స్వాగతం, ఈ చానెల్ గురించి తెలుసుకోవాలని ఇక్కడి వరకు వచ్చిన మీకు ధన్యవాదాలు.
"RAY" అంటే ముగింపు లేనిది. అలానే మన జ్ఞానం కూడా RAY లాగానే ముగింపు లేకుండా పెరుగుతూ ఉండాలి అప్పుడే నిరంతరం ప్రతి క్షణం పరిణామం చెందుతున్న ఈ ప్రపంచంలో మనం జీవించగలం. మన జీవితంలో గెలుపు మరియు ఓటములు సహజం. సాదారణంగా ఒక మనిషి గెలుపు వచ్చినపుడు ఉప్పొంగిపోవడం, ఓటమి వచ్చినపుడు నిరుత్సాహ పడటం సహజం, ఈ ఎమోషన్స్ వచ్చినపుడు అంటే ఓటమి మరియు విజయం వచ్చినపుడు ఒకేలా ఉండేవాడే స్థితః ప్రగణుడు. విజయం వచ్చినపుడు చాలా మంది లో గర్వం పెరిగిపోతుంది. ఆ గర్వం వల్ల మన పతనం మొదలవుతుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. అలానే ఓటమి వచ్చినపుడు కొంత మంది డిప్రెసన్లోకి వెళతారు. ఇలాంటి సమయంలో మనకు మార్గనిర్దేశనం చేసేవారు, మనకు ధైర్యం చెప్పేవారు , మంచి మాటలు , జీవిత సత్యాలు చెప్పి మోటివేట్ చేసేవారు అవసరం. అందుకె ఈ ఛాననెల్లో గొప్ప వ్యక్తుల జీవితం నుండి తీస్కున్న మాటలను , మిమ్మల్ని ఎప్పటి కప్పుడు ఉత్తేజపరిచే మంచి కోట్స్ మీ ముందుకు తీసుకు రావలనేదే నా ఈ "RAY" అనే ప్రయత్నం. ఈ ప్రయతనమంలో నన్ను ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను. మరోసారి కృతజ్ఞతలు.