https://youtu.be/DNTEag_wInc
అమలాపురం ... ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా??
కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి ఒకప్పుడు అమృతపురి, అమ్లీపురి అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో అది అమలాపురంగా రూపాంతరం చెందడానికి ఒక ముఖ్య కారణం- ఇక్కడ నెలకొన్న శ్రీ అమలేశ్వర స్వామివారే అని చాలా మంది భావిస్తారు. అమలేశ్వరీ సమేత శ్రీ అమలేశ్వర స్వామివారి ఆలయం ఒక తోట మధ్యలో, ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. మహాభారత కాలంలో ద్రౌపదిదేవి శ్రీ అమలేశ్వర స్వామివారిని అర్చించినట్లుగా చెబుతారు.
4 - 0
https://youtu.be/RKHaqzTqkjE
శ్రీరంగంలో నెలకొన్న రంగనాథ స్వామివారి ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. భక్తులకు మెరుగైన సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 2012న అప్పుడున్న ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఈ ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు.
3 - 0
https://youtu.be/2DvlY9JgaM4
మహాశివరాత్రి రోజున SVBC TVలో చూపించే శివలింగం
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీసు పక్కనే ఉన్న ఒక వనంలో శ్రీవారి నమూనా ఆలయం, అటు ప్రక్కనే SV Vedic Sivalayam కూడా ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ SV ధ్యానారామంలో నెలకొన్న మహా శివలింగాన్ని దర్శిస్తే మన మనస్సు ఎంతో భక్తి భావనతో ఉప్పొంగుతుంది.
చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్ శిలతో తయారుచేయబడిన ఈ మహా శివలింగం యొక్క ఎత్తు 11 అడుగులు, అలాగే బరువు సుమారు 25 టన్నులు. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కూడా దర్శించి, తరించండి !!
5 - 0
జపాన్ ఆలయంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహం ఎందుకు వుంది?
youtube.com/shorts/lNc2UuavQo...
Renkō-ji (రెంకో-జీ) జపాన్‌లోని టోక్యోలో ఒక బౌద్ధ దేవాలయం. ఈ ఆలయం లోపల నేతాజీ సుభాస్ చంద్రబోస్ గారి అస్థికలు సెప్టెంబరు 1945 నుండి భద్రపరచబడినట్లుగా చెబుతారు. అందుకే నేతాజీ సుభాస్ చంద్రబోస్ గారి విగ్రహం ఇప్పటికీ ఈ ఆలయ అవరణలో చూడవచ్చు.
7 - 0
Video Link <https://youtu.be/8hSWhjhZyf4>
ధనుర్మాసం క్విజ్: ద్వితీయ భాగం || Dhanurmasam Quiz: Part-II
ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదని మనకు తెలుసు. అలాగే ధనుర్మాసం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేవి: తిరుప్పావై, గోదాదేవి (ఆండాళ్), వైకుంఠ ఏకాదశి.
ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి కావస్తున్న తరుణంలో, మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానానికి ఒక చిన్న పరీక్ష !! మేము రూపొందించిన ఈ “ధనుర్మాసం క్విజ్” వీడియోపై మీయొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు అందించగలరు.
4 - 0
ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ...మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు !!
7 - 0
“శ్రీగిరి నిలయం” ఛానెల్‌కు స్వాగతం, సుస్వాగతం. ఇందులో ఆధ్యాత్మికం/భక్తి, యాత్ర, జిహ్వ చాపల్యం, జీవన శైలి మరియు విజ్ఞానం వంటి విషయాలపై వీడియోలు ఉంటాయి. మీకు ఈ వీడియోలు నచ్చితే, నా ఛానెల్‌కు సబ్స్క్రయిబ్ చేయండి, అలాగే ఈ వీడియోలపై మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వండి.
Welcome to my channel- "Srigiri Nilayam". The channel covers various topics related to Devotional, Pilgrimage, Food, Life Style and Technology. Please subscribe to my channel if you like the contents and also do leave your comments & suggestions for the videos that I create.
#SrigiriNilayam #srigirinilayam #శ్రీగిరినిలయం #ఆధ్యాత్మికం #భక్తి #యాత్ర #జిహ్వచాపల్యం #జీవనశైలి #విజ్ఞానం
Joined 6 May 2020