పూలదండలో దారంలాంటిది దేవాలయ వ్యవస్థ. విభిన్న ఆచారాలు, అలవాట్లు, భాషలు, సంస్కృతులు ఉన్న జన సమూహాలను ఒక హిందూ సమాజంగా రూపొందించడంలో కీలక పాత్ర వహించేది దేవాలయ వ్యవస్థ.
ఎవరో వస్తారు, మరేదో చేస్తారు అనే భ్రాంతిని విడనాడి, హిందూ దేవాలయాల బాధ్యత హిందూ సమాజానిదే అనే స్పష్టమైన అవగాహనతో “మన గుడి - మన బాధ్యత” అనే కార్యక్రమాన్ని రూపొందించటం జరిగినది. నిరాదరణకు గురైన దేవాలయాలను గుర్తించి, వాటిని కనీస వసతులతో పునరుద్ధరించి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ధ్యేయం.