నిజ క్రైస్తవ జీవితానికి సరియైన పునాది, దైవ ప్రేరితములైన పరిశుద్ధ లేఖనాలే. వాటినే మన మార్గానికి వెలుగుగా; వ్యక్తిగత, సంఘ జీవితాన్ని నియంత్రించే సూత్రాలుగా ధృడ నిశ్చయం చేసుకోవడానికి సత్య వాక్యాన్ని సరిగా విభజించే ఆరోగ్యకరమైన బోధ ఈ దినాలలో అత్యవసరం. విశ్వాసుల ఆత్మీయ క్షేమార్థం ఇట్టి వాక్య బోధను అందిస్తూ, నశించే ఆత్మల రక్షణార్ధం లేఖనానుసారమైన సువార్త ప్రకటించడానికి ఈ ఛానెల్ ఉద్దేశించబడింది. ఇందలి సందేశాలు విని, మేలు పొందగలరు. ఇంకా ఇతరులకు కూడా పరిచయం చేసి, వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా తోడ్పడగలరు.