Channel Avatar

DM Digital Media NEWS @UCRBEtRGTVVwLUydPjwSsgAg@youtube.com

3.3K subscribers - no pronouns :c

Our Channel is established for Presentation of Fair news amo


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

DM Digital Media NEWS
Posted 1 week ago

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై టీటీడీ అన్ని ఆలయాల్లో నిత్యం తిరుపతి లడ్డూలు:
Sep 6, 2024: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులంటే భక్తులకూ ఎంతో ఇష్టం. అయితే భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారీలు అడ్డదారి తొక్కుతున్నారు. వీరికి అడ్డుకట్ట వేయడంతోపాటు, భాగ్యనగరంలోని అందరి భక్తులకు లడ్డూను అందుబాటులోకి తెచ్చేలా.. తిరుమల తిరుపతి దేవస్థానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వారంలో ఒకరోజే అందుబాటులో ఉండే తిరుపతి లడ్డూ ఇకపై అన్ని రోజులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని హిమాయత్​నగర్​టీటీడీ దేవాలయం ఇన్​స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు.

ఇక నుంచి ప్రతిరోజూ హైదరాబాద్​నగర భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు(టీటీడీ)లో రూ.50కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది.

*భక్తులకు అందుబాటులో*

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కావాలనే భక్తులు దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకు టీటీడీ స్థానిక ఆలయాలతోపాటు సమాచార కేంద్రాల్లో లడ్డూల విక్రయాలు ప్రారంభమైంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి లోని కోదండరామ స్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, అప్పలయాగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట లోని కోదండరామ స్వామి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లిహిల్స్ టీటీడీ దేవాలయం, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, అమరావతి,రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో లడ్డూలు విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్వామివారి ప్రసాదం భక్తులకు మరింత చేరువైనట్లైంది. #dmdigitalmedianews ‪@DMDevotionalMinds‬

2 - 0

DM Digital Media NEWS
Posted 1 month ago

05-08-2024
*పత్రికా/ మీడియా సమాచారం*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం*

*ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు హర్షణీయం*

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన కలెక్టర్, ఎస్పీల సమీక్షా సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ... అధికారం ఉందని పెత్తందారులుగా ప్రవర్తించకుండా.. సహ ఉద్యోగులతో పని చేయించుకోవాలని, వారిని అవమానించేలా మాట్లాడొద్దనీ సమస్యలను కేవలం రూల్ పొజిషన్లో మాత్రమే చూడకుండా మానవతా దృక్పథం కోణంలో ఆలోచించి సమస్యను పరిష్కరించాలనే వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేస్తూ, ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి గారికి క్రింది స్థాయి ఉద్యోగుల ఆత్మాభిమానం పట్ల వారికున్న గౌరవాన్ని సూచిస్తున్నాయని తెలియజేస్తున్నాము.

*జే.శ్రీనివాసరావు,*
*రాష్ట్ర అధ్యక్షుడు,*
*ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్*...

#appolice #cbn #apgovt #amaravathi #dmdigitalmedianews

0 - 0

DM Digital Media NEWS
Posted 2 months ago

రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని ఖజానా రహస్య గది..! హైదరాబాద్:జులై 13:
దేశమంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండా గారం రహస్య గది తెరిచేం దుకు రంగం సిద్ధమైంది.
రహస్య గదిలో స్వామి వారికి అపార సంపదలు, వైజ్రవైఢ్యూర్యాలు పొదిగిన ఆభరణాలు ఉన్నాయి.
ఐదు కర్ర పెట్టెల్లో దాచిన విలువైన జగన్నాథుని ఆభరణాల రహస్య గది రేపు తెరుచుకోనుంది.
ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు... #dmdigitalmedianews #purijagannath secretroom #treasury

1 - 0

DM Digital Media NEWS
Posted 3 months ago

This video 1year ago today, WORLD BLOOD DONATION DAY ##worldblooddonorday #2024

0 - 0