ప్రకృతి సంస్కృతి సంస్కృతం
సనాతన ధర్మం అయిన హిందూ ధర్మం అంటే ఏమిటో కాదు . ప్రకృతి సంస్కృతి సంస్కృతం . ఇక్కడ ప్రకృతి అంటే రెండు అర్థాలు వస్తాయి . ఒకటి ప్రకృతికి హాని కలిగించకుండా ప్రకృతిని వాడుకొంటూ అదే ప్రకృతిని భవిష్యత్తు తరాలకు అందవేయడం. రెండవ అర్థం ప్రకృతి అంటే జంతుజాలా జీవనం లేదా పోటీ తత్వం ఉన్న జీవనం . ప్రకృతి అవధులు దాటి మానవుని మేధస్సుతో , విచక్షణతో కొన్ని యమ నియమాలు పెట్టుకొని మానవులని సంస్కరించాలి అనే ఉద్దేశ్యంతో ఏర్పరిచిన జీవన విధానం సంస్కృతి . సంస్కృతం అంటే సంస్కరించ బడిన శబ్దార్ధ భావ వ్యక్తీకరణ విధానం.