పూజ్య శ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద (98499 36999) గారు వివేకానంద రామతీర్థ రచనలకు ప్రభావితులై ఆత్మ జ్ఞానంపై గల జిజ్ఞాసతో ఋషికేశ్ దయానంద అర్షవిద్య గురుకులంలో మరియు సాందీపని సాధనాలయంలో వేదాంతాన్ని అభ్యసించి, తరువాత ఉత్తరకాశీలో గల బ్రహ్మవిద్య కుటీరంలో ఆదిశంకరాచార్య భాష్యం అధ్యయనం చేసి, పూజ్య శ్రీ స్వామి తత్త్వవిదానంద సరస్వతి గారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. మానవ జన్మకు జీవనాధారం భగవద్గీత ఒక్కటే అని గ్రహించి అనేక ప్రాంతాలలో గీతా విజన్ సత్సంగాలు చేశారు. వీరి యొక్క ఉపన్యాసాలకు ముగ్ధులై వ్యాసఆశ్రమ పీఠాధిపతులు పూజ్య శ్రీ స్వామి పరిపూర్ణానంద గిరి వారు ”ఉపన్యాసక రత్న” అని బిరుదు ఇచ్చి స్వామి వారిని సత్కరించారు. భారత్ ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలవాలని మహాసంకల్పంతో పూజ్యశ్రీ స్వామి స్థితప్రజ్ఞానంద సరస్వతి వారు గీతా విజన్ ప్రాజెక్ట్ మరియు సనాతన సింధు సత్సంగ్ ట్రస్ట్ స్థాపించారు.
ఈ గీతావిజన్ వేదిక ద్వారా భగవద్గీత దీక్షలు మరియు బాలబాలికలకు యజ్ఞోపవీత సంస్కారము, భగవద్గీత యొక్క నిజమైన తత్త్వాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది.
Swami Sthitaprajnananda
sthitaprajna9@gmail.com