Channel Avatar

in school activities @UCLbiOMvFNcyOL2Q2DB2gjCw@youtube.com

11K subscribers - no pronouns :c

Innovation and self learning activities". school activities


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

in school activities
Posted 5 days ago

*నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయ మిత్రులుకు శుభాకాంక్షలతో*....

ఉపాధ్యాయ వృత్తి ఎంతో *గౌరవప్రదమైనది మరియు బాధ్యతాయుతమైనది*.

నూతనంగా నియామకం పొందిన మీకు అసలైన గురుతర బాధ్యత మీకు ఇప్పుడే ప్రారంభం అవుతుంది.
ఇప్పటివరకు మీరు ఉద్యోగం ఎలా పొందాలి అనే ఆలోచనతో ఉన్నారు..
ఇకనుండి మీరు విద్యార్థుల అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేయాలని ఆలోచనలు చేయవలసి ఉంటుంది.
ఉద్యోగం రాగానే అలసత్వం ప్రదర్శించకుండా,
మీరు వెళ్లిన పాఠశాల వసతుల గురించి ఆలోచించి బాధపడకుండా, కేవలం విద్యా బోధనపై దృష్టి పెట్టి నూతన ఉత్సాహంతో పనిచేయవలసి ఉంటుంది.

మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం...
మీకు ఎంత పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నా, నియామక పరీక్షలో మీకు మొదటి ర్యాంకు వచ్చినా
మీరు పాఠశాలకు వెళ్లగానే అక్కడ మీకంటే ముందునుంచే బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉంటారు. వారితో స్నేహపూర్వకంగా మెలగాలి.

మీరు ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించినట్లుగానే, విద్యార్థుల మరియు పాఠశాలలో అభివృద్ధి కొరకు కృషి చేయాలి.
ఇప్పటివరకు నేర్చుకున్న విజ్ఞానాన్ని వదిలివేయకుండా, ప్రతిరోజు అప్డేట్ గా ఉంటూ విద్యార్థులకు జ్ఞానాన్ని పెంపొందించాలి.

చాలామంది నూతన ఉపాధ్యాయులకు పాఠశాల పనులు కొత్తగా ఉంటాయి.

ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో చేరిన నాటి నుండే పాఠశాలకు సంబంధించిన అన్ని పనులు *ప్రధానోపాధ్యాయులు మరియు తమ సీనియర్ ఉపాధ్యాయుల నుండి నేర్చుకోవాలి*.

మొదటగా నూతన ఉపాధ్యాయులు *వృత్తిపరమైన క్రమశిక్షణ అలవర్చుకోవాలి*. ఇది చాలా ముఖ్యమైన అంశం.

- విద్యార్థులకు అర్థమయ్యేలా
పాఠ్యాంశ బోధన,
- లెసన్ ప్లాన్లు తయారు చేసుకోవడం,
- అడ్మిషన్ రికార్డు,
- పరీక్షల రికార్డుల నిర్వహణ,
- టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ ఉపయోగం,
- మధ్యాహ్న భోజనం నిర్వహణ,
- మండల స్థాయి సమావేశాలకు హాజరవడం,
- నెలవారి రిపోర్టులను తయారు చేయడం.

ఈ పనులన్నీ మీ సీనియర్ ఉపాధ్యాయుల సూచనలు సలహాలతో నేర్చుకోవాల్సి ఉంటుంది.
చాలామంది ఉపాధ్యాయులు అది మన పని కాదు అన్నట్టుగా, ఏ పని నేర్చుకోకుండా ఉంటారు. అలా కాకుండా పాఠశాల నిర్వహణ పూర్తిగా తెలుసుకోవాలి.

ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన మీకు
ఈ పనులన్నీ చాలా సులభమైనవి మరియు నేర్చుకోవలసినవి కూడా.

కాబట్టి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తూ, నవ సమాజ నిర్మాణానికి మీ వంతు పాత్రను పోషిస్తూ విద్యార్థులను, మీరు పనిచేస్తున్న పాఠశాలలను అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ...

~ *in school activities*

1 - 0

in school activities
Posted 2 weeks ago

💥 *జర భద్రం సారు !*

ఉపాధ్యాయ మిత్రులకు మనవి

ఉపాధ్యాయులే లక్ష్యంగా సైబర్ క్రైమ్ చేసే వ్యక్తులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు.
మన నెంబర్స్ వారికి ఎలా దొరికాయో కూడా తెలయదు.
దాదాపుగా వాళ్లు ఏర్పాటు చేసే గ్రూపుల్లో అందరూ ఎంప్లాయిస్ ఉంటున్నారు.
ఉపాధ్యాయులతో పాటు, కాంట్రాక్ట్ పనిచేసే వర్కర్స్, జ్యుడీషియల్ మెంబర్స్, రెవిన్యూ డిపార్ట్మెంట్ వాళ్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటున్నారు.
నా ప్రమేయం లేకుండానే నిన్న నా నెంబరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక గ్రూపులో యాడ్ అయి నా ఫోన్లో యాక్టివేట్ అయినది.
ఈ గ్రూప్ అడ్మిన్ జుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఉన్నారు.
అతనికి కాల్ చేయడం జరిగింది. అతడు ఈ గ్రూపును నేను ఏర్పాటు చేయలేదు. నాకు వేరొక మెంబరు అడ్మిన్ గా కనిపిస్తున్నారని చెప్పినారు.
ఆ గ్రూపులో సైబర్ క్రైమ్ వాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్స్ apk app ను పోస్ట్ చేసినాడు.
ఈ ఏపీకే ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే నిమిషాలలో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది.
in school activities
కాబట్టి ఇలాంటి గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండండి.
మీ ప్రమేయం లేకుండా మీ ఫోన్లో ఏదైనా కొత్త గ్రూపు కనిపించినట్లయితే ఆ గ్రూపులో ఉన్న మెంబర్స్ని ఒకసారి చెక్ చేయండి.
అది మీకు సంబంధించిన గ్రూపా, కాదా నిర్ధారించుకోండి అవసరమైతే అడ్మిన్ కి కాల్ చేసి ఎవరో కనుక్కోండి.
అనుమానాస్పదంగా అనిపించినట్లయితే వెంటనే మీరు ఆ గ్రూపు నుంచి ఎక్సిట్ అవ్వండి. ఆ తర్వాత గ్రూపును కూడా పూర్తిగా మీ మొబైల్ నుంచి డిలీట్ చేయండి.
గ్రూపులో ఉన్న ఏ అంశాలను కూడా మీరు ఓపెన్ చేయకండి.
మీ ప్రమేయం లేకుండా వివిధ వాట్సప్ గ్రూపులలో యాడ్ చేసే అవకాశం లేకుండా, మీ ఫోన్ వాట్స్అప్ లో సెట్టింగ్ ఉంటుంది, ఆ సెట్టింగ్ ని ఆక్టివేట్ చేసుకోండి.
Be care - Be safe
~ *in school activities*

3 - 0

in school activities
Posted 2 weeks ago

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి

fb.watch/uRPzdiQas8/?mibextid=ZbWKwL

0 - 0

in school activities
Posted 3 weeks ago

యుడైస్ లో విద్యార్థిని డిలీట్ చేయడం ఎలా ?
ముందుగా యూ డైస్ ప్లస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
udiseplus.gov.in/#/en/page/oldlink

స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ చేయండి
2024-25 అక్కడ మీకు ఇయర్ సెలెక్ట్ చేయండి
ఎడమవైపు ఉన్న ఆప్షన్స్ లో ప్రోగ్రెషన్ ఆక్టివిటీ ఓపెన్ చేయండి
Next
progression summary section wise open చేయండి
అక్కడ అన్ని క్లాసెస్ కనిపిస్తాయి.
ఏ క్లాస్ విద్యార్థిని డిలీట్ చేయాలో ఆ క్లాస్ కుడివైపు అప్డేట్ బటన్ క్లిక్ చేయండి. ( ఇక్కడ విద్యార్థి గత సంవత్సరం తరగతి ని ఎంపిక చేయాలి. ఉదా: విద్యార్థి ప్రస్తుతం ఐదవ తరగతిలో ఉంటే మీరు నాలుగో తరగతిని ఓపెన్ చేయాలి)
డిలీట్ చేయవలసిన విద్యార్థి పేరు వద్దకు వెళ్ళండి.
కుడి వైపు చివరలో correction అని రెడ్ కలర్ లో కనిపిస్తుంది.
కరెక్షన్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి.

Schooling status ( 2024-25) లో
Left school with TC select చేసి update చేయండి.

0 - 0

in school activities
Posted 1 month ago

అధికారి అంటే ఇలా ఉండాలి !

అధికారి అంటే ఆజమాయిసి మాత్రమే కాదు ఆపద సమయంలో ఆదుకోవాలి.
ప్రస్తుతం విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక పరిశీలన చేసినట్లయితే రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, హాస్టల్స్ ఇవన్నీ కూడా విద్యార్థులకు విద్యతోపాటు హాస్టల్ సౌకర్యాలను కల్పిస్తున్నాయి.
పాఠశాలల్లో మాత్రం విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తారు పాఠశాల తర్వాత ఇంటికి వెళ్లిపోతారు.
ఇక్కడ విద్య కోసం పనిచేస్తున్న అన్ని విద్యాసంస్థలు పలు రకాలైన సమస్యల తో సతమతమవుతున్నాయి.

నిన్న అర్వపల్లి కేజీబీవీ లో జరిగిన సంఘటన కానీ గతంలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనల ద్వారా అసలు రెసిడెన్షియల్ విద్యాలయాలు ఎక్కడ నిర్మించాలి, ఎలా నిర్మించాలి అనేది ఉత్పన్నమయ్యేటటువంటి ప్రశ్న.

ఈ పాఠశాలల నిర్వహణకు నియామకం చేయబడిన అధికారులు ఎలా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి అప్రమత్తతతో ఉండాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం.

అధికారి కేవలం యాజమాయిసీ చేస్తే సరిపోదు ఆపద సమయంలో సమయస్ఫూర్తితో స్పందించాలి, ఆదుకోవాలి.
పాఠశాలలను మానిటరింగ్ చేసే అధికారికి ఆ పాఠశాలల భౌతిక పరిస్థితులపై, పరిసరాలపై పూర్తి అవగాహన ఉండాలి.
అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం ఏ సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది అక్కడున్నటువంటి ఉపాధ్యాయులకు సూచనలు చేస్తూ ఉండాలి.

పరిసరాల పరిశుభ్రత పై, సురక్షిత త్రాగునీటి విషయమై, మరుగుదొడ్ల నిర్వహణపై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ విద్యార్థుల ఆరోగ్యం కోసం కృషి చేయాలి.
శిథిలావస్థలో ఉన్నటువంటి పాఠశాలల మరియు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఇలాంటి తుఫాను సమయాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తులను చేస్తూ ఉండాలి.
అవసరమైతే అధికారి అక్కడ ఉండి విద్యార్థుల రక్షణ చర్యలను చేపట్టాలి.
ఆపత్కాలంలో అధికారి అందుబాటులో ఉన్నట్లయితే విద్యార్థులకు కొండంత అండగా ఉన్నట్లు ధైర్యంగా ఉంటారు. మేము సురక్షితంగా ఉన్నాము అనే భావన వారిలో కలుగుతుంది.

నిన్న జరిగిన సంఘటన గమనించినట్లయితే నిజమైన అధికారి ఎలా ఉండాలో నిరూపించారు ఎంఈఓ బాలు గారు మరియు జి సి డి ఓ పూలన్ గారు.
ఎవరో వచ్చి విద్యార్థులను రక్షిస్తారులే అని ఊరుకోకుండా వెంటనే స్పందించి పూర్తిగా నీటితో నిండిపోయిన పాఠశాల భవనం నుండి 150 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు చేర్చినారు.
విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తూ సకాలంలో స్పందించే ఇలాంటి అధికారులు మనకు కావాలి. అప్పుడే మేము మరింత సురక్షితంగా ఉన్నామనే భావన విద్యార్థులలో మరియు వారి తల్లిదండ్రులు కలుగుతుంది.

💥 *హాట్సాఫ్ టు MEO బాలు గారు మరియు GCDO పూలన్ గారు*.

👉 ఇక ఇలాంటి ఆపత్కర పరిస్థితులలో విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఆహార పదార్థాలు, మందులు నిల్వ ఉంచాలి.
👉 ఎప్పటికప్పుడు తరగతి గదులను హాస్టల్ గదులను శానిటేషన్ చేస్తూ ఉండాలి.
👉 వేడి ఆహార పదార్థాలు మాత్రమే వడ్డించాలి.
👉 ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక ఫిమేల్ నర్స్ (లేదా మేల్ ) 24 గంటలు అందుబాటులో ఉండాలి.
👉 అధికారులు ఎప్పుడూ అక్కడి తాజా పరిస్థితిని తెలుసుకుంటూ ఉండాలి.
👉 ముఖ్యంగా పాఠశాల భవనాలను లోతట్టు ప్రాంతాలలో కాకుండా, ఎత్తైన ప్రదేశంలో మెయిన్ రోడ్డుకు దగ్గరలో నిర్మించాలి.
👉 ఫ్రీగా స్థలాలు దొరుకుతున్నాయని రహదారి కూడా సరిగా లేని ప్రాంతాలలో పాఠశాల భవనాలు నిర్మించినట్లయితే విద్యార్థులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
~ in school activities

1 - 0

in school activities
Posted 1 month ago

*HYDRA*

ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాళాలను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన
హైడ్రా ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారింది. అందరూ దీని గురించే చర్చిస్తున్నారు.
పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి విలయాలనుండి రక్షణ కొరకు హైడ్రా లాంటి రక్షణ కమిటీ అవసరం.
కూల్చివేతలు చేసేటప్పుడు
ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ జోన్ లో నిర్మాణాలు చేసుకున్న అందర్నీ ఒకే ఘాటిలో కట్టకుండా కేటగిరి వైజ్ గా విభజించుకోవాల్సిన అవసరం ఉన్నది.

👉 అన్నీ తెలిసి నిర్మాణాలు చేసినటువంటి ప్రజాప్రతినిధులను మొదటి కేటగిరీలో చేర్చాలి.

👉 వివిధ అధికారిక హోదాలలో పనిచేస్తూ నిర్మాణాలు చేయకూడదని తెలిసి పర్మిషన్లు తెచ్చుకొని నిర్మాణాలు చేసుకున్న ప్రభుత్వ ఉన్నతాధికారులను రెండవ కేటగిరిలో చేర్చాలి.

👉 మామూలు, కింది స్థాయి ఉద్యోగులను మూడవ కేటగిరిలో చేర్చాలి
👉 మధ్యతరగతి మరియు సామాన్యులను నాలుగో కేటగిరీలో చేర్చాలి.
ఇలా విభజించుకున్న తర్వాత కూల్చివేతలు ప్రారంభించాలి.

కూల్చివేతకు ముందే యజమానికి సామాగ్రిని తీసుకెళ్లడానికి మరియు కూల్చివేసిన తర్వాత వెళ్లేటటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన తుక్కు సామాగ్రిని అమ్ముకోవడానికి అవకాశం ఇవ్వాలి.

పర్యావరణ పరిరక్షణ కోసం కూల్చివేత ఒక్కటే ముఖ్యమైనది కాదు, ఒక భవనాన్ని కూల్చివేసిన తర్వాత వెలువడే వ్యర్థాలను మొత్తం వెంటనే అక్కడి నుంచి మరొక చోటుకు తరలించాలి.
వ్యర్ధాలను తరలించే ప్రదేశాలలో ఇండ్లు లేకుండా ఉండాలి అలాంటి ప్రదేశాన్ని ఎంచుకొని పూర్తి వ్యర్ధాలను తరలించాల్సిన అవసరం ఉన్నది.
మిగిలిన తుక్కు, సామాన్లు జిహెచ్ఎంసి కార్మికుల చేత వేరు చేయించి రీసైక్లింగ్ వారికి అప్పగించాలి.
దీనిలో ఎక్కువగా నష్టపోయేది
సాధారణ మరియు కిందిస్థాయి ఉద్యోగులకు, మధ్యతరగతి మరియు సామాన్యులు. వీరి భవనాలను కూల్చివేయడమే కాకుండా, వారికి ఆవాసాలను ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకోవాలి.
ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అన్ని కార్పొరేషన్లలో ఇప్పటినుండే గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేసుకోవాలి.

1 - 0

in school activities
Posted 1 month ago

*అసలే ఉపాధ్యాయుల కొరత*
*ఆపైన బోధనలో ఇబ్బందులు*
*ఉన్న ఉపాధ్యాయులను తాత్కాలిక సర్దుబాటు పేరుతో మరొక పాఠశాలకు పంపిస్తున్నారు*
. దీనివలన ప్రాథమిక పాఠశాల విద్యపై తల్లిదండ్రుల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా భవిష్యత్తులో ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది.

చాలా ఉన్నత పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరేసి ఉపాధ్యాయులు ఉన్నారు.

*అరచేతిలో వెన్నబెట్టుకుని - నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్లు*

అక్కడ ఉన్న ఉపాధ్యాయుల సేవలను మరొక విషయం బోధించడానికి ఉపయోగించకుండా ప్రాథమిక ఉపాధ్యాయులను తాత్కాలిక సర్దుబాటు చేస్తున్నారు.

ఉపాధ్యాయులందరూ ఒకే కోవకు చెందినవారు ఏ ఉపాధ్యాయుడైన అన్ని సబ్జెక్టులను బోధించే సామర్థ్యాన్ని ఎంతోకొంత కలిగి ఉంటాడు.
*కేవలం ప్రాథమిక ఉపాధ్యాయులు మాత్రమే ప్రాథమిక మరియు ఉన్నత స్థాయి సబ్జెక్టులను బోధించే సామర్థ్యాన్ని కలిగి ఉండరు*.

గతంలో చాలా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు లేనప్పటికీ 100% ఉత్తీర్ణత సాధించినారు. అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులలో ఉన్నాయి.

కొద్ది రోజులలో నూతన ఉపాధ్యాయ నియామకాలు జరగనున్నాయి. కాబట్టి ఈ కొద్ది కాలం వరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను తాత్కాలిక సర్దుబాటు చేయడం కాకుండా, *అదనంగా ఉన్న ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను ఇతర విషయాన్ని బోధించుటకు ఉపయోగించుకుంటే బాగుంటుంది*.

6 - 1

in school activities
Posted 2 months ago

*ఇలాగైతే ఎలా ?*

విద్యార్థుల సంఖ్య అనే సాకుతో ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేయవద్దు.
*విద్యకు పునాది ప్రాథమిక పాఠశాలలు. విద్యార్థి అన్ని సామర్థ్యాలు ఇక్కడే నేర్చుకుంటాడు*.
ఇలా నేర్చుకున్న విద్యార్థి ఉన్నత స్థాయిలో సులభంగా రాణించగలుగుతాడు.
*బేసిక్స్ సరిగా లేని విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్లి అక్కడ ఎలా నేర్చుకుంటాడు*.
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో సామర్థ్యాలు అభివృద్ధి చెందాలంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతూ ఉన్న ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు డిప్యూటేషన్ చేస్తున్నారు.
ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో రెండు కళ్ళ లాంటివి.
ఏ కన్నులో సమస్య ఉన్న అభివృద్ధి కుంటుపడుతుంది. ఒక కన్నుకు మంచి చూపిన అందించడానికి మరో కన్నును పొడుచుకుంటామా ?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన సమస్య ఉపాధ్యాయుల కొరత.

*50 మంది అంతకన్నా తక్కువ విద్యార్థులు ఉన్న ఉన్నత పాఠశాలలో ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు, ఒక గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఉన్నారు*.

అదే 50 మందితో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులను మాత్రమే నియమిస్తున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులలో సామర్థ్యాలను ఎలా సాధిస్తారు ? in school activities

ఎస్జిటి ఉపాధ్యాయ మిత్రులు ఈ విషయమై ఆలోచించాలి.

*ప్రాథమిక పాఠశాలల డిప్యూటేషన్లను ఆపాలి*.

*ఉన్నత పాఠశాలలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను, అదే పాఠశాలలో ఇతర సబ్జెక్టులను బోధించుటకు లేదా మరో పాఠశాలకు సర్దుబాటు చేయాలి*.

*Japan, New Zealand, Ireland, Barbados, Netherlands, Belgium, Switzerland, and Finland, Australia* లాంటి దేశాలలో ప్రాథమిక విద్యకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
అందుకే ఆ దేశాలు అత్యుత్తమ సాంకేతికత, ఉత్తమ సామర్ధ్యాలు కలిగిన విద్యార్థులు, ఉన్నతమైన అభివృద్ధి తో ఉన్నాయి.

*ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రాథమిక విద్యను కాపాడుదాం*

2 - 0

in school activities
Posted 2 months ago

*ఒక ఉపాధ్యాయుడు - 18 పీరియడ్ల బోధన*

ప్రస్తుతం ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలో విషయంశాల బోధన చాలా కష్టతరమవుతుంది.
ఒక తరగతిలో ఇద్దరూ లేదా ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఆరోజు వారికి అన్ని విషయాలు బోధించాలి.
పరిసరాల విజ్ఞానం లాంటి పాఠ్యాంశాల విషయంలో కొన్ని తరగతులను కలుపుకొని చెప్పడానికి అవకాశం ఉన్నది, కానీ అది పరిమిత సంఖ్యలో మాత్రమే.
*ఎలా చూసినా ఆ ఉపాధ్యాయుడు ప్రతిరోజు 15 పీరియడ్లు బోధించవలసిందే అది కూడా ఎఫ్ ఎల్ ఎన్ ప్రకారం బోధనా కార్యక్రమాన్ని నిర్వహించాలి*.
దీనికి తోడు అన్ని తరగతులకు ప్రతి విద్యార్థి చేత FLN వర్క్ బుక్కులు చేయించాలి మరియు వాటిని మూల్యాంకనం చేయాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయునిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.
బోధనతోపాటు ఇతర అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని ఆ ఉపాధ్యాయుడే అందించాల్సి ఉంటుంది.
1.పాఠశాలకు వెళ్లిన ఏకోపాధ్యాయుడు మొదటగా పాఠశాల పరిసరాలను తరగతి గదులను శుభ్రం చేయించుకోవాలి. ఈ పనిలో ఉపాధ్యాయుడు కూడా చేయి కలపవలసి ఉంటుంది.

2.విద్యార్థుల హాజరును పరిశీలించాలి.తర్వాత ఫేస్ హాజరు తీసుకోవాలి.అనుపస్థితి ఉన్న పిల్లలు కు గల కారణాలను తెలుసుకోవడానికి తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి. కారణాలు నమోదు చేయాలి. హాజరు పూర్తికాగానే ఆరోజు ఉపస్థితి మరియు అనుపస్థితి అయిన పిల్లల వివరాలను ఎమ్మార్సీకి పంపించాలి.

3. మధ్యాహ్న భోజనం కు సంబంధించి రైసు ఇవ్వాలి, కూరగాయలను మరియు వంటను పరిశీలించాలి.

4. మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా ? లేదా ? అనేది కూడా చూసుకోలి.

5. ఆరోజు పంపవలసిన ముఖ్యమైన రిపోర్టులను చెక్ చేసుకోవాలి.

6. వాట్సాప్ లో వచ్చేటటువంటి గూగుల్ షీట్స్ ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ సమాచారాన్ని పంపించాలి.

7. అనుకోకుండా మధ్యలో వచ్చేటటువంటి అర్జెంటు రిపోర్టులను వెంటనే పంపించాలి.

8. యు డైస్ ప్లస్ లో సవరణలు ఏవైనా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు చేయాలి.

9. రోజువారీగా మధ్యాహ్న భోజనం సమాచారాన్ని app లో నమోదు చేస్తూ రికార్డులో రాసుకోవాలి.

10.ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఎఫ్ఏ పరీక్షలను నిర్వహిస్తూ వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలి.

11. శిక్ష సప్తాహ్ మరియు పచ్చదనం -స్వచ్ఛదనం లాంటి అర్జెంటు కార్యక్రమాలను చేయించాలి. వాటికి సంబంధించిన రిపోర్ట్లను పంపించాలి.

12. మూడవ తరగతి పిల్లలను NAS పరీక్ష కోసం సంసిద్ధులను చేయాలి.

13. ఈ పనుల మధ్యలో ఎవరైనా తల్లిదండ్రులు టీ సి మరియు స్టడీ కండక్ట్ కోసం వచ్చినట్లయితే వారికి అవి రాసి ఇవ్వాలి.

14. ఎవరైనా పరిశీలకులు MEO, MNO, AMO వచ్చినట్లయితే వారికి సహకరించాలి. జవాబుదారీగా ఉండాలి.

15. ఈ పనులన్నీ చేస్తూ ప్రతిరోజు అన్ని తరగతులకు అన్ని పాఠ్యాంశాలు బోధించాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది ???
పని ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను బోధించగలుగుతాడా ? అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. కాబట్టి ఏకోపాధ్యాయ పాఠశాల లేకుండా చూడాలి. in school activities

*ప్రతి ప్రాథమిక పాఠశాలకు కూడా ఉన్నత పాఠశాల లాగా సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయున్ని నియామకం చేయాలి*.

*పై పనులన్నీ చేయడానికి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రత్యేక హెడ్మాస్టర్ పోస్టును కేటాయించాలి*.

2 - 1

in school activities
Posted 2 months ago

*ప్రస్తుతం టెట్ రాసిన అభ్యర్థుల మధ్య తీవ్రంగా నడుస్తున్న చర్చ నార్మలైజేషన్*.
షిఫ్టుల వారిగా ఎగ్జామ్ జరిగింది కాబట్టి అన్ని షిఫ్టులలో ఒకే రకమైన పేపరు ఉండదు.
కాబట్టి నార్మలైజేషన్ చేయాలని అభ్యర్థులు అనుకుంటున్నారు.

********************
( in school activities)

నిజానికి *కీ* చూసుకున్న తర్వాత ఎవరైతే క్వాలిఫై కాలేదో అలాంటి అభ్యర్థులు మాత్రమే నార్మలైజేషన్ కోరుకుంటారు.
క్వాలిఫై అయిన అభ్యర్థులు నార్మలైజేషన్ అవసరం లేదు అంటారు.
ఇది నిజమే ఎందుకంటే క్వాలిఫై కానీ అభ్యర్థులు నార్మలైజేషన్ చేసినట్లయితే ఏమైనా మార్పులు జరిగి ఒకటి లేదా రెండు మార్కులు కలిసి క్వాలిఫై అవుతామేమునని వారి ఆలోచన.

కానీ బార్డర్ అంతకంటే సమీప ఎక్కువ మార్కులతో క్వాలిఫై అయిన వారు నార్మలైజేషన్ వలన తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది.
*ఎందుకంటే 60, 75, 90 మార్కులతో క్వాలిఫై అయిన ఒక అభ్యర్థి నార్మలైజేషన్లో, ఒక్క మార్కు తగ్గినట్లయితే అతడు క్వాలిఫై కాకుండా పోతాడు*
.
దీనివల్ల అతడు చాలా నష్టపోవాల్సి వస్తుంది.
*ఉద్యోగ అవకాశాలు కోల్పోతాడు, మానసికంగా కృంగి పోతాడు. ఇది విపరీత పరిణామాలకు దారి తీసే అవకాశం కూడా ఉంటుంది*.

కానీ ప్రస్తుతం *కీ* చూసుకొని క్వాలిఫై కానీ అభ్యర్థి నేను క్వాలిఫై కాలేదు ఆని మానసికంగా ప్రిపేర్ అయి ఉంటాడు. అతడు నిరాశకు గురికావడం అనేది తక్కువగా ఉంటుంది.
*ఇది మానసికమైన సమస్య*.

ఇలాంటి పరిస్థితులలో అభ్యర్థులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది.
*కొంతమంది అభ్యర్థులు సంతోషపడతారు, మరి కొంతమంది అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి గురి అవుతారు*
.
*నిజానికి ఒక ప్రక్రియ జరిగినప్పుడు అది అందరికీ లాభం చేకూర్చే విధంగా ఉండాలి*.

కానీ ప్రస్తుతం జరిగే నార్మలైజేషన్లో అభ్యర్థుల భవితవ్యం చేజారే అవకాశం ఉంటుంది.
*ఒక అభ్యర్థికి ఒక మార్కు కలిపి ముందుకు తీసుకెళ్లాలి, కానీ ఒక మార్కును మైనస్ చేసి అతని జీవితాన్ని నాశనం చేయకూడదు*.

ఇక్కడ ఉదాహరణ ద్వారా గమనిద్దాం.

పేపర్ 2 ఆరు సెషన్లో పరీక్ష నిర్వహించడం జరిగింది.

S:1 లో టాప్ మార్క్స్ - 124 అనుకుందాం
S:2 లో టాప్ మార్క్స్ - 132 అనుకుందాం
S:3 లో టాప్ మార్క్స్ - 128 అనుకుందాం
S:4 లో టాప్ మార్క్స్ - 135 అనుకుందాం
S:5 లో టాప్ మార్క్స్ - 138 అనుకుందాం
S:6 లో టాప్ మార్క్స్ - 122 అనుకుందాం
అన్ని సెషన్ల సరాసరి చేసినట్లయితే 129.83 టాప్ స్కోరు వస్తుంది. అనగా 130 ఫస్ట్ మార్క్ వస్తుంది.
(ప్రతి సెషన్ 130 మార్కులకు సమానం చేయాలి)

*దీని ప్రకారం*

S:1 లో : +6 (మార్కులు కలుస్తాయి)
S:2 లో : -2 (మార్కులు తీసివేస్తారు)
S:3 లో: +2
S:4 లో: -5
S:5 లో: -8
S:6 లో : +8
ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే
1, 3 మరియు 6వ, సెషన్ లో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు స్కోరు యాడ్ అవుతుంది కాబట్టి వారికి కొంత లాభం జరుగుతుంది.

2,4,మరియు 5వ, సెషన్స్ లో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు మార్కులు తగ్గి తీవ్రంగా నష్టపోతారు.
*****************************
సెషన్ -5 గురించి విశ్లేషణ చేసినట్లయితే.
( అభ్యర్థికి వచ్చిన స్కోరు నుండి 8 మార్కులను తీసివేయాలి )

SC: 60 నుండి 67 మార్కులు వచ్చిన అభ్యర్థులు క్వాలిఫై కాకుండా పోతారు.

BC: 75 నుండి 82 మార్కులు పొందిన అభ్యర్థులు

OC: 90 నుండి 97 మార్కులు పొందిన అభ్యర్థులు క్వాలిఫై కాకుండా తీవ్రంగా నష్టపోతారు.
*నిజానికి వీరంతా క్వాలిఫై అయిన అభ్యర్థులు*.

సెషన్ -1 విశ్లేషణ చూసినట్లయితే ( ఇక్కడ 6 మార్కులు కలపాలి )
SC: 54
BC: 69
OC: 84 ఇలా క్వాలిఫై కానీ మార్కులు వచ్చిన అభ్యర్థులకు 6 మార్కులు కలిపినప్పుడు వీరంతా క్వాలిఫై అవుతారు.

ఇదంతా గమనిస్తే అభ్యర్థులకు సమన్యాయం ఎక్కడ జరిగింది.
కావున మిత్రులారా కేవలం *టాప్ మార్క్స్ ఆధారంగా నార్మలైజేషన్ చేసినట్లయితే ఎక్కువ మంది అభ్యర్థులకు తీవ్రమైన నిరాశ మిగులుతుంది*. కీ చూసుకోగానే బార్డర్ మరియు కొద్దిగా ఎక్కువ మార్కులు సాధించి క్వాలిఫై అయిన అభ్యర్థులంతా తమ మార్కులు తగ్గి క్వాలిఫై కాకుండా తీవ్రంగా నష్టపోతారు.

*కావున నార్మలైజేషన్ అనేది ప్రతి అభ్యర్థికి లాభం చేకూర్చే విధంగా ఉండాలి. వివిధ సెషన్లో పరీక్షలు నిర్వహించి నార్మలైజేషన్ పేరుతో ఒక అభ్యర్థి భవిష్యత్తును అంధకారం లోకి నెట్టి వేయడం ఎంతవరకు సమంజసం*.

1 - 0