Channel Avatar

GOVINDA CHANNEL @UCOltBDgxcjJrbpMFRizho7g@youtube.com

20K subscribers - no pronouns :c

Welcome to our official Govinda Channel Hi To spread and con


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

GOVINDA CHANNEL
Posted 1 day ago

అన్ని మతాలు సమానమే అన్న జగన్మోహన్ రెడ్డి గారు,ఈ మత విశ్వాసాలను గౌరవించాలి కద? అలా చేయలేదు అంటే,ఈ ధర్మం పట్ల వారికి పూజనీయ భావం లేదు అన్న, భక్తుల ఆలోచన నిజమేనా?

29 - 2

GOVINDA CHANNEL
Posted 2 days ago

జగన్మోహన్ రెడ్డి గారు క్రిష్టియన్ అయినా కూడ తిరుమల దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వనవసరం లేదు అని అంటున్నారు అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇతర మతస్తుడిని అయిన,ఎందుకు ఇవ్వాలి,నాకు స్వామిపై నమ్మకం వున్నది అంటున్నారు.ఆయన చేసినది తప్పా,ఒప్పా?మానవత్వం వుంటే చాలునా?

59 - 10

GOVINDA CHANNEL
Posted 3 days ago

తిరుపతి కొండ, తిరుపతి గుండు, తిరుపతి లడ్డూ భక్తులపాలిట వరప్రసాదాలు. గోవిందా… గోవిందా… గోవిందా..! నామస్మరణం భక్తి పారవశ్యానికి పరాకాష్ట.
మానవ తప్పిదాలకు పుణ్యక్షేత్రాన్ని వేదికగా చేసుకుని రాజకీయ కక్షల్ని, కార్పణ్యాల్ని బహిరంగంగా చర్చించుకోవడం, నిందారోపణలు చూస్తుంటే భగవంతుని పట్ల మనకున్న భక్తి, శ్రద్ధలను ప్రకటించుకోవటమా? దైవానికి అపవిత్రతను ఆపాదించడమా? ఈ మీమాంసను భక్తాగ్రేశ్వరులమని చెప్పుకునే రాజకీయ క్రీడాకారుల విజ్ఞతకే వదిలివేయడం ఉత్తమం.

కలియుగ ప్రత్యక్ష దైవం ఈ తుచ్ఛ రాజకీయ నాయకుల పిచ్చి చేష్టలను చూస్తూ ఊరుకోడు. తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్దవారైనా శిక్షించకమానడన్నది శ్రీవారి భక్తుల్లో ప్రస్ఫుటంగా వెల్లడవుతున్న అభిప్రాయం. ఆ భక్తి శ్రద్ధలే వారిలో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాల్ని కట్టిపడేశాయేమో. వారి విశ్వాసమే ఆలయ పవిత్రతను తరతరాలుగా కాపాడుతూ వస్తుంది. భగవంతునిపై భక్తి ఉండాలి తప్ప భౌతిక, బాహ్యపదార్ధాలపై కాదన్న నిత్యసత్యాన్ని సగటు భక్తుడు సూచిస్తున్న సదాచారం మనందరికీ మార్గదర్శనమే.

లడ్డూ ప్రసాదం విషయమై మాట్లాడిన, మాట్లాడుతున్న మగా(హా)నుభావులు, అధిక ప్రసంగీకులు, మీడియా ప్రతనిధులు, మే(తా)ధావులు, జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల ట్యాగులు తగిలించుకుని మాట్లాడడం తప్పు. విశ్లేషణలు, హెచ్చరికలు కేవలం ముడిసరుకుల నాణ్యతా ప్రమాణాలు, వాటి ధరలు, సరఫరా వరకే పరిమితమైతే బాగుండేది. ఆలయ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మాట్లాడడం, దైవనిందకు దారితీయకూడదు. రెచ్చగొట్టే ప్రసంగాలు పబ్లిక్‌ ఆర్డరును భంగపరిచే దిశలో కొనసాగడం నేరం. ప్రభుత్వాలు అటువంటి దుష్ప్రచారాన్న సెన్సార్‌ చేయాల్సిన అవసరం ఈ దిశగా ఎంతైనా ఉంది.

మెడమీద తలకాయ ఉన్నోళ్లంతా వాళ్ల వాళ్ల స్వంత అభిప్రాయాల్ని గుళ్లకు, గోపురాలకు ఆపాదించేటపుడు సంయమనాన్ని పాటించాలి. భక్తుల మనోభావాల్ని గుర్తించి మరీ మాట్లాడడం పౌరధర్మం, శ్రేయస్కరం.

సామాన్య జనానికి ఎవరు అధికారంలో ఉన్నపుడు తప్పు జరిగిందన్నది అప్రస్తుతం. దేవడి ప్రసాదాన్ని సొంత లాభం కోసం అపవిత్రం చేసినవారు, వాళ్లను కాపాడేశక్తులు కచ్చితంగా ఆ కర్మను అనుభవిస్తారన్న గట్టి నమ్మకం వారిలో పెల్లుబుకుతోంది. చట్టాలు తప్పు చేసిన వాళ్లను శిక్షించి తీరాలి. తిరిగి అటువంటి తప్పులు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. భక్తజనంలో భరోసా కల్పించి దైవత్వాన్ని పెంచాలి. ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మో రక్షిత: రక్షిత అన్న ఆర్యోక్తిని పాలకులు మనసా, వాచా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్రహ్మోత్సవాలు (అక్టోబర్‌, 4) దగ్గర పడుతున్న తరుణంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు, చేష్టలకు తెరదింపాల్సిన సమయం ఇది.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రాన్ని నిత్యం వేలాది భక్తులు స్వామి వారి ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించుకుని తరిస్తుంటారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి దేవదేవుడిని మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతారు. తిరుపతి లడ్డూకు అంత ప్రాధాన్యత ఉంది.

మూడు వందల ఏళ్ల చరిత్ర. 1715వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన తొలిసారిగా లడ్డూ ప్రసాదాన్ని బూందీ రూపంలో (పొడి లడ్డు) ఆలయ కైంకర్యంలో భాగంగా ప్రవేశపెట్టారని పండితులు చెబుతున్నారు. 1940వ సంవత్సరం నాటికి లడ్డూ రూపంలో ప్రసాదం వాడుకలోకి వచ్చింది. 2010వ సంవత్సరం వరకు రోజుకు ఒక లక్ష లడ్డూల తయారీకి ఏర్పాటు ఉండేది. ఆ పరిమితి కాలక్రమేణా రోజుకు పది లక్షల లడ్లకు పెరగడం విశేషం.
గమనార్హమైన విషయమేమిటంటే, జీఐ గుర్తింపు (ట్యాగ్‌), పేటెంట్‌ రైట్స్‌, ట్రేడ్‌ మార్క్‌ పొందిన లడ్డూ ప్రసాదం ఈరోజు నాణ్యత విషయంలో విమర్శలకు గురికావడం ఆలయ నిర్వహణ లోపం కాక మరేమిటి?
మనిషి (భక్తుడు) నాలుక కంటే బెస్ట్‌ ల్యాబ్‌ ఉండదు కదా! గత కొన్నేళ్లుగా లడ్డూ ప్రసాదం ప్రమాణాలు పడిపోతున్నాయన్న ప్రజావాణి దేవస్థానానికి తెలియనిది కాదు. నానాటికీ పడిపోతున్న లడ్డూ నాణ్యత, రుచి, రంగు గమనించి కూడా భక్తులు నిగ్రహాన్ని పాటిస్తున్నారు. తీర్థయాత్రలో దైవదూషణ, ఆరోపణలు తగదని. భక్తి, శ్రద్ధలే పరమావధిగా మెలిగారు ఇన్నేళ్లుగా. పాలకమండలి నిమ్మకు నీరెత్తిన చందంగా మౌనం వహించడం దైవాపచారం కాక మరేమిటి?

గుళ్లు, గోపురాలు, కళాక్షేత్రాలు, కల్యాణమండపాలు ప్రపంచవ్యాప్తంగా కట్టడానికి ఎనలేని నిధులున్న దేవస్థానానికి పూర్తిస్థాయి క్వాలిటీ కంట్రోల్‌ డివిజన్‌ను గ్లోబల్‌ స్థాయి టెక్నాలజీతో పెట్టుకోవాలన్న దైవ చింతన లేకపోవడం కడు శోచనీయం. అమూల్‌ సంస్థ వలె నేషనల్‌ డెవలప్‌మెంట్‌ డైరీ బోర్డ్‌ వాళ్లను అడిగినా ఎప్పుడో ఏర్పాటు చేసి ఉండేవారు. మానవ తప్పిదం మాధవునికి అంటగట్టే దయనీయమైన పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమై ఉండేది కాదు.

బెటర్‌ లేట్‌ ద్యాన్‌ నెవర్‌ అన్న చందంగా ఇప్పటికైనా ఆ ఆలోచన రావడం మంచి పరిణామమే. ఒక్క నెయ్యి విషయంలోనే కాదు, దేవస్థానం పోటులో తయారయ్యే పదార్ధాలకు వాడే దినుసులు, ద్రవ్యాలన్నింటినీ టెస్ట్‌ చేస్తే బాగుంటుంది. ఈరోజు నెయ్యి, రేపు ద్రాక్ష, బెల్లం వంటి వస్తువులు నాసి రకం సరుకులు కావచ్చు ఈ కల్తీ ప్రపంచంలో.
దేముడి తీర్థ ప్రసాదాలంటేనే భక్తి పూర్వకంగా అరచేతలో స్వీకరించి నాలుకపై వేసుకుని ఆరగించడం మన ఆచారం. దర్శనానంతరం సామాన్య భక్తులకు రెండు చిన్న లడ్లు ఇవ్వడానికి లడ్డూ కౌంటర్‌లో ఎన్నో షరతులు పెట్టే దేవస్థానం వారు, టన్నుల కొద్దీ లడ్లను ఢిల్లి లాంటి మహానగరాల్లో ఉంటున్న బడా వ్యాపారవేత్తలకు, ఘరానా రాజకీయ నాయకుల ఇళ్లకు, విందులు, వినోదాలకు పంపడమే కాకుండా, మీడియాలో ప్రచారం చేసుకోవడం దేవస్థానం ప్రతిష్టను దిగజార్చడం కాదా? దేవస్థానం ఉన్నతాధికారుల, పాలకమండలి సభ్యుల ఆగడాల్ని ప్రశ్నించేదెవరు?

ఇక దేవస్థానం ఉద్యోగులు, స్థానిక ఛోటామోటా రాజకీయ నాయకులు వాళ్ల పరపతిని పెంచుకోవడానికి లడ్డూ ప్రసాదాన్ని మాధ్యమంగా వాడుకోవడం దురదృష్టకరం. ఇక బ్లాక్‌మార్కెట్‌ సరేసరి. ఈమధ్యనే ముగిసిన ఎన్నికల్లో పోటీ చేసిన స్థానిక అభ్యర్ధులు ఓటర్లను ప్రభావితం చేసే దిశలో లడ్డూ ప్రసాదాలను పంచడం జుగుప్సాకరం. ఈ వికృత చేష్టలను తక్షణమే అరికట్టకపోతే, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని తగ్గించిన వాళ్లమవుతాం. ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డూ ప్రసాదమంటేనే పెద్దగా ఆసక్తి చూపకపోవడం, మొక్కుబడిగా స్వీకరించడం చూస్తూనే ఉన్నాం.
కానీ, గ్రామాల్లో ఇప్పటికీ తిరుపతి వెళ్లి వచ్చిన భక్తుల్ని చూసి, స్వామివారిని దర్శించుకున్నంత అనుభూతి పొందుతారు. తిరుపతి గుండు చేయించుకుంటే, ఇంకా పవిత్రంగా భావిస్తారు. యాత్రికులను ప్రోత్సహించి, భక్తిభావాన్ని ఎల్లెడలా వ్యాప్తి చేయాల్సిన కార్యక్రమాలు దేవస్థానం ఎంత ఎక్కువగా చేపడితే, ఆలయ పవిత్రతను అంత ఇనుమడింప చేసినట్టు.

కొండకు వెళ్లి వచ్చిన తర్వాత శనివారం రోజు భక్తుల ఇళ్లలో శుచిగా, శుభ్రంగా పూజాది కార్యక్రమాలు ముగించి, రాగి చెంబులో తెచ్చిన తీర్థ ప్రసాదాన్ని నలుగురికి పంచి ఎంతో తృప్తిని పొందుతారు గ్రామీణులు. కాశీదారం అందరితో పంచుకుంటారు. ముంజేతికి కట్టుకుని మురిసిపోతారు. స్వామివారి భక్తుల ఇళ్లల్లో శనివారం మాంసాహారాన్ని ముట్టకపోవడం ఆచారం. ఇదీ భక్తంటే.
స్వామివారి రోజువారీ కైంకర్యాలకు, ప్రసాద వితరణకు కావాల్సిన ఆవు నెయ్యి దేవస్థానం డైరీ నుంచి రావడం సంప్రదాయం. ఉత్పాదనను బట్టే, లడ్డూల తయారీని నియంత్రించాలి. డిమాండ్‌, సప్లయ్‌ గ్యాప్‌ దృష్ట్యా, ఏ భక్తుడూ లడ్డూ ప్రసాదమే కావాలని ఉద్యమించడు. ఇస్తే తీసుకుని తృప్తి చెందుతాడు. స్వామివారి దర్శన ద్వారం వద్ద చిన్న అరటిపండు ఇచ్చినా మహాభాగ్యంగా భావిస్తాడు. స్వామివారిని అతి చేరువలో దర్శించుకునే ప్రముఖులకు అర్చకులు చిన్న అరటిపండు ఇవ్వడం పరిపాటే.
దేవస్థానం డైరీ ఉత్పత్తి (కెపాసిటీ) దేశలవారీగా పెంచుతూ, తదనుగుణంగా భక్తులకిచ్చే ప్రసాదాలు పంచితే బాగుంటుంది. పది లక్షల లడ్లు రోజువారీ తయారు చేయాల్సిందేనన్న నిబంధనేమీ లేదు. ప్రత్యామ్నాయ ప్రసాద విషయమై పాలకమండలి పరిశీలిస్తే బాగుంటుంది. ఆవు నెయ్యి పేరు చెప్పి డాల్డా వాడే దుస్థితికి దారితీయకుండా… ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా మార్చకుండా..!

ఇక ఇతర ద్రవ్యాల విషయానికి వస్తే, దాతల నుంచి నేరుగా ఆహార ధాన్యాలు సేకరిస్తే సబబుగా ఉంటుంది. భక్తి, ముక్తి రక్తి కట్టించిన వాళ్లమవుతాం. దాతలకు కొదువలేదు. ఇప్పటికీ ఎన్నో దేవాలయాల్లో రైతులు పండించిన ధాన్యాని, దినుసుల్ని నిత్యాన్నదాన కార్యక్రమంలో వాడడం మనందరికీ తెలుసు. కమ్యూనిటీ సహకారంతో ధర్మకార్యాల్ని నిర్వహించడమే అసలు సిసలైన ధార్మికం.

వేలం ద్వారా, టెండర్ల ద్వారా ప్రసాదం తయారీ విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరాన్ని ధర్మకర్తలు గుర్తించాలి. కమ్యూనిటీ భాగస్వామ్యం తో కమర్షియల్‌ ఆధిపత్యాన్ని తగ్గించి సేవా ప్రవృత్తిని పెంపొందింపచేసే విధంగా పథకాలు రూపొందించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో, పక్కనున్న కర్ణాటక, తమిళనాడుlaలో తి.తి.దే కల్యాణమండపాలు విస్తరించి ఉన్నాయి. అలాగే, తి.తి.దే ఆధ్వర్యంలో నడుపబడుతున్న దేవాలయాలు మరెన్నో. వీటినే ధాన్యసేకరణ కేంద్రాలుగా చేసుకుని, దేవస్థానం ఒక క్రమపద్ధతిలో విరాళాలను వస్తు రూపేణా రాబడితే భక్తుల్లో నమ్మకం బలపడ్తుంది.
దేశంలోనే పేరెన్నికగన్న పాలపదార్ధాల ఫెడరేషన్లు వారి ఉత్పత్తుల్లో ఒక శాతం దేవాలయానికి కేటాయంచగలిగితే, వారి వారి సమార్ధ్యాన్నిబట్టి, ఆ కంపెనీనే ఎందుకు ప్రోత్సహించారు? ఈ కంపెనీకి సప్లయి ఆర్డర్‌ ఎందుకు ఇవ్వలేదన్న విమర్శలకు తావుండదు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ వలె, పెద్ద పెద్ద కంపెనీలు ధార్మక కార్యాలకు చేయూతనిచ్చేలా చర్యలకు ఉపక్రమిస్తే స్వామికార్యం, స్వకార్యం నిర్వర్తించిన వాళ్లవుతారు.. దైవ కార్యక్రమంలో భాగంగా. ఈ కంపెనీలన్నీ రైతుల భాగస్వామ్యంతో నడిచేవే.
గత పాతికేళ్లుగా దేవస్థానాన్న టార్గెట్‌గా చేసుకుని ఎన్నో దుమారాలు, దుష్ప్రచారాలు వెలుగు చూశాయి. ఏడు కొండలు, రెండు కొండలు, పింక్‌ డైమండ్‌, అన్యమత వ్యాప్తి, చిరుతపులి చిన్నారి బాలిక వేట మొదలుకుని ఎర్రచందనం స్మగ్లింగ్‌ వరకూ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, దేవాలయ పవిత్రతకు, దేవదేవుని భక్తి ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్ల లేదు. వాటిల్లదు కూడా. ముల్లోకాలేలే మూడు నామాల వాడికి మనం భక్తితో ముడుపులు చెల్లిస్తే చాలు.మన కోరికలు నెరవేరుతాయి.

కుల, మతాలకు అతీతంగా, నేను హిందూ ధర్మానికి వ్యతిరేకిని కాను, దేవుడిని నమ్ముతాను అన్న ప్రామాణికం(డిక్లరేషన్) ఆధారంగా, బీదా బిక్కీ అన్న తేడా లేకుండా, సర్వమానవాళికి అభయహస్తం చూపే సర్వేశ్వరుడికి మానవమాత్రుడి రక్షణ అవసరం లేదు.ఈ సలక్షణం ఒక్క తిరుమలవాసిడికే సొంతం. స్వామివారి లీలలు భక్తలు మనస్సులో సదాస్మరణీయాలు. కొండకు వచ్చిన ప్రతిసారీ ఎంతో స్వాంతన పొందే సామాన్యుల అనుభవాల్ని విస్తృతంగా ప్రచారంలోకి తెస్తే, అంతకంటే స్వామివారికి మనం చేయాల్సంది ఏమీ లేదు.

కరుణామయుడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, జగద్రక్షకుడు ఆయన. అదేమోకాని దర్శించుకున్న ప్రతిసారీ ఒక కొత్త అనుభూతి.శ్రీ వారిని మొదటి సారిగా చూస్తున్న అలౌకిక ఆనందం. ఇంకెక్కడా దొరకని సంతృప్తి.

ఓం నమో వేంకటేశాయ!
- డాక్టర్‌ దాసరి శ్రీనివాసులు

22 - 3

GOVINDA CHANNEL
Posted 3 days ago

తిరుమల జోలికి వెళ్లొద్దు: ఆనాటి యదార్థ గాధ

దాదాపు యాభై సంవత్సరాల క్రితం, పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి తితిదే ఎప్పుడూ ఏవో ప్రణాలికలు రచిస్తూనే ఉంటుంది. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి మరియు దేవస్థానం సభ్యుల కలిసి ఒక పథకం ఆలోచించారు.

మామూలుగా జయవిజయులను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మరలా అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమందపం యొక్క ప్రక్క గోడలు తొలగించి అక్కడ ద్వారములు తెరిస్తే, వాటినుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడిఎడమలకు వెళ్ళవచ్చు. దీనివల్ల భక్తుల రద్దీని భరించవచ్చు. ఇది అమలు చెయ్యాలనుకున్న ప్రతిపాదన.

దీని గురించి లోతుగా చర్చించి నలభై లక్షల వ్యయంతో అమెరికా నుండి కటింగ్ మెషిన్ ను కొనుగోలు చెయ్యాలని నిర్ధారించారు. ఇదంతా విని అక్కడే ఉన్న శ్రీ గణపతి స్థపతి గారి మనస్సు కలతపడింది. మనస్సులోని బాధ మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించారు. స్వయంగా స్థపతి గారినే, “ఎందుకు స్థపతి గారు మౌనంగా ఉన్నారు? ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా?” అని అడిగారు.

“నా అభిప్రాయాల్ని నేను చెప్పవచ్చునా?” అని అడగగా, సరే అన్నట్టు తలూపారు మంత్రిగారు. దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి వేలఏళ్ళ క్రితం ఆగమ శాస్త్రంలో ఉద్ధండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం. గర్భాలయం ముందర ఉన్న అర్థ మండపం పరమ పవిత్రమైనది. దారికోసమని ఆ మండపం గోడలను కూల్చడం సరైన పని కాదు. అలా జరిగిన పక్షంలో వేంకటేశ్వర స్వామివారి పవిత్రత, శక్తికి ఆటంకం ఏర్పడవచ్చు. ఈ పడగొట్టే ప్రణాలికను ఆపేయడం మంచిది అని ధైర్యంగా చెప్పారు.

సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనని అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించడంతో, స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు. దిన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ అక్కడే జరిగిపోయాయి. ఇక చేసేదిలేక అందరి బలవంతం పైన స్థపతి కూడా సంతకం పెట్టవలసి వచ్చింది.

అప్పటినుండి స్థపతి గారి మనస్సు ప్రశాంతతను కోల్పోయింది. గుండె బరువేక్కగా అక్కడినుండి వెళ్ళిపోయారు. దీన్ని ఎలాగైనా ఆపాలని పరి పరి విధాల ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడైన పరమాచార్య స్వామివారు తప్ప ఎవరూ సహాయం చెయ్యలేరని నిర్ణయించుకున్నాడు. వెంటనే మహాస్వామివారి వద్దకు పరుగులు తీసాడు.

కార్వేటి నగరం చేరేటప్పటికి ఉదయం అయ్యింది. బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామివారిని దర్శించాగానే కళ్ళ వెంట అదేపనిగా నీరు వస్తోంది. మహాస్వామివారు వేళ్ళను నుదుటిపై మూడు నామాలవలె చూపిస్తూ, “అక్కడి(తిరుమల) నుండే వస్తున్నావా?” అని అడగడంతో కాస్త కుదుటపడ్డాడు.

“అవును” అని మహాస్వామి వారితో తన బాధనంతా చెప్పుకుందామని నోరుతెరవగానే, చేతి సైగ ద్వారా ఆగమన్నారు స్వామివారు. “ఇప్పుడు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వెళ్లి ఏమైనా తిను”. తల్లి ప్రేమకంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామీ వారి కరుణ మాత్రమె. ఎందుకంటే ఆ తల్లిప్రేమకు మాత్రమే తెలుసు స్థపతి రెండు రోజులుగా ఏమీ తినకుండా మదనపడుతున్నాడని.

మఠసేవకుణ్ణి పిలిచి, “ఏదైనా హోటలుకు తీసుకుని వెళ్లి కడుపునిండా ఆహారం పెట్టించు” అని స్థపతితో పాటు పంపారు. ఆ సమయంలో కేవలం ఒక్క హోటల్ మాత్రమే తెరచి ఉంది. హోటల్ ఓనరుతో స్థపతి గారికి పెట్టిన ఆహారానికి పరమాచార్య స్వామివారు డబ్బు కడతారు అని చెప్పగా, “పరమాచార్య స్వామివారు పంపిన వారికి ఆహారం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం” అని సిద్ధంగా ఉన్న వివిధ రకాలైన ఆహార పదార్థాలను వడ్డించారు.

తిన్న తరువాత వెళ్లి పరమాచార్య స్వామీ వారి ఎదుట నిలబడ్డారు. “ఇప్పుడు చెప్పు” అని స్థపతి చెప్పిన విషయాలను మొత్తం విని,, “అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది?” అని అడిగారు.

“తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామివారికి చెప్పిన తరువాతనే అమలుపరుస్తారు. కాని ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు. అర్థ మంటపాన్ని కదిలిస్తే మునుపటిలాగా వేంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు. బహుశా వారి నిర్ణయాన్ని మీకు తెలపడానికి వారు ఇక్కడకు రావచ్చు. అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వవలదు” అని పరమాచార్య స్వామీ వారిని ప్రార్థించాడు.

మానవజాతినే ఉద్ధరించడానికి ఈ భువిపై అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో, “అంతా నీవు అనుకున్నట్టుగానే జరుగుతుంది. చింత వలదు” అని అభయమిచ్చారు. కొద్దిగా మనోవేదన తగ్గడంతో స్థపతి అక్కడినుండి వచ్చేశారు. బాగా అలసిపోవడం వల్ల ఆ రాత్రి బాగా నిద్రపట్టింది. ఎవరో తనని నిద్రలేపుతునట్టు అనిపించడంతో హఠాత్తుగా అనిపించసాగింది.

భయంతో లేచి చూస్తె అక్కడ ఎవరూ లేరు. కాని తన అలసట బాధ అంతా తిరిపోయి, చాలా ఉల్లాసంగా అనిపించింది. వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఇంటికి పరిగెత్తాడు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటి గార్డు స్థపతి గారిని గుర్తుపట్టి ఆశ్చర్యంతో ఇంత ఉదయం రావాల్సిన పనేమితని అడిగాడు. వెంటనే తానూ ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పారు.

ముందస్తు సమాచారం లేనందున అతను అందుకు ఒప్పుకోలేదు. కాని, తిరుపతి గణపతి స్థపతి అంతే ఎవరో అందరికి తెలిసినదే కాబట్టి వారి కోరికను మన్నించడానికి ఒక అధికారి సమాయత్తమయ్యాడు. “అయ్యా, ఒక పని చేద్దాం. సరిగ్గా నాలుగున్నరకి కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకు వస్తారు. కిందకు వచ్చి హాలులోకి వెళ్ళేటప్పుడు, వారు మిమ్మల్ని చూస్తే సమస్య లేదు. లేదంటే మీరు ఉదయం దాకా ఆగవలసిందే” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమంకంతో, స్థపతి గారు అక్కడ నిలబడ్డారు. ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడ్డ స్థపతిని చూశారు. “ఏంటి గణపతి ఇంత ఉదయాన్నే?” అని అడిగి, లోపలి రమ్మన్నారు.

“తిరుమల దేవాలయానికి ప్రమాదం” అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్నంతా చెప్పారు. స్థపతి చెప్పిందంతా విన్న తరువాత ముఖ్యమంత్రి గారి ముఖంలో కోపం కనపడింది. వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించారు. “మొన్న తిరుమలలో ఏం జరిగింది?” అని అడిగారు. “ఓహ్ అదా! మీతో ఆ విషయం మాట్లాడుదామనే మొత్తం వివరాలతో సిద్ధం అవుతున్నాను” అని బదులిచ్చారు మంత్రిగారు.
ముఖ్యమంత్రి గారు కోపంతో “నేను అడిగింది ఏమి జరిగింది అని మాత్రమె?” ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చింది. మొత్తం తమ ప్రణాలికను వివరించారు మంత్రిగారు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో,
“ముందు నేను చెప్పేది విను. వెంకన్న జోలికి పోకండి” అని నిక్కచ్చిగా చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామీవారి విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి అని చెప్పి సంభాషణ అక్కడితో ముగించారు.

స్థాపతిని పంపుతూ, “తిరుమలకు ఏమీ జరగదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు” అని భరోసా ఇచ్చారు. పెద్ద బరువు దింపుకుని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమయ్యారు స్థపతి. తనను నిద్ర నుండి లేపి, ఈ సమయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి, ఇంట పెద్ద సమస్యకు పరిష్కారాన్ని చూపించింది ఏదో ఒక అదృశ్య శక్తి అని గ్రహించాడు.

వెంటనే పరమాచార్య స్వామివారి పలుకులు చెవిలో వినబడ్డాయి. “అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది” అన్న మాటలు గుర్తుకురావడంతో ఒక్కసారిగా ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. వరుసగా జరిగిన ఈ సంఘటనలన్నీ కేవలం మహాస్వామివారు ఆశీస్సుల వలన మాత్రమె అని తలచి ఆ ఉషోదయ సమయంలో స్వామివారిని తలచుకుని పులకించిపోయాడు.

--- “కంచి మహానిన్ కరుణై నిళగల్” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

52 - 6

GOVINDA CHANNEL
Posted 3 days ago

పత్రిక వార్త యథాతథం:

తిరుమలపై రాజకీయ నాయకుల దండయాత్ర..!

కొండ లడ్డు వివాదం ఎవరి కొంప ముంచుతుందో.?

డిక్లరేషన్ ఇచ్చినా..ఇవ్వకున్నా..జగన్ కు సంకటమే

చంద్రబాబు వేసిన ఉచ్చు మరింత బిగుస్తుందా..!?

జగన్ తొందరపాటు మరింత నష్టం కలిగిస్తుందా!?

బ్రహ్మోత్సవాల వేళ...వెంకన్న భక్తులకు ఆందోళన..

( కోలా లక్ష్మీపతి/ ఎడిటర్ / మాయావి న్యూస్ )

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు మొత్తం తిరుమల కొండ లడ్డు చుట్టూ తిరుగుతున్నాయి. కల్తీ నెయ్యి వ్యవహారం ముదిరి పాకానపడి..మత రాజకీయంగా రూపుదిద్దుకొంది.
ఎవరి రాజకీయ భవిష్యత్తు కోసం వారు తిరుమల కొండను రాజకీయ వేదికగా మార్చుకొని ఇప్పుడు ఏకంగా తిరుమల కొండపైకి దండయాత్రకు సిద్ధమయ్యారు. మరో వారం రోజుల్లో తిరుమల కొండపై ఆధ్యాత్మిక అమృతవాహిని శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. భక్తులను ఆధ్యాత్మిక డోలికల్లో ఉంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి యాజమాన్యం, ఇప్పుడు ఆ బాధ్యతలను పక్కనపెట్టి దండయాత్రకు వస్తున్న వారిపై దృష్టి సాధించాల్సిన దుస్థితి ఏర్పడింది.‌ బ్రహ్మోత్సవాల కోసం వస్తున్న భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించి, వివాదాలు చుట్టుముడుతున్న వేళ...తిరుమలలో భక్తుల మనోభావాలను కాపాడి, దేవుడి భక్తి, లడ్డు పవిత్రత, సంస్థ ప్రతిష్ట కాపాడాల్సిన బాధ్యత టీటీడీ కార్యనిర్వహణాధికారి, అదనపు కార్యనిర్వహణాధికారి, ఉన్నతాధికారుల బృందంపై ఉంది. రాజకీయాలకు అతీతంగా వారిలో ఉన్న సమర్థవంతమైన పనితీరును ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది.

శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించే ఆవు నెయ్యిలో అపవిత్రమైన రీతిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, వెజిటేబుల్స్ ఆయిల్ తదితర వాటిని కల్తీ చేసి గత వైసిపి ప్రభుత్వం తిరుమలను అపవిత్రం చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. దీనిపై అనూహ్యమైన రీతిలో దేశవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దుశ్చర్యకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, టిటిడి మాజీ చైర్మన్ లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డి లపై చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంస్థలతో సహా అందరూ ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ నలుగురిపై ప్రజల్లో ఆగ్రహం ఎంతలా ఉంది అంటే వారు కనిపిస్తే ఎటువంటి దాడి కైనా సిద్ధం అనేలా ప్రజల్లో ఆగ్రహం కనిపిస్తోంది.
క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక బద్ధంగానే హిందూ దేవాలయమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను మంట గలపాలనే ఉద్దేశంతో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని, కొండపై అక్రమాలను వైసిపి హయాంలో కొనసాగించిందని దీనిపై ప్రక్షాళన చేపట్టామని, తప్పు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని దోషులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేయడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతకాలం జగన్ హయాంలో జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దీక్ష ధరించి ఒకటవ తారీఖున తిరుమల కొండకు నడిచి వచ్చే విధంగా కార్యక్రమాన్ని ప్రకటించారు. తనపై జరిగిన రాజకీయ దాడిని ఎదుర్కొనేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అనూహ్యంగా ఈనెల 28వ తేదీ న తిరుమలకు వస్తున్నట్లు ప్రకటించారు. కాలినడకన తిరుమలకు వెళ్లేందుకు కార్యక్రమాన్ని రూపొందించుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లి ఆలయం ఎదుట తన హయాంలో ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసి కొంత వివాదాన్ని సృష్టించి వచ్చారు. తిరుమలలో బ్రష్టు పట్టించిన
జగన్ పర్యటన ను అడ్డుకునేందుకు హిందూ ధార్మిక సంస్థల స్వామీజీలు అందరూ శుక్రవారం నుండి అలిపిరి నుండి తిరుమల వరకు వందలాది మందితో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.‌ బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమల వస్తున్నారు. ఇలా వరుసగా ప్రముఖుల రాక సందర్భంగా అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో అనే ఆందోళన ఇటు శ్రీవారి భక్తుల్లో వ్యక్తం అవుతోంది. భద్రతాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అర్థం కాకుండా అటు పోలీసులు విభాగం సైతం ముందస్తు చర్యలు కోసం ప్రయత్నిస్తోంది. హిందూ వ్యతిరేకి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల కు రావాలంటే మొదటగా సతీ సమేతంగా అలిపిరి వద్ద టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అటు ప్రభుత్వం ఇటు హిందూ ధార్మిక సంస్థలు పట్టుబడుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వకుండా గతంలో మాదిరి దౌర్జన్యంగా తిరుమలకు వెళతానంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.‌ దీంతో ఇప్పుడు రాష్ట్రం మొత్తం జరుగుతున్న పొలిటికల్ హీట్ తిరుపతి కేంద్రంగా కేంద్రీకృతమైంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించడమే కాకుండా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చివేసి మొత్తం పరిపాలనను తన అనుచరుడికి అప్పజెప్పి ధార్మిక సంస్థను అధర్మ వికృత కార్యక్రమాలకు, అరాచకాలకు అవినీతికి, వేదికగా మార్చివేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన రాజకీయ ఉచ్చులో సరిగ్గా తగులుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన స్వయంకృతాపరాధాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. చంద్రబాబు నాయుడు తాను ఎదుర్కొన్న వేధింపులకు, రాష్ట్ర ప్రజలు అనుభవించిన వేదనలకు ప్రతీకారంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి రాజకీయ సమాధి కట్టేందుకే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారాన్ని చక్కగా వినియోగించుకున్నారు. మతపరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దెబ్బతీసి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే విధంగా వేసిన ప్రణాళిక బ్రహ్మాండంగా పనిచేసింది.

అసలు సున్నితమైన ఈ వ్యవహారంపై ఇప్పటికే రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తిన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాస్త సంయమనం పాటించకుండా తొందరపాటు చర్యతో వెంటనే వారి మంత్రులు ఎదురుదాడికి దిగడం, భూమన కరుణాకర్ రెడ్డి కొండపై ప్రమాణం పేరుతో ఓవరాక్షన్ చేయడం తదితర అంశాలన్నీ ఇంకా వైసీపీకి ఎదురుదెబ్బలు తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగిన విధంగానే జగన్ కూడా తొందరపడి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకు రావడం, పెద్ద ఎత్తున ఇక్కడ హిందూ ధార్మిక సంస్థల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి ఉండడం తార్కాణాలుగా చెప్పుకోవచ్చు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకోవాలంటే మొదటగా తిరుపతి అలిపిరి వద్ద తాను హిందూ ధర్మాన్ని పాటిస్తానని, వెంకటేశ్వర స్వామి పై తనకు భక్తి విశ్వాసాలు ఉన్నాయని, డిక్లరేషన్ పై రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆయన దీనిపై సంతకం పెట్టి వెళ్లినా.. లేక తాను ఆ విధంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మొండిగా వాదించి తిరుమలకు వెళ్లాలని ప్రయత్నించినా తప్పనిసరిగా వివాదం చెల రేగుతుంది. దీన్ని ఏ విధంగా చూసినా తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పై ఎదురుదాడి చేసేందుకు అన్ని విధాల అవకాశం ఉంది. వాస్తవానికి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి తిరుమలకు రాకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తిరుమల కొండపై ఇప్పుడు వరుసగా రాజకీయ ప్రయోజనాల కోసం క్యూకడుతున్న నాయకుల పరిస్థితి కారణంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల పరిస్థితి కొంత సంకటంగానే ఇబ్బందికరంగానే ఉండే విధంగా ఉంది. ఈ పరిస్థితిని టీటీడీ యాజమాన్యం, శాంతి భద్రతలను పరిరక్షించి భక్తుల మనోభావాలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పొచ్చు.

10 - 4

GOVINDA CHANNEL
Posted 4 days ago

187 - 17

GOVINDA CHANNEL
Posted 5 days ago

102 - 15

GOVINDA CHANNEL
Posted 6 days ago

126 - 6

GOVINDA CHANNEL
Posted 6 days ago

తిరుమల లడ్డూ విషయంలో హైందవ ధర్మం కోసం పనిచేసే
పార్టీ ఎందుకు ఈ విషయాన్ని ఇప్పటి వరకు భక్తులకు చెప్పలేదు ఆన్న ,కొందరి భక్తుల వాదన సరియైనద?

7 - 0

GOVINDA CHANNEL
Posted 1 week ago

తిరుమలలో అన్య మతస్తులు వుండకూడదు,వారిని వెంటనే తొలగించాలి ఆన్న విషయాన్ని మీరు సమర్ధిస్తారా?

58 - 5