నేను Dr. నవీన్ రెడ్డి పైళ్ళ, 2019 లో Group-2 లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలక్ట్ అయ్యాను. అంతకుముందు 2017 లో సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యాను. రెండు ఉద్యోగాలు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యే సాధించాను. అదేవిధంగా నా వైఫ్ అనూష 2019 గ్రూప్-2 లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ అయ్యింది. అంతకుముందు 2018 లో Forest Range Officer గా సెలెక్ట్ అయ్యింది. పోటీ పరీక్షల పై మాకున్న అనుభవాన్ని తదుపరి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో పంచుకోవడం కోసం ఈ ఛానెల్ ను స్టార్ట్ చేసాము. మీకు ఉపయోగ పడేలా వుండే వీడియోలను రూపొందించడం కోసం ప్రయత్నం చేస్తాము. Thank You.