జనహితమే జర్నలిజమని నమ్మిన మా హృదయాల సాక్షిగా
మా మదిలో పురుడు పోసుకున్నదే మన People Media Point. నిజాన్ని నిర్భయంగా... నిక్కచ్చిగా... నిష్పక్షపాతంగా ... ఖచ్చితత్వంతో... సామాజిక భాధ్యతతో...
అక్రమాలను అడ్డగించే ఆయుధమై...
నిజాన్ని నిలదీసే నిఘా నేత్రమై...
సమగ్ర విశ్లేషణలతో...
అన్వేషిత కధనాలతో...
జన జవాబుదారిగా మీ ముందుకు.. మన People Media Point.
కష్టించి పండించిన పంట చేతికందక ఉరితాడుకు ఊయలై జీవి నిడిచిన కర్షకులు... అమ్మనాన్నల ఆశయమై ఉన్నత విద్యలు అభ్యసించినా ఉద్యోగాలు రాక కూలీలుగా మారుతున్న నిరుద్యోగులు...
కరాలనే ఆయుధాలుగా, నరాల బిగువును శక్తిగా మలచి మానవాళి ఆకలిని తీర్చే కార్మికులు..
తమ రుదిరాన్ని పెట్టుబడిగా మలుచుకొని కష్టించే శ్రామికులు...
దశాబ్దాలు గడిచినా జన స్రవంతిలో తిరగలేక అత్యాచార కుంపటిలో కరిగిపోతున్న కర్మభూమి పుత్రికల కన్నీటి కధనాలు....
ఇలా ఎన్నో అంతులేని విషయాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు మీ పీపుల్ మీడియా పాయింట్ లో...