దైవజనురాలు సహోదరీ ఎన్ . లూదియ గారిని ప్రభువు రక్షించుకొని రక్తస్రావ రోగము నుండి విడిపించెను. 1982 వ సంవత్సరములో యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించిరి. 1988 వ సంవత్సరము మార్చి నెల 10వ తారీఖున ప్రభువు లూదియమ్మ గారిని దర్శించి ముఖాముఖిగా మాట్లాడినారు.
విత్తనములు నాని మొలకెత్తడానికి సిద్ధముగా ఉన్నవి. అనేకుల మీద ఆత్మవర్షం కుమ్మరించ బోతున్న నువ్వు నిలబడితే పదిమంది నిలబడతారు. వ్రాత పలక మీద మత్తయి సువార్త 16 వ అధ్యాయం 17-20 వరకు చదవమని కనిపించింది. నీవు నా సంఘములను కట్టుదువు. ఎంత బలం ఉన్నా లేకున్నా ఏడు సంఘములను కట్టాలి ఏడు దీపాలను వెలిగించాలి అని దేవుడు మాట్లాడినాడు.