Channel Avatar

Naares creative @UCLZ-cr9HPYc2fML9t3_j30Q@youtube.com

18K subscribers - no pronouns :c

Rangoli, tips, recipes, kids,devostional blouse designs


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Naares creative
Posted 22 hours ago

ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి……….?

*పరమేశ్వరుణ్ణి ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా…………?*

శివ లింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.
సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది.

పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు
(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).

వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు” అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట.

శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే.
ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు.

శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని.
లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.

శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి.
బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా ఉంటుంది.

*శివ లింగములు – రకములు*

• స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.

• దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.

• రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలు.

• మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.

• బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).

*పంచభూతలింగాలు*

పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు
ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.

• 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు – అన్నామలై

• 2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం

• 3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం

• 4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి

• 5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు – శ్రీకాళహస్తి

*పంచారామాలు*

• 1. అమారారామము:
అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి

• 2. ద్రాక్షారామము:
ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ

• 3. కుమారారామము:
సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి

• 4 భీమారామము:
భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ

• 5. క్షీరారామము:
పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి.

కొన్ని విశేషాలు:

• శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు.
కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.

• కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం)
కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.

211 - 5

Naares creative
Posted 1 day ago

#అన్నవరం...

#అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది.

#రత్నగిరి సత్రం, దేవస్థానం వారి ఫలహార శాల దాటగానే ప్రవేశద్వారం కనిపిస్తుంది. అందులోంచి కొంతదూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది.

#సత్యనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారం దగ్గర గోడ మీద

''హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప''

అంటూ సాగిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు.

#అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి.

#కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా.

#అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది.

#స్థల పురాణాన్ని అనుసరించి-

#పూర్వం అనరాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో అనరాజు రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అడవికి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు. అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించాడు. రాజుకు కలలో కనిపించి ''బాధ పడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది..'' అని చెప్పి, సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోయాడు.

#కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతి ఒక కల కన్నాడు. ''రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని, దానివల్ల మేలు జరుగుతుందని'' కల సారాంశం. ఆ అధికారి తనకు ఆ కల రావడంలో ఆంతర్యం ఏమిటా అనుకుని, వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా కొండమీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్సనమిచ్చింది.

#ఇక ఉండూరు సంస్థాన అధిపతి తాత్సారం చేయలేదు. వెంటనే రత్నగిరి కొండమీద ఆలయం కట్టించాడు. తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించాడు. అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం.

#అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.



#సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అన్ని విధాల శుభకరం

549 - 8

Naares creative
Posted 6 days ago

ఓం శ్రీ మాత్రే నమః

*14లోకాలు-చతుర్దశ భువనాలు*

లోకాలుచతుర్దశ భువనాల ప్రస్తావన పురాణాలలో తరచుగా కనిపిస్తుంది. భూమితోపాటు భూమికి పైన ఉన్న మరో ఆరు లోకాలు... అంటే మొత్తం ఏడింటిని ‘ఊర్థ్వలోకాలు’ అనీ, భూమికి దిగువన ఉన్న ఏడు లోకాలను ‘అధోలోకాలు’ అనీ పిలుస్తారు.

వీటి గురించి ‘శ్రీమద్భాగవతం’లోని ‘ద్వితీయ స్కంధం’లో వివరంగా ఉంది....

భువనాత్మకుం డాయీశుండు
భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్‌
వివరముతో బదునాలుగు
వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్‌ (పోతన భాగవతం)

విశ్వస్వరూపుడైన భగవంతుడు ఒక భవనంలా ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి, విపులమైన పధ్నాలుగు భువనాలుగా తీర్చిదిద్దాడు. ఈ విశ్వమంతా పరమాత్ముడి శరీరమే. పధ్నాలుగు భువనాలుగా విభజితమైన ఈ విశ్వంలో... పైన ఉన్న ఏడు లోకాలు... శ్రీ మహా విష్ణువు నడుముకు పైన ఉన్న దేహం కాగా, దిగువన ఉన్న ఏడు లోకాలు... మహా విష్ణువు నడుముకు దిగువన ఉన్న శరీరం. ఆయన కటి స్థలం భూలోకం. నాభి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షస్థలం మహర్లోకం, కంఠం జనలోకం, పెదవులు తపోలోకం, శిరస్సు బ్రహ్మ నివాసమైన సత్యలోకం. అలాగే... జఘనం అతలం, ఊరువులు వితలం, మోకాళ్ళు సుతలం. పిక్కలు తలాలతం, చీలమండలు మహాతలం, కాలి మునివేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం. కాగా... ఆయన పాదతలం నుంచి భూలోకం, నాభి నుంచి భువర్లోకం, శిరస్సు నుంచి సువర్లోకం... ఇలా ముల్లోకాల సృష్టి జరిగిందనేది మరో వివరణ. లోకాలన్నిటికీ కర్త, పోషకుడు, లయకారుడు ఆ భగవంతుడేననీ, ప్రళయకాలంలో ఈ పధ్నాలుగు భువనాలు పరబ్రహ్మలో విలీనం అవుతాయని పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఈ లోకాల విశిష్టతలను తెలుసుకుందాం.

భూలోకంతో కలిపి, భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు:

*భూలోకం: ఇక్కడ నాలుగు విధాలైన జీవరాశులు ఉంటాయి. అవి స్వేదజాలు (చెమట నుంచి ఉద్భవించే పేలు, నల్లులు లాంటివి), అండజాలు (గుడ్డు నుంచి ఉద్భవించే పక్షులు), జరాయుజాలు (మానవ, పశు గర్భాల నుంచి పుట్టే మనుషులు, పశువులు), ఉద్భుజాలు (మొక్కలు, చెట్లు).

*భువర్లోకం: ఇది భూలోకానికి పైన ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సూక్ష్మ శరీరంలో ఉండే కింపురుషులు, కిన్నెరులు, విద్యాధరులు లాంటి జాతుల వారు ఉంటారు.

*సువర్లోకం: ఇది భువర్లోకం పైన ఉంటుంది. దీన్ని ‘స్వర్గ లోకం’ లేదా ‘సువఃలోకం’ అని కూడా అంటారు. ఇంద్రాది దిక్పాలకులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు ఉంటారు. వారు కోరుకున్న రూపొన్ని పొందగలిగే సామర్థ్యం కలిగిన వారు. వారికి ఆకలి దప్పులు, శరీర దుర్గంధం, వృద్ధాప్యం లాంటివి ఉండవు.

*మహర్లోకం: ఇది సువర్లోకానికి పైన ఉంటుంది. దేవతలు తపస్సు చేసే లోకం ఇది. స్వర్గంలో దేవతలు అనుభవించే దివ్య సుఖాలను.... ఇక్కడ తాపసులు తమ తపస్సు ద్వారా సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు.

*జనోలోకం: దీన్నే ‘సత్య లోకం’ అని కూడా అంటారు. ఇది మహర్లోకానికి పైన ఉంటుంది. అత్యంత పుణ్యాత్ములైనవారు ఈ లోకంలో సుఖ శాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. అయోనిజులైన దేవతలు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు.

*తపోలోకం: ఇది జనోలోకం పైన ఉంటుంది. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వారి ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడూ సుగంధాలు వెదజల్లుతూ, ప్రశాంతంగా ఉండే లోకం ఇది. భూలోకంలో వివిధ దేవతలను ఉపాసించినవారు... ఈలోకానికి చేరుకొని, కల్పాంతం వరకూ ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తరువాత కర్మానుసారం భూలోకంలో జన్మించి, సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. మహా ప్రళయంలో సర్వం లయమైనప్పుడు... వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు.

*సత్యలోకం: ఇది తపోలోకానికి పైన ఉంటుంది. ఊర్ధ్వలోకాలన్నిటిలో ఇది అత్యుత్తమమైనది. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మకు నివాసం. బ్రహ్మ అనేది ఒక పదవి. అనేకానేక కల్పాలకు ఒకరు ఈ పదవిని అధిష్టిస్తారు. తమ కర్తవ్యం పూర్తయిన తరువాత బ్రహ్మంలో లయమవుతారు. భవిష్యత్తులో హనుమంతుడు బ్రహ్మ పదవిని స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మహర్షులు అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంతులు, భూలోకంలో ఆత్మజ్ఞానాన్ని పొందినవారు ఈ లోకంలో వేదాంత చర్చలు చేస్తూ ఉంటారు.

భూలోకానికి దిగువన ఉండేవి అధోలోకాలు:

*అతల లోకం: భూమికి దిగువన ఉండే లోకం ఇది. ఈ లోకంలో రాక్షసులు ఉంటారు. వాళ్ళు భౌతికమైన భోగలాలసులుగా మదోన్మత్తులుగా ఉంటారు. మయుడి కుమారుడైన బలుడి విహార స్థలం.

*వితల లోకం: అతలలోకానికి కింద ఉంటుంది. స్వర్ణ జలం ప్రవహించే హటకీ నది ఉండే చోటు ఇది. ఈ నదీ జలాలతో తయారైన బంగారంతో తయారైన ఆభరణాలను రాక్షస మహిళలు ధరిస్తారు.

*సుతల లోకం: వితల లోకానికి అడుగున ఉండే ఈ లోకంలోనే సప్త చిరంజీవులలో ఒకరైన బలి చక్రవర్తి ఉంటాడు. ఆయన నిత్యం విష్ణువును ధ్యానిస్తూ, ఇంద్రుడిని మించిన భోగాలను అనుభవిస్తూ... సుతలలోకాన్ని పాలిస్తాడు.

*తలాతల లోకం: ఇది సుతలానికి కింద ఉంటుంది. మాయావులైన రాక్షసులతోపాటు దానవ శిల్పి మయుడు, మహా శివుడు సంహరించిన త్రిపురాసురులనే రాక్షస రాజులు ఇక్కడ ఉంటారు.

*మహాతలం: గరుత్మంతుడి సవతితల్లి కద్రువ పుత్రులైన, వేలాది శిరస్సులు కలిగిన సర్పాలు (కాద్రవేయులు) సకుటుంబంగా ఇక్కడ నివసిస్తారు. వారు మహా బలవంతులు, కోరిన రూపం ధరించగలిగేవారు. ఈ లోకం తలాతలం కింద ఉంటుంది.

*రసాతల లోకం: మహాతలానికి దిగువన ఉండే రసాతల లోకం... నివాత కవచులు, కాలకేయులు తదితర రాక్షసులకి నివాస స్థలం. వీరందరూ అత్యంత సాహసవంతులైన రాక్షస ప్రముఖులు.

*పాతాళ లోకం: రసాతల లోకానికి కింద ఉండే పాతాళమే నాగలోకం. మహా మణులతో ప్రకాశిస్తూ ఉండే పాతాళంలో... నాగలోకాధిపతి వాసుకి, ఆదిశేషుడితో సహా సమస్త సర్పజాతి నివసిస్తూ ఉంటుంది.

🚩సర్వేజనా సుఖినోభవంతు 🚩

138 - 3

Naares creative
Posted 6 days ago

కార్తిక బహుళ అష్టమి -- కాలభైరవ అష్టమి

కాలభైరవ స్వరూపం

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ ‘అదేమిటి? బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. బ్రహ్మగారు ‘నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా! నా అంతవాడిని నేను అంటున్నావు. నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదములని పిలుద్దాం అని వేదములను పిలిచారు. ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేస్తే మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. యజుర్వేదమును పిలిచారు. ఆసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతు తనలో తాను రమిస్తూ ఉన్న శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవాన్ని పిలిచారు. ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై, శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా! నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.
ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.
ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.
అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళితే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.
ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంక ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.
ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

799 - 8

Naares creative
Posted 1 week ago

#అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు............!!
చంద్రుని యొక్క అష్టమికళ ఏ తిధిన ఉంటుందో అది అష్టమి తిధి అనబడుతుంది.

#అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలో
అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది.

#చంద్రుడికి పదహారు కళలున్నాయి...

#పాడ్యమి దగ్గరనుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను పదహారవకళ సాక్షాత్తూ
సచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది.

#చంద్రుని యొక్క పదహారుకళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధపాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి
చంద్రునిలో ప్రవేసిస్తుంది. #ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును పూర్ణిమ అంటారు.
ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది. #ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయిన
రోజును అమావస్యా అంటారు. #ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు.
#ఇవే శుక్ల కృష్ణ పక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమినాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు.

#అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు.

#తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు.

#వీటిని గురించి వసిష్టసంహితలో వివరించబడింది.

#ఈ నిత్యల గురించి వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది.

#కామేశ్వరి, భగమాలినీ, నిత్యక్తిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్య, ఇవి పదహారునిత్యలు.

#ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటంచేతనే
చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్ల కృష్ణ పక్షాలయందున్న తిధులు నిత్యలు
ఈ దిగువ ఇవ్వబడ్డాయి.

#శుక్లపక్షము తిథి, నిత్యాదేవత కృష్ణపక్షము తిథి

1. పాడ్యమి ,కామేశ్వరి. 1. పాడ్యమి, చిత్ర

2. విదియ, భగమాలిని. 2 జ్వాలామాలిని
3. తదియ ,నిత్యక్షిన్న 3 సర్వమంగళ
4. చవితి , భేరుండా. 4 విజయ

5. పంచమి, వహ్నివాసిని 5 నీలపతాక
6. షష్టి ,మహావజ్రే్ేశ్వరి 6. నిత్య

7. సప్తమి ,శివదూతి 7 కులసుందరి
8. అష్టమి, త్వరిత 8 త్వరిత

9. నవమి, కులసుందరి. 9 శివదూతి
10. దశమి ,నిత్య 10. మహావజ్రేేశ్వరి
11. ఏకాదశి ,నీలపతాక 11. ఏకాదశి వహ్నిివాసిని
12. ద్వాదశి ,విజయ 12. ద్వాదశి భేరుండా
13. త్రయోదశి | సర్వమంగళ 13. త్రయోదశి | నిత్యకిన్న
14. చతుర్దశి, జ్వాలామాలిని 14. చతుర్దశి భగమాలిని
15. పూర్ణిమ ,చిత్ర 15. కామేశ్వరి


#చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్ల, కృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తే
తెలుస్తుంది. కాని రెండు పక్షాల యందు అష్టమినాడు మాత్రం “త్వరిత” అనబడే నిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే త్వరితాకళ అని కూడా అంటారు. అనగా ఎటువంటి మార్పులేనివాడు అష్టమినాటి చంద్రుడు. అందుచేతనే అష్టమినాటి చంద్రునితో దేవి
ముఖాన్ని పోల్చటం జరిగింది.

#గుండ్రని ముఖానికి పైన కిరీటము పెట్టటంచేత, దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమినాటి చంద్రునిలాగా కనిపిస్తుంది.

#శ్రీ మాత్రే నమః

356 - 4

Naares creative
Posted 1 week ago

#కాళేశ్వర_ముక్తేశ్వర_స్వామి_దేవాలయం
#కాళేశ్వరం 🙏

#కాళేశ్వరం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మహాదేవపూర్ మండలానికి చెందిన గ్రామము.. ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన శివాలయం ఉంది..

త్రిలింగమనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో #కాళేశ్వరం కూడా ఒకటి. త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే త్రిలింగమనే పదం నుంచి తెలుగు అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన.

ఈ దేవాలయంలో ఒకే పానపట్టంపై శివుడు యముడు వెలిశారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో మహా పుణ్యక్షేత్రం గా ప్రసిద్ధి గాంచిన క్షేత్రం #కాళేశ్వరం. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతంలో త్రివేణి సంగమం (గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు) ఒడ్డున నెలకొని ఉంది..

గోదావరి తీరాన ఒక వైపు కాళేశ్వరం, మరో వైపు మహారాష్ట్ర ఉన్నాయి.. భూపాల్ పల్లి జిల్లాలోని మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున సిరోంచ తాలూకాకు 4 కి.మీ దూరాన #కాళేశ్వరం ఉంది.

అతి ప్రాచీన చరిత్ర గల కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి.. మన రాష్ట్రంలోని శైవ క్షేత్రాలలో శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయాలు ప్రసిద్ధి గాంచినవి.. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి గాంచింది.

భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వర లింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వర లింగానికి రెండు నాశికా రంధ్రాలున్నాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణి సంగమ తీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది.

ఈ దేవాలయం లోని కాళేశ్వరునికి ముందు పూజ చేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
గర్భగుడి లో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు ముందుగా కాళేశ్వర స్వామిని దర్శించి తర్వాత ముక్తీశ్వర స్వామి దర్శించుకుంటారు.

ముక్తీశ్వర స్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగానికి రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం..

కాళేశ్వర క్షేత్రం శిల్పకళా నిలయం. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేక శిల్పాల వల్ల, కాకతీయుల శిలాఫలకాల ద్వారా గత వైభవం తెలుస్తుంది.

మన దేశంలో ప్రముఖ సరస్వతీ ఆలయాలు మూడు ఉన్నాయి.
కాళేశ్వరంలో మహా సరస్వతి,
అదిలాబాద్‌ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతీ, కాశ్మీరులో బాల సరస్వతీ ఆలయాలున్నాయి.

అదే విధంగా సూర్యదేవాలయాలు కూడా మూడు ఉన్నాయి.
కాళేశ్వరంలో ఒకటి కాగా, ఒరిస్సా లోని కోణార్క్‌, శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి లో సూర్య దేవాలయాలు ప్రముఖమైనవి.

కాళేశ్వరంలో బ్రహ్మ తీర్థం, నరసింహ తీర్థం, హనమత్‌ తీర్థం, జ్ఞాన తీర్థం, వాయుస తీర్థం, సంగమ తీర్థం, ఇత్యాది తీర్థాలున్నాయి.

కాళేశ్వరంలోని ప్రధానాలయానికి పశ్చిమం వైపు సుమారు ఒక కి.మీ దూరంలో ఆది ముక్తీశ్వరాలయం ఉంది.. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం..

కాళేశ్వర ఆలయం సమీపానే మహారాష్ట్ర భూభాగం ఉంది. అందువల్ల ఇటు తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు మహారాష్ట్ర భక్తులు కూడా అత్యధికంగా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. పురావస్తుశాఖ వారు నిర్వహించిన తవ్వకాల్లో బౌద్ధ విహారాల గోడలు, పునాదులు, మహాస్తూపాలు, కంచుతో చేసిన బుద్ధుడి విగ్రహాలు లభించాయి. నేలకొండ లోని బౌద్ధస్తూపం ప్రత్యేకాకర్షణ అని చెప్పవచ్చు..

ఆలయంలో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి దూరి బయటకి వెళ్ళినట్లయితే యమ దోషం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు, ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది.. దానిని అనుసరించి వెళ్లాలి.

కాళేశ్వరం ఎలా చేరుకోవాలి ?
కాళేశ్వరం కు హైదరాబాద్ వరంగల్ మరియు కరీంనగర్ నుండి బస్సు సౌకర్యం కలదు..

ఓం నమఃశివాయ...🙏🙏🙏

186 - 6

Naares creative
Posted 1 week ago

180 - 2

Naares creative
Posted 1 week ago

ఇల్లు కట్టుకోవాలనే కోరిక, ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అనేక కారణాల చేత సొంత ఇంటి కల కుదరక పోవచ్చు.సొంత ఇల్లు ఒక్కటే కాదు, స్థలాలు,భూములు,ఇళ్ళు కొనాలన్నా, అమ్మాలన్నా అడ్డంకులు తొలగడానికి ప్రతి రోజు పూజలో భాగంగా ఈ స్తోత్రంని కూడా చేర్చుకోని, ఈ స్తోత్రమును రోజూ 9సార్లు మండలం రోజులు పఠించాలి.

🌺శ్రీ భూ వరాహ స్తోత్రం🌺
ఋషయ ఊచు |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||

రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం |
ఛన్దాంసి యస్య త్వచి బర్హిరోమ-
స్స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||

స్రుక్తుండ ఆసీత్స్రువ ఈశ నాసయో-
రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణంతే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||

దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయో దయనీయ దంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||

సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||

నమో నమస్తేఽఖిలయంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్య భక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమొ నమః || ౬ ||

దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూస్సభూధరా |
యథా వనాన్నిస్సరతో దతా ధృతా
మతంగజేంద్రస్య స పత్రపద్మినీ || ౭ ||

త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలే నాథ తదా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||

సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||

కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణం |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతి విస్మయమ్ || ౧౦ ||

విధున్వతా వేదమయం నిజం వపు-
ర్జనస్తపః సత్యనివాసినో వయం |
సటాశిఖోద్ధూత శివాంబుబిందుభి-
ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||

స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయా గుణ యోగ మోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే శ్రీ వరాహ ప్రాదుర్భావోనామ త్రయోదశోధ్యాయః | సంపూర్ణం.

206 - 1

Naares creative
Posted 1 week ago

🎻🌹🙏కొప్పు శివలింగాలు, కడప జిల్లాలో ఉండే పురాతనమైన అగస్త్యేశ్వర శివలింగాలు.....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿అగస్త్య ముని ప్రతిష్ఠితమైన ఈ శివలింగాలకి, 6-9 శతాబ్దాల కాలంలో రేనాటి చోళులు గుడి కట్టించారని ఆధారాలు లభిస్తున్నాయి.

🌸కార్తీక మాసం, ఈ ప్రత్యేకమైన శివలింగాలు ఉన్న ఆలయాలను దర్శించండి.

🌿నిన్న సంవత్సరం ఇలాంటివి ఒక పది చూసాము. గత సంవత్సర కాలంలో, ఇంకో 5 కొత్తగా కనుక్కోవడం జరిగింది. వాటి వివరాలు కింద ఇస్తున్నాము.

🌹ప్రొద్దుటూరు దగ్గర్లో

🌿పెద్దసెట్టిపల్లె శివాలయం.
ప్రొద్దుటూరు శివాలయం
కల్లూరు శివాలయం.
పోట్లదుర్తి నడిగడ్డ శివాలయం
ఇల్లూరు శివాలయం ( ఇక్కడ శివలింగం విరిగిపోతే, కొత్త శివలింగం చేయించారు )

🌹ఎర్రగుంట్ల దగ్గర్లో

🌸నిడుజువ్వి శివాలయం
చిలమకూరు శివాలయం
పెద్దనపాడు శివాలయం
ఎర్రగుంట్ల కోడూరు శివాలయం
ఉరుటూరు శివాలయం ( ఈ శివలింగం విరిగిపోయింది, ప్రస్తుతం మైలవరం మ్యూజియంలో ఉంది )

🌹కమలాపురం

🌸దగ్గచదిపిరాల శివాలయం
పెద్దచెప్పలి శివాలయం

🌹జ్యోతి సిద్దవటం

🌿ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి. వాటి కొప్పు నిధుల వేటగాళ్ల వల్ల విరిగిపోయింది.

🌹జమ్మలమడుగు దగ్గర

🌿సుగుమంచిపల్లె ( నిధుల వేటగాళ్ల వల్ల కొప్పు విరిగిపోయింది )
కన్యతీర్థం క్షేత్రం ( శాసనాలలో అగస్త్యేశ్వర శివలింగం అన్నారు. పాత శివలింగం ఇప్పుడు లేదు. గండికోట నుండి తెచ్చిన బాణ లింగం అక్కడ ఉంది )

🌸గోదావరి జిల్లాలో పలివేల ఊర్లో ఒకటి, గుంటూరు జిల్లా చిలుమురు లో ఒకటి ఉన్నాయని చరిత్రకారులు తెలిపారు. కానీ కడప జిల్లాలోనే 15 దాకా ఉన్నాయి....స్వస్తీ....🚩🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

252 - 2

Naares creative
Posted 1 week ago

https://youtu.be/7PiVAZdApk0
Watch new vedieo it's informative vedieo

8 - 0