Channel Avatar

Abhigna Deepshika @UCMFRQFbwjQxvpUsNIniEftA@youtube.com

33K subscribers - no pronouns :c

Welcome to our Abhigna Deepshika YouTube channel dedicated t


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Abhigna Deepshika
Posted 2 weeks ago

అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించి, తెలుగు ప్రేక్షకాభిమానుల ఆదరణ చూరగొన్న మహోన్నత వ్యక్తి. సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి. నాటక రంగం నుండి సినిమాల వైపు వచ్చిన ఏఎన్నార్ తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఆయన సినిమాలు, వాటి రికార్డులు, ఆయన పోషించిన పాత్రలు వంటి వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటసామ్రాట్.
https://www.youtube.com/watch?v=DUt_p...
#ANRJayanthi #ANRLivesON #LegendANRJayanthi

38 - 3

Abhigna Deepshika
Posted 3 weeks ago

మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది...మనసుతోటి మనసెపుడో కలసి పోతదీ...అని గీతోపదేశం చేసిన కవిమాంత్రికుడు ఆచార్య ఆత్రేయ. పుట్టిన తేదీ...గిట్టిన తేదీ తారీఖులు దస్తావేజులతో తెలుగువారికి ఆత్రేయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనసున్న ప్రతి తెలుగువారూ రోజూ విని తరించే పాటలు మనసు కవి ఆత్రేయవి.

ఆత్రేయ గారు నెల్లూరు జిల్లా, సూళ్ళూరు పేట తాలూకా, మంగళంపాడు గ్రామంలో సీతమ్మ కృష్ణమాచార్యులు దంపతులకు, మే 7వ తేదీ 1921 లో జన్మించారు. అసలు పేరు కిళాంబి వేంకట నరసింహాచార్యులు. తన పేరులోని ఆచార్య, తన గోత్రంలో ఆత్రేయ ను కలిపి ఆచార్య ఆత్రేయగా తన కలంపేరు పెట్టుకున్నారు.

“భాషను అదుపు చేయడంలోను, భావాన్ని అదుపు చేయడంలోను, తెమ్మెర వంటి తేలిక మాటలతో తేనెలు, తీయని తావులు వెదజల్లడంలోనూ ఈ ఆచార్యుడు (ఆత్రేయ) తిక్కనకు వారసుడు.” – వేటూరి

రాసి ప్రేక్షకులను రాయక నిర్మాతలను ఏడిపిస్తారని పేరుగాంచిన ఆత్రేయ గారి వర్ధంతి నేడు.ఆయన పాట వింటూ కన్నీరు విడిచే మనసులు అర్పించే సుదీర్ఘ నివాళి 🙏🙏🙏

56 - 3

Abhigna Deepshika
Posted 1 month ago

భానుమతీ రామకృష్ణ (సెప్టెంబరు 7, 1926 - డిసెంబరు 24, 2005) దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి.

భానుమతి గారి బహుముఖ ప్రజ్ఞ మన తెలుగు చిత్రసీమకే పరిమితం కాలేదు. ఆమె తమిళం, హిందీ, కన్నడ చిత్రాల్లో కూడా రాణించి, తెలుగు ఖ్యాతిని జాతీయ స్ధాయికి విస్తరింపచేశారు. దక్షిణాది నటీమణుల్లో తొలిసారి పద్మశ్రీ గౌరవాన్ని ఆమె అందుకున్నారు. చండీరాణి (1953)తో తెలుగులో దర్శకత్వం వహించిన తొలి మహిళగానే కాకుండా ఆ చిత్రాన్ని మూడు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం) తీసి అటువంటి ఫీట్ చేసిన మొట్టమొదటి దర్శకురాలిగా ఆమె ఖ్యాతి సంపాదించారు. అలాగే ఒక నటీమణి ఐదు దశాబ్దాలకు పైగా చిత్రరంగంలో తన పలుకుబడిని కొనసాగించడమూ విశేషమే. ఇలా భానుమతి ప్రత్యేకతల గురించి ఎంతైనా చెప్పవచ్చు. నటి, రచయిత్రి, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు, నిర్మాత, స్టూడియో అధినేత, ఎడిటర్, చిత్రకారిణి, జ్యోతిష్కురాలు, సోషల్ వర్కర్. ఇలా వివిధ విభాగాలలో ఆమె చేసిన కృషిని మనం పరిశీలించవచ్చు.

ఈ రోజు భానుమతి గారి జయంతి సందర్భంగా ఆమెని స్మరించుకుందాం 🙏🙏🙏

42 - 2

Abhigna Deepshika
Posted 1 month ago

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏🙏

23 - 11

Abhigna Deepshika
Posted 1 month ago

సరైన మార్గదర్శకుడు వుంటే చిన్న దీపం కూడా సూర్యుడిలా ప్రకాశించగలదు. జీవితంలో వచ్చే ప్రతి చీకటిలో వెలుగు చూపేది గురువు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐

42 - 2

Abhigna Deepshika
Posted 1 month ago

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స

youtube.com/playlist?list=PLY...

#telugu

101 - 5

Abhigna Deepshika
Posted 1 month ago

అందరికీ నమస్కారం.అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐.
తేనెలొలికే భాష తెలుగు భాష
అమ్మతనం నిండిన కమ్మనైన భాష
మన తెలుగు భాష.
తెలుగు భాష అంటేనే మనకు గుర్తుకు వచ్చేది గిడుగు వెంకట రామ్మూర్తి గారు.గ్రాంథికంలో వున్న తెలుగు భాషను వాడుక భాషలోకి రాసిన కవి. ఈయన జయంతి ఆగస్టు 29 న మనం ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం.

youtube.com/playlist?list=PLY...

మల్లెపువ్వు కంటే మంచి గంధము కంటే
పంచదార కంటే పాలకంటే
తెలుగు భాష లెస్స దేశ భాషలలో
సంగీత భాష తెలుగుజాతి భాష

youtube.com/playlist?list=PLY...

#తెలుగు #telugu

50 - 6

Abhigna Deepshika
Posted 1 month ago

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ |
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||

ఈ కృష్ణాష్టమి మీకు ఆనందం, శాంతి మరియు సంతోషాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. శ్రీ కృష్ణుడి ఆశీస్సులతో మీ జీవితంలో సర్వసంపదలు కలగాలని ఆశిస్తున్నాను.

హరే కృష్ణ!
youtube.com/playlist?list=PLY...

#happykrishnashtami #happyjanmashtami #harekrishna

79 - 2

Abhigna Deepshika
Posted 1 month ago

మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు! 🎉🎂

మీరు తెలుగు సినిమా ప్రపంచంలో ఒక వెలుగు. మీ నటన, డాన్స్, మరియు సామాజిక సేవలు మాకు ఎప్పటికీ ప్రేరణగా ఉంటాయి.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం.
#Chiranjeevi #HappyBirthdayChiranjeevi #MegastarChiranjeevi

59 - 3

Abhigna Deepshika
Posted 1 month ago

పి.ఆదినారాయణరావు తెలుగు చిత్రసీమలో ప్రముఖ సంగీత దర్శకుడు మరియు నిర్మాత. ఆయన స్వరకల్పనలో వినసొంపైన రాగాలు కూర్చి, ప్రేక్షకుల మదిని దోచారు. ‘పిలువకురా…’ అంటూ గారాలు పోయి, ‘రాజశేఖరా…నీపై మోజు తీరలేదురా…’ అంటూ సరాగాలు పలికించిన అలాంటి ‘మధురమైన ప్రియభావనలు’ ఆదినారాయణరావుకే సొంతం అనిపిస్తాయి. ‘ఘనాఘనసుందరుని’ వేకువనే గుర్తు చేసుకొనేవారందరికీ ఆదినారాయణరావు స్వరవిన్యాసాలు సైతం ఆరాధనాభావం కలిగిస్తాయి.నిర్మాతగా అనేక విజయవంతమైన చిత్రాలను అందించారు. తనదైన ముద్రతో తెలుగు చిత్రసీమలో చిరస్మరణీయంగా నిలిచారు. ఈరోజు, ఆగస్టు 21, ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. ఆయన ప్రముఖ నటి అంజలీ దేవి గారి భర్త.

36 - 5