Channel Avatar

IDEAS BAZAR IB @UCMUOzseqrul4KjNzaGy42GA@youtube.com

4.8K subscribers - no pronouns :c

Hi friends Cooking, rangoli , devotional, Telugu language, n


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

IDEAS BAZAR IB
Posted 1 hour ago

*శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి...!!🙏🥀*

🌹శ్రీధన్వంతరీ అష్టోత్తర శతనామావళి


ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం ధన్వంతరయే అమృత కలశ హస్తాయ నమః
ఓం సర్వామాయ నాశనాయ నమః
ఓం త్రిలోక్యనాధాయ నమః
ఓం శ్రీ మహా విష్ణవే నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం సురాసురవందితాయ నమః
ఓం వయస్తూపకాయ నమః

ఓం సర్వామయధ్వంశ నాయ నమః
ఓం భయాపహాయై నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం వివిధౌధధాత్రే నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం శంఖచక్ర ధరాయ నమః
ఓం అమృత కలశ హస్తాయ నమః
ఓం శల్య తంత్ర విశారదాయ నమః
ఓం దివ్యౌషధధరాయ   నమః
ఓం కరుణామృతసాగారాయ నమః

ఓం సుఖ కారాయ నమః
ఓం శస్త్రక్రియా కుశలాయ  నమః
ఓం దీరాయ నమః
ఓం త్రీహాయ నమః
ఓం శుభ దాయ నమః
ఓం మహా దయాళవే నమః
ఓం సాంగాగతవేదవేద్యాయ నమః
ఓం భిషక్తమాయ నమః
ఓం ప్రాణదాయ నమః
ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః

ఓం ఆయుర్వేదప్రచారాయ నమః
ఓం అష్టాంగయోగనిపుణాయ నమః
ఓం జగదుద్ధారకాయ నమః
ఓం హనూత్తమాయ నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం విష్ణవే నమః
ఓం సమానాధి వర్జితాయ నమః
ఓం సర్వప్రాణీసుకృతే నమః
ఓం సర్వ మంగళకారాయ నమః
ఓం సర్వార్ధదాత్రేయ నమః

ఓం మహామేధావినే నమః
ఓం అమృతతాయ నమః
ఓం సత్యాసంధాయ నమః
ఓం ఆశ్రిత జనవత్సలాయ నమః
ఓం అమృత వపుషే నమః
ఓం పురాణ నిలయాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం ప్రాణ జీవనాయ నమః
ఓం జన్మమృత్యుజరాధికాయ నమః
ఓం సాధ్గతిప్రదాయి నమః

ఓం మహాత్సాహాయై నమః
ఓం సమస్త భక్త సుఖ ధాత్రేయ నమః
ఓం సహిష్ణవే నమః
ఓం శుద్ధాయ నమః
ఓం సమాత్మనే నమః
ఓం వైద్య రత్నాయ నమః
ఓం అమృత్యవే నమః
ఓం మహాగురవే నమః
ఓం అమృతాంశోద్భవాయై నమః
ఓం క్షేమకృతే నమః
ఓం వంశవర్దరాయ నమః

ఓం వీత భయాయ నమః
ఓం ప్రాణప్రదే నమః
ఓం క్షీరాబ్ధిజన్మనే నమః
ఓం చంద్రసహోదరాయ నమః
ఓం సర్వలోక వందితాయ నమః
ఓం పరబ్రహ్మనే నమః
ఓం యజ్ఞబోగీధరేనయ నమః
ఓం పుణ్య శ్లోకాయ నమః
ఓం పూజ్య పాదాయ నమః
ఓం సనాతన తమాయ నమః

ఓం స్వస్థితాయే నమః
ఓం దీర్ఘాయుష్కారాకాయ నమః
ఓం పురాణ పురుషోత్తమాయ నమః
ఓం అమరప్రభవే నమః
ఓం అమృతాయ నమః
ఓం ఔషదాయ నమః
ఓం సర్వానుకూలాయ నమః
ఓం శోకనాశనాయ నమః
ఓం లోకబంధవే  నమః
ఓం నానారోగార్తిపంజనాయ నమః

ఓం ప్రజానాంజీవ హేతవే నమః
ఓం ప్రజారక్షణ దీక్షితాయ నమః
ఓం శుక్ల వాసనే నమః
ఓం పురుషార్ధ ప్రదాయ నమః
ఓం ప్రశాంతాత్మనే నమః
ఓం భక్త సర్వార్ధ ప్రదాత్రేనయ నమః
ఓం మహైశ్వర్యాయ నమః
ఓం రోగాశల్యహృదయే నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం నవరత్నభుజాయ నమః

ఓం నిస్సీమమహిమ్నే నమః
ఓం గోవిందానాంపతయే నమః
ఓం తిలోదాసాయ నమః
ఓం ప్రాణాచార్యాయ నమః
ఓం బీష్మణయే నమః
ఓం త్రైలోక్యనాధాయ నమః
ఓం భక్తిగమ్యాయ నమః
ఓం తేజోనిధయే నమః
ఓం కాలకాలాయ నమః
ఓం పరమార్ధ గురవే నమః

ఓం జగదానందకారకాయ నమః
ఓం ఆది వైద్యాయ నమః
ఓం శ్రీరంగనిలయాయ నమః
ఓం సర్వజన సేవితాయ నమః
ఓం లక్ష్మీ పతయే నమః
ఓం సర్వలోక రక్షకాయ నమః
ఓం కావేరిస్నాత సంతుష్టయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయవిభూషితాయే నమః

ఇతి శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం..🙏🌹

3 - 0

IDEAS BAZAR IB
Posted 1 hour ago

*నేడు శ్రీ ధన్వంతరి జయంతి..!!*

🌿శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని , ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.

🌸 దేవతలు , దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా , దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం , కామధేనువు , ఐరావతం , చంద్రుడు , శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం , ఔషధులు , ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు.

🌿‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో , ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు , ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో , విశాలమైన వక్షస్థలంతో , సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’
అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.

🌸ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని , కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు.

🌿ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని , అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.
సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు.

🌸అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.

🌿బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి , మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి , అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు.

🌸మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి , ద్రోణ , పుండరీక , ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు.

🌿 ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది.

🌸 ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు , బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు.
అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం.

🌿 ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ , బాల , గ్రహ చికిత్సల గురించి , శలాక్య , శల్య , విష , రసాయన , వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని , అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.

🌸చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్‌ సమీపంలో ‘ధన్వంతరి క్షేత్రం’ ఉంది... స్వస్తి...🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

2 - 0

IDEAS BAZAR IB
Posted 1 hour ago

*శ్రీ గురు పాదుకా పంచకం..!!🙏🥀🌺*

1)ఓం నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమః పరేభ్యః పరపాదుకాభ్యః ! ఆచార్య-సిద్ధేశ్వర-పాదుకాభ్యో నమో నమః శ్రీగురుపాదుకాభ్యః !!


2)ఐంకార-హ్రీంకార- రహస్యయుక్త - శ్రీంకార-గూఢార్థ- మహావిభూత్యా ! ఓంకార-మర్మ-ప్రతిపాదినీభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం !!


3)హోత్రాగ్ని-హోత్రాగ్ని-హవిష్య-హోతృ హోమాది- సర్వాకృతి-భాసమానం ! యద్బ్రహ్మ తద్బోధ వితారిణీభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం !!


4)కామాది సర్ప వ్రజ గారుడాభ్యాం వివేక   వైరాగ్య నిధిప్రదాభ్యాం ! బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం !!


5)అనంత-సంసార-సముద్రతార- నౌకాయితాభ్యాం స్థిరభక్తిదాభ్యాం ! జాడ్యాబ్ధి-సంశోషణ-   వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం !!

ఇతి శ్రీగురు పాదుకా పంచకం సంపూర్ణం...🙏🌹

0 - 0

IDEAS BAZAR IB
Posted 1 hour ago

*జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి, జ్ఞానం ఎలా లభిస్తుంది? తన్ను తాను విచారించుకోవడం చేత*
కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది.
సముద్రాన్ని చేరుకున్న నది, తన ప్రవాహాన్ని కోల్పోయి సముద్రంలో కలిసిపోయినట్లే, పరమాత్మ గురించి నిరంతరం ధ్యానిస్తూ ఉన్న మనసు కూడా పరమాత్మమయం అయిపోతుంది.

*అదే ముక్తి* 🙏

0 - 0

IDEAS BAZAR IB
Posted 1 day ago

*॥ శ్రీ శివ రక్షా స్తోత్రం ॥* 🙏🌿☘️

*అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః ||*

*చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |*
*అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ ౧*

*గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్ |*
*శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః ౨*

*గంగాధరః శిరః పాతు ఫాలం అర్ధేందుశేఖరః |*
*నయనే మదనధ్వంసీ కర్ణో సర్పవిభూషణః ౩*

*ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః |*
*జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరాం శితికంధరః ౪*

*శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురంధరః |*
*భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ ౫*

*హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః |*
*నాభిం మృత్యుంజయః పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః ౬*

*సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః |*
*ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః ౭*

*జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |*
*చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః ౮*

*ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |*
*స భుక్త్వా సకలాన్కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్ ౯*

*గ్రహభూతపిశాచాద్యాః త్రైలోక్యే విచరంతి యే |*
*దూరాదాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ ౧౦*

*అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |*
*భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్ ౧౧*

*ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాఽదిశత్ |*
*ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాఽలిఖత్ ౧౨*

*ఇతి శ్రీయాజ్ఞవల్క్యప్రోక్తం శివరక్షాస్తోత్రమ్ |*

13 - 0

IDEAS BAZAR IB
Posted 1 day ago

*🙏కార్తీక దీపారాధన శ్లోకము..🙏*

      కీటా: పతంగా: మశకాశ్చ  వృక్షా:
         జలే స్థలే యే నివసన్తి జీవా:
      దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన:
       భవంతి త్వం శ్వపచాహి విప్రా:||

దీప దాన శ్లోకము

సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం!

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ !!!...🙏🌹

32 - 0

IDEAS BAZAR IB
Posted 1 day ago

*🙏శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం....🙏🌺*

🌷(సర్వ ఆరోగ్య సిద్ధి)🌷

🌿ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే!

🌸దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే!

🌿లంబోదరం మహావీరం నాగ యజ్ఞోప శోభితం!

🌸అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం!

🌿ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః హేరంబాయ
నమో నమః!!

🌸స్వసిద్ధి ప్రదోహాసి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ!

🌿చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ!

🌸సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక!

🌿ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః!!

🌸తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి!!

🌹ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం సంపూర్ణం...🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

8 - 0

IDEAS BAZAR IB
Posted 1 day ago

*_🙏శ్రీ గణేశ న్యాసా🙏🌺_*

ఆచామయ, ప్రాణాయామం సంకల్పం చా కృత్వా

దక్షిణాహస్తే వక్రతుండయ నమః
వమహస్తే శుర్పకర్ణయ నమః
ఓష్టే విఘ్నేశయ నమః
అధారోష్తే చింతామనే నమః
సంపుటే గజననాయ నమః

దక్షిణాపడే లంబోదరాయ నమః
వామపడే ఏకాదంత నమః
శిరసి ఏకాదంతయ నమః
చిబుకే బ్రాహ్మణస్పతాయ నమః
దక్షిణనాసికాయం వినాయకాయ నమః

వామనసికయం జ్యేష్టరాజయ నమః
దక్షిణానేత్ర వికాటయ నమః
వామనేత్రే కపిలయ నమః
దక్షిణాకర్ణ ధరణీధరాయ నమః
వామకర్ణ ఆశాపురాకయ నమః

నభౌ మహోదరాయ నమః
హరిదయే ధుమ్రాకేటవే నమః
లలాటే మయూరేషయ నమః
దక్షిణాబాహౌ స్వానందవాసకరకాయ నమః
వామబహౌ సచ్చిట్సుఖాధమ్నే నమః

ఇతి ముద్గల పూరాణోక్త గణేశాన్యాసః సమాప్తహః...🙏🌹

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

5 - 0

IDEAS BAZAR IB
Posted 1 day ago

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,

తేదీ ... 27 - 11 - 2024,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,

తిథి : ద్వాదశి తె5.41 వరకు,
నక్షత్రం : చిత్ర పూర్తి,
యోగం : ఆయుష్మాన్ సా4.25 వరకు,
కరణం : కౌలువ సా4.36 వరకు
తదుపరి తైతుల తె5.41 వరకు,

వర్జ్యం : మ2.04 - 3.51,
దుర్ముహూర్తము : ఉ11.25 - 12.09,
అమృతకాలం : రా12.43 - 2.29,
రాహుకాలం : మ12.00 - 1.30,
యమగండం : ఉ7.30 - 9.00,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.15,
సూర్యాస్తమయం: 5.20,

*_నేటి మాట_*

*“దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః" వేదం చెబుతోంది, మరి దీనికి మన జీవితానికి ఏంటి సంబందం???*

దేహియే దేవదేవుడు, అట్టి దైవస్వరూపమైన దేహికి దేహమే ఆలయం.
ఒక వైద్యుణ్ని చూడగానే మన రోగాలు, ఒక లాయర్ ని చూడగానే మన కేసులు జ్ఞాపకమొస్తాయి...

దేవాలయాన్ని చూడగానే దైవం జ్ఞాపకమొస్తాడు...
దైవం జ్ఞాపకం రాగానే మనలోని దుర్భావములు అదృశ్యమై, సద్భావములు ఉద్భవిస్తాయి...

అందుకే మన ప్రాచీనులు ప్రతి గ్రామములోనూ ఎత్తయిన గోపురాలతో దేవాలయాలు నిర్మించారు.
దేవుడు మనకి కనబడి దేవాలయాన్ని చూపడు, దేవాలయమే మనల్ని ఆకర్షించి దైవాన్ని చూపుతుంది.

ప్రతి దేవాలయం సర్వశక్తి సమన్వితుడైన దైవాన్ని సందర్శింపజేసే పవిత్ర పుణ్యక్షేత్రం. అందువలన ఏ వ్యక్తిని చూసినా అతని దేహంలో దేహియనే దైవం ఉన్నాడన్న సత్యాన్ని త్రికరణ శుద్ధిగా విశ్వసించి ప్రతి వ్యక్తిని ప్రేమించి సేవించాలి. అ
ప్పుడే దేవుణ్ణి ప్రేమించి సేవించినట్లువుతుంది...🙏

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

16 - 1

IDEAS BAZAR IB
Posted 1 day ago

   _*కార్తీక పురాణం - 27 వ అధ్యాయము*_

*దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*

మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభ సంభవా ! ఆ శ్రీ హరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను.

"ఓ దూర్వాసమునీ ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే", నేను అవతారము ఎత్తుట కష్టము గాదు.
నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను, కావున అందులకు నేనంగగీకరించితిని, బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు.
ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను, ప్రజారక్షణమే రాజధర్మము గాని , ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను...
ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను, ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు.
బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు.
విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును , బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి, బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును , కాలితో తన్నినవాడును , విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును , విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు.

కాన , ఓ దూర్వాస మహర్షి ! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు , విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు.

అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు, కాబట్టి , నీవు వేగమే అంబరీషుని కడకేగుము, అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి    సప్తవింశోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.*🙏🥀

21 - 0