in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
భక్త మహాశయులారా! తేది: 08-03-2024 శుక్రవారం మహా శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణ మహోత్సవము శ్రీ నగరేశ్వరాలయములో శ్రీ పాలెపు రాము శర్మ శిశ్వబృందం మరియు ఆలయ అర్ధకులు శ్రీ దివాకర శర్మ గార్ల, వైదిక నిర్వహణలో అత్యంత వైభవోపేతముగా నిర్వహించబడును. కావున ఇట్టి భగవత్ కార్యములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలరని మనవి. శివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు: నూనె నవీన్, నీలి శ్రీనివాస్ (టైపు), కొత్త రాజేష్, మోటూరి రాజు, నూనె రాంమోహన్, బెజ్జారపు రాంచంద్రం(చందు), రేగులు భూమానందం, మానుక మల్లయ్య, గంటేడి రాజేష్, ముక్కదాము, నీలి శ్రీనివాస్, గుడిసె కోటేశ్, చిటిమెల్లి రమేష్ గుప్త, సిరిపురం రాము గమనిక: అభిషేకం 51/-, హోమము 101/- రూ॥లు చెల్లించి రశీదు పొందగలరు. మరిన్ని వివరాలకు సంప్రదించండి: పల్లెర్ల మహేందర్ సెల్: 94902 59621 నూనె రాంమోహన్ సెల్: 9618444824 కార్యక్రమ సరళి: తేది: 07-03-2024 గురువారం రోజున ఉదయం గం|| 10.08 ని॥లకు : స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, నవగ్రహ స్థాపన, రుద్ర కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవత హవనం, రుద్ర హననం, తీర్థ ప్రసాద వితరణ. సా॥ గం॥ 6.03 ని.ల నుండి: శ్రీ నగరేశ్వర స్వామికి సామూహిక రుద్రాభిషేకం, హారతి, తీర్ధప్రసాద వితరణ. తేది: 08-03-2024 శుక్రవారం మహా శివరాత్రి రోజున ఉదయం 6.00 గం॥ల నుండి: సామూహిక అభిషేకములు 10.08 గం.ల నుండి: రుద్ర హవనము సాయంత్రం 5.30 గం॥లకు : శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ ఆవరణ నుండి శ్రీ నగరేశ్వర స్వామి ఊరేగింపులో సమస్త భక్త జనులు, వాసవి వనితా క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య మహిళలందరు పాల్గొనెదరు. సాయంత్రం 6.30 గం॥లకు : శ్రీ నగరేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము రాత్రి 9.00 గం॥లకు : ప్రసాద వితరణ తేది: 09-03-2024 శనివారం రోజున ఉదయం గం॥ 9.09 ని॥లకు : గం॥ 11.01 మి.ల నుండి; శ్రీ నగరేశ్వర స్వామికి రుద్రాభిషేకం మరియు అన్నపూజ అన్న ప్రసాద వితరణ. (అన్నదానం)
0 - 0