in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Poetry చచ్చిపోతున్న ఈ కాలంలో, నా Post కి మీరంతా ఇచ్చిన Response నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఆ ఉత్సాహంలో ఈ సారి Jon Snow ని దింపాను :)
అతనికి తెలుసు...
అమ్మ కాని ఆ అమ్మ,
తననెప్పటికీ నమ్మదని
అతనికి తెలుసు
నాన్న తనవాడైనా
ప్రేమ పంచలేడని...
అతనికి తెలుసు
అన్నదమ్ముల బంధమైనా,
అధికారం లేదని...
అతనికి తెలుసు
ఇంట్లో చోటున్నా
తనకో ఇంటి పేరు లేదని
అతనికి తెలుసు
చెల్లెళ్ళ చిలిపి నవ్వులైనా
తమ్ముళ్ల తడి కౌగిళ్ళయినా
హక్కుతో అడిగేవి కాదని...
అతనికి తెలుసు
గుండెలో లావాలు పొంగుతున్నా
'మంచు' మాటున
మరిగిపోవాల్సిందేనని
అతనికన్నీ తెలుసు...
అయినా ఆమె -
ఎందుకలా అంటుంది?
Jon Snow!... నీకేం తెలీదు!
నీ...కేం తెలీదు
నీకేం... తెలీదు.... అని
ఎందుకలా అంటుంది!
181 - 32
Game Of Thrones గురించి Poetry రాసే చిన్న Experiment చేసాను. మరీ Complicated చెయ్యకుండా సింపుల్ గానే రాసాను. పూర్తిగా చదివి, అమ్మెవరో, బొమ్మలేవో కామెంట్ చెయ్యండి.
అమ్మ - బొమ్మలు!
అర చేతులు పట్టని
ఆ గుండ్రని బొమ్మతో ఆడుకున్నారట
తనకి తెలియని, తనవాళ్లంతా!
తనకో మరి?
బొమ్మ చేతికొచ్చేసరికి
అమ్మయ్యే వయసొచ్చింది,
పోనీలే, పుట్టబోయే పసివాడికి
ఒకటికి మూడిద్దామనుకుంది...
కడుపులో పడ్డ బిడ్డ
భూమ్మీద పడలేక
మధ్యలోనే మాయమైతే
మాటరాని రాతి బొమ్మయింది
కట్టుకున్న వాడి కట్టె
కట్టెల్లో కాలిపోతే
మనసులోని మంటలతో
దేహాన్ని కాసుకుంది
రెండు దేహాలు
తన హృదయానికి నిప్పంటిస్తే
మూడు ప్రాణాలు నిప్పులు కక్కుతూ
జీవం పోసుకున్నాయి
అప్పుడయింది అమ్మ
రెక్కలొచ్చిన మనసుతో,
రెక్క తొడగబోయే
ఆ మూడు నిప్పు బంతులకీ...
అప్పుడయింది అమ్మ
మోసి కనకుండానే
తనని మొయ్యబోయే
ఆ మూడు మహా శక్తులకీ!
ఇప్పుడిక ఆమె కీర్తికి
ఆకాశమే సింహాసనం!
ఇప్పుడిక ఆమె చూపుకి
ప్రపంచమంతా దాసోహం!
69 - 41
ఈ మధ్య Game Of Thrones గొడవలో పడి, చదవడం, రాయడం పూర్తిగా మానేసాను. అంటే Novels చదవడం, Poetry రాయడం లాంటివన్నమాట. ఈ వీడియోస్ చెయ్యడానికే ఎంత టైం అయినా సరిపోవట్లేదు. I hope it is just a phase. ఇక అసలు ఈ పోస్ట్ పెట్టడానికి రీజన్ ఏమిటంటే ఈ మధ్య ఒక ఆడియో బుక్ విన్నాను. అది నన్ను నిజంగా Surprise చేసింది. మనవాళ్లంతా The Haunting Of Hill House చూసే ఉంటారు. చూడకపోతే చూడండి. Netflix లో ఉంటుంది. మంచి Horror సిరీస్. ఈ హారర్ సిరీస్ Original Story రాసింది Shirley Jackson. బ్రతికింది 48 ఏళ్ళు, రాసింది 20 ఏళ్ళే అయినా, ఆరు నవలలు, 200 వరకూ Short Stories రాసారామె. అలా ఆమె రాసిన ఒక Short Stories Collection పేరు Dark Tales . అసలు ఆ స్టోరీస్ వింటుంటే భలే ఆశ్చర్యం కలిగింది. మన లోపల ఉండే చిన్న చిన్న Insecurities, ఫాంటసీ లూ, భయాలూ, Random Thoughts, violent thoughts, మరింకేవో రాకూడని ఆలోచనలు...ఇలాంటివన్నీ నిజమైపోయి ఎదురుగా వస్తే ఏం జరుగుతుందో కథల్లాగా చెబుతూ, ఎంత బ్యూటిఫుల్ గా Narrate చేశారంటే, 'అసలు వీటి గురించి అందరికీ తెలియకపోతే ఎలా!' అని బలంగా అనిపించేసి ఈ పోస్ట్ రాస్తున్నాను. ఈ కథలు పూర్తి Horror కాదు. మామూలు Thrillers కూడా కాదు. Dark Humor కలగలిసిన Dark Tales.
1. ఒక ఊరిలో అందరితో మంచిగా ఉండే ఒక ముసలావిడ అందరినీ తిడుతూ ఉత్తరాలు రాస్తోందని ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోతే?
2. ఏ కారణం లేకుండా ఒకమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే?
3. పెళ్లయిన వారానికే, భర్త ఒక Murderer అని అనుమానం వచ్చిన ఒక స్త్రీ, తన హత్య ఎప్పుడు జరుగుతుందోనని ఎదురు చూస్తూ గడిపితే...
4. ఒంటరిగా బ్రతుకుతున్న ఒక హై స్కూల్ టీచర్, ఒక చిన్న పాపకి భయపడితే...
5. ట్రిప్ కి వెళ్లి తిరిగొచ్చిన భర్త కొత్తగా ప్రవర్తిస్తుంటే, అతను తన భర్త కాకుండా వేరే వ్యక్తేమోనని ఒక భార్య ఆశ పడితే?
6. ఫ్రెండ్ భర్త చనిపోయాడని వాళ్ళింటికి వెళ్లిన ఒక స్త్రీ, అక్కడి ఒక పెయింటింగ్ లో చిక్కుకుపోతే...
7. ఒక పదిహేనేళ్ల అమ్మాయి, తల్లి తండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయారని తెలిసినా అస్సలు బాధ పడినట్టు కనిపించకపోతే, ఏడవకపోతే?
8. తనని ఎంతగానో ప్రేమించే భర్తని ఏ కారణం లేకుండానే చంపాలని, ఒక భార్యకి అనిపిస్తే...
కథలన్నీ ఇటువంటి వింత వింత ఆలోచనల్లోంచి పుట్టినవే. ఇక Shirley Jackson writing Style ఎంత Simple గా ఉంటుందో అంత Beautifulగా ఉంటుంది. Translate చేసి వీడియోస్ చెయ్యాలని ఉంది గానీ, ఎవరికీ Interest ఉండదేమోనని చెయ్యడం లేదు.
67 - 17
Hello Friends...అందరూ బావున్నారా? ఇది చూడండి! ఈ మధ్య Game Of Thrones Videos కోసం ఏవైనా ఇమేజ్ లు దొరక్కపోతుంటే, ఒక Generative AI లో Images Create చెయ్యడానికి Try చేస్తున్నాను. "Image To Video" ఎలా వస్తుందో చూద్దామని George R R Martin ఫోటో ఒకటి ఇచ్చి, ఆయన చెయ్యి ఊపినట్టుగా వీడియో Create చెయ్యమన్నాను. ఎలా వచ్చిందో చూడండి! ఎవరి Hand తీసుకొచ్చి పెట్టిందో ఏంటో! మన మార్టిన్ ఇమేజ్ కదాని, సరదాగా share చేస్తున్నాను. వెనక Bus, మనుషులు, నేల మీద నీళ్లు కూడా కదులుతున్నాయి చూడండి!
86 - 25
చిన్నప్పటి నించీ సైన్స్ ఫిక్షన్ పేరు చెబితే ఆకాశంలో... కాదు కాదు... అంతరిక్షంలో తేలిపోయే నేను, చాలా Sci fi బుక్స్ చదివాను. సిరీస్ లూ, సినిమాలూ చూసాను గానీ Dune Novels మాత్రం ఇప్పటివరకూచదవనేలేదు. అంటే... ఒకసారి Start చేసాను గానీ ఎందుకో ఆపేసాను. Dune ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు. కానీ సెకండ్ మూవీ చూసాక మాత్రం, నాకెంతో ఇష్టమైన Genre లో ఒక కొత్త ప్రపంచాన్నే మిస్ అవుతున్నానా అనిపించింది. పెద్దగా ఈ యూనివర్స్ ని ఫాలో కాకపోవడం వలన @storiesocean షార్ట్ చూస్తే గానీ Dune : Prophecy సిరీస్, నవంబర్ 17th న Jio Cinema లో Stream అవుతోందని తెలీలేదు. ఆ సిరీస్ ట్రైలర్ చూస్తే మాత్రం భలే అనిపించింది. చాలా ప్రామిసింగ్ గా ఉంది. Surprising గా మన Indian Actress Tabu కూడా కనిపించింది. ఇప్పుడు సీరియస్ గా Dune బుక్స్ చదవడం మొదలు పెట్టాను. I am Just Enjoying Them! నాకు ఆ టాపిక్ మీదా, యూనివర్స్ మీదా కొంత గ్రిప్ వచ్చాకా మీతో కూడా పంచుకుంటాను. I hope my YouTube family will like these videos as well!
141 - 28
తెలుగు భాష మీద ఇంత పట్టు ఉన్న నేను, GOT, HOTD దారి పట్టి తప్పు చేసానని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ నేను తెలుగు పుస్తకాల మీదా, సాహిత్యం మీదా, పాటల మీదా కొన్ని వందల వీడియోలు చేసాను. నేనే స్వంతంగా రాసిన కవితలూ, కథలూ ఎన్నో ఉన్నాయి. అప్పుడు వీళ్లంతా ఏమైపోయారో తెలీదు. నిజమే. GOT లో చాలా వయొలెన్స్, అడల్ట్ కంటెంట్ ఉంటాయి. ఈ టాపిక్ మీద ఫస్ట్ వీడియో చేసినప్పుడు చాలా భయపడ్డాను కూడా. అప్పటివరకూ ఎంత మంచి వీడియోస్ చేసినా తిట్లూ, సెక్సిస్ట్ కామెంట్లే తెలుసు నాకు You tube లో. కానీ GOT ఫస్ట్ వీడియోనే నాకు ఎంతో ధైర్యాన్ని తెచ్చిపెట్టింది. GOT Telugu Fans కి నిజంగా అభిమానించడం తెలుసు. Respect ఇవ్వడం తెలుసు. చివరికి మనిషికి కావాల్సినవి అవే!
151 - 85
ఈ సారి 2024 Emmy Awards వర్షం SHOGUN అనే జపనీస్ కథకి చెందిన సిరీస్ మీద కురిసింది. ఈ సిరీస్ కథ మొత్తం నేను ఎప్పుడో నాలుగు నెలల క్రితమే వీడియో గా చేసాను. అప్పట్లో ఎవరికీ పెద్దగా ఆ సిరీస్ గురించి తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైనా ఆ కథ కోసం వెతుకుతుంటే ఈ వీడియో చూడండి.
Spoiler Alert! సిరీస్ పూర్తి కథ చెప్పాను కనుక షో చూసాకే చూడండి. మన Subscriber Raghavendra Suru గారు షోగన్ కథ గురించి ఎప్పటినించో అడుగుతున్నారు. రాఘవేంద్ర గారూ... మీరు ఈ వీడియో చూసే అడుగుతున్నారా? వివరంగానే చెప్పాను.
15 - 2
హలో ఫ్రెండ్స్... బావున్నారా? నేను ఎప్పటినించో నాకు నచ్చిన సినిమాల రివ్యూస్ నా ఛానెల్ లో పెడుతూ వచ్చాను. ఈ మధ్య Game Of Thrones Content చెయ్యడం మొదలు పెట్టాకా, రివ్యూస్ లాంటివి తగ్గించేసాను. ఇప్పుడు "సరిపోదా శనివారం" సినిమా రిలీజ్ అవుతోంది కదా. మీకెవరికైనా ఆ మూవీ రివ్యూ నావైపు నించి వినాలని ఉంటే కనుక పోల్ చెయ్యండి. ఒక 200 మెంబర్స్ అయినా చెప్పమంటేనే అసలు సినిమా చూస్తాను. లేదంటే ఎప్పుడో OTT లోకి వచ్చాకా చూస్తాను. తప్పకుండా మీ Opinion చెబుతారు కదూ...
33 - 28
Maegor the Cruel ఎంట్రీ జరిగిపోయింది మన కథలో. Aegon the Conqueror ఇద్దరు కొడుకుల కథనీ The Sons Of The Dragon పేరుతో రాసారు George R R Martin. అదే కథ, కొంత వేరియేషన్ తో Fire and Blood బుక్ లోనూ, The Rise of the Dragon బుక్ లోనూ కూడా ఉంటుంది. మూడు బుక్స్ లో ఉన్న స్టోరీస్ ని summarize చేసి మీ కోసం వీడియోగా చేశాను. తప్పకుండా చూడండి.
ఇక Martin రాసిన The Ice Dragon అనే కథని తెలుగులోకి translate చేస్తున్నాను. త్వరలో ఆ స్టోరీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ Ice Dragon కథ ఎందుకో గానీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ కథతో Warner Group వాళ్ళు ఒక Animation film కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టోరీ మీకూ నచ్చుతుందనే అనుకుంటున్నాను.
14 - 3
మన Game Of Thrones వరల్డ్ కి కొత్త హీరో Daemon అయితే, పాత హీరో Tyrion. అతని ఇంట్రెస్టింగ్ బ్యాక్ స్టోరీ తో వీడియో పెట్టాను. చూడకపోతే చూడండి.
అన్నట్టు నేను ఈ మధ్య ఎక్కువగా GOT వీడియోస్ చేస్తున్నాను గానీ, ఇంతకుముందు చాలా విషయాల్లో చెయ్యి కాల్చుకున్నాను. చెయ్యి కాల్చుకోవడం అంటే వంటలు చేసి చూపించానని కాదు, చాలా టాపిక్స్ మీద వీడియోస్ చేసాను. చిన్న చిన్న Quotes లాగా నేను రాసిన poetry Play List ఇస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.
www.youtube.com/playlist?list...
18 - 5
కథలూ, కబుర్లూ, సినిమాలూ ఇంకా మ్యాజిక్ కూడా!