ఒక అనుభవం...ఒక ఆలోచన...ఒక ఆచరణ నుంచి ఉద్భవించిందే ఈ PRASAD'S KITCHEN 999... నా ఈ
వంటల సమ్మిళితం మరికొంతమందికి ఉపయోగపడాలన్నదే ఓ చిన్ని ఆశ... కొద్దిమంది అయినా
తెలుసుకుని కమ్మని రుచికరమైన వంటలు చేసుకుని తృప్తిగా భోజనం చేస్తారని అభిలాష...
నా వయస్సు ఇప్పుడు 60 సంవత్సరాలు...పదేళ్లు ఈనాడు దిన పత్రికలో సబ్ ఎడిటర్, రిపోర్టర్ గా వర్క్ చేసాను. ప్రస్తుతం 'THE TRADITIONAL DESIGNER SAREES' HOME BASED SHOP RUN చేస్తున్నాను. అన్ని బాధ్యతల్ని నెరవేర్చుకున్నాను. పిల్లలిద్దరూ అమెరికా లో సెటిల్ అయ్యారు. నా పిల్లల కోసం తెలియని వంటల్ని కూడా తెలుసుకుని నేర్చుకున్నాను. కుకింగ్ చేయడం చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఈ సంకల్పానికి శ్రీకారమైంది. సంప్రదాయ వంటల్ని ఎంత రుచిగా చేయవచ్చునో సులభతరమైన పద్ధతుల్లో ఎలా చేయాలో చెప్పడమే ఈ ఛానల్ ధ్యేయం. అందరు ఈ మీ ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
youtube.com/c/PrasadsKitchen999