లినా ఆగలేదు. తాళి కట్టని భార్యలా తల్లడిల్లింది. తనువుని చాలించదలచింది. ఉన్న ధనమంతా బీదసాదాలకు పంచి పెట్టింది. ధాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి శవం వెంట మేళ తాళాలతో వెళ్ళింది. శ్మశాసనంలో చితి పేర్చింది. తనే నిప్పంటించింది. తనూ చితిలోకి దూకింది. చిత్రంగా ఎగిసిన మంటలు మల్లెలయ్యాయి. కాలిన కట్టెలు పువ్వులయ్యాయి. లక్ష్మి సమేతంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు.

గండకి చూస్తూనే ముగ్దురాలైంది. చేతులు జోడించింది. కన్నీళ్ళతో కీర్తించింది. కీర్తిస్తూ కాళ్ళు కడిగింది. శరీరమూ మనసూ స్వచ్ఛంగా నిలిపింది.

గండకి పవిత్రతకు నారాయణుడు పరవశించిపోయాడు. ఆమె నియమ నిబంధనలకు నిర్ఘాంతపోయాడు. ఆమె నిశ్చలతకు చలించిపోయాడు. నిష్టకు ఇష్టపడ్డాడు.

ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి డబ్బూ ధనం కోరలేదు. మోక్షమూ కోరలేదు. మాతృత్వాన్ని వరంగా కోరింది. మహా విష్ణువుని తన కడుపున కొడుకుగా పుట్టాలని కోరింది. ఫలితమే.

మరు జన్మలో గండకీ నదిగా పుట్టింది.
నది కడుపులో సాలిగ్రామాల రూపంలో విష్ణుమూర్తి పుట్టి పూజలందుకున్నాడు.

గండకి ఏకులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనసు మలినం కాలేదు. ఆ విధంగా పవిత్రురాలైంది. విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకొని తల్లయింది. కృతయుగాన జరిగినా ఈయుగానికీ గండకీకథనిలిచిపోయింది...

1.5K - 35

BhakthiSadhana
Posted 2 years ago

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)
3. మాసం : శ్రావణం
4. తిథి: అష్టమి
5 . నక్షత్రం : రోహిణి
6. వారం : బుధవారం
7. సమయం : రాత్రి గం.00.00 ని.
8 జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
9. నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం
12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ

15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ
17. పెంచిన తండ్రి నందుడు
18. పెంచిన తల్లి యశోద
19. సోదరుడు బలరాముడు
20. సోదరి సుభద్ర
21. జన్మ స్థలం మధుర
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : చాణుర - కుస్తీదారు
కంసుడు - మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.
27. 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
41. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

సర్వోజనా సుఖినోభావంత్🙏

వసుదేవ సుతం దేవం
కంస చాణూర మర్థనం దేవకీపరమానందం
కృష్ణం వందే జగద్గురుం.

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

8.1K - 97

BhakthiSadhana
Posted 2 years ago

🌿శ్రావణ శుద్ధ ఏకాదశి
కుబేర స్వామి జయంతి 🌿
సకల సంపదలకు
ఉత్తర దిక్కునకు అధిపతి ,
లోకపాలకుడైన యక్షరాజే కుబేరుడు .
శ్రావణ శుద్ధ ఏకాదశి రోజున
ఓం యక్షరాజయ విద్మహే
వైశ్రవణాయ ధీమహి
తన్నో కుబేరః ప్రచోదయాత్ !

9.9K - 98

BhakthiSadhana
Posted 2 years ago

వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేసుకుంటారు ?

శ్రీ మహాలక్ష్మీ దేవి క్షీర సాగరము నుండి ఆవిర్భవించినది. చంద్రుడు కూడా శ్రీ మహాలక్ష్మీ దేవితో పాటు క్షీర సాగరము నుండి ఆవిర్భవించాడు. చంద్రుడు శ్రీ మహాలక్ష్మీ దేవికి సోదరుడు. పౌర్ణమి ముందు చంద్రుడు సంపూర్ణమైన కాంతితో పూర్ణ చంద్రుడిలా ప్రకాశిస్తుంటాడు. ఆ పూర్ణ చంద్రుని చూచి శ్రీ మహాలక్ష్మీ దేవి ఆ సమయమున ఎంతో సంతోషముగా ఉంటుంది . శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉండటానికి మరో ముఖ్య కారణం. శ్రావణ మాసం శ్రవణా నక్షత్రయుక్త మాసము. ఇది తన భర్త అయిన శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం. సాధారణంగా పౌర్ణమి శ్రవణా నక్షత్రం ఈ శ్రావణ మాసంలో ఇంచుమించుగా కలిసే వస్తాయి. అందువలన శ్రీ మహాలక్ష్మీ దేవి మరింత ప్రసన్నంగా ఉంటుంది. అలా శ్రీ మహాలక్ష్మీ దేవి సంతోషముగా ఉన్న పున్నమి ముందు శ్రావణ శుక్రవారం రోజున, ముత్తయిదువులు ఈ వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తే, వారి సమస్త కోరికలు నేరవేరడమే కాకుండా, వారి సౌభాగ్యం నిండు నూరేళ్ళు సుఖ శాంతులతో వర్ధిల్లుతుందని మన పెద్దలు శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతమును చేసుకోవాలని చెప్పారు. ఆ రోజున ముత్తయిదువులకు వీలుకాని పక్షంలో మాత్రమే మూడవ శ్రావణ శుక్రవారం కూడా నోచుకోనవచ్చు.

7.6K - 59

BhakthiSadhana
Posted 2 years ago

🙏ఓం నమో వేంకటేశాయ 🙏
లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి, భూమిపై కరవీరపూర్ (కొల్హాపూర్) లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత, విష్ణువు భూలోకంలో, వెంకట కొండపై పుష్కరిణి పక్కన, ఆహారం, నిద్ర లేకుండా, లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో. చింత చెట్టు క్రింద చీమలపుట్ట (కొండ) లో నివసించాడు.బ్రహ్మ , శివుడు అతడిపై జాలి కలిగి, విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీ ఒక ఆవులకాపరిణి రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు, దూడను అమ్మింది. చోళ రాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమలపుట్ట మీద విష్ణువుని కనిపెట్టి, ఆవు తన పాలును అందించి, తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో, రాజభవంతి వద్ద, ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని, దీని వల్ల చోళ రాణి ఆవు కాపరుడికి శేరాబడు అనే యాదవుడు . పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసు కోవడానికి, ఆవు కాపరుడు శేరాబడు ఆవును రహస్యంగా అనుసరించి, చీమలపుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు శేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరి వేసాడు, కాని ఆవుకు హాని కలిగించ లేకపోయాడు. అయినప్పటికీ, ఆవు కాపరుడు శేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమలపుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు శేరాబడుతన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవటం చూసినపుడు, శేరాబడుకి మహావిష్ణువు పిశశిగా శేరాబడు ని శపిస్తాడు తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తాడు మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతి తో కళ్యాణం జరుగుతుంది అప్పుడు నీకు శాపం విమోక్షం కలుగుది మహావిష్ణువు శేరాబడు కి ఒక వరం ఇస్తారు భూమి మీద మొట్ట మొదట నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రధమ దర్శనం నీకె ఇస్తున్నాను ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు.

ఆ తరువాత, విష్ణువు, శ్రీనివాసుడు లాగా, వరాహ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన నివాసం కోసం ఒక స్థలాన్ని మంజూరు చేసేందుకు వరాహుడిని (విష్ణువు యొక్క అడవి పంది అవతారం) కోరాడు.
ఓం నమో వేంకటేశాయ

9.1K - 102

BhakthiSadhana
Posted 2 years ago

శివలింగం రోజుకు 5 సార్లు రంగులు మారుస్తుంది

కళ్యాణ సుందరేశ్వర ఆలయం
నల్లూరు, తమిళనాడు.
పరమశివుడు ఇక్కడ కల్యాణసుందరేసర్ మరియు దేవి గిరిసుందరి లేదా త్రిపురసుందరి.

ఇక్కడ శివలింగం స్వయంభూ. ప్రత్యేకత ఏమిటంటే శివలింగం రోజుకు 5 సార్లు రంగులు మారుస్తుంది. అందుకే శివుడిని పంచవర్ణేశ్వర్ అని పిలుస్తారు.
పంచ అంటే ఐదు, వర్ణం రంగు మరియు ఈశ్వరుడు శివుడు. ఇక్కడ శివుడు తిరునావుక్కరసర్‌కి దీక్ష ఇచ్చాడని చెబుతారు.
ఆదిశేషుడు మరియు వాయువు ఆధిపత్యంపై పోట్లాడినప్పుడు, ఆదిశేషుడు మేరు పర్వతాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యాడు, దాని శిఖరం విరిగిపోయింది. శివలింగం పర్వత శిఖరం నుండి ఏర్పడిందని నమ్ముతారు

ఇక్కడ శివలింగం రోజులో 5 సార్లు రంగు మారుతుంది -
రాగి (ఉదయం 6 నుండి 8.24 వరకు)
లేత ఎరుపు / గులాబీ (ఉదయం 8.25 నుండి 10.48 వరకు)
బంగారం, పచ్చ పచ్చ (10.49 నుండి 1.12)
మరియు భక్తుడు చూడటానికి ఇష్టపడే చివరి రంగు.
(సమయం 3.37 నుండి 6.00 వరకు)
ఆలయ చెరువు సప్త సహారా తీర్థం

6.3K - 53

BhakthiSadhana
Posted 2 years ago

నాగ చతుర్థి రోజున పాములను, పాము రూపం ఉన్న దేవుళ్ళను ఆరాధించడం జరుగుతుంది.

*నాగ చతుర్థి లేదా నాగుల చవితి*

🍂శ్రావణ మాసం అంటే భక్తుల హడావుడి మాములుగా ఉండదు. శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పాలి. అయితే శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థి లేదా నాగుల చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండగను నాగ పంచమికి ముందు రోజున జరుపుకుంటారు.

🍂 నాగ చతుర్థి అంటే అర్ధం ఏమిటి అంటే .. నాగా అంటే పాము లేదా సర్పం అని, చతుర్థి అంటే చంద్ర మాసంలో వచ్చే 4 వ రోజు అని అర్ధం.

🍂 కుటుంభంలో ఎటువంటి కలతలు, కలహాలు లేకుండా భర్త, పిల్లల శ్రేయస్సు కోసం వారి దీర్ఘాయువు కోసం నాగ చతుర్తి రోజున మహిళలు ఈ పూజను ఆచరిస్తారు. నాగ చతుర్థి రోజున పాములను, పాము రూపం ఉన్న దేవుళ్ళను ఆరాధించడం జరుగుతుంది.

🍂నాగ చతుర్థి పండుగ రోజున స్త్రీలు పాము పుట్టల దగ్గర పూజలు చేసి పాము పుట్టలో పాలు పోస్తారు. అలాగే పుట్టల దగ్గర గుడ్లు ఉంచుతారు.

🍂 పుట్టలో పాలు పోసిన వారు భక్తితో ఆ రోజు ఉపవాసం చేస్తారు. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి.

🍂నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇస్తే మంచిది.

🍂ఆ తరువాత పాములకు సంబందించిన దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న పాము విగ్రహాలకు నీరు మరియు పాలతో అభిషేకం చేసి విగ్రహాలకు పసుపు పొడి, కుంకుమ బొట్టులు పెట్టి దీప ధూపం మరియు ప్రసాదం అర్పిస్తారు.

🍂 ఇలా పాము దేవుళ్లకు ప్రార్థనలు చేయడం వల్ల మీకు కానీ మీ పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న పాము శాపాలనుంచి విముక్తి పొందవచ్చు.

5.4K - 42