Channel Avatar

Channel9 hd @UCG8RaucXk-JUmu5MVTS2AKA@youtube.com

97K subscribers - no pronouns :c

Official Youtube Channel of CHANNEL9hd CHANNEL9hd, Telugu


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Channel9 hd
Posted 6 hours ago

మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న మర్రిగుంట సర్పంచి గోపి, గ్రామస్తులు
పొలంలో పని అని చెప్పి వ్యాపారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు.
పోలీసుల మాటలను పట్టించుకోని అక్రమార్కులు
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్న సర్పంచి, గ్రామస్థులు

11 - 0

Channel9 hd
Posted 11 hours ago

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా నియమితులైన మన విశ్రాంత I.A.S అధికారి పి.కృష్ణయ్య గారికి సొంత విలేజ్ వెంకన్నపురం గ్రామప్రజలు తరపున విజయవాడ కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు

26 - 0

Channel9 hd
Posted 1 day ago

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వరుస భేటీలు

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి

జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార్ రోశయ్య

దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు

93 - 2

Channel9 hd
Posted 1 day ago

నేడు ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ఐ.టీ.శాఖ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారితో మర్యాదపూర్వకంగా బేటీ అయిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

134 - 0

Channel9 hd
Posted 1 day ago

అంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య ని విజయవాడలోని ప్రభుత్వ అతిథిగృహం నందు కలిసి శాలువా తో సన్మానించి, పుష్పగుచ్ఛం తో శుభాకాంక్షలు తెలిపిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ,శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు తదితరులు

45 - 0

Channel9 hd
Posted 3 days ago

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలశాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డిని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, రూరల్ నియోజకవర్గం పరిధిలోని నెల్లూరు- ములుముడి- తాటిపర్తి రోడ్(వైడనింగ్),ఎన్.కె.రోడ్- పెనుబర్తి వయా మాధరాజు గూడూరు రోడ్ (స్పెషల్ రిపేర్స్), జి.ఎన్.టీ. రోడ్,నెల్లూరు(స్పెషల్ రిపేర్స్)km 168/0 to 172/7, నెల్లూరు - కృష్ణపట్నం పోర్టు రోడ్(రోడ్ సేఫ్టీ ఇంటర్ వెన్షన్స్), జి.ఎన్.టీ. రోడ్, నెల్లూరు(రోడ్ సేఫ్టీ ఇంటర్ వెన్షన్స్)km165/2 to 172/7, నెల్లూరు- ములుమూడి- తటిపర్తి రోడ్ టు సజ్జపురం వయా గొల్లకందుకూరు, రోడ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి, నిధులు మంజూరు చేయవలసిందిగా కోరిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
అమరావతి రాష్ట్ర సచివాలయంలో జలవనరులశాఖ మంత్రివర్యులు డా: నిమ్మల రామానాయుడు ని మర్యాదపూర్వకంగా కలసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

133 - 4

Channel9 hd
Posted 3 days ago

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రివర్యులు వంగలపూడి అనితని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తల పై అక్రమంగా బనాయించిన కేసులను తీసివేయాలని కోరిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.సానుకూలంగా స్పందించిన హోం మంత్రి అనిత

256 - 4

Channel9 hd
Posted 3 days ago

మహారాష్ట్ర మంత్రివర్యులు హసన్ ముష్రిఫ్ ను కలిసిన అబ్దుల్ అజీజ్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన మహారాష్ట్ర వైద్య విద్య, ప్రత్యేక సహాయ శాఖల మంత్రివర్యులు హసన్ ముష్రీఫ్ ను తిరుపతి కరకంబాడి రోడ్డు లో గల బీవీఆర్ గెస్ట్ హౌస్ నందు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు తో కలిసి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హసన్ ను అబ్దుల్ అజీజ్ శాలువా పుష్పగుచ్ఛం తో సత్కరించారు. వారితో పాటు జాఫర్ షరీఫ్, మైనుద్దీన్, సాబీర్ ఖాన్, మైజుల్లా హుస్సేని, రియాజ్ తదితరులు ఉన్నారు.

42 - 0

Channel9 hd
Posted 4 days ago

నామినేటెడ్ పోస్టుల్లో నెల్లూరు కు చెందిన బీసీకే తొలి ప్రాధాన్యం
..
ప్రతిష్టాత్మకమైన ఏపీపీసీబీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ కృష్ణయ్య
- చైర్మన్ గా బాధ్యతలు నేడు చేపట్టిన కృష్ణయ్య
- అభినందనలు తెలిపిన నేతలు, పార్టీ కార్యాలయ సిబ్బంది
సి.ఎం చంద్రబాబు, డిప్యూటీ సి.ఎం పవన్, హెచ్ ఆర్ డి మంత్రిశాఖ నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణయ్య
తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి రుజువు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత, ప్రజతకోసం, పార్టీకోసం కష్టపడిన ఎందరో ఆశావాహులు ఎదురుస్తున్న కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీకి తొలి అడుగు పడింది. అందులో భాగంగానే విశ్రాంతి ఐఏఎస్ అధికారి పి. కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏపీపీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ గా కృష్ణయ్య ఈరోజు బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన కృష్ణయ్యను పార్టీ కార్యాలయ సిబ్బంది, నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. తొలి నామినేటెడ్ పోస్టును దక్కించుకున్న కృష్ణయ్య కోసం కార్యాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి, ప్రోగ్రాం కమిటీ ఇంఛార్జ్ నున్న రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ..తొలి నామినేటెడ్ పోస్టును బీసీలకు చంద్రబాబు కేటాయిండం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీపీసీబీ చైర్మన్‌గా ఆయన రాష్ట్రానికి మరిన్ని విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఐఏఎస్ అధికారిగా కృష్ణయ్యకు ఉన్న అపారమైన అనుభవంతో ప్రభుత్వానికి, ప్రజలకు మరిన్న ఉన్నతమైన సేవలు అందించాలని కాంక్షించారు.

60 - 2

Channel9 hd
Posted 4 days ago

సెప్టెంబరు 16
మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధకుడు సర్ రోనాల్డ్ రాస్ వర్ధంతి.

ఇతనికి మలేరియా పారసైట్ జీవితచక్రానికి చెందిన పరిశోధనకు గాను 1902లో వైద్యశాస్త్రంలో
నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది.

1897 లో ఒక దోమ యొక్క జీర్ణశయాంతర ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని ఆయన కనుగొన్నప్పుడు మలేరియా దోమల ద్వారా వ్యాపిస్తుందని ఋజువు చేసింది. ఈ వ్యాధిని ఎదుర్కునే పద్ధతికి పునాది వేసింది.

అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. అతను అనేక కవితలు రాసాడు, అనేక నవలలను ప్రచురించాడు. అతను పాటలను స్వరకల్పన చేసాడు. అతను కళాభిలాషి, గణిత శాస్త్రవేత్త కూడా. రొనాల్డ్ రాస్ భారత దేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో జన్మించాడు. అతని తండ్రి కాంప్‌బెల్ క్లాయె గ్రాంట్ రాస్
బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జనరల్ గా పనిచేసేవాడు. ఎనిమిదేళ్ల వయసులో ఐల్ ఆఫ్ వైట్‌లో తన అత్త, మామలతో కలిసి జీవించడానికి ఇంగ్లాండ్‌కు పంపించారు. రాస్ విధ్యాభ్యాసం అంతా లండన్ లోనే సాగింది.

రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్ లోని సెయింట్ బార్తొలోమ్ హాస్పిటల్ లో 1875 - 1880 మధ్య పూర్తిచేశాడు. 1879 లో, అతను "రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్" పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు.
అతను 1881 లో రెండవ ప్రయత్నంలో అర్హత సాధించి ఆర్మీ మెడికల్ స్కూల్లో నాలుగు నెలల శిక్షణ తరువాత, 1881 లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ప్రవేశించాడు.

1881 నుండి 1894 వరకు అతను మద్రాస్, బర్మా, బలూచిస్తాన్, అండమాన్ దీవులు, బెంగళూరు, సికింద్రాబాద్‌లలో వివిధ పదవులలో నియమించబడ్డారు. 1883 లో, అతన్ని బెంగళూరులో యాక్టింగ్ గారిసన్ సర్జన్‌గా నియమించారు. ఈ సమయంలో దోమల నీటి సౌలభ్యత తగ్గించడం ద్వారా వాటిని నియంత్రించే అవకాశాన్ని గమనించాడు. అతను సర్ పాట్రిక్ మాన్సన్‌ గారి సుచనలమేరకు మలేరియా పరిశోధనలో వాస్తవ సమస్యలను గమనించాడు.

భారతీయ వైద్య సేవలో 25 సంవత్సరాలు పనిచేశాడు. తన సేవలోనే అతను సంచలనాత్మక వైద్య ఆవిష్కరణ చేశాడు. భారతదేశంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత, అతను లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అధ్యాపకులలో ఒకనిగా చేరాడు. 10 సంవత్సరాల పాటు ఇనిస్టిట్యూట్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ , చైర్మన్ గా కొనసాగాడు.

1926 లో అతను రాస్ ఇనిస్టిట్యూట్, హాస్పిటల్ ఫర్ ట్రాపికల్ డిసీజెస్ లకు డైరెక్టర్-ఇన్-చీఫ్ అయ్యాడు.
అతను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. అతను హైదరాబాదు
నగరంలో తన పరిశోధన జరిపాడు. ప్రస్తుతం "మినిస్టర్స్ రోడ్"గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు "సర్ రోనాల్డ్ రాస్ రోడ్" అనేవారు.

భారతదేశంలో, రాస్ మలేరియాపై చేసిన కృషి ఫలితాన్ని ఎంతో గౌరవంగా జ్ఞాపకం చేసుకుంటారు. మలేరియా ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఘోరమైన అంటువ్యాధి.

అనేక భారతీయ పట్టణాలు, నగరాల్లో అతని పేరు మీద రోడ్లు ఉన్నాయి. కలకత్తాలో ప్రెసిడెన్సీ జనరల్ హాస్పిటల్‌ను, కిడర్‌పూర్ రోడ్‌తో కలిపే రహదారికి అతని పేరు సర్ రోనాల్డ్ రాస్ సరాని అని పేరు మార్చారు. ఇంతకు ముందు ఈ రహదారిని హాస్పిటల్ రోడ్ అని పిలిచేవారు.

అతని జ్ఞాపకార్థం, హైదరాబాద్ లోని ప్రాంతీయ అంటు వ్యాధి ఆసుపత్రికి సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికేషన్ డిసీజెస్ అని పేరు పెట్టారు.

బేగంపేట విమానాశ్రయానికి సమీపంలో సికింద్రాబాద్‌లో ఉన్న మలేరియా పరాన్నజీవిని అతను కనుగొన్న భవనాన్ని ఒక వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.ఆ భవనానికి వెళ్లే రహదారికి సర్ రోనాల్డ్ రాస్ రోడ్ అని పేరుపెట్టారు.

లూధియానాలో, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ తన హాస్టల్‌కు "రాస్ హాస్టల్" అని పేరు పెట్టింది. యువ వైద్యులు తమను తాము "రోసియన్లు" అని పిలుస్తారు.

రోనాల్డ్ రాస్ జ్ఞాపకార్థం భారత తపాలాశాఖ 1997లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది

యునైటెడ్ కింగ్‌డం లోని సర్రే విశ్వవిద్యాలయం తన మనోర్ పార్క్ నివాసాలలో అతని పేరును రహదారికి నామకరనం చేసింది.

వింబుల్డన్ కామన్ సమీపంలోని రోనాల్డ్ రాస్ ప్రైమరీ స్కూల్ అతని పేరు మీద ఉంది. పాఠశాల చిహ్నంలోని నాలుగో భాగంలో ఒక దోమను కలిగి ఉంటుంది.

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రోనాల్డ్ రాస్ జ్ఞాపకార్థం సర్ రోనాల్డ్ రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారాసిటాలజీ స్థాపించబడింది.

2010 లో లివర్‌పూల్ విశ్వవిద్యాలయం తన గౌరవార్థం తన కొత్త బయోలాజికల్ సైన్స్ భవనానికి "ది రోనాల్డ్ రాస్ బిల్డింగ్" అని పేరు పెట్టింది. అతని మనవడు డేవిడ్ రాస్ దీనిని ప్రారంభించాడు.

1932 సెప్టెంబరు 16 న తన 75 వ ఏట లండన్, (యు.కె )లో ఆయన మరణించాడు.

6 - 0