• భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశ ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంచటం.
• ప్రపంచవ్యాప్తంగా బలపడుతున్న మానవవాదాన్ని తెలుగు నాట పరిచయం చేయటంతో పాటు జనాన్ని మతాలకు అతీతంగా ఆలోచింపజేయటం.
• ప్రతి విషయంలోనూ కార్య కారణ సంబంధాన్ని ఎత్తి చూపుతూ బాల బాలికలని, యువతీ యువకులని హేతుబద్దంగా ఆలోచింపజేయటం
• అమాయకత్వం, అజ్ఞానాలతో మూఢనమ్మకాలకు బలి అవుతున్న వారిని హెచ్చరించటం
• మూఢవిశ్వాసాలని నిర్మూలించే దిశగా కృషి చేయడం.
• దొంగ బాబాల, స్వాముల బండారాలు బయట పెట్టడం.
• విద్యావంతులైనప్పటికీ తమ వివేకాన్ని ఉపయోగించకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వారిలో మార్పు తేవటం.
• 21వ శతాబ్దంలో కూడా స్త్రీలకు దక్కకుండా పోతున్న స్వేచ్చను, హక్కుల్ని వారికి దక్కే దిశగా విషయాల్ని విశ్లేషించటం.
• కట్టుకథల అద్భుత కల్పనల గుట్టు రట్టు చేయటం.
• చర్చించే విషయం ఏదైనా సరైన ఆధారాలు చూపుతూ జన చైతన్యానికి దోహదం చేయటం.
• జన చైతన్యానికి, మానవీయ విలువల పరిరక్షణ కోసం సాహితీ ప్రక్రియల్ని, ఉపన్యాసాలను, ఇంటర్వ్యూలను ఈ ఛానల్ ఉపయోగించుకుంటుంది