Channel Avatar

koushik manaswi varma vlogs @UCMf9VORQE0opFPMRm1eLrvQ@youtube.com

1.5K subscribers - no pronouns :c

my self koushik and manaswi varma


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

koushik manaswi varma vlogs
Posted 1 year ago

హోలీ పూర్ణిమ.


వసంత రుతు ఆగమనానికి సంకేతం. రాలే ఆకులు రాలుతూ ఉంటే , వచ్చే ఆకులు వస్తూ వుంటాయి. అదేవిధంగా , పాతకోరికలు మరుగున పడుతూ ఉంటే కొత్త కోరికలు చిగురులు తొడుగుతూ ఉంటాయన్నమాట. రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ. మనిషి జీవితం రాగరంజితంగా , సప్తవర్ణ శోభితంగా ఉండాలన్నది సందేశం. పురానగాథ ఏమిటంటే , లోకకల్యాణం కోసం దేవతల కోరిక మేరకు , తన స్నేహితుడైన వసంతుడిని వెంటబెట్టుకుని వెళ్లి , తపోదీక్షలో మునిగి ఉన్న పరమేశ్వరునిపై విరిబాణాలను సంధించి ఆయన మనస్సును చలింపజేసేందుకు ప్రయత్నిస్తాడు మన్మథుడు.

తపోభంగం కావడంతో శివుడు తన మూడోకన్ను తెరిచి మన్మథుణ్ణి మసి చేస్తాడు. అయితే , మన్మథుడి భార్య రతీదేవి పార్వతీ దేవికి భక్తురాలు కావడంతో , సుమంగళిగా ఉండాలన్న వరాన్ని అనుగ్రహించింది పార్వతి ఆమెకు. ఆ వరభంగం కాకుండా ఉండేందుకు , మన్మథుణ్ణి తిరిగి బతికిస్తాడు పరమేశ్వరుడు. అయితే , అతను రతీదేవికి తప్ప మరెవరికీ తన రూపంలో కనిపించడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి , తన బాణాలద్వారా వారి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక్కడ మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి.
వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే , ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు , గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారు చేసి , ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఫాల్గుణ పూర్ణిమనాడు పెళ్లికాని యువతీ యువకులు ఒకచోట చేరి , వసంతం కలిపిన నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. దీనిద్వారా వారికి గల పరస్పర ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేసుకుంటారు. పెద్దలు వారి ప్రేమను ఆమోదిస్తారు.

*రాధాకృష్ణుల రంగుల కేళీ:*

రాధాకృష్ణులు ఓరోజున ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. అప్పుడు యశోదమ్మ *‘నాయనా ! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమెపై రంగులు కలిపిన నీళ్లు పోయి’* అని సలహా ఇచ్చిందట. దాంతో నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా బయటకు పరుగులు తీసిందట. ఇలా రాధాకృష్ణులిద్దరూ ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో ఆనాడు రంగుల పండుగ చేసుకున్నారట. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం , పెద్ద ఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

*హోలికా పేరు మీదుగానే:*

హిరణ్యకశిపునికి హోలిక అనే సోదరి ఉండేదట. ఆమెకు అనేక దుష్టశక్తులతోపాటు మంటలలో దూకినా కాలిపోని వరం ఉంది. హోలిక చాలా దుష్టురాలు , దుర్మార్గురాలు. పసిపిల్లలను ఎత్తుకుపోయేది. తన కుమారుడయిన ప్రహ్లాదుడు హరినామ స్మరణ మానకపోయేసరికి హోలిక తన మేనల్లుడైన ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో దూకిందట. అయితే , హోలిక మాడిపోగా , ప్రహ్లాదుడు సురక్షితంగా బయట పడ్డాడు. దుష్టరాక్షసి పీడ వదిలిందన్న సంతోషంతో ప్రజలంతా ఆనందంతో ఒకరిపై ఒకరు రంగునీళ్లు చిమ్ముకుంటూ ఉత్సవం చేసుకున్నారట. హోలిక అనే రాక్షసి పేరు మీదుగా *‘హోలీ’* అనే పేరు వచ్చిందట.

ఇవే కాకుండా హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా ! అంటే మనలోని దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి , వాటి స్థానంలో ఉల్లాసం , ఉత్సాహం అనే సుగుణాలతో కూడిన లేలేత ఆకులను చిగురింపచేసుకోవాలి. ఈ రోజున ఏం చేస్తే మంచిదంటే... *మహాలక్ష్మి ఫాల్గుణ పూర్ణిమ నాడే పాలకడలి నుంచి ఆవిర్భవించిందని , అందుకే ఈ వేళ లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే సకల సంపదలూ చేకూరతాయని పురాణోక్తి.*
ఈ రోజున బాలకృష్ణుని ఊయలలో వేసి ఊపుతారు. అందుకే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో డోలోత్సవంగా జరుపుకుంటారు. *అయ్యప్ప పందల రాజుకు కనపడింది ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడేనని , కనుక ఈ వేళ అయ్యప్పకు పూజలు చేస్తే మంచిదని విశ్వాసం.* అలాగే ఈ వేళ రతీమన్మథులను పూజించడమూ మంచిదే. అదేవిధంగా పిల్లలకు ప్రాణహాని తలపెట్టే ఢుంఢి అనే రాక్షసి పీడను వదిలించుకునేందుకు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి. హోలీపండుగ రోజున లేలేత మావిచిగుళ్లు తింటే సంవత్సరమంతా సంతోషంగా ఉంటారని శాస్త్రోక్తి.

0 - 0

koushik manaswi varma vlogs
Posted 2 years ago

🔆ఒక అమ్మ కథ🔆
""""'''''''''''''''''''''"""""""
మా అమ్మకు ఒక్క కన్నే ఉండేది

మా అమ్మంటే నాకు ఇష్టం ఉండేది కాదు

ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా తోస్తుండేది

ఆమె ఓ చిన్న కొట్టు నడుపుతుండేది

ఒక రోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను కలుసుకోవడానికి స్కూల్ కి వచ్చింది

ఇంక అప్పట్నించి చూడండి
”మీ అమ్మ ఒంటి కన్నుది”
అని స్నేహితులందరూ ఒకటే వెక్కిరింతలు, అవహేళనలు

అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానాలే

అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అనిపించేది

ఒక్కోసారి నాకు అసలామె ఈ లోకం నుంచే ఒక్కసారిగా అదృశ్యమైపోతే బావుణ్ణు అనిపించేది

“అమ్మా నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీవల్ల నేను అందరికీ చులకన అయిపోయాను
నువ్వు చచ్చిపో!”

కోపంగా అరిచేసే వాణ్ణి

ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేదికాదు

నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది

అయినా సరే అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడలేని సంతోషంగా ఉండేది

ఆమె నన్ను ఎప్పుడూ దండించలేదు కాబట్టి ఆమెను నేను ఎంతగా భాధ పెట్టానో నాకు తెలియదు

ఒక రోజు రాత్రి యధాప్రకారం అమ్మను నానా మాటలు అనేసి నిద్రపోయాను

మద్యలో దాహం వేసి మెలుకువ వచ్చింది

నీళ్ళు తాగడానికి వంటగదిలోకి వెళ్ళాను

అమ్మ అక్కడ ఒంటరిగా రోదిస్తోంది

మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక్క కంటిలోంచే నీళ్ళు

నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది?

మొహం తిప్పుకుని వెళ్ళిపోయాను

ఎక్కడికొచ్చినా నన్ను అవమానాలు పాలు చేసే మా అమ్మను, మా పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుణ్ణవ్వాలనీ, బాగా పేరు సంపాదించాలనీ కలలుగంటూ నిద్రపోయాను

ఆ తరువాత నేను చాలా కష్టపడి చదివాను

పై చదువుల కోసం అమ్మను వదిలి వచ్చేశాను

మంచి విశ్వ విద్యాలయం లో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను

బాగా డబ్బు సంపాదించాను

మంచి ఇల్లు కొనుక్కున్నాను

మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాను

నాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా

ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం గడిచిపోతుంది

ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదుకదా!

అలా ఎడతెరిపిలేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది మహాతల్లి

ఇంకెవరు?

మా అమ్మ

ఆమె ఒంటి కన్ను చూసి రెండేళ్ళ నా కూతురు భయంతోజడుసుకుంది

“ఎవరు నువ్వు?

ఎందుకొచ్చావిక్కడికి?

నువ్వెవరో నాకు తెలియదు

నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా?

ముందునువ్వెళ్ళిపో ఇక్కడ్నుంచి!!!”

సాధ్యమైనంతవరకు తెలియనట్లే నటించాను

“క్షమించండి బాబూ! తెలియక తప్పుడు చిరునామాకి వచ్చినట్లున్నాను”

ఆమె అదృశ్యమై పోయింది

“హమ్మయ్య ఆమె నన్ను గుర్తు పట్టలేదు”

భారంగా ఊపిరి పీల్చుకున్నాను

ఇక ఆమె గురించి జీవితాంతం పట్టించు కోనవసరం లేదు అనుకున్నాను

కానీ కొద్దిరోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రం అందింది నాకు

వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలు దేరాను

స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను

ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపలి భాగాన్ని పరికించాయి

మా అమ్మ ఒంటరిగా కటికనేలపై పడి ఉంది

ఆమె చేతిలో ఒక లేఖ

నా కోసమే రాసిపెట్టి ఉంది

దాని సారాంశం

ప్రియమైన కుమారునికి, ఇప్పటికే నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువే బతికాను

నేనింక నీవుండే దగ్గరికి రాను

కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా!

ఏం చేయమంటావు?

నిన్ను చూడకుండా ఉండలేకున్నాను

కన్నపేగురా

తట్టుకోలేక పోతోంది

నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసిన నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు

కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే

వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్నవుతాను

ఒక్క విషయం మాత్రం ఇప్పటికి చెప్పక తప్పడం లేదు

చిన్నా!

నీవు చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్నుపోయింది

నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఒక కంటితో చూడలేకపోయాన్రా కన్నా!

అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను

నా కంటితో నువ్వు ప్రపంచం చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా?

నువ్వు చేసిన పనులన్నింటికీ నేను ఎప్పుడూ బాధ పడలేదు

ఒకటి, రెండు సార్లు మాత్రం ''వాడు నా మీద కోప్పడ్డాడంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా!”
అని సరిపెట్టుకున్నాను

చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులు

ఉత్తరం తడిసి ముద్దయింది

నాకు ప్రపంచం కనిపించడం లేదు

నవనాడులూ కుంగి పోయాయి

భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకి వెళ్ళిపోయాను

తన జీవితమంతా నాకోసం ధారబోసిన అటు వంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిoచాను ?

మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్ళు కారిస్తే సరిపోతాయి?

ఎన్ని జన్మలెత్తితే ఆమె ఋణం తీర్చుకోగలను ?

(ఇది ఇంగ్లీష్ కథకు అనువాదం)

నాస్తి మాతృ సమం దైవం

నాస్తి మాతృ సమః పూజ్యో

నాస్తి మాతృ సమో బంధు

నాస్తిమాతృ సమో గురుః

అమ్మతో సమానమైన పూజ్యులుగానీ దైవంగానీ లేరు

తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు

ఆకలేసినా..

ఆనందం వేసినా
దిగులేసినా
దుఃఖం ముంచుకొచ్చినా
పిల్లలకైనా
పిల్లలను కన్న తల్లిదండ్రు లకైనా
గుర్తొచే పదం అమ్మ

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ

అటు వంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి

కనుపాప లా కాపాడండి

ఒక్కసారి ఆలోచించండి

నలుగురికీ ఇలాంటి సందేశాలుపంపండి

బంధాలు బాంధవ్యాలను కాపాడుదాం

తల్లి ఋణం ఈ జన్మకి తీరదు

*చదివినవారికి ధన్యవాదాలు* తల్లిదండ్రులను పూజించే. ప్రతివారికీ నమస్సులు
🙏🙏🙏

3 - 0

koushik manaswi varma vlogs
Posted 2 years ago

♦️🌳♦️ *శ్రీరామచంద్రుడి* *వంశవృక్షం* ♦️🌳♦️
♦️బ్రహ్మ కొడుకు మరీచి
♦️మరీచి కొడుకు కాశ్యపుడు
♦️కాశ్యపుడి కొడుకు సూర్యుడు
♦️సూర్యుడి కొడుకు మనువు
♦️మనువు కొడుకు ఇక్ష్వాకువు
♦️ఇక్ష్వాకువు కొడుకు కుక్షి
♦️కుక్షి కొడుకు వికుక్షి
♦️వికుక్షి కొడుకు బాణుడు
♦️బాణుడి కొడుకు అనరణ్యుడు
♦️అనరణ్యుడి కొడుకు పృధువు
♦️పృధువు కొడుకు త్రిశంఖుడు
♦️త్రిశంఖుడి కొడుకు దుంధుమారుడు
♦️దుంధుమారుడి కొడుకు మాంధాత
♦️మాంధాత కొడుకు సుసంధి
♦️సుసంధి కొడుకు ధృవసంధి
♦️ధృవసంధి కొడుకు భరతుడు
♦️భరతుడి కొడుకు అశితుడు
♦️అశితుడి కొడుకు సగరుడు
♦️సగరుడి కొడుకు అసమంజసుడు
♦️అసమంజసుడి కొడుకు అంశుమంతుడు
♦️అంశుమంతుడి కొడుకు దిలీపుడు
♦️దిలీపుడి కొడుకు భగీరధుడు
♦️భగీరధుడి కొడుకు కకుత్సుడు
♦️కకుత్సుడి కొడుకు రఘువు
♦️రఘువు కొడుకు ప్రవుర్ధుడు
♦️ప్రవుర్ధుడి కొడుకు శంఖనుడు
♦️శంఖనుడి కొడుకు సుదర్శనుడు
♦️సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు
♦️అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘ్రవేదుడు
♦️శ్రీఘ్రవేదుడి కొడుకు మరువు
♦️మరువు కొడుకు ప్రశిష్యకుడు
♦️ప్రశిష్యకుడి కొడుకు అంబరీశుడు
♦️అంబరీశుడి కొడుకు నహుషుడు
♦️నహుషుడి కొడుకు యయాతి
♦️యయాతి కొడుకు నాభాగుడు
♦️నాభాగుడి కొడుకు అజుడు
♦️అజుడి కొడుకు ధశరథుడు
♦️ధశరథుడి కొడుకు రాముడు
♦️రాముడి కొడుకులు లవకుశులు
♦️🌳♦️ ఇదీ శ్రీరాముడి వంశవృక్షం
ఈ వంశ పరంపర విన్నా, చదివినా పుణ్యఫలం.🌹

2 - 0