Channel Avatar

Akondi Haripriya Devotional @UC9sxhXv6z2DpMvDOfjg5upQ@youtube.com

53K subscribers - no pronouns :c

"Akondi Haripriya" is devotional channel in Telugu which cat


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Akondi Haripriya Devotional
Posted 1 week ago

🌿🌼నవంబర్ 19వ తేదీ, అంగారక సంకష్టహర చతుర్థి 🌼🌿

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి , రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని , పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు

ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా , చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి

🌿🌼సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం🌼🌿

సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి , తరువాత గణపతిని పూజించాలి.అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానినిపసుపు , కుంకుమలతో అలంకరణను చేయాలి.మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండుఖర్జూరాలు , రెండు వక్కలు , దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.సంకటనాశన గణేశ స్తోత్రం , సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.

ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కానిచేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు.సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి

ఓం గం గణపతయే నమః

136 - 0

Akondi Haripriya Devotional
Posted 1 week ago

video link --https://youtu.be/xPm3RWn2S7Y
కార్తీక మాసంలో 3వ సోమవారం పూజ విధానం
శివాభిషేకం ఫలితాలు 108 మారేడు దళాలతో శివ పూజ

24 - 0

Akondi Haripriya Devotional
Posted 2 weeks ago

video link -- https://youtu.be/1CXRHiElC7w
కార్తీక మాసంలో ఉసిరి కాయ దీపం ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎవరు పెట్టాలి ఉసిరి దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితాలు

14 - 3

Akondi Haripriya Devotional
Posted 2 weeks ago

video link -- https://youtu.be/H9R5Z6_SMNE
కార్తీక పౌర్ణమి పూర్తి పూజా విధానం 365 వత్తులు ఎలా వెలిగించాలి

36 - 0

Akondi Haripriya Devotional
Posted 2 weeks ago

video link -- https://youtu.be/Irnco-SG7ZQ
365 వత్తులు ఎలా వెలిగించాలి ,ఎప్పుడు ,ఎక్కడ వెలిగించాలి

20 - 0

Akondi Haripriya Devotional
Posted 2 weeks ago

video link --https://youtu.be/Gf9RXQOKSTg
క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం

21 - 0

Akondi Haripriya Devotional
Posted 3 weeks ago

video link --- https://youtu.be/-BFWxcvK-z8
కార్తీక పురాణం 6వ రోజు అధ్యాయం

10 - 0

Akondi Haripriya Devotional
Posted 3 weeks ago

video link --- https://youtu.be/yeHvX2F49aY
కార్తీక మాసం లో తప్పకుండా ఆచరించవలసిన పూజ కార్తీక దామోదర పూజ

15 - 0

Akondi Haripriya Devotional
Posted 3 weeks ago

video link -- https://youtu.be/Il0J0iTv4XM
karthika puranam 3va adhyayam

12 - 0

Akondi Haripriya Devotional
Posted 3 weeks ago

video link -- https://youtu.be/ewLDD5fcn6Y
నాగుల చవితి పూర్తి పూజా విధానం సంతానం కోసం వంశాభివృద్ధి కోసం తప్పకుండా చేయాల్సిన పూజ

32 - 0