పరమశాంతి! ఇది ప్రతి మనిషికీ అదే పరమావధి!! కానీ నిజానికి అది ఇప్పటికే మనలోనే ఉన్న తరగని నిధి!!! అదే పరమాత్ముని సన్నిధి!!!! కానీ మన ఆలోచనలు... ఆశలు... ఆకాంక్షలు... ఆ సన్నిధిని తెలియకుండా చేస్తున్నాయి. అందరిలో ఉండే అత్యంత సహజమైన గమనింపు శక్తిని ఉపయోగించి సరళమైన విచారణ మార్గంలో ఆనందాన్ని అనుభవించవచ్చు. అవగాహన అనే ఆయుధంతో మనలోని అజ్ఞానాన్ని ఎలా ఛేదించాలో, శుభేచ్ఛతో జ్ఞానదీపం ఎలా వెలిగించాలో తెలియజేసే శివశ్రీ రమణ గురుదేవుల బోధామృత వేదిక ఈ రమణీయం ఛానల్.