Channel Avatar

Real Estate Tv @UCCCR6kpN-YTiYjRVVey636Q@youtube.com

125K subscribers - no pronouns :c

welcome to Real Estate Tv official YouTube Channel Do Subs


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Real Estate Tv
Posted 16 hours ago

హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలన్నారు. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను చెప్పారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ప్రధానకార్యదర్శి శాంతి కుమారి గారు, ఇతర ఉన్నతాధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎంగారు సుదీర్ఘంగా సమీక్షించారు.

✅ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు.

✅ పర్యావరణ హితంగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

✅ అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీలు, తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనులు చేయాలని సూచించారు.

✅ గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు.

✅ ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ & లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

✅ యాంటీ బయాటిక్స్, ఫెర్మంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మోటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.

✅ వీటితో పాటు పరిశోధన, అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

3 - 0

Real Estate Tv
Posted 2 days ago

హైడ్రా రావొద్దు మేమే కూల్చేస్తం : నోటీసులపై మురళీమోహన్

హైడ్రా అధికారుల నోటీసులపై సినీ నటుడు మురళీమోహన్ స్పందించారు. 33 ఏళ్లుగా తాను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానన్న మురళీమోహన్.. తాను ఎలాంటి అక్రమణలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారని.. అందుకు హైడ్రా అధికారులు రావాల్సిన అవసరం ఏమీ లేదని.. ఆ షెడ్డును తామే కూలుస్తామని స్పష్టం చేశారు. కాగా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (FTL), బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో మురళీమోహన్ స్పందించారు.

నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.

8 - 2

Real Estate Tv
Posted 6 days ago

Fractional Real Estate Investments Opportunities in India and USA Survey

Unlock your chance to shape the future of real estate investing with 22 Yards! ⭐️We’re on a mission to democratize access to high-value properties in India and the U.S., 🏨🏢and we want to hear from you. Take a moment to share your thoughts in our quick survey—your insights could help redefine the investment landscape_. [survey.22yardsprop.com/]

4 - 0

Real Estate Tv
Posted 6 days ago

Breaking News

బ్రేకింగ్...

ఓ.అర్.ఆర్ పరిధిలో 51 గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ గెజిట్ విడుదల..

కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులతో నిర్ణయం..
.........................................
ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం..

హైదరాబాద్‌: ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలు విలీన జాబితాలో ఉన్నాయి.

పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో.. బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్‌ తారామతిపేట పంచాయతీలు విలీనం..

శంషాబాద్ మున్సిపాలిటీలో.. బహదూర్‌గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ విలీనం..

నార్సింగి మున్సిపాలిటీలో.. మీర్జాగూడ గ్రామపంచాయతీ ...

తుక్కుగూడ మున్సిపాలిటీలో.. హర్షగూడ గ్రామపంచాయతీ
మేడ్చల్ మున్సిపాలిటీలో.. పూడూరు, రాయిలాపూర్ గ్రామపంచాయతీలు ..

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో.. కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి ..


నాగారం మున్సిపాలిటీలో.. బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు..

పోచారం మున్సిపాలిటీలో.. వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ విలీనం...

ఘట్‌కేసర్‌ మున్సిపాల్టీలో.. అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనం..

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో.. మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు..

తూంకుంట మున్సిపాలిటీలో.. బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం

7 - 1

Real Estate Tv
Posted 1 week ago

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన ప్రాథమిక నమూనాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశీలించారు. ఆర్కిటెక్టులకు పలు మార్పులు సూచించిన ముఖ్యమంత్రి గారు వీలైనంత తొందరగా మార్పులతో కూడిన ప్రాథమిక డిజైన్లను రూపొందించాలని చెప్పారు.

22 - 1

Real Estate Tv
Posted 1 week ago

*🔸 ఎకో, హెల్త్ , టెంపుల్ టూరిజాలకు విడివిడిగా పాలసీలు*
*🔸 పర్యాటక అభివృద్ధిపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు*

తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులకు చెప్పారు. ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలకు విడివిడిగా పాలసీలను రూపొందించాలని సూచించారు.

🔸స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (#SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సూచించారు.

🔸మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో పర్యాటక రంగానికి సంబంధించిన అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.

🔸హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జామ్ నగర్ లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ప్రస్తావించారు.

🔸అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎంగారు సూచించారు.

🔸హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని అన్నారు.

35 - 0

Real Estate Tv
Posted 1 week ago

తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే విధంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నూత‌నంగా ఏర్ప‌డ‌నున్న ఫ్యూచర్ సిటీలో నెల‌కొల్ప‌నున్న ప‌రిశ్ర‌మ‌లు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వ‌సతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలన్నారు.

ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌దారి అంశాలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సుదీర్ఘ స‌మీక్ష నిర్వ‌హించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమన్ గల్ – చేవెళ్ల – శంకర్ పల్లి – సంగారెడ్డి వరకు) అధికారులు రూపొందించిన అలైన్‌మెంట్‌లో మరికొన్ని మార్పుల‌ను ముఖ్య‌మంత్రి సూచించారు. ప్ర‌తిపాదిత రేడియ‌ల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ స‌మీక‌ర‌ణ, భూ సేక‌ర‌ణ‌ చేయాల‌న్నారు. భూములిచ్చే రైతులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందేలా చూడాలని ఆదేశించారు.

మనదగ్గర డ్రైపోర్టును ఏపీలోని మ‌చిలీప‌ట్నం, కాకినాడ రేవుల‌తో అనుసంధానం చేసే అవకాశాలపై అధ్య‌య‌నం చేశాకే గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని, ఇన్‌ల్యాండ్ వాట‌ర్ వేస్ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సీఎం అన్నారు.

#ORR - #RRR మ‌ధ్య రావిర్యాల నుంచి అమ‌న్‌గ‌ల్ వ‌ర‌కు నిర్మించ‌నున్న ర‌హ‌దారిలో మూడు చోట్ల ఉన్న అట‌వీ ప్రాంతాల‌ను నైట్ స‌ఫారీలుగా మార్చే అంశంపై కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. కాలిఫోర్నియాలో ఆపిల్ పండ్లతోటలోనే 'ఆపిల్' సంస్థ కార్యాలయం, బెంగ‌ళూరులో జిందాల్ నేచ‌ర్ కేర్ తరహాలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలోనూ పర్యావరణహిత నిర్మాణాలకు అధ్యయనం చేయాలన్నారు. ప్రకృతి సౌంద‌ర్యానికి నెలవైన రాచకొండలో సినీ ప‌రిశ్ర‌మ‌ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు.

ఆర్ఆర్ఆర్‌, రేడియ‌ల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన భూ స‌మీక‌ర‌ణ‌, భూ సేక‌ర‌ణ విష‌యంలో అన్ని శాఖ‌ల అధికారులు సమన్వయంతో పని చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించారు.

26 - 1

Real Estate Tv
Posted 1 week ago

*అమరావతి:*

ఏపీలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి.

కోర్టుల్లో జడ్జిల తరహాలో సబ్ రిజిస్ట్రార్లు కూర్చొనే విధానానికి చెల్లు చీటి పలికేలా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల రూపు రేఖలు మార్చే అంశంపై ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు.

అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్ట్రార్ల సీటింగ్ ఉండేలా చర్యలు.

సబ్ రిజిస్ట్రార్లు కూడా సామాన్యులేననే భావన కలిగేలా రెవెన్యూ శాఖ కసరత్తు.

ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే సర్కులర్ జారీ చేయనున్న రెవెన్యూ శాఖ.

19 - 2

Real Estate Tv
Posted 2 weeks ago

కొంగరకలాన్ లో కేన్స్ సంస్థ ప్రారంభం.

*రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజికవర్గం కొంగరకలాన్ ప్రాంతంలో నెలకొల్పిన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పరిశ్రమను శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు…గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించడం జరిగింది…ఇట్టి పరిశ్రమల ఏర్పాటు కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడుతుందని తెలియచేశారు…..23//08//2024*

29 - 0

Real Estate Tv
Posted 2 weeks ago

*✅ రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై ఇక రోజువారీ పరిశీలన*
*✅ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో భూసేకరణ వేగం పెంచండి*
*✅ రైతులకు న్యాయం జరిగేలా పారదర్శకత పాటించండి*
*✅ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే అలైన్‌మెంట్ ఉండాలి*
*✅ RRR ప్రగతిపై ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*

తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.

భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లు ఇకపై రోజూవారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం పేర్కొన్నారు.

అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య అనుసంధానానికి అనువుగా రహదారుల ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధాన రహదారులకు అనుసంధానం చేసే ప్రదేశాలను ముందుగానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు.

భవిష్యత్తు అవసరాలే ప్రాతిపదికగా RRR అలైన్‌మెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ రకాల పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ రోడ్ల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు.

ఆర్ఆర్ఆర్ కింద ఉత్తర భాగం సంగారెడ్డి – భువనగిరి – చౌటుప్పల్ మార్గంలో భూసేకరణ దాదాపుగా పూర్తి కాగా, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలోని (చౌటుప్ప‌ల్-ఆమ‌న్‌గ‌ల్‌ -షాద్ న‌గ‌ర్‌ -సంగారెడ్డి (189.20 కి.మీ.)మార్గానికి సంబంధించి భూ సేక‌ర‌ణ,అలైన్‌మెంట్‌ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి త్వరగా అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని సీఎం చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

11 - 0