నేను ఏకాకిని ఎవరు లేని ఏకాకిని
ఎదో ఒక్కరోజు నా లైఫ్ లో
అర్ధం చేసుకున్న వ్యక్తి రాకపోదా అని ఎదురు చూసాను.
సగం జీవితం గడిచే లోపు నువ్వు నాకు పరిచయం అయ్యావు.
"నీలో కనిపించిన అమాయకత్వం
నేను ఇంతవరకు ఎవరులోను చూడనేలేదు."
ఇలాంటి ప్రపంచంలోని నేను చూడని అమాయకత్వం
నాకంటూ ఎవరు లేని స్థితిలో ఒక మంచి రక్తసంబంధం నువ్వు అయ్యావు.
అది నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది అని మాటల్లో చెప్పలేను
"నీ ప్రేమ నాకు ఎంతో ఓర్పును ఇచ్చింది, నువ్వే నా లోకం అయ్యావు."