నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మావతి. నా వయసు నాలుగు పుష్కరాలు దాటి నాలుగేళ్లు అయింది ఇన్నేళ్ల నా జీవితానుభవం లో నేను నేర్చుకున్న అనేక విషయాలను నలుగురితో పంచుకోవాలనే కోరికతో ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది.
తెలుగు సాహిత్యం అంటే విపరీతమైన మక్కువ. అందులోనూ హాస్యరసం అంటే చాలా ఇష్టం తెలుగు సాహిత్యంలో మహామహులు రచించిన హాస్య కథానికలు నేటి యువతరానికి వినిపించాలని ఉద్దేశ్యం ఉంది. ఇప్పటి యువతకు చూడటం తప్ప చదివే అలవాటు తగ్గిపోయింది. అందువల్ల వినిపించే కథల రూపంలో తెలుగు లో ఉన్న మంచి హాస్య కథలను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను.
లక్ష్మి చెప్పే కధలు అనే ఈ ఛానల్ మీకు విజ్ఞాన వినోదాలు రెండు అందిస్తుంది. తప్పకుండా సబ్ స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి.
మీ.. లక్ష్మి.. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం.... నమస్తే